Newly Wed Bride Ends Her Life Due To Husband, In-Laws Harassment - Sakshi
Sakshi News home page

HYD: ఐదు నెలల క్రితమే పెళ్లి.. అత్తింటి వేధింపులతో గర్భిణి ఆత్మహత్య

Aug 17 2023 7:55 AM | Updated on Aug 17 2023 8:50 AM

Newly Wed Bride Commits Suicide Due Husband In Laws harassment Borabanda - Sakshi

భర్త రాజేందర్‌లో లావణ్య (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: అత్తింటి వారి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోరబండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌  రవికుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్పీఆర్‌హిల్స్‌ అశయ్య నగర్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ స్వచ్ఛ ఆటో డ్రైవర్‌గా పనిచేసే రాజేందర్‌కు బాలానగర్‌ చింతల్‌కు చెందిన లావణ్యతో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది.

లావణ్యకు పుట్టుకతోనే వినికిడి లోపం ఉంది. పెళ్లయిన కొద్ది రోజులకే ఆమె భర్త రాజేందర్, అత్తింటి వారు ఆమెను వేధింపులకు గురిచేసేవారు. చెవిటి దానివిగనుక అదనపు కట్నం తీసుకోరావాలని అత్తింటి వారు లావణ్యను వేధించేవారు. ఈ క్రమంలోనే గర్భిణి అయిన లావణ్య(25)తనలో తాను కుమిలిపోయి ఆగస్టు 14న తెల్లవారు జామున తన అత్తగారింట్లో ఫ్యానుకు ఊరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

అయితే ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను కాపాడి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతిరాలి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు భర్త రాజేందర్, అత్త నరసవ్వలపై వరకట్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.
చదవండి: బ్యాంక్‌ ఖాతాల్లోంచి డబ్బునలా కాజేస్తున్నారు! 

Advertisement
 
Advertisement
Advertisement