ఢిల్లీ: Pan Masala Baron Daughter In Law Dies ప్రముఖ వ్యాపారవేత్త కమల్ కిషోర్ చౌరాసియా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కమల పాసంద్ పాన్ మసాలా బ్రాండ్‌తో పాపులర్ అయిన కమల్ కోడలు దీప్తి చౌరాసియా (Deepti Chaurasia) (40) దక్షిణ ఢిల్లీలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని వసంత విహార్‌లోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారని తెలుస్తోంది.
దక్షిణ ఢిల్లీలోని ఇంట్లో పాన్ మసాలా బారన్ కోడలు చనిపోయి కనిపించారు. చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఆమె గదిలో సూసైడ్ నోట్‌ను లభించింది. తన మరణానికి ఎవరికీ సంబంధం లేదంటూనే, రిలేషన్‌లో ప్రేమ, నమ్మకం లేకపోతే, ఇక జీవితానికి అర్థం ఏముంది? అని తన నోట్‌లో పేర్కొనడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై వివరణాత్మక దర్యాప్తు జరుగుతోంది. మృతదేహాన్నిస్వాధీనం చేసుకుని, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై పోలీసులు ఇంకా బహిరంగ ప్రకటన చేయలేదు.
ఇదీ చదవండి: H-1B వీసా స్కాం సంచలనం : ఏకంగా 220000 వీసాలా?
కాగా దీప్తి, కమల్ కిషోర్ కుమారుడు అర్పిత్‌ను 2010లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కమల్ కిషోర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, కమల్ కిషోర్ చౌరాసియా. ఇది కమలా పసంద్, రాజ్‌శ్రీ బ్రాండ్ పాన్ మసాలా, ఇతర పొగాకు ఉత్పత్తుల రంగంలో పనిచేస్తుంది.


