దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ట్రాఫిక్ సమస్య, దానికి తోడు చలాన్లతో వాహనదారులు జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇంతలో ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చేలా జరిమానాలు భారీగా పెంచే దిశలో ఉన్నారు. సిగ్నల్ జంప్, నో పార్కింగ్, ఫుట్‌పాత్ పార్కింగ్ తదితర తప్పిదాలకు మరింత చెల్లించుకోవాలి.
బుధవారంనాడు రవాణాశాఖ, హోంశాఖల మధ్య ఈ చర్చలు జరిగినట్టు సమాచారం. ప్రస్తుతం నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500, తరువాత రూ.1000 జరిమానా కట్టాలి. తాజా సవరింపుల ప్రకారం మొదటిసారి ఉన్నంఘిస్తే రూ.3000, రెండోసారి ఉల్లంఘిస్తే రూ.5000 జరిమానా కట్టాల్సి ఉంది. ఇలా ఏ తప్పిదానికైనా ఐదారు రెట్లు పెంచేసినట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి వచ్చే స్పందన చూసుకుని కాస్త అటూఇటుగా జరిమానాల మొత్తాన్ని నిర్ణయిస్తారు.


