‘వానిష్‌ కుమార్‌’ను ప్రజలు క్షమించరు  | Vanish Kumar tried to take away people right to vote, attaks Mamata Banerjee | Sakshi
Sakshi News home page

‘వానిష్‌ కుమార్‌’ను ప్రజలు క్షమించరు 

Oct 2 2026 6:30 AM | Updated on Oct 2 2026 6:30 AM

Vanish Kumar tried to take away people right to vote, attaks Mamata Banerjee

ప్రజల హక్కును ఆయన నాశనం చేశారు  

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ ధ్వజం  

ఎస్‌ఐఆర్‌పై కోర్టుకు వెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన  

న్యూఢిల్లీ:  ఓటు హక్కును హరించిన వారిని ప్రజలు క్షమించరని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) అధినేత, పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీ తేలి్చచెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను వానిష్‌ కుమార్‌(నాశనం చేసే వ్యక్తి)గా అభివర్ణించారు. ‘‘ప్రజల హక్కులను జ్ఞానేశ్‌ కుమార్‌ నాశనం చేశారు. నేను ఆయనను ఎలా క్షమించగలను? అసలు నేనెవరిని? నిజానికి భారతదేశ ప్రజలే ఆయనను క్షమించరు’’అని పేర్కొన్నారు. మమతా బెనర్జీ గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను తమ పార్టీ మొదటి నుంచే వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం కేంద్రీకృతం చేసిందని ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌లో అవకతవకలపై కోర్టుకు వెళ్లినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 100 మంది బాధితులతో కలిసి ఎన్నికల సంఘం వద్దకు వెళితే అక్కడ తమకు తీవ్ర అవమానం జరిగిందని ఆక్షేపించారు. సీఈసీని కలవడానికి వెళ్లిన టీఎంసీ ఎంపీలను ‘ఇక్కడి నుండి వెళ్ళిపోండి’అంటూ అరుస్తూ అవమానించారని ఆరోపించారు.  

వారికి మినహాయింపు ఎందుకు?  
అధికారిక విధులను నిర్వర్తించే క్రమంలో లేదా నిర్వర్తిస్తున్నట్లుగా భావించే చర్యలకు సంబంధించి సివిల్‌ లేదా క్రిమినల్‌ చర్యల నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లకు రక్షణ కలి్పంచే మినహాయింపు నిబంధనను మమతా బెనర్జీ ప్రశ్నించారు. 2023 నాటి చట్టంలో ఈ నిబంధనను చేర్చడాన్ని తప్పుపట్టారు. ప శ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ ముసుగులో విచ్చలవిడిగా ఓట్లు తొలగించారని మండిపడ్డారు. తమ పార్టీ ప్రభావం అధికంగా ఉన్నచోట భారీగా ఓట్లను మాయం చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుమారు 4,000 ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తగలబెట్టిన ఘటనల వెనుక బీజేపీ సూత్రధారిగా వ్యవహరించిందని ఆరోపించారు. ఎన్నికల తర్వాత తమ పార్టీ నేతలను, కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.  

బీజేపీకి ఈసారి ఓటమి తప్పదు  
ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని తాను భావిస్తున్నట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. బీజేపీపై విపక్ష ‘ఇండియా’కూటమి కలిసికట్టుగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు 2029 లోక్‌సభ ఎన్నికల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏం జరుగుతుందో చూడండి.. ఆట మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ముందుగా ఎన్నికల సంఘం పనితీరుతో సహా తక్షణ రాజకీయ పోరాటంపై దృష్టి సారించి, కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ముందుగా సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ వెళ్ళిపోవాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఎన్నికల వ్యవస్థ కచ్చితంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని, అందుకోసం అందరూ కలిసి పోరాడాలని సూచించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు త్వరలోనే మారిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు మమత తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement