సీఈసీ మెడకు ‘ఇండియా’ కూటమి ఉచ్చు | INDIA Bloc Constitution Club Meet: Push for CEC Impeachment and Stoppage of SIR | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ‘ఇండియా’ కూటమి సమావేశం.. ముఖ్య నేతల డుమ్మా!

Sep 30 2026 11:37 AM | Updated on Sep 30 2026 12:03 PM

INDIA Bloc Constitution Club Meet: Push for CEC Impeachment and Stoppage of SIR

సాక్షి,న్యూఢిల్లీ: కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ‘ఇండియా’ కూటమి సమావేశం ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ముఖ్యమైన ప్రతిపక్ష నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)వివాదం, దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న సర్ అవకతవకల అంశాలపై ఈ సమావేశంలో కూటమి నేతలు చర్చిస్తున్నారు.

తొలగించిన 13 కోట్ల 30 లక్షల ఓట్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చేలా ఎన్నికల సంఘంపై ఒత్తిడి, ఎస్‌ఐఆర్ ప్రక్రియను వెంటనే సస్పెండ్ చేయాలని, ఎన్నికల సంఘంలో తలెత్తిన పరిణామాలు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు ఆయన చేత రాజీనామా చేయించేందుకు వ్యూహాలు, జ్ఞానేశ్‌ కుమార్‌పై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై  అజెండాగా ఇండియా కూటమి చర్చిస్తున్నట్లు సమాచారం. ఇండియా కూటమి సమావేశానికి 20 పార్టీలకు పైగా నేతలు పాల్గొన్నారు.

దీనికి సంబంధించి ఉభయసభల్లో అవసరమైన మద్దతు, విధివిధానాలపై కసరత్తు జరుగుతోంది. ఈసీ నిర్ణయాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో చేపట్టబోయే జాయింట్ ప్రొటెస్ట్‌లు, దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

అయితే, ఈ కీలక సమావేశానికి ఇండియా కూటమిలోని కొన్ని ముఖ్యమైన పార్టీలు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, టీవీకే పార్టీలు తాము ఈ సమావేశానికి రాలేమని తేల్చిచెప్పాయి. అయినప్పటికీ, పార్లమెంట్ వేదికగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వచ్చే అభిశంసన తీర్మానానికి, లేదా ఆయన తొలగింపు డిమాండ్‌కు మాత్రం తమ పూర్తి మద్దతు ఉంటుందని డీఎంకే స్పష్టం చేసింది.

అలాగే, ఉత్తరప్రదేశ్‌లో ఇతర రాజకీయ బిజీ షెడ్యూల్ కారణంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ భేటీకి హాజరుకాలేకపోయినప్పటికీ, పార్టీ తరఫున ప్రతినిధులను పంపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ ఎన్నికల సంఘం తీరుపై కలిసికట్టుగా పోరాడాలని దృఢ నిశ్చయంతో ఉన్నాయి

ఇదీ చదవండి : ‘ఇండియా కూటమి నుంచి నితీశ్‌ను వెళ్లనివ్వకుండా ఉండాల్సింది!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement