దుబాయ్‌లో 'గామా' అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ | GAMA 2025 Celebrate Best Movie And Artist Events In Dubai, Check Out Full Winners List Inside | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో 'గామా' అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌

Sep 1 2025 8:12 AM | Updated on Sep 1 2025 9:38 AM

Gama 2025 Celebrate Best movie and artist Events In Dubai

ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్‌లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. గామా 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌‌లో  గ్రాండ్గా జరిగాయి. ఈ వేడుకలో టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు , సీఈఓ సౌరభ్ కేసరి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా ఈ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది.

గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు - ఏ. కోదండ రామిరెడ్డి , ప్రముఖ సంగీత దర్శకులు - కోటి , ప్రముఖ సినీ దర్శకులు - బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్డ్స్ బహుకరించబడ్డాయి. నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపును అందుకున్న 'పుష్ప 2' గామా బెస్ట్ మూవీగా అవార్డ్ కైవసం చేసుకుంది.

గామా అవార్డు గ్రహీతలు:

బెస్ట్ యాక్టర్ 2024 అల్లు అర్జున్ (పుష్ప2 ది రూల్)

బెస్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)

బెస్ట్ మూవీ పుష్ప 2 (మైత్రి మూవీ మేకర్స్.. యలమంచిలి రవి నవీన్ యెర్నేని)

బెస్ట్ డైరెక్టర్ సుకుమార్ (పుష్ప 2)

బెస్ట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898AD)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ (పుష్ప 2)

బెస్ట్ కొరియోగ్రఫీ : భాను మాస్టర్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)

బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)

బెస్ట్ సినిమాటోగ్రఫీ : రత్న వేలు (దేవర)

బెస్ట్ లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లే..దేవర)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : అనురాగ్ కులకర్ణి (సుట్టమలా సూసి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ : మంగ్లీ (కళ్యాణి వచ్చావచ్చా.. ఫ్యామిలీ స్టార్)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ క్రిటిక్ : సమీరా భరద్వాజ్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)

 

బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ : రజాకార్

బెస్ట్ యాక్టర్ క్రిటిక్ : తేజ సజ్జా

బెస్ట్ పెర్ఫార్మన్స్ యాక్టర్ జ్యూరీ : రాజా రవీంద్ర (సారంగదరియా)

బెస్ట్ యాక్టర్ జ్యూరీ : కిరణ్ అబ్బవరం (క)

బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ : రోషన్ (కోర్ట్)

బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ : శ్రీదేవి (కోర్ట్)

బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ : మానస వారణాశి

బెస్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ : అప్సర్ (శివం భజే)

గద్దర్ మెమోరియల్ మ్యూజిక్ అవార్డ్ : మట్ల తిరుపతి

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : వినయ్ రాయ్ (హనుమాన్)

బెస్ట్ సపోర్టింగ్ పెర్ఫార్మన్స్ అవార్డ్ : హర్ష చెముడు (సుందరం మాస్టర్)

బెస్ట్ సపోర్టింగ్ కామెడీ రోల్ : బాలిరెడ్డి పృథ్వీరాజ్

బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫిమేల్ : నయన్ సారిక (ఆయ్, క)

బెస్ట్ డెబ్యూ యాక్టర్ జ్యూరీ : ధర్మ కాకాని (డ్రింకర్ సాయి)

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రాళ్ళు)

బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రాళ్ళు)

గ్లోబల్ కమెడియన్గా ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం స్పెషల్ అవార్డును అందుకున్నారు. వీరితోపాటు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును నిర్మాత అశ్వినీ దత్ అందుకున్నారు. అలాగే హీరో సత్యదేవ్ జీబ్రా చిత్రానికి గాను ప్రామిసింగ్ యాక్టర్గా అవార్డును కైవసం చేసుకున్నారు. ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ అవార్డును అందాల భామ ఊర్వశి రౌటెల అందుకున్నారు.

గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ..”వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదిక‌పై ఇలా ప్రెస్టేజియస్ గా ఈ వేడుక నిర్వహించడం ఆనందంగా ఉంది. గామా స్థాపించినప్పటి నుండి.. గామా అవార్డు వేదికకు సహాయ, సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని తెలియచేశారు.

అలాగే హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, ఊర్వశి రౌటెల, మానస వారణాశి స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించిన ఈ కార్యక్రమంలో.. యాంకర్ సుమ, అతడు హర్ష వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన తీరు హైలెట్గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement