● కొళత్తూరులో సీఎం స్టాలిన్ ● సొంత ఇలాకాలో సమత్తువ పొం
కానుకల పంపిణీ చేస్తూ..
సీఎం స్టాలిన్ దంపతులకు ఆహ్వానం
సాక్షి, చైన్నె : సీఎం స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గం నుంచి వరుసగా విజయ ఢంకా మోగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇక్కడి నుంచే ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రభుత్వ విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, అత్యాధునిక వివిధ శిక్షణా కేంద్రాలు... ఇలా అనేక బ్రహ్మాండ ప్రగతి జరిగి ఉంది. నెలలో కనీసం ఒకటి రెండు రోజులు తన నియోజకవర్గంలో పర్యటించే సీఎం స్టాలిన్, అన్ని పండుగలను ఇక్కడి ప్రజలతో మమేకం అవుతూ జరుపుకుంటూ వస్తున్నారు. ఆదిశగా పెరంబూర్ డాన్ బాస్కో స్కూల్ ఆవరణలో బ్రహ్మాండ ఏర్పాట్లతో పొంగల్ సంబరాలకు చర్యలు తీసుకున్నారు. వివరాలు.. పొంగల్ పండుగలో పాల్గొంటూ ఇచ్చిన ప్రసంగం. తన సతీమణి దుర్గాతో కలిసి స్టాలిన్ ఈ వేడుకకు హాజరయ్యారు. అన్ని మతాల మహిళలతో కలిసి పొంగలి తయారు చేశారు. ఇక్కడ జరిగిన సంక్రాంతి సంబరాల సందడిలో తాను సైతం భాగస్వామ్యమయ్యారు. కర్ర సాముతో అందర్నీ ఆకట్టుకున్నారు. తన నియోజకవర్గ ప్రజలకే కాదు, ఇక్కడ పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు కానుకలను అందజేశారు. అందరితో ఆనందాన్ని పంచుకుంటూ కొన్ని గంటల పాటూ గడిపారు. మధ్యాహ్నం బ్రహ్మాండ విందు ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులకు స్వయంగా వడ్డించడమేకాకుండా అందరితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమానికి మంత్రి శేఖర్‌బాబు, మేయర్ ప్రియ, ప్రముఖ వ్యాఖ్యాత డాక్టర్ పర్వీన్ సుల్తానా, ఎంపీలు కళానిధి వీరసామి, గిరిరాజన్, శాసనసభ సభ్యులు తాయగం కవి, జోసెఫ్ శామ్యూల్, వెట్రి అళగన్, తదితరులు హాజరయ్యారు.
ఫియట్ కారులో ప్రయాణం
సీఎం స్టాలిన్ రోజూ అడయార్ పార్కులో వాకింగ్‌కు వెళ్లడం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన తన ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధతో వ్యాయామాలు సైతం చేస్తూ ఉంటారు. అలాగే, ఏడాదిలో ఓమారైనా తనకు ఎంతో నచ్చిన అప్పట్లో ఉపయోగించిన ఫియట్ కారును నడపడం జరుగుతోంది. ఆ దిశగా శనివారం ఆయన వాకింగ్‌కు వెళ్లి వస్తూ ఫియట్ కారును నడుపుకుంటూ ఇంటికి వెళ్లడం విశేషం. అదే సమయంలో సీఎం భద్రతా వాహనాల కాన్వాయ్ మధ్యలో బుల్లి ఫియట్ కారు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అడయార్ పరిసరాలలోని జంక్షన్ల వద్ద సీఎం తన ఫియట్‌ను నడుపుకుంటూ వెళ్తుండడాన్ని చూసిన జనం ఆసక్తితో పలకరించారు. అనంతరం తన నివాసం ఆవరణలోని క్యాంప్ కార్యాలయంలో తిరుక్కురల్ ఫెస్టివల్ కురల్ వీక్ పోటీలు 2026 కోసం సిద్ధం చేసిన లోగోను ఆవిష్కరించారు.
తమిళుల పొంగల్ పండుగను ఉత్సాహంగా జరుపుకోవడమే కాకుండా, ఈ వేదిక నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం ఆనందంగా ఉందని సీఎం ఎంకే స్టాలిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వేడుకలో ఆయన ప్రసంగిస్తూ, తాను కొళత్తూరుకు అనేక సార్లు వచ్చి వెళ్లినప్పటికీ, ఇలాంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందం కలిగించడమే కాకుండా, కొత్త శక్తిని ఇస్తుందని వ్యాఖ్యానించారు. ద్రవిడ మోడల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు పుర్తయ్యిందని పేర్కొంటూ, ఈ కాలంలో ఎన్నో విజయాలను సాధించామని గుర్తు చేశారు. 1967లో దివంగత నేత అన్నా నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో మాజీ సీఎం భక్తవత్సలం ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. డీఎంకే వాళ్ల సింగిల్ టీ తాగి కష్ట పని పనిచేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేయడానికి కారణం, ఆ మేరకు ఇక్కడ కేడర్ పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. కొళత్తూరు నియోజకవర్గంలో మాత్రమే కాదని, యావత్ తమిళనాడులోని ప్రతి నియోజకవర్గం తనదేనని వివరిస్తూ, రానున్న ఎన్నికలలో 200 స్థానాలలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కూటమిగా అన్నింటినీ అధిగమిస్తామన్న విశ్వాసంతో పొంగల్ సంబరాల వేదికగా అద్భుత విజయాలే లక్ష్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నానని, అందరం ప్రతిజ్ఞ చేద్దామని పిలుపు నిచ్చారు.
విజయాల వైపుగా ప్రయాణం


