breaking news
H1B Visa
-
హెచ్-1బీ వీసాలు.. వైట్‌హౌస్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాల(H-1B Visa) అంశంలో వైట్‌హౌస్ సంచలన ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా వ్యవస్థల్లో మోసాలు జరుగుతున్నాయని వైట్‌హౌస్(White House) ప్రెస్ సెక్రటరీ కరోలీనా లివిట్(Karoline Leavitt) తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కోర్టులో పోరాడేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.హెచ్-1బీ వీసాల(H-1B Visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. కోర్టుల్లో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పిటిషన్ల వ్యవహారమై తాజాగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలీనా లివిట్ స్పందించారు. ఈ సందర్భంగా లివిట్ మాట్లాడుతూ..‘అమెరికాలో చాలాకాలంగా హెచ్-1బీ వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయి. అమెరికన్ల వేతనాలను హెచ్-1బీ వీసాలు తగ్గించేస్తున్నాయి. కాబట్టి ట్రంప్ ఈ వ్యవస్థను మెరుగుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యలు చట్టబద్ధమైనవి. అయితే, ట్రంప్ నిర్ణయంపై కొందరు కోర్టులను ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై కోర్టులో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. అమెరికన్ కార్మికులకు అవకాశాలు అందడంతో పాటు వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే అధ్యక్షుడు ట్రంప్ తొలి ప్రాధాన్యం. దీనిపై కోర్టులో పోరాడేందుకు సిద్ధం. వీసా ఫీజుపెంపుపై కోర్టుల్లో వచ్చిన పిటిషన్లను ఎదుర్కొంటాం’ అని కామెంట్స్ చేశారు.#WATCH | Washington, DC | On H-1B visas, White House Press Secretary Karoline Leavitt says, "The administration will fight these lawsuits in court. The president's main priority has always been to put American workers first and to strengthen our visa system. For far too long, the… pic.twitter.com/9WLktOOaqd— ANI (@ANI) October 23, 2025హెచ్-1బీపై ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. పలు ఉద్యోగ సంఘాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయం కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఆ గ్రూప్ ఆందోళన వ్యక్తంచేసింది. హెచ్-1బీపై ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని తన వ్యాజ్యంలో వాదించింది. ఫీజు రాయితీలు..ఇదిలా ఉండగా.. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు(దాదాపు రూ. 88 లక్షలు) పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నెలరోజుల తర్వాత ఫీజును ఎలా చెల్లించాలో, ఈ ఫీజు నుంచి ఎవరికి మినహాయింపు లభిస్తుందో వివరాలు వెల్లడించింది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఫీజు పేమెంట్ పోర్టల్‌ను ప్రవేశపెడుతూ ఫీజు చెల్లించినట్లు రసీదు సమర్పించిన దరఖాస్తుదారులు మాత్రమే తదుపరి అడుగులు వేయాలని, అయితే కొందరు స్టూడెంట్ వీసాదారులకు మాత్రం ఫీజు రాయితీ ఉంటుందని తెలిపింది.ఎఫ్-1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, ఎల్-1 వీసాలపై ఉన్న ప్రొఫెషనల్స్‌తో సహా ప్రస్తుత వీసాదారులు హెచ్-1బీ హోదా కోసం దరఖాస్తు చేసినపుడు లక్ష డాలర్లను చెల్లించవలసిన అవసరం లేదని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. అమెరికా వెలుపల ఉన్న వ్యక్తులు దాఖలు చేసే దరఖాస్తులకు మాత్రం కొత్త ఫీజు వర్తిస్తుందని గ్రీన్ అండ్ స్పీగెల్‌కు చెందిన డాన్ బెర్గెర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అమెరికాను వీడి ఉండి ప్రస్తుత హెచ్-1బీ వీసాపై దేశంలోకి తిరిగి ప్రవేశించడం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే వారికి కొత్త ఫీజు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. హోదా మార్పు లేదా స్టే పొడిగింపునకు దరఖాస్తుదారు అర్హుడు కాదని తాము నిర్ధారిస్తే కంపెనీ యజమాని ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉంటుందని యూఎస్సీఐఎస్ పేర్కొంది. -
ప్రతిభను ఆకర్షించడంపై కెనడా దృష్టి
నైపుణ్యం కలిగిన ప్రతిభను ఆకర్షించడం, శ్రామిక శక్తిని పెంచడంపై దృష్టి సారించేలా కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రణాళికను ఆవిష్కరించారు. రాబోయే బడ్జెట్లో ఈమేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. అమెరికా హెచ్1బీ వీసా ఫీజు పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కెనడా చర్యలు కీలకంగా మారనున్నాయి.ఈ సందర్భంగా కార్నీ మాట్లాడుతూ.. ‘దేశ అవసరాలకు సరిపోలేలా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా బడ్జెట్లో కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రణాళికకు కేటాయింపులుంటాయి. ఈ ప్రణాళికలో ప్రతిభ, నైపుణ్యాల శిక్షణ, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన అప్రెంటిస్‌షిప్‌లు ఉంటాయి’ అని చెప్పారు.అమెరికన్ హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో కార్నీ గ్లోబల్ టెక్ టాలెంట్‌పై దృష్టి సారించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసా ఛార్జీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో హెచ్-1బీ వీసాలపై 1,00,000 డాలర్ల రుసుము విధిస్తామని చెప్పారు. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ వంటి రంగాలలో విదేశీ ప్రతిభపై ఆధారపడే యూఎస్ కంపెనీల్లో అనిశ్చితిని సృష్టించింది. దీన్ని ఆసరాగా చేసుకుని కెనడా తమ దేశంలోకి ప్రతిభను ఆకర్షించే విధానాలు రూపొందిస్తుంది.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
అమెరికాలోనే చదివిన వారికి లక్ష డాలర్ల ఫీజులేదు
న్యూయార్క్: హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులందరిపై ఏకంగా ఒకేసారి లక్ష డాలర్ల ఫీజు గుదిబండ పడేసిన ట్రంప్ సర్కార్ హఠాత్తుగా ఒక వర్గం వారికి మాత్రం భారీ లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటూ విద్యనభ్యసిస్తూ హెచ్–1బీ కోసం దరఖాస్తుచేసుకున్న విద్యార్థులు ఈ అధిక వీసా ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) విభాగం ఒక నోటిఫికేషన్ జారీచేసింది.ఇప్పటికే అమెరికాలోని పలు రంగాల సంస్థల్లో పనులు చేస్తున్న విదేశీయులు చేసే దరఖాస్తులకు సైతం లక్ష డాలర్ల మినహాయింపు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, అక్కడి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయులకు భారీ లబ్ధిచేకూరనుంది. విదేశాల్లోని వ్యక్తులు చేసే హెచ్–1బీ వీసా దరఖాస్తులకు మాత్రం లక్ష డాలర్ల ఫీజు ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.అమెరికాలో విద్యనభ్యసిస్తూ ఎఫ్–1వీసా ఉండి దానికి హెచ్–1బీ వీసాగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. సెపె్టంబర్ 21వ తేదీ మొదలవగానే అర్ధరాత్రి 12.01 నిమిషాల తర్వాత వచ్చే ప్రతి విదేశీ హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులు తప్పకుండా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏఏ వర్గాల వారికి ఈ అధిక ఫీజు మినహాయింపు ఉంటుందనే దానిపై సోమవారం యూఎస్సీఐఎస్ ఈ ప్రకటనలో స్పష్టతనిచ్చింది.. హాయిగా వెళ్లిరావొచ్చు ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉన్న విదేశీయులు అత్యవసర పనుల నిమిత్తం స్వదేశం లేదా విదేశాలకు వెళితే మళ్లీ తిరిగొచ్చేటప్పుడు వీసా నిబంధనలు ప్రతిబంధకంగా మారుతాయన్న భయంతో చాలా మంది ఎక్కడికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే ఉండిపోతున్నారు. ఇలాంటి భయాలు అక్కర్లేదని హాయిగా అమెరికా నుంచి విదేశాలకు వెళ్లిరావొచ్చని ప్రభుత్వం స్పష్టంచేసింది. ‘‘హెచ్–1బీ వీసా పొడిగింపు, హెచ్–1బీ వీసాగా మార్పు, నివాస స్థితి పొడిగింపు వంటి దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నందున ఈలోపు అంతర్జాతీయ విమానప్రయాణం చేస్తే తమ వీసా స్టేటస్‌కు ముప్పు వస్తుందనే భయం ఎవరికీ అక్కర్లేదు’’అని గ్రీన్ అండ్ స్పైగల్ న్యాయసేవల సంస్థ ఉన్నతాధికారి డ్యాన్ బెర్జర్ చెప్పారు. చిన్న మెలిక పెట్టిన ప్రభుత్వంఅయితే, ఇప్పటికే అమెరికాలో ఉంటూ చదువుకుంటున్న లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్న విదేశీయులు చేసే ‘హెచ్–1బీ వీసాగా మార్పు’,‘నివాస స్థితి పొడిగింపు’,‘స్టేటస్ మార్పు’వంటి అభ్యర్థనలకు వాళ్లు అనర్హులు అని తేలితే వాళ్ల నుంచి కూడా లక్ష డాలర్ల ఫీజు వసూలుచేస్తామని యూఎస్సీఐఎస్ వ్యాఖ్యానించింది. ఈ లెక్కన ఏ దరఖాస్తునైనా ఉద్దేశపూర్వకంగా అనర్హమైనదిగా ప్రకటించి లక్ష డాలర్ల రుసుం కట్టాల్సిందేనని ఇమిగ్రేషన్ విభాగం ప్రకటిస్తే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.కొత్తగా విదేశాల నుంచి చేసే దరఖాస్తులకే లక్ష డాలర్ల ఫీజు ఉంటుంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉండి, దాని రెన్యూవల్ దరఖాస్తు ఆమోదం/పెండింగ్ స్థితిలో ఉండగా స్వదేశం వెళ్లిపోయిన విదేశీయులు మళ్లీ అమెరికాలోకి విమానంలో వచ్చినా వాళ్లకు సైతం ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు మొదట అమెరికాలోనే చదువుకోవాలనేదే ట్రంప్ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టమవుతోంది.గత కొన్నాళ్లుగా హెచ్–1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. భారతీయులు అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, వీరికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంలోనే లక్ష డాలర్ల ఫీజు ట్రంప్ తీసుకొచ్చారని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా 65,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తోంది. ఇవిగాక అమెరికాలోనే మాస్టర్స్, అంతకుమించిన ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అర్హతల మేరకు మరో 20,000 హెచ్–1బీ వీసాలను అందజేస్తోంది. -
H1B వీసా ఫీజు విషయంలో విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
-
H1b Visa: విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. కొత్త H-1B వీసా దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్(USCIS) పేర్కొంది. హెచ్1బీ ఫీజు పెంపుపై స్పష్టత ఇచ్చే క్రమంలో పలు వివరాలను వెల్లడించింది.హెచ్-1బీ ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుంచి దరఖాస్తు చేసుకొన్నవారికే వర్తిస్తుందని పేర్కొంటూ అమెరికాలో చదువుకొంటున్న విద్యార్థులకు అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ తీపి కబురు చెప్పింది. అలాగే.. ఫీజు పెంపు ప్రకటన వెలువడే సమయానికి అమెరికాలోనే ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది.ఇదిలా ఉంటే.. 2025 సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ప్రెసిడెన్షియల్ ప్రోక్లమేషన్’ విడుదల చేశారు. దీని ప్రకారం, కొత్త H-1B వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధించబడుతుంది. ఈ ఫీజు 2025 సెప్టెంబర్ 21 నుంచి కొత్త H-1B వీసా పిటిషన్లకు వర్తించడం అమలైంది. అయితే.. USCIS అక్టోబర్ 20న ఫీజు అమలులో పారదర్శకత, మినహాయింపు విధానం, అర్హత ప్రమాణాలు గురించి వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను తెలియజేసింది.మరోవైపు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా మాట్లాడుతూ.. F-1 (విద్యార్థి వీసా), L-1 (ఇంటర్‌కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా) లబ్ధిదారులు ఈ భారీ ఫీజు నుంచి విముక్తి పొందారని తెలిపారు. ఇది విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపశమనం కలిగించే నిర్ణయమని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మార్పులు అమెరికాలో ఉన్న ఉద్యోగదారులకు, అలాగే విద్యార్థులకు.. ఇమ్మిగ్రేషన్ ఖర్చులను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో నుంచే H-1Bకి మారుతారు. కాబట్టి. ఈ భారీ ఫీజు వాళ్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. -
హెచ్1బీ ఫీజు పెంపుపై పిటిషన్
వాషింగ్టన్: విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించిన హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్ల (దాదాపు రూ.88 లక్షలు)కు పెంచటాన్ని సవాల్ చేస్తూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కొలంబియాలోని ఒక జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్) చేసిన చట్టంలో ఏకపక్షంగా మార్పులు చేసే అధికారం దేశాధ్యక్షుడికి లేదని గురువారం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వంతోపాటు హోమ్‌లాండ్ సెక్యూరిటీ, మంత్రులు క్రిష్టీ ఎల్ నోయెమ్, మార్కో రుబియోలను ప్రతివాదులుగా చేర్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పూర్తిగా అన్యాయం, తప్పుదోవ పట్టించే విధానం అని ఆరోపించింది. ఫీజు పెంపు వల్ల నైపుణ్యగల విదేశీ నిపుణులు అమెరికాలోకి రాలేరని, అప్పుడు దేశంలో పరిశోధనలు, పోటీతత్వం దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేసింది. ట్రంప్ నిర్ణయం అమెరికా ప్రత్యర్థి దేశాలకు మేలు చేసేదిగా ఉందని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ బ్రాడ్లీ విమర్శించారు. పార్లమెంటు అధికారాలను కాలరాసి, అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం చెల్లదని స్పష్టంచేశారు. 3,600 ఉన్న హెచ్1బీ వీసా ఫీజును అధ్యక్షుడు ట్రంప్ గత నెల 19న ఒకేసారి లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం భారతీయ వృత్తినిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏటా దాదాపు 85,000 హెచ్1బీ వీసాలు జారీచేస్తుండగా, అందులో దాదాపు 70 శాతం భారతీయులే దక్కించుకుంటున్నారు. -
విప్రో లాభం ఫ్లాట్
ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ.3,246 కోట్లను దాటింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.3,209 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 2 శాతం పుంజుకుని రూ.22,697 కోట్లను తాకింది. అయితే త్రైమాసికవారీగా నికర లాభం 2.5 శాతం నీరసించగా.. ఆదాయం ఇదే స్థాయిలో బలపడింది.మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ఐటీ సర్వీసుల ఆదాయం –0.5–+1.5 శాతం స్థాయిలో నమోదుకాగలదని కంపెనీ తాజాగా అంచనా వేసింది. వెరసి 259.1–264.4 కోట్ల డాలర్ల మధ్య ఆదాయ గైడెన్స్ ప్రకటించింది. అయితే ఇటీవల సొంతం చేసుకున్న హర్మన్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్ ఆదాయ అంచనాలను దీనిలో కలపకపోవడం గమనార్హం! ప్రస్తుతం డిమాండ్ వాతావరణం పటిష్టంగా కనిపిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. విచక్షణా వ్యయాలు ఏఐ ఆధారిత ప్రాజెక్టులవైపు మరలుతున్నట్లు వెల్లడించారు. హెచ్1బీ వీసా ఫీజు ప్రభావం అంతంతే..యూఎస్ ఉద్యోగులలో 80% స్థానికులే కావడంతో హెచ్1బీ వీసా ఫీజు పెంపు ప్రభావం నామమాత్రమేనని కంపెనీ సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. డిమాండ్ ఆధారంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ చేపట్టనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇతర విశేషాలు..2,260 మంది ఉద్యోగులు జతకావడంతో. సిబ్బంది సంఖ్య 2,35,492ను తాకింది.2 మెగా రెన్యువల్స్, 13 భారీ డీల్స్ ద్వారా మొత్తం ఆర్డర్లు 31 శాతం జంప్‌చేసి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐటీ సర్వీసుల మార్జిన్లు 16.7%గా ఉన్నాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు -
H1B వీసా నిబంధనల్లో మరో షాకిచ్చిన ట్రంప
-
H1B Visa: కారు మబ్బులు.. కాంతి రేఖలు
మొదట సుంకాల మోత... ఆ తర్వాత కొత్త హెచ్1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు వ్యవహారం.. ఆపైన బ్రాండెడ్ ఔషధాలపై 100 శాతం సుంకాలు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలితో భారత్-అమెరికా సంబంధాల్లో తెలియని గందరగోళం నెలకొంది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మొన్న అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావమూ మన వీసాలపై పడనుంది.ఇప్పుడేం జరిగింది?హెచ్1బీ వీసాల ఫీజును ఒకేసారి దాదాపు 60 రెట్లు పెంచుతూ, లక్ష డాలర్లు చేస్తున్నట్టు సెప్టెంబర్ 19న ట్రంప్ సంతకం చేశారు. గందరగోళం రేగడంతో, కొత్త దరఖాస్తులకే ఈ హెచ్చు ఫీజు వర్తిస్తుందనీ, ఇప్పటికే వీసా ఉన్నవారికీ, రెన్యువల్ కోరుతున్న వారికీ అది వర్తించదనీ వాషింగ్టన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇంతలో అక్టోబర్ 1 నాటి షట్‌డౌన్ నిర్ణయంతో మరో చిక్కు వచ్చి పడింది.షట్‌డౌన్ కథేమిటి?ఏటా అక్టోబర్ 1 నుంచి మరుసటి సెప్టెంబర్ 30 వరకు అమెరికా ప్రభుత్వపు ఆర్థిక సంవత్సరం. ఆ కాలవ్యవధికి అన్ని శాఖల వ్యయపరిమితిని నిర్ణ యిస్తూ మన బడ్జెట్ తరహాలో నిధుల కేటాయింపు చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించగా, దేశాధ్యక్షుడు సంతకం చేయాలి. ఈ ఫండింగ్ బిల్ సమయానికి ఆమోదం పొందకపోతే, ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే, అత్యవసరం కాని సర్వీసులు స్తంభిస్తాయి. దీనితో కొత్త దరఖాస్తులు, బదిలీలు, గ్రీన్‌కార్డ్ ప్రక్రియలు ఆగిపోయాయి.ఎంత కష్టం? ఎవరికి నష్టం?నిజానికి, అమెరికన్ పౌరులు కానివారు ఆ దేశంలో ప్రత్యేక ఉద్యోగాలు సంపాదించడానికి హెచ్1బీ వీసాలు ఒక మార్గం. ఏటా గరిష్ఠంగా 65 వేల వీసాలే ఇవ్వాలి. అమెరికాకు చెందిన ఉన్నత విద్యాసంస్థ నుంచి మాస్టర్స్ డిగ్రీ, లేదా డాక్టరేట్ చేసిన విదేశీ వృత్తి నిపుణులకై అదనంగా మరో 20 వేల వీసాలు ఇవ్వవచ్చు. నిరుడు 80 వేల మందికి పైగా భారతీయులు హెచ్1బీలకు దరఖాస్తులు పెట్టారు. గత ఆర్థిక సంవత్సరం ఆమోదం పొందిన మొత్తం హెచ్1బీలలో 71 శాతం మన భారతీయులవే. పెంచిన తాజా వీసా ఫీజు ఆ దేశంలో భారీ టెక్ సంస్థలకే నష్టం. అవన్నీ విదేశీ ఉద్యోగులపై ఆధారపడి ఉన్నాయి.తెరుచుకున్న కొత్త తలుపులుఇప్పుడు ట్రంప్ ఫీజు పెంపుతో భారతీయ వృత్తి నిపుణుల్లో లక్ష మందిపై ప్రభావం పడుతుందని అంచనా. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) రంగాల్లోని వారు ఎక్కువ నష్టపోతారు. ఈ పరిస్థితుల్లో చైనా, జర్మనీల నుంచి బ్రిటన్ దాకా వివిధ దేశాలు భారత్‌లోని ప్రతిభావంతుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక వీసా విధానాల్ని అందిస్తామంటున్నాయి. చైనా ఇప్పటికే అక్టోబర్ 1 నుంచి కొత్త ‘కె’ వీసాను అమలులోకి తెచ్చింది. స్పాన్సర్ అవసరం లేకపోవడం ‘కె’ వీసా ఆకర్షణ.మరోపక్క విదేశీ ఉద్యోగులను తీసుకొనేందుకు త్వరలోనే కొన్ని ప్రతిపాదనల్ని చేయనున్నట్టు కెనడా ప్రధాని ఇటీవలే ప్రకటించారు. అమెరికాకు ప్రత్యామ్నాయం తమ ఆర్థిక వ్యవస్థే అంటూ, ఐటీ, సైన్స్, టెక్ రంగాలలో భారతీయులకు పుష్కలంగా అవకా శాలున్నాయని జర్మనీ చెబుతోంది. పైగా, జర్మనీలో పెరుగుతున్న వయోవృద్ధుల రీత్యా కనీసం 2040 వరకు ఏటా దాదాపు 2.88 లక్షల మంది ఇమ్మిగ్రెంట్స్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరం. ఇవన్నీ అమెరికన్ వీసాల సంక్షోభ వేళ భారతీయులకు అందివచ్చిన సరికొత్త అవకాశాలు.రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది? వీసా ఫీజుపై ఇవే నిబంధనలు కొనసాగితే, అమెరికన్ ఐటీ సంస్థలు ఒక్కొక్కరికి లక్ష డాలర్లు పెట్టి కొత్త ఉద్యోగుల్ని తీసుకువెళ్ళడం కష్టమే. కాకపోతే, మరో మార్గం ఉంది. భారతీయుల ప్రతిభను ఉపయోగించుకోవడానికి అవి ఇక్కడే ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్’ (జీసీసీలు) నెలకొల్పవచ్చు. ఇప్పటికే మన దేశంలో 1,600 జీసీసీలు పెట్టాయి. మరిన్ని జీసీసీ లొస్తే, వీసా షరతుల ప్రభావం ఉండదు. ఈ 2025 నాటికి భారత్‌లోని జీసీసీలు 20 లక్షల మందికి పైగా నిపుణులకు ఉపాధినిస్తున్నాయి. ఏమైనా, సాక్షాత్తూ అమెరికాయే వలస జీవులతో నిర్మితమైన దేశం. ఆ సంగతి ట్రంప్ మర్చిపోతేనే కష్టం. -
సుంకాలు, నిబంధనలు ఆందోళనకరం
సాక్షి, హైదరాబాద్: అమెరికా ప్రభుత్వం తీసుకొనే నిర్ణయా లు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. భార తీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచడం, హెచ్– 1బీ వీసాలపై కఠిన నిబంధనలు విధించడంపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు అస్థిరతకు, అపార్థానికి దారితీస్తాయన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థికా భివృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్నారు.అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం తెలంగాణ పర్యటనలో భాగంగా గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమైంది. అమెరికాలోని హడ్సన్ ఇన్స్టిట్యూట్కు చెందిన 16 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉండగా వారిలో మేధావులు, బిజినెస్ లీడర్లు ఉన్నారు. ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై అభిప్రాయాలు స్వీకరిస్తోంది. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర అభి వృద్ధి విషయంలో ఉత్తమ విధానాలను ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తోందన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని.. 2034 నాటి కి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిది ద్దుతూ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. న్యూయార్క్, టోక్యోకి పోటీగా హైదరాబాద్ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరా బాద్ అందరినీ ఆకర్షిస్తోందని.. ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని సీఎం రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ఇప్పుడు న్యూయార్క్, టోక్యో, దక్షిణ కొరియాతో పోటీపడు తోందన్నారు. హైదరాబాద్‌లో గేమ్–ఛేంజర్ ప్రాజెక్టులుగా భారత్ ఫ్యూచర్ సిటీతోపాటు రీజనల్ రింగ్‌రోడ్, రీజనల్ రింగ్ రైల్, మాన్యుఫాక్చరింగ్ జోన్లు, మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణ చేపడుతున్నట్లు వివరించారు. హైదరాబాద్ – చైన్నై, హైదరాబాద్–బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు. 500 ఫార్చ్యూన్ కంపెనీలు రావాలి30 వేల ఎకరాల్లో హైదరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వా మ్యాన్ని ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని.. మొత్తం 500 కంపెనీలూ పెట్టుబడులకు ముందుకొచ్చి ఫ్యూచర్ సిటీలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ‘చైనా+1’ వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని.. అటువంటి భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం అనుసరిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి. సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాకు.. స్టెమ్ భారతీయులే!
హెచ్ –1బీ వీసా దరఖాస్తుకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలంటూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ విద్యార్థులందరినీ షాక్‌కి గురిచేసింది. దాన్నుంచి తేరుకోకముందే.. అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌లో ఇటీవల మరో బిల్లును ప్రవేశపెట్టింది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను పూర్తిగా ఎత్తేయడమే దీని ఉద్దేశం. ఇదే నిజమైతే.. ఔత్సాహిక భారతీయ విద్యార్థుల పాలిట ఇది మరో శరాఘాతం కానుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ( స్టెమ్) విద్యార్థులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.గ్రాడ్యుయేషన్స్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టింది కూడా. ఇది ఇప్పుడు అక్కడి విదేశీ విద్యార్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఎఫ్ –1 వీసాపై అమెరికాలో ఉండే విదేశీ విద్యార్థులు తమ చదువు / విభాగానికి సంబంధించిన రంగంలోని కంపెనీల్లో పనిచేయవచ్చు.తమ కోర్సులో భాగంగానూ, డిగ్రీ పూర్తి చేశాక కూడా ఓపీటీ కింద ఆయా కంపెనీల్లో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) విద్యార్థులకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. ఇప్పుడు ఓపీటీనే ఎత్తేస్తే.. డిగ్రీ పూర్తయ్యాక వెంటనే అక్కడ ఉద్యోగం వస్తే ఫర్వాలేదు, లేదంటే తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఇలా 2024లో ‘ఓపీటీ’ వర్క్ పర్మిట్లు పొందిన విదేశీ విద్యార్థుల సంఖ్య 1,94,554 కాగా, కొత్తగా స్టెమ్ – ఓపీటీ అనుమతులు పొందినవారి సంఖ్య 95,384.అనుభవం.. అవకాశాలు!చాలామంది భారతీయులు ప్రత్యేకించి స్టెమ్ విభాగాల్లోని వారు.. హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేసుకునేముందు ప్రాక్టికల్ అనుభవం కోసం ఓపీటీని ఉపయోగించుకునేవారు. ఇకమీదట ఆ అవకాశం ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓపీటీ అనేది కాలేజీ చదువు పూర్తిచేసే విద్యార్థులకు ఉద్యోగార్జనలో ఒక వారధిగా ఉపయోగపడింది. అమెరికాలో ఓపీటీ చేస్తున్న మొత్తం విద్యార్థుల్లో భారతీయలు 2006–07లో 22.12 శాతం కాగా, 2023–24 నాటికి ఇది 40.18 శాతానికి పెరిగింది.‘స్టెమ్’ మీద దెబ్బఅమెరికా ప్రభుత్వ నిర్ణయం.. ఆ దేశ ‘స్టెమ్’ శ్రామికశక్తికి వెన్నెముక లాంటి భారతీయ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా 2024లో హెచ్ –1బీ వీసా పొందిన వారిలో 70 శాతం మంది భారతీయులే. అమెరికా అవసరాలకు సరిపడా వృత్తి ఉద్యోగ నిపుణులు అక్కడ లేరు. విదేశాల నుంచి ప్రధానంగా భారతీయ స్టెమ్ నిపుణులు అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారన్నది జగమెరిగిన సత్యం. అమెరికాలోని స్టెమ్ కార్మికులు / ఉద్యోగుల్లో విదేశీయుల శాతం రెండు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. 2000లో 16.4 శాతం నుంచి 2019 నాటికి 23.1 శాతానికి పెరిగింది. 2019 నాటికి అమెరికాలోని స్టెమ్ ఉద్యోగుల్లో అత్యధికంగా 28.9 శాతం భారతీయులే. ప్రతి నలుగురిలో ముగ్గురు..: 2023–24లో అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులే. ఇందులో కూడా ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులు స్టెమ్ కోర్సులు చదువుతున్నవారే. స్టెమ్ కోర్సుల్లోనూ మనవాళ్లే అధికం కావడం విశేషం. -
ఐటీ పరిశ్రమకు గడ్డు రోజులు
అత్యంత నైపుణ్యం కలిగిన టెక్నాలజీ వృత్తినిపుణులు ఎవరైనా సరే అమెరికా వెళ్ళాలని కలలుగనడం సహజం. భారీ టెక్ లేదా భారతీయ సాఫ్ట్వేర్ సంస్థల ద్వారా వారు తమ కలలను సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దానికి, ఆరేళ్ళ పాటు చెల్లుబాటయ్యే హెచ్–1బి వీసా చేజిక్కించుకోవాలని అర్రులు చాస్తారు. కానీ, ఆ రకం వీసాల సంఖ్యపై పరిమితి ఉంది. గ్రహీతలను కూడా లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఇవి ఆ వీసాకున్న ప్రతికూలాంశాలు. హెచ్–1బి వీసా దారులు అమెరికాలో గ్రీన్ కార్డును చేజిక్కించుకోగలగడం, దీర్ఘకాలంలో పౌరసత్వాన్ని కూడా సంపాదించుకోవడం దానికున్న అనుకూలాంశాలు. హెచ్–1బి వీసాతో వృత్తి జీవితం మొదలుపెట్టి, తదనంతర కాలంలో ఉన్నత స్థాయికి చేరిన వారి జాబితా పెద్దదే. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ,గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా స్థాపకుడు జెన్సెన్ హుయాంగ్, జూమ్ స్థాపకుడు ఎరిక్ యువాన్ వంటి వారిని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మారిన పరిస్థితులుఈ వీసాలపై 1,00,000 డాలర్ల చొప్పున ఒక విడత లెవీని ట్రంప్ ప్రభుత్వం విధించింది. అంత భారం మోయడం కష్టమని పెద్ద టెక్ కంపెనీలు శ్వేత సౌధానికి నచ్చజెబితే ఈ అంశానికి సంబంధించి, ఇతర కోణాలలో కూడా వీలైనంత త్వరగా మార్పు రావచ్చు. కానీ దీనివల్ల అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలపైనే పెను ప్రభావం పడబోతోందనడంలో సందేహం లేదు. హెచ్–1బి వీసాలకు సౌజన్యం వహిస్తున్న పది టాప్ కంపెనీలలో భారతీయ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక్కటే ఉంది. అమెజాన్ 10,000 వీసాలకు పైగా సంఖ్యతో 2025లో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. దానితో పోలిస్తే 5,500 వీసాలతో టి.సి.ఎస్. చాలా వెనుక నున్నట్లు లెక్క. మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, ఆపిల్ వంటి ఇతర దిగ్గజాలు జాబితాలో చాలా దిగువన ఉన్నాయి. అంతమాత్రాన ఈ పరిణామం వల్ల భారతీయ సాఫ్ట్వేర్ రంగా నికి వాటిల్లే నష్టం లేదనుకోవడం పొరపాటు. ఎందుకంటే, హెచ్– 1బి వీసాదారుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే. దెబ్బ మీద దెబ్బఅమెరికన్ కంపెనీలు ఇకమీదట కూడా, బయట దేశాల నుంచి ఎక్కువ పనులు చేయించుకోవాలని కోరుకుంటాయా, ఫలితంగా, భారత్‌లో మరిన్ని గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) నెలకొంటాయా అనేది ప్రశ్న. దేశంలో వాటిని నెలకొల్పడంలో అగ్ర టెక్ సంస్థలు పట్టుదలతో ఉన్నాయి. అమెరికా వంటి అధునాతన ఆర్థిక వ్యవస్థలోకన్నా తక్కువ జీతభత్యాలతో భారతదేశంలో నిపుణులైన వారిని నియమించుకోవడం తేలిక. ఐటీ సేవలకు భారతీయ కంపెనీలపై ఆధారపడటం ఇక ముందు కూడా కొనసాగవచ్చు. కానీ అధిక ఫీజు వల్ల అటువంటి సేవలు మరింత ఖరీదైనవిగా మారతాయి లేదా లాభదాయకతను తగ్గిస్తాయి. ఒక విడత ఫీజు చెల్లించడం వల్ల అయ్యే ఖర్చు, తత్ఫ లితంగా ఒనగూడగల ప్రయోజనాన్ని విశ్లేషించుకుని కంపెనీలు కొత్తవారిని తీసుకునే వ్యూహాలను రూపొందించుకుంటాయి. ఈ ఫీజు వసూలు చాలా కాలం కొనసాగితే, ఈ వీసాకు సౌజన్యం వహించడాన్ని అవి తగ్గించుకోవచ్చు. ఎల్1, ఓ1 వంటి ఇతర వీసా మార్గాలున్నాయి. కానీ, వీటికి షరతులుంటాయి. అందరు దర ఖాస్తుదారులు వాటిని ఉపయోగించుకోలేరు. ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చే కంపెనీలపై పన్ను విధించాలని అమె రికాలో ఇప్పటికే ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ బిల్లు భారతీయ ఐటీ పరిశ్రమ పాలిట పెను తుపాను అవుతుంది. సాఫ్ట్వేర్ సర్వీసులను ఎగుమతి చేయడం ద్వారానే భారతీయ ఐటీ పరిశ్రమ బ్రహ్మాండ మైన వృద్ధిని సాధించగలిగింది. వాటి వ్యూహంలో హెచ్–1బి వీసాలు కూడా అంతర్భాగం.అవకాశాల తలుపులుసంక్షోభాలు అవకాశాలకు కూడా తలుపులు తెరుస్తాయని అంటారు. హైటెక్ నవీకరణ, పరిశోధనకు దేశంలో తగిన వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వం–పరిశ్రమలు ఇప్పటికైనా చేతులు కలపాలి. బెంగళూరు, హైదరాబాద్ నగరాలు భారతీయ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి వహించాయి గానీ, అత్యధునాతన టెక్నాలజీని తీర్చిదిద్దే వాగ్దానాన్ని అంతగా నిలబెట్టుకోలేకపోయాయి. అట్టడుగు స్థాయి నుంచి సమూల మార్పులు తీసుకురాగలిగినదిగా భారతీయ ఐటీ రంగం ప్రతిష్ఠను సంతరించుకోలేకపోయింది. ఇతర దేశాలలో వచ్చిన నవీకరణలను అనుసరించేదిగానే అది పేరుపడింది. అమెరికా చేరిన భారతీయ ప్రజ్ఞావంతులు అక్కడి సంస్థలను డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో అగ్ర స్థానాన నిలపడంలో కృతకృత్యులవుతున్నారు. పరిశోధన, అభివృద్ధి, కొత్త వెంచర్ల ప్రారంభానికి అమెరికాలో వాతావరణం అనుకూలంగా ఉండే మాట నిజమే. భారత్‌లో అందుబాటులో ఉన్న మానవ ప్రతిభా వ్యుత్పత్తుల సంపదను వినియోగించుకునేందుకు ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులను కల్పించాలి. ఇందుకు ప్రభుత్వాన్ని ఒక్కదాన్నీ నిందించి ప్రయోజనం లేదు. భారతీయ కంపెనీలు పరిశోధన–అభివృద్ధి విభాగంపై నిధులు వెచ్చించేందుకు విముఖత చూపుతూ వస్తున్నాయి. దేశంలో ‘స్టెమ్’ గ్రాడ్యుయేట్లు అపారంగా ఉన్నారు. వారిని ప్రోత్సహించే వాతావరణాన్ని దేశంలోనే సృష్టించు కోవలసిన అవసరం మున్నెన్నటికన్నా ఇపుడే ఎక్కువగా ఉంది. సుష్మా రామచంద్రన్వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ మరింత కఠినం
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న వేలాదిమంది భారతీయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రీన్ కార్డ్ పైనా ట్రంప్ ప్రభుత్వం దృష్టిపడింది. ఇటీవలే భారతీయులు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్1బీ వీసాపై కఠిన చర్యలను ప్రకటించడం తెల్సిందే. ఇప్పుడిక గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల ఇంటర్వ్యూ ప్రక్రియలో కఠినతరమైన నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇంటర్వ్యూల పరిధి మరింత విస్తృతం కానుంది. పరీక్ష కూడా కఠినంగా మారనుంది. దరఖాస్తుదారుల సత్ప్రవర్తనపై ఇమిగ్రేషన్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపడతారు. కొత్త విధానం ఈ నెల 20వ తేదీ నుంచే అమల్లోకి రానుండటం గమనార్హం. అమెరికా విలువలను పూర్తిగా స్వీకరించే వారు మాత్రమే పౌరులయ్యేలా చూడటమే ఈ మార్పుల లక్ష్యమని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) చెబుతోంది. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా హోమ్‌ల్యాండ్ డిఫెండర్స్ పేరుతో అధికారులను కూడా నియమిస్తోంది. అయితే, దరఖాస్తు దారులకు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి రెండంటే రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి. రెండో ప్రయత్నంలో విఫలమైతే వారికి పౌరస త్వాన్ని తిరస్కరిస్తారని తెలిపింది. అమెరికా లో ఒక వ్యక్తిని శాశ్వత నివాసి అని చూపే అధికారిక గుర్తింపు పత్రమే గ్రీన్ కార్డ్. హోల్డర్లను అధికారికంగా చట్టబద్ధమైన శాశ్వత నివాసులుగా పిలుస్తారు. ఈ విధానం సమగ్రతను స్థాపించడమే తాజా మార్పుల లక్ష్యమని యూఎస్సీఐఎస్ అంటున్నప్పటికీ, వలసదారుల ఉద్దేశాలను సందేహించే అవకాశం ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పౌరశాస్త్ర పరీక్ష. కొత్తగా ప్రవేశపెట్టే ఈ పరీక్షలో దరఖాస్తుదారులకు అమెరికా చరిత్ర, ప్రభుత్వంపై ఉన్న అవగాహనను అంచనా వేస్తారు. మొత్తం 128 ప్రశ్నల నుంచి దరఖాస్తుదారులు 20 ప్రశ్నలను ఎన్నుకుని 12 ప్రశ్నలకు సమాధానం సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో 10 ప్రశ్నల్లో ఆరింటికి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉండేది. ఈ పరీక్షతోపాటు అభ్యర్థుల సత్ప్రవర్తనను ఇమిగ్రేషన్ అధికారులు అంచనా వేయడం కూడా కఠినతరమైందే. కేవలం నేర రహిత ప్రవర్తన ఉంటే చాలదు. అమెరికా సమాజానికి సానుకూలంగా చేసిన మేలును కూడా చూస్తారు. ఇందులో, 1991 నుంచి వారి చుట్టుపక్కల వారిని సైతం విచారిస్తారు. దరఖాస్తుదారులు తెలిసిన సహ ఉద్యోగులు, సంబంధిత సంస్థల యజమానులు, ఇతరులను కూడా ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు చేసి, ప్రవర్తనను బేరీజు వేస్తారు. ఇందులోనూ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. దీని వల్ల భారతీయులపై ప్రత్యేకంగా వివక్ష చూపే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. అమెరికాలోని వలసదారుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. వేలాది మంది భారతీయులకు గ్రీన్‌కార్డు ఉంది. పెద్ద సంఖ్యలో భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఈ ‘పచ్చకార్డు’కోసం ఎదురు చూస్తున్నారు. 2024 గణాంకాల ప్రకారం అమెరికా పౌరుల్లో 6.1 శాతం, అంటే 49,700 మంది భారతీయులున్నారు. ఈ విషయంలో అమెరికాకు పొరుగునున్న మెక్సికో మొదటిస్థానంలో నిలిచింది. -
అమెరికా వెళ్లాలంటే.. అప్పు పుట్టట్లేదు!
సాక్షి, హైదరాబాద్: విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లాలన్న ఆసక్తి విద్యార్థుల్లో క్రమంగా తగ్గుతోంది. తమ పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులూ వెనుకాడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు అమెరికా అంటేనే నమ్మకం పోతోందని కన్సల్టెన్సీ సంస్థలూ అంటున్నాయి. ఇదిలాఉంటే, ఇప్పటికే అమెరికా వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నారు. ప్రైవేటు అప్పులు వారిని వెంటాడుతున్నాయి. ఇంకోవైపు అమెరికా నుంచి విద్యార్థులు డబ్బులు పంపాలని కోరడం మరింత ఆందోళన రేపుతోంది. పిల్లలు అమెరికా వెళ్లే వరకూ ఆనందంగా ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నాయి. హెచ్1–బీ వీసీకు లక్ష డాలర్లు చెల్లించాలన్న ట్రంప్ నిర్ణయం అనేక కుటుంబాల్లో కునుకులేకుండా చేస్తోంది. పెరుగుతున్న అప్పు ఒత్తిడి భారత్ నుంచి ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది అమెరికా వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేల మంది వెళ్లినట్టు అంచనా. ఇందులో ఎక్కువ మంది చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో బ్యాంకు లోన్లలతోపాటు, తేలికగా ప్రైవేటు అప్పులు పుట్టాయి. అమెరికా వెళ్లే విద్యార్థి పార్ట్ టైం ఉద్యోగం చేసి సంపాదిస్తాడనే నమ్మకం ఉండేది. దీంతో ప్రైవేటు వ్యక్తులూ అప్పులివ్వడానికి వెనుకాడలేదు. కొంతమంది తల్లిదండ్రులు రూ.2 నుంచి 5 వడ్డీకి కూడా అప్పులు తెచ్చారు. వడ్డీ రెండేళ్లలో అసలును మించి పోయిందని ఇప్పుడు వాపోతున్నారు. వచ్చే జీతంలో ఎక్కువ భాగం నెలనెలా వడ్డీ కట్టేవాళ్లూ ఉన్నారు. అమెరికాలో పార్ట్‌టైం ఉద్యోగాలు చేయొద్దంటూ ఆంక్షలు పెట్టడంతో, జీవనం కోసం విద్యార్థులు తల్లిదండ్రులను ఆశ్రయించారు. డబ్బులు పంపకపోతే అమెరికాలో ఉండటం కష్టమని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఏడాదిగా కొత్త అప్పులు తీసుకురాక తప్పని పరిస్థితి. దీనికితోడు రూపాయి మారక విలువ తగ్గడంతో అమెరికాలో యూనివర్సిటీ ఫీజుల భారం ఎక్కువైంది. ఇవన్నీ తల్లిదండ్రులను మరింత అప్పుల్లోకి నెట్టాయి. హెచ్1–బీ వీసాకు ఆంక్షలు పెట్టడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన 19 వేల మంది విద్యార్థులు ఎంఎస్ పూర్తి చేసుకుని, ఉద్యోగం లేని కారణంగా వెనక్కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన అప్పుల వాళ్లు తామిచ్చిన మొత్తాన్ని ఇవ్వమని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారు. వడ్డీ ఇవ్వకున్నా అసలైనా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏమీ చేయలేని అమోమయంలోకి వెళ్తున్నారు. అమ్మో... అప్పా? కొత్తగా అమెరికా వెళ్లే విద్యార్థులకు అప్పులు ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకు రావడం లేదు. స్థిరాస్తి కుదవపెడితే ఆలోచిస్తామని చెబుతున్నారు. బ్యాంకులు కూడా షూరిటీని అడుగుతున్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. అమెరికా వెళ్లాలంటే ముందుగా జీవన వ్యయాన్ని బ్యాంకు నిల్వగా చూపించాలి. ఈ మొత్తాన్ని ఆరు నెలల ముందే బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వచ్చే జనవరి సెమిస్టర్ కోసం యూఎస్ వెళ్లే విద్యార్థులు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక్కో విద్యార్థి కనీసం రూ. 40 లక్షలు సమకూర్చుకుంటే తప్ప అమెరికా వెళ్లలేరు. కొంతమంది ఉద్యోగులు తమ పీఎఫ్ డ్రా చేస్తున్నారు. ఒత్తిడి పెరిగింది: మల్లెల హర్షవర్ధన్ (సిద్దిపేట) సాధారణ ఉద్యోగం చేసే నేను రూ.20 లక్షల ప్రైవేటు అప్పు చేసి ఎంఎస్ కోసం కొడుకును అమెరికా పంపాను. రెండేళ్లల్లో అప్పు రెట్టింపు అయింది. నెలనెలా అమెరికాలో అబ్బాయికి డబ్బులు పంపుతున్నాను. అప్పు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి. స్థిరాస్తులు కూడా ఏమీ లేవు. భయమేస్తోంది. అప్పంటే భయమేస్తోంది : మారపంపు నవీన్, వడ్డీ వ్యాపారి, వరంగల్ అమెరికా వెళ్లే వారికి కొన్నేళ్లుగా అప్పులు ఇస్తున్నాను. పెద్దగా ష్యూరిటీ ఆశించలేదు. కానీ రెండేళ్లుగా ఇస్తున్న అప్పులు తిరిగి రావడం కష్టంగా ఉంది. కొంతమంది వద్ద స్థిరాస్తులు కూడా లేవు. గట్టిగా అడిగే పరిస్థితి లేదు. అందుకే అమెరికా వెళ్లే వారికి అప్పులు ఇవ్వడం మానేశాను. -
అమెరికాకు వెళ్లాలా?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. ‘డాలర్ డ్రీమ్స్’కి బ్రేకులు పడటం మొదలయ్యాయి. కొత్తగా పెట్టిన హెచ్–1బీ వీసా ‘లక్ష డాలర్ల’ నిబంధన.. పెద్ద స్పీడ్ బ్రేకర్ అంటున్నారు నిపుణులు. ఇప్పటికే అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. 2024 మొదటి 8 నెలలతో పోలిస్తే.. 2025లో ఆగస్టు వరకు అమెరికా వెళ్లిన వారి సంఖ్య 4.3 శాతం తగ్గింది. ప్రత్యేకించి ఆగస్టులో ఇది ఏకంగా 14.8 శాతం తగ్గింది. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది.అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం (యూఎస్ ఐటీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మొదటి 8 నెలల్లో... విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లిన భారతీయులు 1,77,435. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 26.1 శాతం తక్కువ. ఇక పర్యాటక వీసాల మీద వెళ్లినవారు 9.98 లక్షలు. గతేడాది మొదటి 8 నెలలతో పోలిస్తే ఇది 2.7 శాతం తక్కువ.ఏయే వీసా మీద ఎంతమంది?ప్రత్యేకించి విద్యార్థి వీసా మీద అమెరికా వెళ్లే వారి సంఖ్య.. 2024 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 44.5 శాతం తగ్గిపోయింది. పర్యాటక, విద్యార్థి వీసాలపై వెళ్లినవాళ్లు తగ్గడంతో మొత్తం సంఖ్యలోనూ భారీ తగ్గుదల నమోదయింది. యూకే తరవాత మనమేయూఎస్ ఐటీఏ గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లలో ఆగస్టు నెలలో అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే.. ఈ ఏడాది ఆగస్టులో వీరి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2025లో ఆగస్టు వరకు చూస్తే.. యూకే తరవాత అమెరికాను అత్యధికంగా సందర్శించింది భారతీయులే. ఈ ఏడాది మొదటి 8 నెలల్లోమొత్తం 14.87 లక్షల మంది అమెరికాకు వెళ్లారు. 2024 జనవరి – ఆగస్టుతో పోలిస్తే ఇది 4.3 శాతం తక్కువ.ఈ ఏడాది తగ్గుతుందా?భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం.. అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య 2022 నుంచి భారీగా పెరుగుతోంది. కానీ, ఈ ఏడాది గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై సెప్టెంబరు 30న ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో యూఎస్ వెళ్లిన మొత్తం భారతీయులు సుమారు 19.4 లక్షలు. గతేడాది సెప్టెంబర్‌లో 1.81 లక్షల మంది వెళ్లారు. ఈసారి సెప్టెంబరులో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సంఖ్య 21 లక్షలు దాటకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మన రియల్‌ఎస్టేట్‌కు కలిసిరానున్న ట్రంప్ నిర్ణయం
పీఠం ఎక్కిన తొలి రోజు నుంచీ భారత్‌పై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయం.. దేశీయ స్థిరాస్తి రంగానికి ఊతమివ్వనుంది. ప్రత్యేకించి కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ను కల్పించనుంది. వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్1బీ వీసా రుసుముల పెంపు నిర్ణయంతో.. దేశీయంగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు అపార అవకాశాలు ఏర్పడతాయని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే బహుళ జాతి సంస్థల జీసీసీలకు హాట్ ఫేవరేట్ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌లకు ఇదొక వరంగా మారనుంది. అందుబాటులో అద్దెలు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, మెరుగైన మౌలిక వసతులు, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్ జీసీసీలకు హబ్‌గా మారే అవకాశాలున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోజీసీసీలకు ఇండియా కేంద్రంగా అభివృద్ధిచెందడంతో బహుళ జాతి కంపెనీలు ఇక దేశీయంగానే జీసీసీల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తాయి. దీంతో హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై వంటి టెక్నాలజీ హబ్ మెట్రోల్లోని ఆఫీసు స్పేస్‌లకు ఆదరణ ఏర్పడనుంది. ప్రస్తుతం దేశంలో 1700లకు పైగా జీసీసీలు ఉండగా.. వీటిల్లో 19 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 64 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా ఉంది. 2030 నాటికి 2,400 జీసీసీలకు, 25–30 లక్షల మంది ఉద్యోగులకు, అలాగే వంద బిలియన్ డాలర్ల మార్కెట్‌కు విస్తరిస్తుందని కొల్లియర్స్ నివేదిక అంచనా వేసింది.ఒక్కో నగరం ఒక్కో ప్రత్యేకత..జీసీసీలు అనేవి బహుళ జాతి సంస్థల ఆఫ్‌షోర్ యూనిట్లు. ఇవి ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణలను ఏకీకృతం చేసి కేంద్రాలు. దేశంలోని మెట్రో నగరాలు ఒక్కో రంగంలో కీలక హబ్‌లుగా ఉన్నాయి. బెంగళూరు ఐటీ, పరిశోధనాభివృద్ధికి, ముంబై బీఎఫ్‌ఎస్‌ఐకి, హైదరాబాద్ ఫార్మా, ఐటీ, కృత్రిమ మేధస్సుకు, పుణె ఇంజనీరింగ్‌కు, ఢిల్లీ–ఎన్సీఆర్ ఈ–కామర్స్, చెన్నై తయారీ రంగాలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఖర్చును ఆదా చేసే కేంద్రాల నుంచి ఆవిష్కరణ, విలువ ఆధారిత సేవలకు వ్యూహాత్మక కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. దేశంలోని జీసీసీలు కృత్రిమ మేధస్సు(ఏఐ), మెషిన్ లెరి్నంగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి.అమెరికా కంపెనీలే ఎక్కువ..భారత్‌లో జీసీసీల ఏర్పాటుకు అమెరికాకు చెందిన కంపెనీలే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. 2021 నుంచి ఇండియాలో జరిగిన జీసీసీ లీజులలో యూఎస్ కంపెనీల వాటా ఏకంగా 70 శాతంగా ఉందంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఫార్చ్యూన్ –500 కంపెనీలు, గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఈ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో యూకే, యూరప్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా(ఈఎంఈఏ), ఆసియా పసిఫిక్ (ఏపీఏసీ) దేశాల జీసీసీలు కూడా ఇండియాలో జీసీసీలను విస్తరిస్తున్నాయి. 2025లో జరిగిన 2.8 కోట్ల చ.అ. జీసీసీ ఆఫీసు స్పేస్ లావాదేవీలలో జపాన్, ఆ్రస్టేలియా, సింగపూర్ వంటి ఏపీఏసీ దేశాల వాటా 10 శాతంగా ఉంది.జీసీసీ స్పేస్ 10 కోట్ల చ.అ.నాలుగేళ్లలో ఇండియాలోని ఏడు ప్రధాన నగరాలలో 10 కోట్ల చ.అ. స్థలాలను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. ఇది మొత్తం ఆఫీసు స్పేస్ డిమాండ్‌లో 36 శాతం. జీసీసీ లీజింగ్‌లలో టెక్నాలజీ రంగం ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. 37 శాతం లావాదేవీలలో ఐటీ రంగం తొలి స్థానంలో నిలవగా.. బీఎఫ్ఎస్ఐ, ఇంజినీరింగ్, తయారీ రంగాలు 40 శాతం స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అలాగే 2026లో 7–7.5 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలలో 2.9–3.2 కోట్ల చ.అ. స్థలాన్ని జీసీసీలు లీజుకు తీసుకుంటాయని ‘కొల్లియర్స్’ అంచనా వేసింది. అలాగే 2027లో 7.5–8.5 కోట్ల కార్యాలయ స్థల లావాదేవీలలో జీసీసీల వాటా 3.2–3.4 కోట్లతో, ఏటా 40 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా.హైదరాబాద్ వర్సెస్ బెంగళూరుబహుళ జాతి సంస్థల జీసీసీలకు దక్షిణాది నగరాలు హాట్ ఫేవరెట్‌గా ఉన్నాయి. ప్రత్యేకించి ఐటీ హబ్‌లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు నగరాలు బహుళ జాతి సంస్థల జీసీసీలను ఆకర్షించడంలో తీవ్రపోటీపడుతున్నాయి. 2021–25 మధ్యకాలంలో ఈ రెండు నగరాలు మొత్తం జీసీసీ డిమాండ్‌లో 60 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.2021తో పోలిస్తే 2025లో చెన్నైలో జీసీసీ లీజులు 5.3 రెట్లు పెరిగాయి. బెంగళూరు, హైదరాబాద్ 2021 నుంచి జీసీసీ లీజింగ్‌లలో 60 శాతం వాటాను నమోదు చేస్తున్నాయి. బెంగళూరులోని ఓఆర్ఆర్, హైదరాబాద్‌లోని సెకండరీ బిజినెస్ డి్రస్టిక్ట్(ఎస్‌బీడీ) ప్రాంతాలు ఎక్కువ డిమాండ్ ఉంది. ఫార్చ్యూన్–500 కంపెనీలు ఈ కారిడార్లలో జీసీసీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2021 నుంచి దేశంలోని జీసీసీ లీజులలో ఈ కారిడార్ల వాటా ఏకంగా 37 శాతంగా ఉంది.నగరంలో 355 జీసీసీలు..ప్రస్తుతం హైదరాబాద్‌లో 355కు పైగా జీసీసీ సెంటర్లున్నాయి. అమెరికా, యూరప్, జపాన్, సౌత్ కొరియా దేశాలకు చెందిన జీసీసీలు నగరంలో కొలువుదీరాయి. మెక్ డొనాల్డ్స్, వాన్గార్డ్, సిటిజెన్ బ్యాంక్, హీనెకెన్, బారీకేల్బాట్, డై–ఇచి, హెచ్‌సీఏ హెల్త్‌కేర్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో జీసీసీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2021లో నగరంలో 37 లక్షల చ.అ. స్థలాన్ని జీసీసీలు లీజుకు తీసుకోగా.. 2025 నాటికి 52 చ.అ.లకు చేరాయి.5.09 కోట్ల ఆఫీసు స్పేస్..దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్యకాలంలో 5.09 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 4.73 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 8 శాతం అధికం. అలాగే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 7 నగరాలలో కొత్తగా 4.14 కోట్ల గ్రేడ్–ఏ కార్యాలయ స్థలం సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంలో సప్లయి అయిన 3.78 కోట్ల చ.అ. స్పేస్‌తో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే.. -
సమస్యగా కాదు... సదావకాశంగా చూద్దాం!
హెచ్–1బీ వీసా రుసుమును పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా మనల్ని నిస్పృహకు గురి చేసినా... దీర్ఘ కాలంలో మేలు చేస్తుంది. నిజానికి మన ‘ఆత్మనిర్భర్’ నినాదానికీ, ‘అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడ’మనే ట్రంప్ పిలుపునకూ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. మరి దానిమీద మనం ఇంతగా స్పందించడం దేనికి? అమెరికా నిర్ణయం సుశిక్షితులైన, ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు అయిన భారతీయ వృత్తినిపుణుల సంఖ్యను ఆ దేశంలో తగ్గిస్తుంది. కొత్తగా కాలుమోపబోయే వారి సంఖ్య పరిమితమవుతుంది. అమెరికాకు వెళ్ళడాన్ని నిరుత్సాహపరుస్తుంది. కానీ, ఆ కోవకు చెందినవారికి అమెరికాలో కొరత ఉందన్నది కూడా వాస్తవం. అమెరికా కోణం నుంచి చూస్తే అది న్యాయబద్ధమైనదే. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు గైకొనే హక్కు ట్రంప్‌కు ఉంది. దానిపై మన స్పందన తార్కికమైనదిగా ఉండాలి.భారత నిపుణులను యూరప్ బలవంతంగా..భారతీయ పత్తి పరిశ్రమను 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు నాశనం చేశారు. నేతపనివారినీ, పత్తి పరిశ్రమలో పనిచేస్తున్న చాలా మందినీ బ్రిటన్‌కు తీసుకెళ్ళారు. మాంచెస్టర్ రాత్రికి రాత్రి పత్తి మార్కెట్ కేంద్రంగా అవతరించింది. భారతీయుల్లో చాలా మంది దాన్ని న్యాయవిరుద్ధమైన చర్యగానే పరిగణించారు. ఇంగ్లండ్ ఒక కిలో పత్తిని కూడా ఎన్నడూ పండించకపోయినా, యూరప్‌లోనే వస్త్ర పరిశ్రమకు చాలా ముఖ్యమైన కేంద్రంగా మాంచెస్టర్ రూపుదిద్దు కుంది. నిపుణులైన కార్మికులను భారత్ నుంచి బలవంతంగా తీసుకెళ్ళిన కారణంగానే అది సాధ్యమైంది. వాస్తవానికి, ట్రంప్ ఇపుడు దానికి విరుద్ధమైన పని చేస్తున్నారు. సాంకేతిక నిపుణులను లేదా నిపుణులైన సిబ్బందిని తమ దేశం నుంచి పంపించేయాలని చూస్తున్నారు. అమెరికాకు రాకుండా నివారిస్తున్నారు. కానీ, మనవారిని తీసుకెళ్ళడం వల్ల బ్రిటిష్ వారు బాగు పడినంతగా, మనవారిని పంపించేయడం వల్ల అమెరికా లబ్ధి పొందబోవడం లేదు.ప్రతిభావంతులను ఆకర్షించే వ్యవస్థ..ట్రంప్ నిర్ణయం ఆత్మనిర్భర్ భావనను మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళేందుకు పురికొల్పినదవుతుంది. ఇందుకు మన ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, నియంత్రణలపై దృష్టి పెట్టి కీలక రంగాల్లో సత్వర సంస్కరణలు తీసుకురావాలి. సర్వవిధాలా ప్రతిభావంతులను ఆకర్షించి, అండగా నిలిచి, నిలబెట్టుకుని ప్రోత్సహించే సరైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాలి. విశ్వవిద్యాలయాలను పటిష్ఠపరచాలి. హెచ్–1బీతో ట్రంప్ తాజా దాడి, ఐఐటీలు, ఐఐఎస్సీలు తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి తాజా గ్రాడ్యుయేట్లు తండోపతండాలుగా అమెరికాకు తరలిపోకుండా తగ్గించడానికి, ఇంకా చెప్పాలంటే ఆగిపోవడానికి కూడా తోడ్పడవచ్చు.కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం..అత్యంత ప్రతిభావంతులైన వృత్తినిపుణులను భారతదేశంలోనే అట్టిపెట్టుకునేందుకు, వారు భారతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేటట్లు చేసుకునేందుకు ఇది స్పష్టంగా నిజమైన అవకాశం కల్పిస్తోంది. విద్యార్థుల చదువు, శిక్షణలకు ప్రతి ఐఐటీ పైనా భారత్ రూ.1000 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. కానీ, వాటి నుంచి దేశం పూర్తి ఫలాలను నిజంగానే పొందడం లేదు. అమెరికా, యూరప్‌లకు చెందిన అనేక సంస్థల సీఈఓలుగా మన ఐఐటీ మెరికలు పని చేస్తూంటే వారి పేర్లు, పాత్రలను గొప్పగా చెప్పుకుంటూ గర్విస్తున్నాం. భారతీయుల ఆలోచనా శక్తి, వారసత్వం, ప్రజ్ఞాపాటవాలను ప్రపంచంలోని మిగిలిన దేశాలకు వినమ్రంగా, బలంగా, ఆత్మ విశ్వాసంతో చాటి చెప్పేందుకు, నిరూపించుకునేందుకు సమయం ఆసన్నమైంది.– ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డి, మాజీ వైస్ చాన్సలర్, యోగి వేమన యూనివర్సిటీ -
విదేశీ గడ్డపై అడ్డంకులు
హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా భారతీయులను షాక్‌కు గురి చేసింది. ఒక్క యూఎస్ మాత్రమే కాదు.. భారతీయులు సంప్రదాయకంగా ఉద్యోగాల కోసం తరలివెళ్లే అనేక పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి అవరోధాలు ఉన్నాయి. ఈ దేశాలు చరిత్రాత్మకంగా నిపుణుల కొరతను పూడ్చుకోవడానికి, ఆర్థిక వృద్ధిని నడిపించడానికి భారత్, చైనా వంటి దేశాలపై ఆధారపడి ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఆయా పాశ్చాత్య దేశాల్లోని ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. విదేశీ కార్మికుల కంటే సొంత పౌరులకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నైపుణ్యం కల విదేశీ కార్మికులను ప్రోత్సహించకుండా ఉండటానికి తమ వలస విధానాలకు అనుగుణంగా ఆయా దేశాలు మార్పులు చేసుకుంటున్నాయి. అదే సమయంలో అక్రమ, తక్కువ నైపుణ్యమున్న కార్మికులను నిలువరిస్తున్నాయి.మనవాళ్ల ఆదాయం ఎక్కువకొన్ని ప్రధాన దేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఆదాయం స్థానికుల ఆదాయం కంటే అధికంగా ఉంటోంది. తమ దేశంలో ఉంటూ తమ కంటే ఎక్కువ ఆర్జించడం ఆయా దేశాల స్థానికులకు, ముఖ్యంగా యువతకు మింగుడు పడడం లేదన్నది నిపుణుల మాట. యూఎస్ సిటిజన్స్ తో పోలిస్తే.. అక్కడ ఉంటున్న భారతీయుల ఆదాయం రెండింతలకుపైగా ఉంది. ఆస్ట్రేలియా, జర్మనీల విషయంలో ఇది సుమారు 50 శాతం ఎక్కువ. భారతీయుల వల్ల తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయనే కోపం ఒకవైపు.. తమకంటే ఎక్కువ సంపాదిస్తున్నారన్న అసూయ మరోవైపు.. వెరసి ఆస్ట్రేలియా, యూకే వంటి అనేక దేశాల్లో స్థానిక యువత అక్కడున్న భారతీయులపై దాడులు చేస్తున్నారు. ‘గో బ్యాక్ టు ఇండియా’ అంటూ బహిరంగంగానే మనవాళ్లను హెచ్చరిస్తున్న సంఘటనలు సైతం పెరుగుతూనే ఉన్నాయి.వలసలు తగ్గించాలని..గడిచిన రెండు సంవత్సరాలలో వలసలను తగ్గించేందుకు పాశ్చాత్య దేశాలు అనేక నిర్ణయాలు తీసుకున్నాయి.యూఎస్: కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తుకు 1,00,000 డాలర్ల వన్–టైమ్ ఫీజు అమలులోకి తెచ్చింది.యూకే: వర్క్ పర్మిట్ కోసం కనీస వేతన పరిమితిని 38,700 పౌండ్స్ నుంచి 2025 జూలైలో 41,700 పౌండ్స్‌కు పెంచింది.స్వీడన్: వర్క్ పర్మిట్ కోసం కనీస జీతం పరిమితి 2023 అక్టోబర్ నుంచి రెండింతలకుపైగా అధికమై 29,680 క్రోనర్లకు (ఆ దేశ కరెన్సీ. ఒక క్రోనా సుమారు రూ.9.37) చేరింది.కెనడా: 2025లో విద్యార్థులు, కార్మికుల దరఖాస్తుల అనుమతిని 10–16% తగ్గించాలన్నది ప్రణాళిక.ఆస్ట్రేలియా: 2025 నాటికి నికర వలసలను సగానికి తగ్గించే ప్రయత్నంలో భాగంగా 2023–24లో విద్యార్థి వీసాల జారీని 34% తగ్గించారు. -
హెచ్-1బీ వీసా నిపుణులకు మైక్రోసాఫ్ట్ వేతనాలు ఇలా..
హెచ్-1బీ(H1-B) వీసా వార్షిక రుసుమును పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో బహుళజాతి కంపెనీల్లోని ఉద్యోగుల వేతనాలపై చర్చ సాగుతోంది. యూఎస్ కార్పొరేట్ కంపెనీలు విదేశాల్లోని తమ ఉద్యోగులకు దేశీయంగా ఎంత వేతనాలు ఆఫర్ చేస్తున్నాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ సర్వీసులు అందిస్తున్న మైక్రోసాఫ్ట్(Microsoft) కంపెనీ హెచ్1-బీ వీసాపై ఉన్న తమ నిపుణులకు యూఎస్‌లో ఎంత పే చేస్తుందో వివరాలు వెల్లడయ్యాయి. అయితే వీటిని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదని గమనించాలి.జాబ్ రోల్ప్రదేశంవేతనం(యూఎస్ డాలర్లలో)సాఫ్ట్ వేర్ ఇంజినీర్రెడ్మండ్2,84,000 వరకుప్రొడక్ట్ మేనేజర్రెడ్మండ్2,50,000 వరకుడేటా సైంటిస్ట్రెడ్మండ్1,21,200 - 1,60,000డేటా సైంటిస్ట్మౌంటైన్ వ్యూ2,74,500 వరకు ఈ వేతనాలు బేస్ శాలరీలు మాత్రమే. కంపెనీ అందించే అలవెన్స్‌లు వీటికి అదనం.ఉద్యోగి స్థాయిని అనుసరించి వేతన వివరాలు ఇలా..వేతన స్థాయిసగటు వేతనం (USD)గరిష్ట వేతనం (USD)స్థాయి I1,28,8441,77,200స్థాయి II1,53,0102,77,980స్థాయి III1,82,5753,13,500స్థాయి IV2,17,6193,14,000నాన్-ఓఈఎస్1,71,0812,25,294 ఇదీ చదవండి: ట్రయినీల నియామకానికి వ్యతిరేకంగా సమ్మె -
లాటరీకి స్వస్తి.. హెచ్–1బీ కోసం కొత్త విధానం!
వాషింగ్టన్: అత్యంత నైపుణ్యమున్న విదేశీయులకే హెచ్–1బీ వీసా ప్రక్రియలో అధిక ప్రాధాన్యత కల్పించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ సర్కార్ తాజాగా తక్కువ నైపుణ్యమున్న విదేశీయులకు హెచ్–1బీ వీసా దక్కకూడదనే కుట్రకు తెరతీసింది. ఏటా ఇచ్చే 85వేల హెచ్–1బీ వీసాల పరిమితిదాటాక సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనల్లో అత్యధిక నైపుణ్యంతో అధిక వేతనాలు పొందగల వారికే హెచ్–1బీ వీసాలు జారీచేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు పాత లాటరీ విధానానికి స్వస్తిపలికి అధిక నైపుణ్యం, అధిక వేతనం ఉన్న వాళ్లకే హెచ్–1బీ వీసాలను కట్టబెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఫెడరల్ రిజిస్టర్ నోటీస్ వెలువడింది. ‘‘ లాటరీ విధానానికి బదుల వెయిటేజీ విధానానికి ప్రాధాన్యత కల్పించాలి. అమెరికన్ సంస్థలు కోరే అభ్యర్థుల్లో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ కారి్మకులకు మాత్రమే హెచ్–1బీల జారీలో అధిక వెయిటేజీ ఇవ్వాలి. అమెరికాకు వచ్చాక 1,62,528 డాలర్ల వార్షిక వేతనం పొందబోయే అభ్యర్థులకే వెయిటేజీ పూల్‌లో నాలుగుసార్లు ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ వేతన కారి్మకులకు వెయిటేజీ పూల్‌లో ఒక్కసారే అవకాశం ఇవ్వాలి. కిందిస్థాయి ఉద్యోగాల ఎంపికలో అమెరికన్ పౌరులకు తగు ప్రాధాన్యత కల్పించాలి. అసంబద్ధమైన విదేశీ కారి్మకుల జీతభత్యాల పోటీ నుంచి అమెరికన్లను కాపాడాలి అని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఉద్యోగి వేతన స్థాయికి అనుగుణంగా రిజి్రస్టేషన్‌లో ప్రాధాన్యత కల్పించడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. -
అమ్మాయిల ఆశలపై 'నీళ్లు'
కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తులపై ఒకేసారి లక్ష డాలర్ల రుసుము విధిస్తున్న అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం భారతీయ యువ మహిళా ఔత్సాహికుల ను దెబ్బతీసే అవకాశం ఉంది. నిజానికి హెచ్–1బీ వీసా అందుకుంటున్న భారతీయుల్లో అత్యధికులు పురుషులే. 2023–24లో తమ ఉద్యోగాలను కొనసాగించడానికి (రెన్యువల్) ఆమోదం పొందిన నిపుణుల్లో 74% మంది పురుషులు, 26% మంది మహిళలు ఉన్నారు. హెచ్–1బీ కొత్త దరఖాస్తులకు (ప్రారంభ ఉపాధికి) ఆమోదం లభించిన నిపుణుల్లో మహిళల వాటా 37%. కొత్త ‘వన్ టైమ్ రుసుము’ ప్రభావంతో నూతన దరఖాస్తుదారులు.. ముఖ్యంగా, పురుషులతో పోలిస్తే తక్కువ వేతనాలు ఉండే మహిళల అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఉద్యోగుల లేదా కార్మికుల వార్షిక జీతంలో అధిక భాగం లేదా అంతకు మించి కొత్త హెచ్–1 బీ వీసా ఫీజు ఉంది. అందువల్ల, ప్రారంభ ఉపాధి లబ్ధిదారులను స్పాన్సర్ చేయడం కంపెనీలకు ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు.ఈ అంశం హెచ్–1బీ వీసాలు ఆశిస్తున్న ఔత్సాహికుల భవిష్యత్తు గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉదాహరణకు ఒక కంపెనీ కొత్త లబ్ధిదారునికి నూతన వీసా ఫీజు ప్రకారం స్పాన్సర్ చేస్తే.. మొదటి సంవత్సరంలో మొత్తం ఖర్చు.. రెన్యువల్ కోరుకునే అనుభవజ్ఞుడైన ఉద్యోగికి అయ్యే వ్యయం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం ముఖ్యంగా మహిళా లబ్ధిదారులపై ఉంటుందన్నది నిపుణుల మాట. ఎందుకంటే వారు సాధారణంగా హెచ్–1బీ హోల్డర్లలో పురుషుల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్విద్యార్హతలు ఉన్నప్పటికీ..అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం గణాంకాల ప్రకారం.. 2023–24లో హెచ్–1బీ ద్వారా కొత్త ఉద్యోగాలకు ఆమోదం పొందిన మహిళల్లో 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు 75% మంది ఉన్నారు. పురుషుల విషయంలో ఇది 65%గా ఉంది. దీని అర్థం.. కెరీర్‌ను ప్రారంభించే వయసులో ఉన్న మహిళల్లో ఎక్కువ మందిని హెచ్–1బీ వీసా కొత్త ఫీజు ప్రభావితం చేయనుందని పరిశీలకులు అంటున్నారు. 2023–24లో కొత్త ఉద్యోగాలకు ఆమోదం పొందిన మహిళల్లో 44% మంది మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. పురుషుల విషయంలో ఇది కేవలం 39% మాత్రమే. డాక్టరేట్, ప్రొఫెషనల్ డిగ్రీ స్థాయిల్లో సైతం మహిళలదే ఆధిపత్యం. కొత్త రుసుము నూతన దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి పురుషులతో పోలిస్తే ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ ఇది మహిళలపై ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.2023-24లో హెచ్-1బీ దరఖాస్తుల ఆమోదంప్రారంభ ఉపాధి దరఖాస్తుపురుషులు 63%మహిళలు 37%రెన్యువల్ దరఖాస్తుపురుషులు 74%మహిళలు 26% -
రెండు అమెరికా కంపెనీల నిర్ణయం: సీఈఓలుగా ఇండియన్స్
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని.. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ (H-1B) వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, ఫీజును లక్ష డాలర్లకు పెంచింది. ఈ తరుణంలోనే రెండు ప్రధాన అమెరికన్ కంపెనీలు తమ సీఈఓలు(CEO)గా భారతీయుల పేర్లను ప్రకటించాయి.అమెరికా టెలికాం దిగ్గజం టీ-మొబైల్ (T-Mobile).. సీఈఓగా 'శ్రీని గోపాలన్' పేరును ప్రకటించింది. ప్రస్తుతం టీ-మొబైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీని.. నవంబర్ 1న సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి.గోపాలన్.. హిందూస్తాన్ యూనిలీవర్లో మేనేజ్మెంట్ ట్రైనీగా జీవితాన్ని ప్రారంభించి, ఆ తరువాత భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, క్యాపిటల్ వన్, డ్యూష్ టెలికామ్లలో సీనియర్ పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఈయన పనిచేస్తున్న కంపెనీకే (టీ-మొబైల్) సీఈఓగా ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఇదీ చదవండి: ప్రమాదంలో మహిళా ఉద్యోగాలు!: ఐక్యరాజ్యసమితి హెచ్చరికచికాగోకు చెందిన పానీయాల దిగ్గజం.. మోల్సన్ కూర్స్ (Molson Coors) కూడా తన సీఈఓగా రాహుల్ గోయల్‌ను నియమించింది. అక్టోబర్ 1నుంచి ఈయన కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. కంపెనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గోయల్ అన్నారు. ఈయన మైసూర్లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. భారతదేశంలోని కూర్స్, మోల్సన్ బ్రాండ్లలో మాత్రమే కాకుండా ఈయన కొన్నాళ్లు యూకేలో కూడా పనిచేశారు. -
ట్రంప్ తెచ్చిన తంటా!
ఎవరి అంచనాలకూ అందకుండా ప్రవర్తిస్తూ అయోమయానికి గురిచేయటంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధహస్తుడు. ఆర్నెల్లక్రితం రెండోసారి అధికారంలో కొచ్చింది మొదలు తీసుకుంటున్న విపరీత నిర్ణయాల మాదిరే హెచ్1బీ వీసా ఫీజు దాదాపు లక్ష డాలర్లు చేసి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల నిపుణుల ఆశలను భగ్నం చేశారు. ఈ వీసా లబ్ధిదారుల్లో అత్యధికులు భారతీయులని తెలిసే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతం హెచ్1బీ వీసాదారులు 7,30,000 మందిలో దాదాపు 71 శాతం మంది భారతీయులు. ఇప్పటికే మన సరుకులపై సుంకాల మోత మోగించి భిన్నరంగాల కార్మికుల పొట్టగొట్టిన ట్రంప్, ఇప్పుడు ఐటీ, ఫార్మా,సాంకేతిక రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న అత్యంత నైపుణ్యంగల ఇంజనీర్ల ఆశలు అడియాసలు చేశారు. మొదట ఫీజు పెంపుపై చేసిన అస్పష్ట ప్రకటన అమెరికాలోని భారతీయుల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. పండగ కోసం స్వస్థలాలకు చేరుకుంటున్న వేలాదిమంది మార్గమధ్యంలో వెనుదిరిగే ప్రయత్నం చేయగా, అలాంటివారిని మరింత ఇబ్బంది పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ట్రంప్ కనుసన్నల్లో పనిచేసే ‘మాగా’ ఉద్యమకారులు విమానాల్లో భారీయెత్తున సీట్లు బ్లాక్ చేసి టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటేలా చేశారు. అసలు జరుగుతున్నదేమిటో అర్థంకాక అమెజాన్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలన్నీ ఆదివారం మధ్యాహ్నం గడువు ముగిసే వేళకు వచ్చితీరాలని సందేశాలు పంపటంతో స్వస్థలాలకొచ్చినవారంతా ఉన్నపాటున బయల్దేరారు. అంతా అయిన తర్వాత ఈ పెంపు కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందంటూ, అది కూడా వార్షిక ఫీజు కాదు... ఒక్కసారి కట్టాల్సిన రుసుమేనంటూ వైట్‌హౌస్ అధికార ప్రతినిధి తీరిగ్గా ప్రకటించారు. పైగా రెండు మూడేళ్లలో వీసాను నవీకరించుకోవాల్సినవారికి కూడా ఇది వర్తించబోదని చెప్పారు. కానీ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఛాంబర్ ఆఫ్ ప్రోగ్రెస్ సంస్థల ప్రతినిధుల ప్రకటనలు గమనిస్తే ఇప్పటికీ దిగ్గజ సంస్థల్లో ఏర్పడిన అయోమయం పోలేదని అర్థమవుతుంది. అసలు ఇప్పుడు చెప్పిన మాటకు ట్రంప్ కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ కూడా లేదు.తీరికూర్చుని నిందలేయటానికి తప్ప వలసదారుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కొచ్చిన నష్టం లేశమాత్రమైనా లేదు. అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొట్టిందీ లేదు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందన్న ఉద్దేశంతోనే ఆ కట్టుకథను మాగా ప్రచారంలో పెట్టింది. ప్రారంభంలో వలసదారులు తక్కువ వేతనానికి చేరినా త్వరలోనే తమ నైపుణ్యంతో, చురుకుదనంతో అక్కడివారితో సమానంగా వేతనం అందుకుంటున్నారు. నిజానికి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల మాట అటుంచి చిప్ డిజైన్,క్లౌడ్ కంప్యూటింగ్, పెనువేగంతో విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) తదితర ప్రాజెక్టుల్లో సమర్థంగా పనిచేసే చాలినంతమంది స్థానిక నిపుణులు దొరకటం అక్కడి సంస్థలకు అసాధ్యం. ఏఐలో అమెరికాను చైనా దాటిపోతోందన్న వార్త ఇప్పటికే అక్కడి పరిశ్రమల్ని కలవరపెడుతోంది. దాన్ని మరింత పెంచటం, చివరకు అమెరికా వెనకబాటుకు కారకుడు కావటం మినహా ట్రంప్ సాధించేదేమీవుండదు. వలసదారుల వల్ల అమెరికా పొందిన లబ్ధి అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనంత సంపద పోగు పడటానికి వలసదారులే కారణం. 1990–2000 మధ్య నోబెల్ సాధించిన శాస్త్రవేత్తల్లో 26 శాతంమంది వలసదారులు. ఇప్పుడు ప్రముఖ కంపెనీలుగా ఉన్న సంస్థల వృద్ధి వెనక 25 శాతం వలసదారులే ఉన్నారు. తన విపరీత నిర్ణయాలు అనుద్దేశిత పర్యవసానాలకు దారి తీస్తాయన్న ఎరుక ట్రంప్‌కు లేకుండా పోయింది. తాజా పెంపు నిర్ణయాన్ని న్యాయస్థానాలు తప్పుబట్టి తాత్కాలికంగా నిలిపేయవచ్చంటున్నారు. ఆ సంగతెలావున్నా ట్రంప్ సృష్టించిన అనిశ్చితి పర్యవసానంగా స్థానిక కంపెనీలు తమ కార్యక్షేత్రాలను వేరే దేశాలకు తరలిస్తాయి.దాంతోపాటు వృత్తిరంగ నిపుణులు, విద్యార్థులు ఇతర దేశాల వైపు దృష్టి సారిస్తారు. ఇదంతా అమెరికాకే నష్టం. మన ప్రభుత్వం మెరుగైన విధానాలతో ముందు కొస్తే, ఆ ప్రతిభా సామర్థ్యాలకు ఆసరాగా నిలిస్తే ఆ చర్య దేశాభివృద్ధికి దోహదపడుతుంది. -
హెచ్1బీ, జీఎస్టీ ఎఫెక్ట్
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. వారాంతాన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును ఎకాఎకిన లక్ష డాలర్ల(రూ. 88 లక్షలు)కు పెంచేయడం, గత వారం 0.25 శాతం వడ్డీ రేట్లను తగ్గించిన యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ భవిష్యత్ విధానాలపై ప్రసంగించనుండటం వంటి అంశాలు ప్రధానంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..దేశీయంగా స్టాక్ మార్కెట్లకు ఈ వారం కీలకంగా నిలవనుంది. గత వారం జూలై తదుపరి ప్రధాన ఇండెక్సులు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ గరిష్టాలకు చేరాయి. అయితే ఇకపై వీటి పరుగును దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగా ఈ(సెపె్టంబర్) నెలకు హెచ్ఎస్బీసీ కాంపోజిట్, తయారీ, సర్వీసుల పీఎంఐ ఫ్లాష్ అంచనాలు వెలువడనున్నాయి. ఇక గత వారాంతాన ఉన్నట్టుండి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును 3,000–5,000 డాలర్ల నుంచి ఏకంగా 1,00,000 డాలర్లకు పెంచేయడం ఐటీ పరిశ్రమలో సంచలనానికి తెరతీసింది. దీంతో యూఎస్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన దేశీ ఐటీ దిగ్గజాల షేర్లు(ఏడీఆర్‌లు) అమ్మకాలతో డీలాపడ్డాయి. ఈ ప్రభావం నేడు(సోమవారం) కనిపించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు ఐటీ పరిశ్రమలో కొన్నేళ్లుగా పెరిగిపోయిన ఆన్సైట్ సర్వీసులపై ఈ ప్రభావం పడవచ్చని అభిప్రాయపడ్డారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తిరిగి ఆఫ్‌షోర్ విధానానికి ప్రాధాన్యత పెరగవచ్చని అంచనా వేశారు. 285 బిలియన్ డాలర్ల విలువైన దేశీ ఐటీ పరిశ్రమలో ఆన్‌షోర్ ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది. ఇప్పటికే ఎగుమతి ఆధారిత రంగాలు ట్రంప్ విధించిన అదనపు టారిఫ్‌లతో డీలాపడినట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. హెచ్1బీ వీసాల జారీలో భారత నిపుణుల వాటా 70 శాతంకాగా.. దేశీ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోకు సెగ తగిలే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ వివరించారు. జీఎస్టీ దన్ను నేటి నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలు అమల్లోకిరానుండటంతో ఆటోమొబైల్, వైట్‌గూడ్స్, ఎఫ్ఎంసీజీసహా పలు రంగాలలోని కంపెనీలకు జోష్ లభించనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కొనుగోళ్లు పెరిగి వ్యవస్థలో డిమాండ్ బలపడే వీలున్నట్లు అంచనా వేశాయి. ఇది పెట్టుబడులకు, ఉద్యోగాలకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. ప్రధానంగా జీఎస్టీని రెండు శ్లాబులు 5 శాతం, 18 శాతంగా క్రమబదీ్ధకరించడంతో పట్టణ ప్రాంతాలలోనూ డిమాండ్ ఊపందుకోనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 40 శాతం శ్లాబులోకి మరికొన్ని ప్రొడక్టులను చేర్చినప్పటికీ జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీని రద్దు చేయడం, 375 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వినియోగానికి దారి చూపనున్నట్లు తెలియజేశారు. కాగా.. వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన ఈ నెల 22 నుంచి యూఎస్‌తో వాణిజ్య టారిఫ్‌లపై చర్చలు ప్రారంభంకానున్నట్లు దేశీ ప్రభుత్వం వారాంతాన వెల్లడించింది. ఇతర అంశాలు కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లోనూ మరిన్ని కంపెనీలు ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు క్యూ కట్టనున్నట్లు పీఎల్ క్యాపిటల్ అడ్వయిజరీ హెడ్ విక్రమ్ కసట్ పేర్కొన్నారు. ఇక దేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు తదితర అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు వివరించారు. గత వారమిలా గత వారం మార్కెట్లు వరుసగా మూడోసారి లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 722 పాయింట్లు(0.9 శాతం) బలపడి 82,626 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 213 పాయింట్లు(0.85 శాతం) పుంజుకుని 25,327 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.5–2 శాతం చొప్పున ఎగశాయి.సాంకేతికంగా గత వారం అంచనాలనకు అనుగుణంగా మార్కెట్లు బ్రేకవుట్ బాటలో సాగాయి. దీంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 25,350 సమీపంలో ముగిసింది. అయితే ఈ వారం నిఫ్టీకి 25,500 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చు. ఆపై ఇటీవలి గరిష్టం 25,669 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చు. ఒకవేళ బలహీనపడితే తొలుత 25,000 పాయింట్ల వద్ద మద్దతుకు వీలుంది. తదుపరి 24,650 వద్ద మరోసారి సపోర్ట్ లభించవచ్చు.వెనకడుగులోనే ఎఫ్పీఐలుఈ నెలలో రూ. 7,945 కోట్ల అమ్మకాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 7,945 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఆగస్ట్‌లో రూ. 34,990 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్లు విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. దీంతో ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1.38 లక్షల కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. టారిఫ్‌లు, యుద్ధాలు తదితర ప్రపంచ అనిశి్చతులు ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే గత వారం యూఎస్ ఫెడ్ 0.25 శాతం వడ్డీ రేటు కోత పెట్టడంతో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 900 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
అత్యంత అభిమానం నుంచి అత్యంత విద్వేషం దాకా..
వాషింగ్టన్: నూతన హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులకు వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు అమెరికా ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా మూలాలున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గతంలో చేసిన హెచ్–1బీ అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు మరోసారి తెరమీదకొచ్చాయి. హెచ్–1బీ కారణంగానే తనలాంటి ఎంతో మంది దక్షిణాఫ్రికా మొదలు ఎన్నో ప్రపంచదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారని, హెచ్–1బీ అనేది అద్భుతమైన విధానమని గతంలో మస్క్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేసిన అంశాన్ని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. ఆ తర్వాతి కాలంలో హెచ్–1బీ విధానంపై మస్క్ హఠాత్తుగా మాటమార్చారు. అది అత్యంత లోపభూయిష్టమైన విధానమని, అమెరికాకు దీంతో ప్రయోజనంలేదని అభాండాలు వేయడం మొదలెట్టడం చూసి రిపబ్లికన్ పార్టీ నేతలు సైతం విస్మయం వ్యక్తంచేయడం తెల్సిందే. మొదట్లో ట్రంప్‌ను ఆకాశానికెత్తేసిన మస్క్ ఆ తర్వాత ట్రంప్‌కు పోటీగా రాజకీయ పార్టీని సైతం ప్రకటించారు. హెచ్–1బీ అమలుతీరులో ఎలాంటి లోపాలు లేవు. సంస్కరణలు అక్కర్లేదని మస్క్ గతంలో అన్నారు. ఇటీవల మాటమార్చారు. ‘అదొక విఫల విధానం. భారీ సంస్కరణలు తేవాల్సిందే’అని అన్నారు. గతంలో దీనికి పూర్తిభిన్నంగా మాట్లాడారు. ‘హెచ్–1బీ కారణంగానే నేను అమెరికాలో స్థిరపడగలిగా. నేను మాత్రమే కాదు నా సంస్థలైన టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్, ఇతర కీలక సంస్థల ఏర్పాటులో నాకు సాయపడిన వారెందరినో హెచ్–1బీ అమెరికా కలలను నెరవేర్చింది. చట్టబద్ధ వలసలకు ఇది స్వర్గధామం. హెచ్–1బీ కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధం. హెచ్–1బీని తప్పుబట్టేవాళ్లను ముఖం మీదనే చాచికొడతా’అని గతంలో అన్నారు. ఇలా మాట్లాడిన కొద్ది కాలానికే మస్క్ స్వరం మార్చారు. ‘హెచ్–1బీ వీసాతో అమెరికాలో అడుగుపెట్టిన వృత్తినిపుణులుకు కనీస వేతనం పెంచడం, మెయింటెన్స్ ఖర్చులు పెరగడంతో స్థానిక ఉద్యోగులతో పోలిస్తే ఇలా విదేశీయులను పనిలో పెట్టుకోవడం ఆర్థికంగా భారమే. ఇవన్నీ చూస్తుంటే హెచ్–1బీ అనేది కాలంచెల్లిన విధానంగా అఘోరించింది. దీనిలో భారీ సంస్కరణలు తీసుకురాక తప్పదు’అని అన్నారు. -
ట్రంప్ సృష్టించిన వీసా ప్రకంపనలు
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల దరఖాస్తు రుసుముపై అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టించింది. దరఖాస్తుకు లక్ష డాలర్లు చెల్లించాలంటూ సంబంధిత ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో జనం ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్నవారు, హెచ్–1బీ వీసా కోసం ప్రయత్నిస్తున్నారు బెంబేలెత్తిపోయారు. ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? అని ఆవేదనకు గురయ్యారు. అమెరికా నుంచి స్వదేశాలకు వెళ్లాల్సిన వారు ఆగిపోయారు. ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ఇందులో భారతీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. విదేశాల్లో ఉన్న హెచ్–1బీ వీసాదారులైతే వెంటనే అమెరికాకు చేరుకోవడానికి పరుగులు పెట్టారు. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి విమానం టికెŠక్ట్ కొనుగోలు చేయాల్సి వచి్చంది. అయితే, హెచ్–1బీ వీసాల విషయంలో కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే లక్ష డాలర్లు వసూలు చేయనున్నట్లు అమెరికా ప్రభుత్వం వివరణ ఇచి్చంది. దీంతో చాలామంది ఊరట చెందారు. పెద్ద భారం భారం దిగిపోయినట్లుగా ఉపశమనం పొందారు. టిక్కెట్‌కు రూ.7.04 లక్షలు మహారాష్ట్రకు చెందిన ఒకరు హెచ్–1బీ వీసాతో అమెరికాలో సాఫ్ట్వేర్ నిపుణుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. 11 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. తన తండ్రి వర్థంతి కార్యక్రమం కోసం ఇటీవలే అమెరికా నుంచి నాగపూర్ వచ్చాడు. మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. హెచ్–1వీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు గురించి తెలియగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే అమెరికాకు ప్రయాణం కట్టాడు. అప్పటికప్పుడు విమానం టిక్కెట్ దొరకాలంటే మాటలు కాదు కదా! ప్రయాణం కోసం ఎక్కువ సొమ్ము చెల్లించక తప్పలేదు. నాగపూర్ నుంచి అమెరికాకు చేరుకోవడానికి 8,000 డాలర్లు (రూ.7.04 లక్షలు) ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రోహన్ మెహతా వాపోయాడు. సాధారణం అయ్యే ఖర్చు కంటే ఇది ఎన్నో రెట్లు అధికం. ట్రంప్ ప్రభుత్వం ముందే స్పష్టత ఇచ్చి ఉంటే తనకు ఈ భారం తప్పేదని ఆవేదన వ్యక్తంచేశాడు. యూరప్ దేశాలే ముద్దు దసరా, దీపావళి పండుగల కోసం స్వదేశానికి రావడానికి అమెరికాలోని భారతీయులు ముందే ప్లాన్ చేసుకున్నారు. హెచ్–1బీ వీసాలపై లక్ష డాలర్ల రుసుము విధిస్తున్నారని తెలియగానే విమానం టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. పండుగలకు వెళ్లలేమంటూ ప్రయాణాలు ఆపేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ నెల 19న ట్రంప్ ప్రభుత్వం నుంచి ప్రకటన వచి్చంది. దాంతో సోషల్ మీడియాలో ఇదే అంశంపై జోరుగా చర్చ సాగింది. అమెరికాలోని హెచ్–1బీ వీసాదారులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇప్పుడు ఇండియాకు వెళ్లకపోవడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చేశారు. స్వదేశంలో కుటుంబ సభ్యులతో పండుగలు చేసుకోవాలన్న ఆసక్తి చచి్చపోయిందని ఓ భారతీయుడు స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, భారత్‌లో ఉన్న వృత్తి నిపుణులు అమెరికా పట్ల విముఖత చూపుతున్నారు. ట్రంప్ దూకుడు నిర్ణయాలతో వారు పునరాలోచనలో పడ్డారు. ఉద్యోగాలకు యూరప్ దేశాలే బెటర్ అని అంచనాకొచ్చారు. ఆ దిశగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. పెళ్లి రద్దయ్యింది ఇండియాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అతడికి ఇండియాలోనే పెళ్లి కుదిరింది. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. శనివారమే పెళ్లి జరగాల్సి ఉంది. వివాహం కోసం శుక్రవారం ఆనందంగా స్వదేశానికి బయలుదేరాడు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తర్వాత ట్రంప్ విసిరిన వీసా బాంబు గురించి తెలిసింది. ఇప్పుడు ఇండియాకు వెళ్తే మళ్లీ వెనక్కి వస్తామో లేదో తెలియని పరిస్థితి. దాంతో ఆ యువకుడు ప్రయాణం ఆపేసి ఎయిర్పోరుŠట్ నుంచి ఇంటికి తిరిగివెళ్లాడు. ఇండియాలో జరగాల్సిన పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఇప్పటికే హెచ్–1బీ వీసాలు ఉన్నవారిపై లక్ష డాలర్ల రుసుము ఉండబోదని మొదటే చెబితే తనకు ఈ బాధ తప్పేదని ఆ యువకుడు పేర్కొన్నాడు. -
‘హెచ్1బీ’ని యుద్ధప్రాతిపదికన పరిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: హెచ్1బీ వీసాల వార్షిక రుసుమును లక్ష డాలర్ల (రూ. 88 లక్షలు)కు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు టెక్ నిపుణులు సహా అక్కడి భారతీయ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా తోడ్పడుతున్న భారతీయ టెక్ నిపుణుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించకపోతే భారతీయ నిపుణులు ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. -
అమెరికా పొమ్మంటే.. చైనా రమ్మంటోంది
బీజింగ్: హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును పెంచేసి అమెరికా విదేశీ ప్రతిభావంతులను దూరం చేసుకుంటుంటే ఇదే అదనుగా వాళ్లకు చైనా స్వాగతం పలుకుతోంది. కీలకమైన సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్(స్టెమ్) కోర్సుల్లో పట్టభద్రులైన విదేశీ నిపుణులు సులభంగా తమ కొత్త కే–వీసా పొంది తమ దేశంలో హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చని చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ నుంచి కొత్త కేటగిరీ అయిన కే–వీసాల జారీ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు ఆదివారం పేర్కొంది. కొత్త కేటగిరీ వీసాల జారీకి వీలుగా విదేశీయుల రాకపోకల అడ్మినిస్ట్రేషన్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. అమెరికా సహా పలు సంపన్న దేశాలు స్థానికుల ఉద్యోగకల్పనకు ప్రాధాన్యతనిస్తూ వర్క్ వీసా నిబంధనలను కఠినతరం చేస్తుండటంతో విదేశీ ప్రతిభావంతులను ముఖ్యంగా దక్షిణాసియా యువ ప్రతిభను ఒడిసిపట్టేందుకు చైనా ఇలా కొత్త కేటగిరీ వీసాను తెస్తోంది. చైనా లేదా విదేశీ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఇన్స్టిట్యూట్లలో స్టెమ్ కోర్సుల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఆపై ఉత్తీర్ణత సాధించిన యువ శాస్త్ర, సాంకేతిక నిపుణులకు కే–వీసాను ఇవ్వనున్నారు. బోధన, పరిశోధనారంగంలో ఉన్న వాళ్లూ కే–వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్కువ రోజుల కాలపరిమితి, ఎక్కువ సార్లు స్వదేశాలకు రాకపోకలు సాగించే వెసులుబాటు, రెన్యూవల్ సదుపాయం వంటి మరిన్ని ఫీచర్లను కే–వీసాకు జోడించారు. హెచ్–1బీ వీసా రావాలంటే అమెరికాలోని కంపెనీయే స్వయంగా వీసా దరఖాస్తుదారుడిని సిఫార్సు చేయాల్సి ఉంటుంది. చైనా కే–వీసాకు అలాంటి కఠిన షరతులు లేవని తెలుస్తోంది. విదేశీయులు చైనాలో విద్య, సాంస్కృతిక, శాస్త్ర, సాంకేతికత, అంకుర వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొనేందుకు కే–వీసా అనుమతిస్తుంది. ఇన్నాళ్లూ అమెరికాకు పొలోమంటూ వెళ్లిన సృజనాత్మక, ప్రతిభావంత యువతను తమ వైపునకు తిప్పుకోవాలని చైనా అభిలషిస్తోంది. -
USCIS: కొత్త దరఖాస్తులకే లక్ష డాలర్లు
వాషింగ్టన్: విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై రకరకాల సందేహాలు తలెత్తాయి. కొత్త దరఖాస్తులకేనా? లేక వీసాల పునరుద్ధరణకు కూడా ఈ రుసుము వర్తిస్తుందా? దరఖాస్తు చేసిన ప్రతిసారీ లక్ష డాలర్లు చెల్లించాలా? అనే అనుమానాలు విదేశీ ఉద్యోగుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా స్పష్టతనిచ్చింది. హెచ్–1బీ వీసాలతో ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారికి భారీ ఊరట కల్పించింది. కొత్త దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్ల రుసుము వసూలు చేయనున్నట్లు తెలియజేసింది. అది కూడా ఒక్కసారి మాత్రమేనని, వారు వీసా రెన్యూవల్ చేసుకుంటే పాత రుసుములే వర్తిస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా ప్రస్తుతం హెచ్–1బీ వీసాలు కలిగి ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొంది. వారు వీసా రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ లక్ష డాలర్లు చెల్లించాల్సి అవసరం లేదని, పాత రుసుములే వర్తిస్తాయని వివరించింది. ఈ మేరకు యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. హెచ్–1బీ వీసా కోసం తొలిసారిగా దరఖాస్తు చేసేవారు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని తెలియజేసింది. ఈ నెల 21వ తేదీ కంటే ముందు సమర్పించిన వీసా దరఖాస్తులపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, లక్ష డాలర్ల ఫీజు వారికి వర్తించదని వెల్లడించింది. 21వ తేదీ తర్వాత సమరి్పంచే దరఖాస్తులకు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాలని సూచించింది. ప్రస్తుతం అమెరికా బయట ఉన్న హెచ్–1బీ వీసాదారులు మళ్లీ తమ దేశంలోకి రావడానికి కొత్తగా వీసా ఫీజు చెల్లించాల్సి అవసరం లేదని స్పష్టంచేసింది. దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే భారీ రుసుము లక్ష డాలర్ల ఫీజు అనేది వన్–టైమ్ చార్జీ మాత్రమేనని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు. కొత్త దరఖాస్తులకే ఇది వర్తిసుందని పేర్కొన్నారు. లక్ష డాలర్లు చెల్లించి పొందిన హెచ్–1బీ వీసాను రెన్యూవల్ చేసుకోవడానికి మళ్లీ లక్ష డాలర్లు చెల్లించాల్సిన పనిలేదని, పాత చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. ఇప్పటికే హెచ్–1బీ వీసాలు పొందినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వీసా రెన్యూవల్‌పై వారిపై అదనంగా ఎలాంటి భారం పడబోదని తేల్చిచెప్పారు. 2025లో లాటరీలో హెచ్–1బీ వీసాలు పొందినవారిపై భారమేమీ ఉండదన్నారు. త్వరలో జరగబోయే లాటరీలో పాల్గొని, మొట్టమొదటిసారిగా వీసాలు పొందేవారు లక్ష డాలర్లు చెల్లించక తప్పదని వివరణ ఇచ్చారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో స్థానిక అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానమని గుర్తుచేశారు. విదేశీయులను విచ్చలవిడిగా నియమించుకోకుండా అమెరికా కంపెనీలను నిరుత్సాహపర్చాలన్నదే ఆయన ఉద్దేశమని పేర్కొన్నారు. అత్యధిక ప్రతిభాపాటవాలు కలిగిన ఉద్యోగులే ఉద్యోగాల్లో చేరితే తమ దేశానికి లబ్ధి కలుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. హెచ్–1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం అవుతోందని, దీనికి అడ్డుకట్ట వేసే దిశగానే కొత్త దరఖాస్తులపై లక్ష డాలర్ల రుసుము విధించినట్లు స్పష్టంచేశారు. ఈ నెల 21 కంటే ముందు హెచ్–1బీ వీసా దరఖాస్తులు సమరి్పంచినవారు, అవి ఆమోదం పొందినవారు లక్ష డాలర్లు చెల్లించనక్కర్లేదని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో వెల్లడించారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ సైతం స్పందించారు. ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హెచ్–1బీ నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల విషయంలో లక్ష డాలర్లు అనేది వార్షిక రుసుము కాదని, వన్–టైమ్ ఫీజు మాత్రమేనని ఉద్ఘాటించారు. ఈ వీసా కోసం ప్రతిఏటా లక్ష డాలర్లు కట్టాల్సిన పని లేదని, మొదటిసారి చెల్లిస్తే సరిపోతుందని, ఆ తర్వాత సాధారణ చార్జీలే వర్తిస్తాయని తెలియజేశారు. ఇప్పటికే హెచ్–1బీ వీసాదారులు ఉన్నవారు ఎప్పటిలాగే నిక్షేపంగా వారి స్వదేశానికి వెళ్లి రావొచ్చని సూచించారు. ఇదిలా ఉండగా, వీసా రుసుములపై అమెరికా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో భారతీయ ఐటీ నిపుణులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. సంబంధిత ఉత్తర్వుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన తర్వాత వారు ఆందోళనకు గురైన సంగతి తెలిసిందే. -
తిరిగి వచ్చేయండి.. భయంతో జీవించవద్దు: శ్రీధర్ వెంబు
అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు, సీఈఓ 'శ్రీధర్ వెంబు' స్పందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''విభజన సమయంలో అన్నీ వదిలి భారతదేశానికి ఎలా రావాల్సి వచ్చిందో.. సింధీ స్నేహితుల నుంచి నేను చాలా విషయాలను విన్నాను. వారు తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్నారు. సింధీలు భారతదేశంలో బాగానే ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో.. హెచ్1బీ వీసాపై ఉన్న భారతీయుల వంతు వచ్చింది. చెప్పడానికి బాధగా ఉన్నప్పటికీ.. మన దేశానికి తిరిగి వచ్చేయండి. మీ జీవితాలను మళ్లీ పునర్నిర్మించుకోవడానికి ఐదేళ్ల కాలం పట్టవచ్చు. కానీ అది మిమ్మల్ని బలపరుస్తుంది. భయంతో జీవించవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. మీరు బాగానే ఉంటారు'' అని శ్రీధర్ వెంబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.I have heard so many accounts from Sindhi friends about how their families had to leave everything and come to India during partition. They rebuilt their lives and Sindhis have done well in India.I am sad to say this, but for Indians on an H1-B visa in America, this may be that…— Sridhar Vembu (@svembu) September 21, 2025శ్రీధర్ వెంబు పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ''వాస్తవాలు తెలియకుండా భయాన్ని వ్యాపింపజేస్తున్నారు. ఇప్పటికే హెచ్1బీ వీసాలో ఉన్న వ్యక్తులకు కొత్త నియమాలు వర్తించవు, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త నియమాలు కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకు మాత్రమే'' అని ఒక యూజర్ పేర్కొన్నారు. బెంగాలీలు, పంజాబీల నుంచి మీరు చాలా విషయాలను విని ఉండవచ్చు. కానీ వారు ఇప్పుడు ఉన్న స్థితికి చేరుకోవడానికి దాదాపు మూడు తరాలు పట్టింది. ఇది అంత సులభం కాదని ఇంకొకరు అన్నారు.ఇలాంటి సవాళ్లు అప్పుడప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వదేశానికి తిరిగి వచ్చి, జీవితాలను పునర్నిర్మించుకోవడానికి చాలా కృషి అవసరం. కానీ భారతదేశంలో అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ధైర్యం, పట్టుదలతో, అభివృద్ధి చెందవచ్చని.. మరో యూజర్ శ్రీధర్ వెంబు మాటలతో ఏకీభవించారు. -
‘మన టాలెంట్ చూసి భయపడుతున్నట్లున్నారు’
న్యూఢిల్లీ: అమెరికా హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు రుసుము భారీ పెంచిన నేపథ్యంలో ఒకవైపు ఆందోళన నెలకొంది. యూఎస్ వెళ్లాలనుకునే భారతీయుల ఆశలకు దాదాపు గండిపడింది. సుమారు లక్ష అమెరికన్ డాలర్ల(రూ. 83 లక్షలు) రుసుము చెల్లిస్తే కానీ కొత్తగా హెచ్ 1 బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిక అవకాశం ఉండదు. అంటే తమ దేశానికి రావొద్దని పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చేశారు. తమ దేశ సంపదను భారతీయులు కొల్లగొట్టేస్తున్నారనే భయం ట్రంప్‌లో మొదలైనట్లుంది.భారతీయుల్లో టాలెంట్‌కు కొదవ లేకపోవడంతో అమెరికాలోని అవకాశాలను ఇట్టే అందిపుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుము పెంపుతో దీనిని అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ తన అసూయను బయటపెట్టేసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచేశారు. దీనిపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘ మన దేశంలోని యువత ప్రతిభకు అమెరికా భయపడినట్లుంది’ అంటూ చమత్కరించారు. ఇదే విషయంపై ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోయల్ మాట్లాడారు. రేపు(సోమవారం, సెప్టెంబర్ 22వ తేదీ) వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు గోయల్. అయితే ముందుగానే అమెరికా విధించిన హెచ్ 1 బీ వీసా రుసుముకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు గోయల్ స్పందించారు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. టాలెంట్ పరంగా చూస్తే మనవాళ్లు మేటి అని, దాన్ని చూసే అమెరికా హెచ్ 1 బీ వీసా దరఖాస్తు రుసుమును అమాంతం పెంచేసిందంటూ నవ్వుతూ సెటైర్లు వేశారు. ‘మన ప్రతిభను చూసి వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు. దానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని చమత్కరించారు. పలు దేశాలు భారత్‌తో వాణిజ్య ఒప్పందాలకు ఎదురుచూస్తున్నాయని, భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచకోవడానికి చాలా దేశాలు ముందు వరుసలో ఉన్నాయన్నారు. Bharat is a winner, come what may! pic.twitter.com/5MXtih8Cnr— Piyush Goyal (@PiyushGoyal) September 20, 2025 కాగా, నేటి(ఆదివారం, సెప్టెంబర్ 21వ తేదీ) నుంచి హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి లక్ష డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసే విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. ఇప్పటికే హెచ్1-బీ వీసా ఉన్నవారికి తాజా పెంపు వర్తించదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు తాజాగా విడుదల చేసిన ‘ప్రోక్లమేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్‌ఇమ్మిగ్రెంట్ వర్కర్స్’ ప్రకటన ప్రకారం హెచ్ 1బీ వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదిలా ఉంచితే, పీయూష్ గోయల్ భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 22న అమెరికాకు పయనం కానున్నారు. సెప్టెంబర్ 16న ఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ బృందం.. భారత ప్రతినిధి రాజేష్ అగర్వాల్ తో జరిపిన ఏడు గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన సుంకాలను తగ్గించడం ఈ చర్చల్లో ఒక కీలక అంశం కానుంది. -
h1b visa: ‘హెచ్1బీ’ వీసా ఫీజు పెంపుపై వైట్ హౌస్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1 బీ వీసా వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో వైట్‌హౌస్ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి హెచ్1బీ వార్షిక వీసా కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి లక్ష డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ పెంపు కొత్తగా దరఖాస్తు చేసే విదేశీ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే హెచ్1-బీ వీసా ఉన్నవారికి తాజా పెంపు వర్తించదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు తాజాగా విడుదల చేసిన ‘ప్రోక్లమేషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్‌ఇమ్మిగ్రెంట్ వర్కర్స్’ ప్రకటన ప్రకారం హెచ్ 1బీ వీసాలపై కీలకమైన పరిమితులు విధించింది. ట్రంప్ ఆదేశాలను అమలు చేసే యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గ దర్శకాల ప్రకారం.. హెచ్ 1 బీ వీసా పొందిన ఈ ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. మినహాయింపులు:అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలుఅమెరికాలో స్థిర నివాసం ఉన్న వ్యక్తులువ్యవసాయం, మాంసం ప్రాసెసింగ్, ప్యాకింగ్ హౌసులు, రవాణా వంటి రంగాల్లో పనిచేసే కార్మికులకు మినహాయింపు ఆరోగ్య సంరక్షణ రంగంలోకి వచ్చే ముఖ్యమైన విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనలు అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న కొత్త వీసా దారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే దాఖలైన కానీ ఇంకా వీసా పొందని ధరఖాస్తు దారులకు మాత్రమే వర్తిస్తుంది. ఏమిటీ హెచ్–1బీ వీసా? విదేశీ నిపుణులను అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడానికి వీలుగా 1990వ దశకంలో అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టం ద్వారా హెచ్–1బీ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు. ఇక్కడే స్థిరపడ్డారు. క్రమంగా పౌరసత్వం కూడా పొందారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం 2 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల (రూ.1.76 లక్షలు– రూ.4.40 లక్షలు) దాకా ఉంది. తొలుత మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసా జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరో మూడేళ్లు పొడిగిస్తారు. ఈ వీసాలతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారత నిపుణులే.ఆ తర్వాత చైనా నిపుణులు ఉంటున్నారు. భారత్‌లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన విద్యార్థుల కల హెచ్–1బీ వీసా అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి తెలియనివాళ్లు దాదాపు ఉండరు. సాధారణంగా హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజుతోపాటు ఇతర రుసుములను కంపెనీలే భరిస్తాయి. ఇకపై దీనికోసం ఏటా ఒక్కో విదేశీ ఉద్యోగిపై రూ.88 లక్షలకుపైగా చెల్లించాల్సి రావడం అమెరికా సంస్థలకు పెనుభారమే. అది పరోక్షంగా విదేశీ ఉద్యోగులకు.. ముఖ్యంగా భారతీయులకు నష్టం చేకూర్చనుంది. కంపెనీల అవసరాలు తీర్చేలా అత్యధిక ప్రతిభాపాటవాలు ఉంటే తప్ప హెచ్–1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం పొందడం దుర్లభమేనని అంటున్నారు. -
వామ్మో.. లక్ష డాలర్లా.. ఇక ఆశలు వదులుకోవాల్సిందే
-
H1B ఎఫెక్ట్.. బలహీన ప్రధాని అంటూ మోదీపై విమర్శలు
న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల వార్షిక ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచినా మౌనంగా ఉండిపోయిన ప్రధాని మోదీ నిజంగానే బలహీన ప్రధాని అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగోయ్ తమ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాల్లో పోస్ట్‌లు పెట్టారు.‘నేను మరోసారి చెబుతున్నా. భారత్‌కు ఉన్నది కేవలం బలహీన ప్రధాని మాత్రమే’ అని రాహుల్ విమర్శించారు. ‘మోదీజీ.. పుట్టినరోజు నాడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ట్రంప్ నుంచి మీకు ఫోన్‌కాల్ వచ్చింది. కానీ రిటర్న్ గిఫ్ట్‌గా లక్ష డాలర్ల రుసుం భారం భారతీయులపై పడింది’ అని ఖర్గే అన్నారు. ‘‘నాడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ తరఫున పాల్గొని ‘మరోసారి ట్రంప్ సర్కార్’ అని మీరే నినదించారు. అందుకే రిటర్న్ గిఫ్ట్‌గా లక్షడాలర్ల వార్షిక ఫీజు భారం భారతీయ టెక్ ఉద్యోగులపై పడింది. ఇప్పటికే 50 శాతం టారిఫ్ పడుతోంది. దీంతో 10 కీలక రంగాల్లో భారత్ రూ.2.17 లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోతోంది. ఇవి చాలవన్నట్లు భారత్‌పై 100 శాతం టారిఫ్ మోపాలని ఐరోపా సమాఖ్యను ట్రంప్ ఉసిగొల్పుతున్నారు.విదేశీ అగ్రనేతలు కనబడగానే గట్టిగా ఆలింగనాలు చేసుకోవడం, ప్రాసలు వినిపించేలా నినాదాలు ఇవ్వడం, పెద్ద సభలు ఏర్పాటుచేయడం, ఆ సభల్లో మోదీ, మోదీ అని బిగ్గరగా నినా దాలు ఇప్పించుకోవడం సరైన విదేశాంగ విధానం అనిపించుకోదు’ అని మోదీపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ‘భారతీయ ప్రతిభావంతులు, అత్యున్నత నైపుణ్యాలున్న సిబ్బంది భవిష్యత్తును అమెరికా ప్రభుత్వం నాశనం చేస్తోంది. ఇంతటి రుసుముల భారం మోపినా మోదీ మౌనంగా ఉండటం ఆయన బలహీనతను రుజువుచేస్తోంది’అని గౌరవ్ గొగోయ్ అన్నారు. ‘నేరుగా చర్చల వేళ హెచ్–1బీ వీసాల విషయంలో నాటి ట్రంప్ ప్రభుత్వం ఆనాడు మోదీకి ఎలాంటి హామీ ఇవ్వలేదని 2017లోనే రాహుల్‌గాంధీ బయటపెట్టారు. ఇప్పుడు అది నిజమని నిరూపితమైంది’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా అన్నారు. -
లక్ష డాలర్ల బాంబు
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా నుంచి వలస దారులను బయటకు పంపించి, అమెరికన్ల మనసులు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పెద్ద బాంబు పేల్చారు. విదేశీ వృత్తి నిపుణులు అమెరికా గడ్డపై ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పిస్తున్న హెచ్–1బీ వీసా వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు (రూ. 88 లక్షలకుపైగా) పెంచేశారు. ఈ మేరకు ‘నాన్–ఇమిగ్రెంట్ ఉద్యోగుల ప్రవేశంపై ఆంక్షలు’ పేరిట సంబంధిత ఉత్తర్వుపై శుక్రవారం సంతకం చేశారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ నెల 21వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పారు. ప్రతిఏటా హెచ్–1బీ వీసాలు పొందుతున్నవారిలో 70% మంది భారతీయులే కావడంతో వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డాలర్ డ్రీమ్స్ వదులుకోవాల్సి రావొచ్చని అంటున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తూ విదేశీయులను నియమించుకొనే కంపెనీలు వారికి హెచ్–1బీ వీసాలు జారీ చేయడానికి ప్రతి సంవత్సరం రూ.88 లక్షలకుపైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని మోయలేని కంపెనీలు విదేశీ ఉద్యోగులను పక్కనపెట్టి, స్థానిక అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. సరిగ్గా ట్రంప్ ఆశిస్తున్నది కూడా ఇదే. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం వెంటనే ప్రభావం చూపింది. గడువు దాటితే రూ.88 లక్షలు చెల్లించక తప్పని పరిస్థితి ఉండడంతో ప్రస్తుతం విదేశాల్లో ఉన్న హెచ్–1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులు తక్షణమే అమెరికాకు చేరుకోవాలని కంపెనీలు ఆదేశించాయి. దాంతో విమానాశ్రయాల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. టిక్కెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఉత్తర్వు అమల్లోకి వచ్చే నిర్దేశిత గడువులోగా అమెరికాలో అడుగుపెట్టడానికి హెచ్–1బీ వీసాలు కలిగిన విదేశీ ఉద్యోగులు పరుగులు తీశారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు: ట్రంప్ అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను మాత్రమే అమెరికాలోకి అనుమతించాలన్నదే తమ విధానమని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. హెచ్–1బీ వీసా కార్యక్రమం అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఆయన ఆక్షేపించారు. నైపుణ్యంతో కూడిన పనులు చేయడానికి విదేశాల నుంచి తాత్కాలిక ఉద్యోగులను తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ వీసా దుర్వినియోగం అవుతోందని అన్నారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో తక్కువ వేతనం, తక్కువ నైపుణ్యాలు కలిగిన విదేశీయులను నియమించుకోవడానికి హెచ్–1బీని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా ఈ వీసాలపై ఆధారపడిన ఔట్సోర్సింగ్ కంపెనీలు వీసా మోసాలు, మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు తమ దర్యాప్తు సంస్థలు గుర్తించాయని చెప్పారు. విదేశీయులను అడ్డదారుల్లో అమెరికాకు చేరవేస్తున్నట్లు కనిపెట్టాయని పేర్కొన్నారు. ఈ అక్రమాలను అరికట్టడానికి కంపెనీలపై వీసా దరఖాస్తు ఫీజులు పెంచక తప్పడం లేదని వివరించారు. విదేశీ నిపుణుల్లో అత్యంత ప్రతిభావంతమైన నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి కంపెనీలకు అనుమతి ఇస్తున్నామని, అందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ప్రకటించారు. తమ నిర్ణయం పట్ల టెక్ కంపెనీల సీఈఓలు కచ్చితంగా సంతోషిస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. వీసాల ముసుగులో కొనసాగుతున్న విచ్చలవిడి వలసలకు కళ్లెం వేయక తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు. కంప్యూటర్ సంబంధిత రంగాల్లో కంపెనీలు హెచ్–1బీ వీసాలతో విదేశీయులకు ఉద్యోగాలు ఇస్తూ అమెరికన్లకు అన్యాయం చేస్తున్నాయని తప్పుపట్టారు. 2003లో హెచ్–1బీలు పొందిన విదేశీయుల్లో ఐటీ ఉద్యోగులు 32 శాతం మంది ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 65 శాతానికి చేరడం గమనార్హం. ట్రంప్ తాజా నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నిపుణులైన విదేశీ మానవ వనరులను అమెరికాకు దూరంచేసే ప్రయత్నం మానుకోవాలని ట్రంప్ ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిభలేనివారు మనకెందుకు?: హోవార్డ్ లుట్నిక్ అమెరికాలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో హెచ్–1బీ నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా కార్యక్రమం అత్యధికంగా ఉల్లంఘనకు గురవుతోందని వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రెటరీ విల్ స్కార్ఫ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వీసా అసలు ఉద్దేశం నెరవేరడం లేదన్నారు. అమెరికా కామర్స్ సెక్రెటరీ హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ.. అమెరికన్ల అవకాశాలు దోచుకొనేవారు తమకు అవసరం లేదన్నారు. అత్యధిక నైపుణ్యాలు కలిగినవారికే అమెరికాలో ఉద్యోగాలు దక్కాలని చెప్పారు. అలాంటి నిపుణులు అమెరికాలో వ్యాపారాలు చేసి, ప్రతిభతో అమెరికన్ల కోసం కొత్త ఉద్యోగాలు సృష్టించగలరని తెలిపారు. దీనివల్ల అమెరికా ఖజానాకు 100 బిలియన్ డాలర్ల మేర లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఒక విదేశీ ఉద్యోగి కచ్చితంగా అవసరమని భావిస్తే అతడి కోసం ఏటా లక్ష డాలర్లు ప్రభుత్వానికి చెల్లించాలని, లేకపోతే అమెరికా పౌరుడినే నియమించుకోవాలని కంపెనీలకు సూచించారు. ప్రతిభ లేని విదేశీయులు మనకెందుని ప్రశ్నించారు. స్థానికులకే శిక్షణ ఇచ్చి, ఉద్యోగాల్లో చేర్చుకోవాలని కంపెనీలకు స్పష్టంచేశారు. హెచ్–1బీ వీసాల రెన్యూవల్స్తోపాటు కొత్త దరఖాస్తులకు కూడా లక్షల డాలర్ల రుసుము వర్తిస్తుందని హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. మరోవైపు ఒక విదేశీ ఉద్యోగి గ్రీన్‌కార్డు పొందడం కోసం కంపెనీ ఇప్పటికే స్పాన్సర్ చేస్తే అతడి వీసాను రెన్యూవల్ చేయడానికి ఏటా లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అది భారంగా భావిస్తే రెన్యూవల్ చేయడం ఆపేయొచ్చు. ఫలితంగా గ్రీన్‌కార్డు ఆశలు సైతం వదులుకోవాల్సిందే. గ్రీన్‌కార్డుల కోసం ఇప్పటికే వేలాది మంది విదేశీయులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు.ఏమిటీ హెచ్–1బీ వీసా? విదేశీ నిపుణులను అమెరికాలోని కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడానికి వీలుగా 1990వ దశకంలో అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టం ద్వారా హెచ్–1బీ వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు. ఇక్కడే స్థిరపడ్డారు. క్రమంగా పౌరసత్వం కూడా పొందారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం 2 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల (రూ.1.76 లక్షలు– రూ.4.40 లక్షలు) దాకా ఉంది. తొలుత మూడేళ్ల కాలానికి హెచ్–1బీ వీసా జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరో మూడేళ్లు పొడిగిస్తారు. ఈ వీసాలతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారత నిపుణులే. ఆ తర్వాత చైనా నిపుణులు ఉంటున్నారు. భారత్‌లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన విద్యార్థుల కల హెచ్–1బీ వీసా అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి తెలియనివాళ్లు దాదాపు ఉండరు. సాధారణంగా హెచ్–1బీ వీసా దరఖాస్తు ఫీజుతోపాటు ఇతర రుసుములను కంపెనీలే భరిస్తాయి. ఇకపై దీనికోసం ఏటా ఒక్కో విదేశీ ఉద్యోగిపై రూ.88 లక్షలకుపైగా చెల్లించాల్సి రావడం అమెరికా సంస్థలకు పెనుభారమే. అది పరోక్షంగా విదేశీ ఉద్యోగులకు.. ముఖ్యంగా భారతీయులకు నష్టం చేకూర్చనుంది. కంపెనీల అవసరాలు తీర్చేలా అత్యధిక ప్రతిభాపాటవాలు ఉంటే తప్ప హెచ్–1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగం పొందడం దుర్లభమేనని అంటున్నారు. -
