మోదీ కోసం పోలీస్‌ ఉద్యోగానికి రాజీనామా..2029 వరకు చెప్పులు వేసుకోనని శపథం! | Gujarat Cop Quits Over Jantar Mantar Protest To Support PM Modi For 2029 Polls | Sakshi
Sakshi News home page

మోదీ కోసం పోలీస్‌ ఉద్యోగానికి రాజీనామా..2029 వరకు చెప్పులు వేసుకోనని శపథం!

Aug 17 2026 9:22 PM | Updated on Aug 17 2026 9:28 PM

Gujarat Cop Quits Over Jantar Mantar Protest To Support PM Modi For 2029 Polls

గాంధీనగర్‌: ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) విధానాలకు మద్దతుగా గుజరాత్‌లో ఓ పోలీసు ఉద్యోగి తన పదవికి రాజీనామా చేశారు. తూర్పు కచ్‌లోని అడేసార్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రామ్‌గర్ మోహన్‌గర్ గోసాయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. 

ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు, పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టడానికి, ప్రధాని మోదీ దేశంలోని యువత కోసం చేపడుతున్న విధానాలకు మద్దతుగా నిలవడమే తన నైతిక బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  ఈ మేరకు ఆయన ఒక వీడియోను కూడా విడుదల చేశారు. 

ఆ వీడియోలో ఈ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి నేను ఎంతో కష్టపడ్డాను. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా.. నేరుగా రంగంలోకి దిగి మోదీ ప్రభుత్వానికి, ఆర్‌ఎస్‌ఎస్‌కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. ఎలాంటి లాభాపేక్ష లేకుండా దేశ సేవకు అంకితమైన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ఇకపై పూర్తిగా భాగస్వామి అవుతాను’ అని వెల్లడించారు. అంతేకాకుండా, 2029లో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిచి, ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు తాను ఎలాంటి చెప్పులు ధరించనని శపథం చేయడం గమనార్హం. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement