క్రికెట్‌ బ్యాట్‌తో తలపై కొట్టి.. వడ్డీ వ్యాపారి దారుణ హత్య! | Kokapet Murder Cricket Bat Interest Business | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బ్యాట్‌తో తలపై కొట్టి.. వడ్డీ వ్యాపారి దారుణ హత్య!

Oct 2 2026 7:50 AM | Updated on Oct 2 2026 7:59 AM

Kokapet Murder Cricket Bat Interest Business

వెంకన్న(ఫైల్‌)

మృతుడు ఓయూ పీహెచ్‌డీ విద్యార్థి

హైదరాబాద్‌: ఓ వ్యక్తిని క్రికెట్‌ బ్యాట్‌తో తలపై కొట్టి దారుణంగా హత్య చేసి కోకాపేటలో పడేశారు. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్‌ తెలిపిన మేరకు.. కోకాపేటలోని కురుమ సంఘం భవనం ముందు గురువారం ఉదయం ఓ మృతదేహం ఉందని వాకింగ్‌కు వచ్చిన వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులు పరిశీలించగా అతను ఖమ్మం జిల్లాకు చెందిన వెంకన్న (45) అని గుర్తించామని, అతను డబ్బును వడ్డీలకు ఇచ్చి కార్లు, ద్విచక్ర వాహనాలను తాకట్టు పెట్టుకుంటాడని తేలిందన్నారు. అతని మృతదేహంతో పాటు సంఘటనా స్థలంలో ఉన్న కారు నంబర్‌ ప్లేట్‌ లేకుండా ఉందని,  అది శ్రీకాంత్‌ అనే వ్యక్తిదని, మూడు నెలల క్రితం డబ్బు అవసరం ఉండి వెంకన్న వద్ద తాకట్టు ఉంచినట్లు తేలిందన్నారు. మృతుడు భార్య, పిల్లలతో భేదాభిప్రాయాలు వచ్చి పది సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నాడన్నారు.

మృతుని సోదరి గాందీనగర్‌లో ఉంటుందని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ పీహెచ్‌డీ చేస్తున్నాడని తేలిందన్నారు.  వెంకన్నను వేరే చోట హత్య చేసి తెచ్చి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా.. లేక ఇక్కడికే తీసుకువచ్చి హత్య చేశారా.. హత్యకు వడ్డీ వ్యాపార లావాదేవీలే కారణమా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామన్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో విషాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement