
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దోహా నుంచి ఢిల్లీ చేరుకున్న కిలాడీ లేడీ వద్ద కొకైన్‌ను గుర్తించారు. ఈ క్రమంలో ఆమె వద్ద నుంచి రూ.82 కోట్లు విలువ చేసే 5.5 కిలోల కొకైన్‌ను సీజ్ చేశారు.
వివరాల ప్రకారం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ దొరకడం తీవ్ర కలకలం రేపింది. దోహా నుంచి ఢిల్లీ చేరుకున్న కిలాడీ లేడీ గోల్డ్ కలర్ చాక్లెట్స్‌లో కొకైన్‌ను నింపి తరలించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు.. ఆమె వద్ద నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.