H-1B వీసా స్కాం సంచలనం : చెన్నైకి ఏకంగా 220000 వీసాలా? | H-1B Visas Chennai Got 220000 US Economist Allegations will shock you | Sakshi
Sakshi News home page

H-1B వీసా స్కాం సంచలనం : చెన్నైకి ఏకంగా 220000 వీసాలా?

Nov 26 2025 12:46 PM | Updated on Nov 26 2025 1:22 PM

H-1B Visas Chennai Got 220000 US Economist Allegations will shock you

అమెరికా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఐటీ , కంపెనీలు ఉద్యోగుల్లో  H-1B వీసాల టెన్షన్‌ నెలకొంది. ఈ  ఆందోళన ఇలా ఉండగా చెన్నైలో హెచ్‌ 1బీవీసాలకు సంబంధించి భారీ కుంభకోణం ఆరోపణలు వెలుగులోకి రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. భారతదేశంలోని చెన్నై జిల్లా దేశవ్యాప్తంగా అనుమతించబడిన మొత్తం వీసాల సంఖ్య కంటే రెండు రెట్లు ఎక్కువ పొందిందని అమెరికా మాజీ ప్రతినిధి , ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ ఆరోపించారు. దీంతో అధి నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం అమెరికా కంపెనీలు అందించే అమెరికా H-1B వీసా కార్యక్రమం మరోసారి చర్చనీయాంశమైంది.  

స్టీవ్ బానన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ H-1B వ్యవస్థను "పారిశ్రామిక-స్థాయి మోసం"  జరిగిందని, వీసా కేటాయింపులు చట్టబద్ధమైన పరిమితులను మించిపోయాయని డేవ్ బ్రాట్ పేర్కొన్నారు.  71 శాతం H-1B వీసాలు భారతదేశం నుండి వస్తున్నాయని, అయితే 12 శాతం మాత్రమే ఈ కార్యక్రమంలో రెండవ అతిపెద్ద లబ్ధిదారు చైనా నుండి వస్తున్నాయని  గుర్తు చేశారు.  కేవలం 85,000 H-1B వీసాల పరిమితి ఉంది, కానీ ఏదో విధంగా భారతదేశంలోని ఒక జిల్లా, మద్రాస్ (చెన్నై) జిల్లా 220,000  పొందింది అని ప్రశ్నించారు.   ఇక్కడ భారతీయులకు జారీ చేసిన హెచ్-1బీ వీసాల్లో 80-90 శాతం నకిలీవని ఆరోపించారు. H-1B వీసాల జాతీయ పరిమితి 85,000 అయితే, చెన్నైకి 220,000 వీసాలు  ఎలా వచ్చాయి? ఇది 2.5 రెట్లు ఎక్కువ,  మోసం చేశారన్నారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ కర్ణాటక వంటి నాలుగు అధిక జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల నుండి ని, దరఖాస్తులను ప్రాసెస్ చేస్తోంది. అక్రమంగా ఈ వీసాలు పొందేందుకు వారు తప్పుడు డిగ్రీలు, నకిలీ పత్రాలు సమర్పించారని పేర్కొన్నారు.

బ్రాట్ ఈ సమస్యను అమెరికన్ కార్మికులకు ప్రత్యక్ష ముప్పుగా  అభివర్ణించారు.   కాగా దాదాపు రెండు దశాబ్దాల క్రితం చెన్నై కాన్సులేట్‌లో పనిచేసిన భారత సంతతికి చెందిన అమెరికా విదేశాంగ సేవా అధికారి మహవాష్ సిద్ధిఖీ చేసిన ఆరోపణలను బ్రాట్‌ వాదనలు తిరిగి తెరపైకి తెచ్చాయి. చెన్నై కాన్సులేట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే H-1B ప్రాసెసింగ్ కేంద్రాలలో ఒకటి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement