నీవు లేక నేనుండలేనని.. | married women suicide illegal affair | Sakshi
Sakshi News home page

నీవు లేక నేనుండలేనని..

Nov 10 2024 6:34 AM | Updated on Nov 10 2024 6:34 AM

married women suicide illegal affair

ప్రియుడిని మరిచిపోలేక వివాహిత ఆత్మహత్య 

కుత్బుల్లాపూర్‌: ప్రేమికుడిని మరిచిపోలేని ఓ వివాహిత మనస్తాపంతో భనవంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్‌బషరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన మేరకు.. ఎంఎన్‌రెడ్డి నగర్‌లో నివాసముంటున్న  ఓ వివాహిత (25)కి పెళ్లికి ముందే మరొకరిని ప్రేమించింది. 

ఈ నేపథ్యంలో ప్రియుడిని మరిచిపోలేక శుక్రవారం రాత్రి తాము నివాసముంటున్న భవనం 5వ అంతస్తు నుంచి ఆమె కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపతున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement