తప్పు–శిక్ష
చైన్నెలో చెట్లను నరికేస్తే.. రూ. లక్ష జరిమానా
సాక్షి, చైన్నె: పచ్చదనంతో కూడిన నగరంగా చైన్నెను తిర్చిదిద్దేందుకు , కాలుష్యం తగ్గించే చర్యలకు ప్రభుత్వం కసరత్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తమకు చెందిన స్థలలో ఉన్న చెట్లను గానీ, బహిరంగ ప్రదేశాలలో ఉన్న చెట్లను నరికి వేసిన పక్షంలో చర్యలకు సిద్ధమయ్యారు. చెట్లనుగానీ, కొమ్మలను గానీ కత్తిరించాల్సి వస్తే, కార్పొరేషన్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ప్రత్యేక కాలం కేటాయించారు. అలాగే చెట్లను నరికినా, కొమ్మలను రోడ్ల మీద పడేసినా రూ. లక్ష జరిమానా విధించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రోడ్లపై ఉన్న చెట్లకు చీలలు కొట్టడం, బోర్డులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే రూ. 15 వేలు జరిమానా విధిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


