దీదీ... కాంగ్రెస్‌లోకి వచ్చేయండి  | Come back to Congress, Adhir Chowdhury invites Mamata Banerjee | Sakshi
Sakshi News home page

దీదీ... కాంగ్రెస్‌లోకి వచ్చేయండి 

Oct 2 2026 6:34 AM | Updated on Oct 2 2026 6:34 AM

Come back to Congress, Adhir Chowdhury invites Mamata Banerjee

పశ్చిమ బెంగాల్‌లో మీరే లీడర్‌ 

అధిష్టానానికీ విజ్ఙప్తి చేస్తా 

మమతకు అధిర్‌ రంజన్‌ చౌదరి ఆఫర్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోసహా తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి గురువారం పిలుపునిచ్చారు. బెంగాల్‌లో మమత నేతృత్వంలో పనిచేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కూడా ఇందుకు అంగీకరించాలని అభ్యర్థించారు. ఇరుపార్టీల సహకారానికి గుర్తుగా మమత బెనర్జీ అక్టోబరు ఆరున జరిగే రెజినగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. 

2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత మమత బెనర్జీ పార్టీ పరంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఈ నేపథ్యంలో అధిర్‌ రంజన్‌ చౌదరి మమతను కాంగ్రెస్‌లోకి రమ్మనడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత మిగిలింది ఏదీ లేదని, మమత 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ నుంచి వేరుపడే పార్టీని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. ‘‘మమతా బెనర్జీ తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో మళ్లీ కాంగ్రెస్‌లో చేరాలని కోరుతున్నాం. 

ఈ విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌కు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఆమె పార్టీలో తిరిగి చేరాలి. బెంగాల్‌లో ఆమె నాయకత్వాన్ని మేము అంగీకరిస్తాం; కలిసి పనిచేస్తాం’’ అని అధిర్‌ చెప్పారు. మమత వర్గం నందిగ్రామ్‌లో మాదిరిగానే రెజినగర్‌లోనూ అక్టోబరు ఆరు నాటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలని అధిర్‌ కోరారు. అధిర్‌ ప్రతిపాదనపై ఎంపీ సౌగత రాయ్‌ స్పందిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రతిపాదన చేస్తే చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అభిషేక్‌ బెనర్జీ లేకుండా ఎలాంటి నిర్ణయం జరగదని స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement