రాజమౌళి, బాహుబలి ఆపేద్దామన్నాడా..? | Prabhas Reveals Secret Behind Baahubali | Sakshi
Sakshi News home page

రాజమౌళి, బాహుబలి ఆపేద్దామన్నాడా..?

Feb 14 2016 1:10 PM | Updated on Jul 14 2019 4:05 PM

రాజమౌళి, బాహుబలి ఆపేద్దామన్నాడా..? - Sakshi

రాజమౌళి, బాహుబలి ఆపేద్దామన్నాడా..?

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. ఇప్పటికే భారీ కలెక్షన్లతో పాటు ఎన్నో అంతర్జాతీయ వేదిక మీద కూడా ఈ సినిమా సత్తా చాటింది. తాజాగా గామా...

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి. ఇప్పటికే భారీ కలెక్షన్లతో పాటు ఎన్నో అంతర్జాతీయ వేదిక మీద కూడా ఈ సినిమా సత్తా చాటింది. తాజాగా గామా అవార్డుల వేడుకలోనూ బాహుబలి హవా కొనసాగింది. ఈ సందర్భంగా గామా వేదికపై మాట్లాడిన ప్రభాస్ కొన్ని ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించాడు. అసలు బాహుబలి సినిమా తెర మీదకు రావటం వెనక ఎవరి ధైర్యం ఉందో తెలియజేశాడు.

ముందు బాహుబలి సినిమాను ఒక్క భాగంగానే తెరకెక్కించాలని భావించారు. కథా కథనాలతో పాటు బడ్జెట్ లెక్కలు కూడా చూసిన తరువాత.. తెలుగు సినిమా మార్కెట్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ సాధ్య పడదని రాజమౌళి తేల్చేశాడట. అంతేకాదు ప్రభాస్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో మరో సినిమా చేద్దామని కూడా చెప్పాడు. అయితే సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్లు మాత్రం ఎంత ఖర్చైనా పర్వాలేదు, బాహుబలి లాంటి అద్భుతాన్నే తెరకెక్కించాలని, రాజమౌళిని ఒప్పించారని తెలిపాడు ప్రభాస్.

Advertisement
 
Advertisement
Advertisement