
దుబాయిలో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు గామా (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) పురస్కారాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు ఐదో ఎడిషన్ వేడుకలు ఈనెల 30 నుంచి షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనున్నాయి.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు.

గామా సీఈవో సౌరభ్ కేసరి, వైభవ్ జ్యువెలర్స్ ఎండీ రాఘవ్, జ్యూరీ సభ్యులు ప్రముఖ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, బి.గోపాల్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్‌తో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొనబోతున్నారు.

హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, పూజా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.



















