ఢిల్లీలో దంచికొట్టిన వాన | Delhi Weather Updates July 9 Heavy Rains IMD Red Alert News | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో దంచికొట్టిన వాన

Jul 9 2025 7:43 PM | Updated on Jul 9 2025 9:57 PM

Delhi Weather Updates July 9 Heavy Rains IMD Red Alert News

ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం మారిపోయింది. నగరంతో పాటు శివారులో కుండపోత భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పని వేళలు ముగిసే సమయం కావడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

భారీ వర్షం పడొచ్చని చెబుతూ వాతావరణ శాఖ(IMD) రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని ఢిల్లీ అధికార యంత్రంగాణం పలు సూచనలు జారీ చేసింది. 

నగర వ్యాప్తంగా పలు అండర్‌పాస్‌లను మూసేస్తున్నట్లు చెబుతూ.. ఆ వైపుగా వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. భారీ వర్షం నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.అందుకు తగ్గట్లే నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement