breaking news
Gama Awards
-
దుబాయ్‌లో 'గామా' అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. గామా 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలో టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు , సీఈఓ సౌరభ్ కేసరి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా ఈ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది.గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు - ఏ. కోదండ రామిరెడ్డి , ప్రముఖ సంగీత దర్శకులు - కోటి , ప్రముఖ సినీ దర్శకులు - బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్డ్స్ బహుకరించబడ్డాయి. నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపును అందుకున్న 'పుష్ప 2' గామా బెస్ట్ మూవీగా అవార్డ్ కైవసం చేసుకుంది.గామా అవార్డు గ్రహీతలు:బెస్ట్ యాక్టర్ 2024 – అల్లు అర్జున్ (పుష్ప2 ది రూల్)బెస్ట్ హీరోయిన్ – మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)బెస్ట్ మూవీ – పుష్ప 2 (మైత్రి మూవీ మేకర్స్.. యలమంచిలి రవి నవీన్ యెర్నేని)బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్ (పుష్ప 2)బెస్ట్ ప్రొడ్యూసర్ – అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898AD)బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీప్రసాద్ (పుష్ప 2)బెస్ట్ కొరియోగ్రఫీ : భాను మాస్టర్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)బెస్ట్ సినిమాటోగ్రఫీ : రత్న వేలు (దేవర)బెస్ట్ లిరిసిస్ట్ – రామ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లే..దేవర)బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : అనురాగ్ కులకర్ణి (సుట్టమలా సూసి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ : మంగ్లీ (కళ్యాణి వచ్చావచ్చా.. ఫ్యామిలీ స్టార్)బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ క్రిటిక్ : సమీరా భరద్వాజ్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్) బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ : రజాకార్బెస్ట్ యాక్టర్ క్రిటిక్ : తేజ సజ్జాబెస్ట్ పెర్ఫార్మన్స్ యాక్టర్ జ్యూరీ : రాజా రవీంద్ర (సారంగదరియా)బెస్ట్ యాక్టర్ జ్యూరీ : కిరణ్ అబ్బవరం (క)బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ : రోషన్ (కోర్ట్)బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ : శ్రీదేవి (కోర్ట్)బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ : మానస వారణాశిబెస్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ : అప్సర్ (శివం భజే)గద్దర్ మెమోరియల్ మ్యూజిక్ అవార్డ్ : మట్ల తిరుపతిబెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : వినయ్ రాయ్ (హనుమాన్)బెస్ట్ సపోర్టింగ్ పెర్ఫార్మన్స్ అవార్డ్ : హర్ష చెముడు (సుందరం మాస్టర్)బెస్ట్ సపోర్టింగ్ కామెడీ రోల్ : బాలిరెడ్డి పృథ్వీరాజ్బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫిమేల్ : నయన్ సారిక (ఆయ్, క)బెస్ట్ డెబ్యూ యాక్టర్ జ్యూరీ : ధర్మ కాకాని (డ్రింకర్ సాయి)బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రాళ్ళు)బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రాళ్ళు)గ్లోబల్ కమెడియన్‌గా ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం స్పెషల్ అవార్డును అందుకున్నారు. వీరితోపాటు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును నిర్మాత అశ్వినీ దత్ అందుకున్నారు. అలాగే హీరో సత్యదేవ్ జీబ్రా చిత్రానికి గాను ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డును కైవసం చేసుకున్నారు. ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ అవార్డును అందాల భామ ఊర్వశి రౌటెల అందుకున్నారు.గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ..”వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదికపై ఇలా ప్రెస్టేజియస్ గా ఈ వేడుక నిర్వహించడం ఆనందంగా ఉంది. గామా స్థాపించినప్పటి నుండి.. గామా అవార్డు వేదికకు సహాయ, సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని తెలియచేశారు.అలాగే హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, ఊర్వశి రౌటెల, మానస వారణాశి స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించిన ఈ కార్యక్రమంలో.. యాంకర్ సుమ, అతడు హర్ష వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన తీరు హైలెట్‌గా నిలిచింది. -
‘గామా’ అవార్డ్స్ ప్రెస్ మీట్ లో మెరిసిన హీరోయిన్స్ (ఫొటోలు)
-
‘గామా అవార్డ్స్’ కర్టెన్ రైజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆగస్టు 30న ఘనంగా గామా అవార్డుల వేడుక
దుబాయిలో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు గామా (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) పురస్కారాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇప్పుడు ఐదో ఎడిషన్ వేడుకలు ఈనెల 30 నుంచి షార్జా ఎక్స్పో సెంటర్లో గ్రాండ్‌గా జరగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించారు. గామా సీఈవో సౌరభ్ కేసరి, వైభవ్ జ్యువెలర్స్ ఎండీ రాఘవ్, జ్యూరీ సభ్యులు ప్రముఖ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, బి.గోపాల్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.ఈ సందర్భంగా గామా సీఈవో సౌరభ్ మాట్లాడుతూ.. 'ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈవెంట్ కాదు. మా నాన్నకు(త్రిమూర్తులు) కళాకారులపై ఉన్న అభిమానంతో గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నాం. అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం. వచ్చే ఏడాది మరింత గ్రాండ్‌గా అవార్డ్స్ ఇచ్చే ప్లాన్ చేస్తున్నాం. దుబాయిలోని తెలుగువారితోపాటు ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈవెంట్ నిర్వహించబోతున్నాం. మా జ్యూరీ సభ్యుల సహకారంతో అవార్డు విజేతలను ఎంపిక చేశామని చెప్పుకొచ్చారు. ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్‌తో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకని నిర్వహించేలా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్‌తో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొనబోతున్నారు. హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, పూజా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. -
దుబాయ్‌లో ‘గామా అవార్డ్స్’.. హాజరయ్యే హీరోహీరోయిన్లు వీళ్లే!
గల్భ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (గామా) ఐదవ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. ఇందుకు సంబంధించిన థీమ్ సాంగ్‌ను దుబాయ్‌లో లాంచ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను రఘు కుంచె కంపోజ్ చేసి పాడారు. సందర్భంగా ‘గామా అవార్డ్స్’ చైర్మన్ త్రిమూర్తులు గారు మాట్లాడుతూ ‘ దుబాయ్ లో జరిగే ఏకైక అతి పెద్ద వేడుక గామా అవార్డ్స్. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్నాం. ఆగస్ట్ 30న జరగబోయే 5వ ఎడిషన్‌ను కూడా మన తెలుగు వారు అందరూ , ఈ కార్యక్రమానికి సహకరించి, అధిక సంఖ్యలో హాజరు అయ్యి విజయవంతం చేయాలి’అని కోరారు.దుబాయ్‌లో జరిగే ఈ ఈవెంట్‌కి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్ తో పాటు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొనబోతున్నారు. అలాగే హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించనున్నారు.ప్రత్యేక అతిధులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్విని దత్, డివివి దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిషోర్ తదితర ప్రముఖులు హాజరవనున్నారు.వీరితో పాటు పలువురు టాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు సర్ ప్రైజ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారు. అతిరథ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరగనున్న ఈ అవార్డ్స్ వేడుక కోసం చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్.. ప్రదానం చేసేది ఎప్పుడంటే?
ప్రతిష్టాత్మక గామా అవార్డుల వేడుక అంతా సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న ఐదో ఎడిషన్‌కు సంబంధించిన వివరాలను దుబాయ్ వేదికగా ప్రకటించారు. దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో నిర్వహించిన ఈవెంట్లో తేదీ, వేదికను ఖరారు చేశారు. ఈ వేడుకలో ప్రముఖ సింగర్ రఘు కుంచె సమక్షంలో జ్యూరీ కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గామా అవార్డ్స్ గ్రాండ్ రివీల్ పేరిట ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రత్యేకమైన వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.మొట్టమొదటి సారి చాలా వినూత్నంగా ఈ గ్రాండ్ రెవీల్ ఈవెంట్ నిర్వహించారు. గామా అవార్డ్స్-2025 వేడుక 5వ ఎడిషన్ జూన్ 7, 2025న దుబాయ్ షార్జా ఎక్స్పో సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ జ్యూరీ చైర్ పర్సన్స్ సభ్యులుగా టాలీవుడ్ సినీ దర్శకులు ఏ. కొదండ రామిరెడ్డి , సంగీత దర్శకులు కోటి , సినీ దర్శకులు బి. గోపాల్ వారి ఆధ్వర్యంలో ఎంపికైన టాలీవుడ్ నటీనటులకు, సినిమాలకు గామా అవార్ద్స్ అందజేస్తారు.ఈ సందర్బంగా కుంచె రఘు గారు మాట్లాడుతూ.. 'తెలుగు ఇండస్ట్రీ లో నాలాంటి కళాకారులు ఎందరో ఆసక్తిగా ఎదురు చూసే ఈవెంట్ గామా అవార్డ్స్. గామాతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది. మా కళా కారుల అందరిని మంచి వసతులు ఇచ్చి చాలా బాగా చూసుకుంటామని చెప్పారు. కాగా.. ఈ వేడుకలో యాంకర్, సింగర్ తిరు, శరణ్య తమ చక్కటి ప్రదర్శనలతో వచ్చిన అతిధులను ఆకట్టుకున్నారు. సంగీత ప్రదర్శనలతో పాటు, ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలతో ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. -
టాలీవుడ్ గామా అవార్డ్స్.. హనుమాన్ హీరోకు అవార్డ్..!
తెలుగు సినిమా అవార్డ్స్ వేడుక ఘనంగా నిర్వహించారు. గామా పేరిట అందిస్తున్న అవార్డుల నాలుగో ఎడిషన్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. దుబాయ్ వేదికగా జరిగిన వేడుకల్లో టాలీవుడ్ సినీ తారలు హాజరై సందడి చేశారు. 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించి వివిధ కేటగిరిల్లో ఈ అవార్డులను అందింటారు. ఈ వేడుకల్లో గామా అవార్డ్స్ ఛైర్మన్ కేసరి త్రిమూర్తులుతో పాటు మరికొందరు ముఖ్య అతిథులు విన్నర్స్‌కు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు నేహాశెట్టి, ఫరియా అబ్దుల్లా, డింపుల్ హయాతి, దక్షా నగార్కర్, ఆషికా రంగనాథ్ తమ డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరించారు. 2021 గామా అవార్డ్ విజేతలు ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి - ఫరియా అబ్దుల్లా (జాతి రత్నాలు) ఉత్తమ దర్శకుడు- సుకుమార్ (పుష్ప) బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - దక్షా నగర్కర్ (జాంబి రెడ్డి) ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప) అత్యంత ప్రజాదరణ పొందిన పాట- నీలి నీలి ఆకాశం (అనూప్ రూబెన్స్) ఉత్తమ గాయకుడు- ధనుంజయ్ (నా మది నీదే) ఉత్తమ గాయని - ఎంఎల్ శృతి (అడిగా అడిగా) గామా బెస్ట్ పాపులర్ సాంగ్ - మౌనిక యాదవ్ (సామి నా సామి - పుష్ప) మూవీ ఆఫ్ ది ఇయర్ - పుష్ప (మైత్రి మూవీ మేకర్స్ - యలమంచిలి రవి, నవీన్ యెర్నేని) 2022 గామా అవార్డ్ విజేతలు ఉత్తమ నటుడు - నిఖిల్ (కార్తికేయ 2) ఉత్తమ నటి - మృణాల్ ఠాకూర్ (సీతా రామం) బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్- డింపుల్ హయతి (ఖిలాడి) మూవీ ఆఫ్ ది ఇయర్ - సీతా రామం (వైజయంతి మూవీస్) ఉత్తమ దర్శకుడు - హను రాఘవపూడి (సీతా రామం) గామా జ్యూరీ ఉత్తమ నటుడు - విశ్వక్ సేన్ (అశోక వనంలో అర్జున కళ్యాణం) ఉత్తమ సంగీత దర్శకుడు - ఎస్ఎస్ తమన్ (భీమ్లా నాయక్) ఉత్తమ ఆల్బమ్ - సీతారామం (విశాల్ చంద్రశేఖర్) ఉత్తమ గాయకుడు- అనురాగ్ కులకర్ణి (సిరివెన్నెల... శ్యామ్ సింగరాయ్) ఉత్తమ గాయని - హారిక నారాయణ (లాహే లాహే... ఆచార్య) 2023 గామా అవార్డుల విజేతలు ఉత్తమ నటుడు - ఆనంద్ దేవరకొండ (బేబీ) ఉత్తమ నటి - సంయుక్త (విరూపాక్ష) బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ - ఆషికా రంగనాథ్ (అమిగోస్, నా సామి రంగ) బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ - తేజ సజ్జా (హను-మాన్) మూవీ ఆఫ్ ది ఇయర్- బ్రో (పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ - టీజీ విశ్వప్రసాద్) ఉత్తమ దర్శకుడు - బాబీ (వాల్తేరు వీరయ్య) గామా జ్యూరీ ఉత్తమ నటుడు - సందీప్ కిషన్ (మైఖేల్) ఉత్తమ విలక్షణ నటుడు - మురళీ శర్మ పలు కేటగిరీల్లో అవార్డులు గామా లెజెండ్రీ సంగీత దర్శకుడు - డాక్టర్ కోటి సాలూరి (40 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ) గామా స్పెషల్ జ్యూరీ అవార్డు - ఎంఎం శ్రీలేఖ (25 ఇయర్స్ ఆఫ్ మ్యూజికల్ జర్నీ) గామా గౌరవ్ సత్కర్ - చంద్రబోస్ (ఆస్కార్ విన్నింగ్ ఇండియన్ లిరిసిస్ట్) ఉత్తమ సంగీత దర్శకుడు - హేషమ్ అబ్దుల్ వాహాబ్ (ఖుషి) ఉత్తమ గేయ రచయిత - కాసర్ల శ్యామ్ (చంకీలా అంగీ లేసి... దసరా సినిమా) అత్యంత ప్రజాదరణ పొందిన పాట - పూనకాలు లోడింగ్ (దేవి శ్రీ ప్రసాద్) గామా మూవీ ఆఫ్ ది డెకేడ్ - ఆర్ఆర్ఆర్ (డీవీవీ దానయ్య నిర్మాణం) గామా మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ - నక్కిలీసు గొలుసు (రఘు కుంచె) ఉత్తమ గాయకుడు- రాహుల్ సిప్లిగంజ్ (ధూమ్ దాం - దసరా) ఉత్తమ గాయని - చిన్మయి (ఆరాధ్య - ఖుషి) గామా గద్దర్ మెమోరియల్ అవార్డు - జానపద గాయకుడు ‘నల్లగొండ గద్దర్’ నరసన్న -
గామా అవార్డ్స్ మెరిసిన తారలు (ఫొటోలు)
-
GAMA Awards 2024: దుబాయ్‌లో గామా అవార్డ్స్ ఈవెంట్ (ఫొటోలు)
-
రాజమౌళి, బాహుబలి ఆపేద్దామన్నాడా..?
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. ఇప్పటికే భారీ కలెక్షన్లతో పాటు ఎన్నో అంతర్జాతీయ వేదిక మీద కూడా ఈ సినిమా సత్తా చాటింది. తాజాగా గామా అవార్డుల వేడుకలోనూ బాహుబలి హవా కొనసాగింది. ఈ సందర్భంగా గామా వేదికపై మాట్లాడిన ప్రభాస్ కొన్ని ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించాడు. అసలు బాహుబలి సినిమా తెర మీదకు రావటం వెనక ఎవరి ధైర్యం ఉందో తెలియజేశాడు. ముందు బాహుబలి సినిమాను ఒక్క భాగంగానే తెరకెక్కించాలని భావించారు. కథా కథనాలతో పాటు బడ్జెట్ లెక్కలు కూడా చూసిన తరువాత.. తెలుగు సినిమా మార్కెట్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ సాధ్య పడదని రాజమౌళి తేల్చేశాడట. అంతేకాదు ప్రభాస్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో మరో సినిమా చేద్దామని కూడా చెప్పాడు. అయితే సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లు మాత్రం ఎంత ఖర్చైనా పర్వాలేదు, బాహుబలి లాంటి అద్భుతాన్నే తెరకెక్కించాలని, రాజమౌళిని ఒప్పించారని తెలిపాడు ప్రభాస్.