భారత టెక్ కంపెనీలపై ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాలకు సంబంధించి అమెరికా అదనంగా 1,00,000 డాలర్ల ఫీజు విధించడంపై దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనితో ఆన్‌షోర్ ప్రాజెక్టులకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. ఫలితంగా భారతీయ టెక్నాలజీ సర్వీస్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. అంతే గాకుండా దీని అమలుకు ఒకే ఒక్క రోజు గడువు ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, ప్రొఫెషనల్స్, విద్యార్థుల విషయంలో అనిశ్చితి తలెత్తే ప్రమాదం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ, భారతీయ కంపెనీల కోసం హెచ్1బీ వీసాలపై పని చేస్తున్న భారతీయులపైనా అమెరికా నిర్ణయం ప్రభావం పడుతుందని నాస్కామ్ వివరించింది. వీసా ఫీజులపై ఆదేశాలను అధ్యయనం చేస్తున్నామని, ఇలాంటి మార్పుల వల్ల అమెరికా నవకల్పనల వ్యవస్థపై, అలాగే ఉద్యోగాలపై కూడా ప్రభావాలు పడతాయని పేర్కొంది. వీటికి తగ్గట్లుగా సర్దుబాట్లు చేసుకునేందుకు క్లయింట్లతో కలిసి కంపెనీలు పని చేస్తాయని వివరించింది. ఈ స్థాయి మార్పులు చేసేటప్పుడు వ్యాపారవర్గాలు, వ్యక్తులు ప్రణాళిక వేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ‘మేము ఎప్పటికప్పుడు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. దీని వల్ల తలెత్తే ప్రభావాల గురించి పరిశ్రమవర్గాలతో సమాలోచనలు జరుపుతున్నాం‘ అని నాస్కామ్ తెలిపింది. మరోవైపు, ప్రస్తుతం హెచ్1బీ వీసాలు కలిగి ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగులను అత్యవసరంగా అమెరికాకు తిప్పి పంపేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని కంపెనీలకు నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ సూచించారు. కృత్రిమ మేథ, ఇతరత్రా టెక్నాలజీలను అభివృద్ధి చేయడం వేగవంతమవుతున్న తరుణంలో ఇలాంటి చర్యల వల్ల వ్యవస్థకు విఘాతం కలుగుతుందని తెలిపారు. నవకల్పనలకు నిపుణులు కీలకం.. కొత్త ఆవిష్కరణలను కనుగొనేందుకు, అమెరికా దీటుగా పోటీపడేందుకు, ఆ దేశ ఎకానమీ అభివృద్ధి చెందేందుకు ప్రతిభావంతులు అవసరమని నాస్కామ్ తెలిపింది. ఏఐతో పాటు ఇతరత్రా సాంకేతికతల్లో అనేక మార్పులు జరుగుతున్న తరుణంలో వారి సేవలు కీలకంగా మారాయని వివరించింది. ప్రస్తుతం హెచ్1బీ వీసా ఫీజులు కంపెనీ స్థాయిని బట్టి సుమారు 2,000–5,000 డాలర్ల వరకు ఉన్నాయి. కొత్తగా విధించిన 1,00,000 డాలర్లు దీనికి అదనం. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడే పేరుతో తలపెట్టిన చేపట్టిన ఈ చర్య, కీలకమైన ప్రతిభావంతుల లభ్యతను దెబ్బతీస్తుందని కార్పొరేట్ న్యాయవాది సీఆర్ సుకుమార్ వ్యాఖ్యానించారు. అమెరికా నిర్ణయాన్ని వీసా కన్సల్టెంట్, ఐటీ వ్యాపారవేత్త దిలీప్ కుమార్ నూనే ’షాకింగ్’గా అభివర్ణించారు. అమెరికాలో సర్వీసులు అందిస్తున్న చాలా మటుకు ఐటీ కంపెనీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. దీనితో ప్రతిభావంతులను అమెరికాకు రప్పించడం కష్టతరం అవుతుంది కాబట్టి అమెరికన్ కంపెనీలపైనా ప్రభావం పడుతుందన్నారు. అమెరికాలో నియామకాలు పెంచుకుంటున్నాం .. భారత్ కేంద్రంగా పని చేసే కంపెనీలు అమెరికాలో స్థానికుల నియామకాలను పెంచుకోవడం ద్వారా కొన్నాళ్లుగా వీసాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్న సంగతిని నాస్కామ్ గుర్తు చేసింది. ఈ కంపెనీలు హెచ్1బీ ప్రాసెస్‌లకు సంబంధించి అన్ని నిబంధనలను పాటిస్తున్నాయని, నిర్దేశిత జీతభత్యాలు చెల్లిస్తున్నాయని, స్థానిక ఎకానమీ వృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని, కొత్త ఆవిష్కరణల కోసం విద్యాసంస్థలు, స్టార్టప్‌లతో కలిసి పని చేస్తున్నాయని పేర్కొంది. ఈ కంపెనీల్లో హెచ్1బీ వీసాలపై పని చేస్తున్న వర్కర్లతో అమెరికా దేశ భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదని స్పష్టం చేసింది. ఐటీ కంపెనీల వ్యయాలు పెరుగుతాయ్హెచ్1బీ వీసాల ఫీజు పెంపుతో భారతీయ ఐటీ కంపెనీలకు వ్యయాలపరంగా సవాళ్లు గణనీయంగా పెరుగుతాయి. సమీప భవిష్యత్తులో దీని పరిణామాలు కొంత తీవ్రంగా ఉండొచ్చు. దేశీ ఐటీ కంపెనీలు అమెరికాలో నియామకాలను మరింతగా పెంచుకునేందుకు, గ్లోబల్ డెలివరీ వ్యవస్థను పటి ష్టం చేసుకునేందుకు ఇది దారి తీయొచ్చు. తద్వా రా సవాలును అవకాశంగా మల్చుకోవడానికి ఆస్కారం ఉంది. – బీవీఆర్ మోహన్ రెడ్డి, సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ఆఫ్షోరింగ్ వేగవంతంహెచ్1బీ వీసా ఫీజుల పెంపుతో కొత్త దరఖాస్తులపై ప్రభావం పడుతుంది. దీని ఎఫె క్ట్‌తో ఓవైపు ప్రతిభావంతులు దొరక్క, మరోవైపు వ్యయాలు పెరిగిపోవడం వల్ల రాబోయే రోజుల్లో కార్యకలాపాల ఆఫ్‌షోరింగ్ మరింత వేగవంతం అవుతుంది. హెచ్1బీ వీసాలపై భారత ఐటీ కంపెనీలు ఆధారపడటం కొన్నాళ్లుగా గణనీయంగా తగ్గిపోయింది. డేటా ప్రకారం అమెరికన్ టెక్ దిగ్గజాలే వీటిని ఎక్కువగా తీసుకుంటున్నాయి. కొత్త దరఖాస్తులకు మాత్రమే కొత్త నిబంధన వర్తిస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే దీని ప్రభావం పరిమితమే. అమెరికాలో చౌకగా పని చేసి పెట్టేలా ఉద్యోగులను పంపించేందుకు కంపెనీలు ఈ వీసాలను ఉపయోగించుకుంటున్నాయన్న అభిప్రాయాలన్నీ అపోహలే. హెచ్1బీ వీసాలను వినియోగించుకునే టాప్ 20 కంపెనీలు సగటున 1,00,000 డాలర్ల పైగానే జీతభత్యాలు ఇస్తున్నాయి. – మోహన్‌దాస్ పాయ్, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వోఅమెరికాకు నష్టం, భారత్‌కు లాభం హెచ్1బీ వీసా ఫీజులను భారీగా పెంచడం వల్ల అమెరికాలో కొత్త ఆవిష్కరణలపై దెబ్బ పడుతుంది. అయితే, దీని వల్ల భారత్‌లో నవకల్పనలకు ఊతం లభిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, పుణె, గుర్గావ్ లాంటి నగరాలకు కొత్త ప్రయోగశాలలు, పేటెంట్లు, అంకురాలు వెల్లువెత్తుతాయి. తద్వారా హెచ్1బీ ఫీజులను పెంచడమనేది అమెరికాకు నష్టదాయకం, భారత్‌కు లాభదాయకంగా మారుతుంది. దీని వల్ల దేశంలోనే అత్యుత్తమ డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు భారతదేశ వృద్ధి గాధలో, వికసిత భారత్ లక్ష్య సాధనలో పాలుపంచుకునే అవకాశం లభించినట్లవుతుంది. – అమితాబ్ కాంత్ , నీతి ఆయోగ్ మాజీ సీఈవో -
కొత్తవాళ్లకు మాత్రమే
న్యూయార్క్/వాషింగ్టన్: హెచ్1బీ వీసాల వార్షిక రుసుము పెంపుపై సర్వత్రా గగ్గోలు రేగిన నేపథ్యంలో ఈ పెంపు కేవలం కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకే వర్తిస్తుందని ‘వైట్‌హౌస్’ అధికారి ఒకరు తెలిపినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ శనివారం పేర్కొంది. ‘హెచ్1బీ ఫీజు పెంపునకు చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సవాళ్లను అధిగమిస్తే అంతర్జాతీయ వృత్తి నిపుణులను తీసుకొనే కంపెనీలు ఒక్కో ఉద్యోగిపై ఏటా లక్ష డాలర్ల ఫీజు చొప్పున ఆరేళ్లపాటు చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ఫీజు కేవలం కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకే వర్తిస్తుంది’ అని ‘వైట్‌హౌస్’ ఉన్నతాధికారి పేర్కొన్నట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రచురించింది. మరోవైపు స్వదేశాలకు వెళ్లిన ప్రస్తుత హెచ్1బీ వీసాదారులు నిర్దేశిత గడువులోగా హడావుడిగా తిరిగి అమెరికా చేరుకోవాల్సిన అవసరం లేదని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది. -
విమాన టికెట్ల ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ/ముంబై: హెచ్–1బీ వార్షిక ఫీజు లక్ష డాల ర్లకు పెంచడంతోపాటు తాము పనిచేస్తున్న కార్పొరే ట్ సంస్థల యాజమాన్యాల నుంచి వచ్చిన సందేశాలతో భారతీయ హెచ్–1బీ వీసాదారుల గుండె రైళ్లు పరుగెడుతున్నాయి. 21వ తేదీ నుంచి నిర్ణ యం అమలుచేస్తానని ట్రంప్ ప్రకటించడంతో ఆతేదీనాటికి హెచ్–1బీ వీసాదారులంతా అమెరికా గడ్డమీదనే ఉండిపోవాలేమోనని కార్పొరేట్ కంపెనీలు భావించాయి.సొంత పనుల స్వదేశాలకు వెళ్లిన తమ ఉద్యోగులను తక్షణం అమెరికాకు వచ్చేయాలని మెమోలు పంపాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, జేపీమోర్గాన్ వంటి కీలక సంస్థలన్నీ తమ ఉద్యోగులకు ఇలాంటి సందేశాలు చేరవేశాయి. దీంతో శరన్నవరాత్రులు, దసరా కోసం భారత్‌కు వచ్చిన హెచ్–1బీ వీసాదారులు ఉన్నపళాన ఎయిర్‌పోర్ట్‌లకు పరుగెత్తారు. నేరుగా అమెరికా ప్రయాణానికి విమాన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దీన్ని పౌరవిమానయాన సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుని ధరలను అమాంతం పెంచేశాయి. న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విమాన టికెట్ ధరను అదనంగా రూ.37వేల నుంచి రూ.80 వేలదాకా పెంచేశారు. పెరిగిన ధరలతో ఒక టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 4,500 డాలర్లు అంటే దాదాపు రూ. 3,96,000కు చేరుకుందని ఒక యూజర్ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. విమానాల నుంచి బయటకు పరుగోపరుగు భారత్‌లో కుటుంబసమేతంగా పండుగలు జరుపుకునేందుకు న్యూయార్క్, ఇతరత్రా అమెరికా విమానాశ్రయాల్లో విమానం ఎక్కిన హెచ్–1బీవీసాదారులు ట్రంప్ ప్రకటన వార్త తెల్సిన మరుక్షణమే వెంటనే విమానాల నుంచి బయటకు దిగిపోయారు. రన్‌వేపై ఉన్న విమానం నుంచి సైతం హఠాత్తుగా భారతీయులు గగ్గోలుపెట్టిమరీ విమానాన్ని ఆపించేసి కిందకు దిగిపోయినట్లు వార్తలొచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారాయి. ‘‘శుక్రవారం ఉదయం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ నుంచి భారత్‌కు వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులంతా విమానం ఎక్కేశారు. ఇంకొన్ని సెకన్లలో విమానం బయల్దేరుతుందనగా కొందరు లేచి గోల చేశారు. మేం విమానం దిగిపోతాం అని అరుపులు మొదలెట్టారు. అసలేం జరుగుతుందో అర్థమయ్యేలోపే చాలా మంది విమానం తలుపు దగ్గర గుమిగూడారు. వీళ్లంతా దిగిపోయి అంత సద్దుమణగడానికి మూడు గంటలు సమయం పట్టింది’’అని విమానప్రయాణికుడు మసూద్ రాణా ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. బోర్డింగ్ పాస్‌లు ఇచ్చే ప్రాంతంలో, బేఏరియాలోనూ హెచ్–1బీ వీసాదారులు తమ భారత ప్రయాణాలను రద్దుచేసుకుని వేగంగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పరుగెత్తడం చూశా’’అని చార్టర్డ్ అకౌంటెంట్ కౌస్తవ్ మజూందార్ అనే మరో యూజర్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘దుబాయ్ విమానాశ్రయంలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. అమెరికా నుంచి దుబాయ్‌కు చేరుకున్న వీసాదారులు ముంబైకి వెళ్లే విమానం కోసం ఎదురుచూస్తున్నారు. ట్రంప్ వార్త వినగానే భారత్‌కు వెళ్లడాన్ని విరమించుకుని అదే దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో నేరుగా అమెరికా టికెట్ల కోసం కౌంటర్ వద్ద క్యూ కట్టారు’’అని మరో యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. భారతీయులు ఇంతచేసినా ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌ను చేరుకోవడం కష్టమేనని తెలుస్తోంది. ఈ వార్త తెలిసేటప్పటికి భారత్‌లో ఉన్న వీసాదారులకు కేవలం 10 గంటల సమయమే మిగిలిఉంది. అప్పటికప్పుడు ఢిల్లీ లేదా ముంబై నుంచి డైరెక్ట్ ఫ్లయిట్లో బయల్దేరినా అమెరికాకు చేరుకోవడానికి 15 గంటలకుపైనే సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
పరాదీనతే ప్రబల శత్రువు
భావ్‌నగర్(గుజరాత్): హెచ్–1బీ వీసాల దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయుల నెత్తిన భారీ పిడుగు పడేసిన నేపథ్యంలో భారత ప్రధాని మోదీ హితబోధ ధోరణిలో స్పందించారు. శనివారం గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో రూ.34,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి తర్వాత ‘సముద్రం నుంచి సమృద్ధిదాకా’కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘విశ్వబంధు భావనతో భారత్ దూసుకుపోతోంది. అందరితో మిత్రత్వం, సత్సంబంధాలు కోరుకునే, కొనసాగించే భారత్‌కు ప్రపంచంలో ప్రత్యేకంగా శత్రువంటూ ఎవరూ లేరనే చెప్పాలి. కానీ ఇతర దేశాలపై ఆధారపడటం అనే వైఖరి మనకు పెద్ద శత్రువులా తయారైంది. ఇలా మనపై పైచేయి సాధిస్తున్న పరా«దీనతను మనందరం కలసికట్టుగా ఓడిద్దాం. విదేశాలపై అతిగా ఆధారపడితే అంతగా స్వదేశం విఫలమవుతుంది. విశ్వశాంతి, శ్రేయస్సు, సుస్థిరత కోసం పాటుపడే దేశం కచి్చతంగా స్వయంసమృద్ధిని సాధించాలి. స్వావలంబన సాధించకుండా ఇతర దేశాలపై ఆధారపడితే జాతీయ ఆత్మగౌరవం అనేది దెబ్బతింటుంది’’అని మోదీ అన్నారు. 140 కోట్ల ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టబోం ‘‘140 కోట్ల ప్రజల భవిష్యత్తును విదేశీ శక్తుల చేతుల్లో పెట్టబోం. విదేశీ పరా«దీనత అనేది మన జాతీయాభివృద్ధిని నిర్దేశిస్తుందంటే అస్సలు అంగీకరించబోం. మన భావితరాల భవిష్యత్తును ఇతరుల చేతికి అందించబోం. ఏకంగా 140 కోట్ల జనాభా ఉన్న దేశం ఇతర దేశాలపై ఆధారపడితే జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లే లెక్క. ఒక సామెతలాగా చెప్పాలంటే 100 సమస్యలకు ఒకే పరిష్కారం ఉన్నట్లు.. భారత్ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. అదే ఆత్మనిర్భరత’’అని మోదీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌పై మళ్లీ విమర్శల నిప్పులు పనిలోపనిగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీలపై, గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ‘‘భారత్‌లో నిగూఢంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసే ప్రయత్నాలు స్వాతంత్య్రం వచ్చాక ఆరేడు దశాబ్దాలదాకా జరగనేలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెంచిపోషించిన లైసెన్స్‌రాజ్ వ్యవస్థలో దేశాభివృద్ధి పడకేసింది. లైసెన్స్–కోటా రాజ్యంలో భారత్ విశ్వవిపణిలోకి అడుగుపెట్టలేక ఒంటరిగా మిగిలిపోయింది. ఆ తర్వాత ప్రపంచీకరణ శకం మొదలైనప్పుడు గత ప్రభుత్వాలు తప్పిదాలే చేశాయి. దేశావసరాలు తీర్చుకునేందుకు స్వావలంబన సాధించాల్సిందిపోయి కేవలం దిగుమతులపైనే దృష్టిపెట్టాయి. దీంతో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు సర్వసాధారణమయ్యాయి. తప్పుడు విధానపర నిర్ణయాల కారణంగా ప్రభ కోల్పోయిన రంగాల్లో నౌకల తయారీ పరిశ్రమ కీలకమైంది. గతంలో భారతీయ తయారీ నౌకలనే మనం ఉపయోగించేవాళ్లం. ఇప్పుడు విదేశాలపై ఆధారపడుతున్నాం. అప్పట్లో ఎగుమతిదిగుమతి సరుకుల్లో 40 శాతం భారతీయ నౌకల్లో జరిగేవి. ఇప్పుడు కేవలం 5 శాతం నౌకల్లో జరుగుతోంది. మిగతావన్నీ విదేశీ నౌకలే. అందుకే ఏటా ఏకంగా రూ.6 లక్షల కోట్లను వినియోగ ఖర్చుల కింద విదేశీ నౌకల కంపెనీలకు చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఏడు దశాబ్దాల్లో ఎంత చెల్లించామో లెక్కేసుకోండి. ఇంత సొమ్ము విదేశాలకు వెళ్లడంతో ఆయా దేశాల్లో ఉపాధి పెరిగింది. ఇదే సొమ్ములో కొంత అయినా దేశీయంగా పెట్టుబడిగా మార్చి ఉంటే ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగేవో ఊహించుకోండి. దేశీయ నౌకలనే వినియోగించి ఉంటే ఏటా భారత్ లక్షల కోట్ల ఆదాయాన్ని చవిచూసేది’’అని మోదీ వివరించారు. షిప్ అయినా చిప్ అయినా ఇక్కడిదై ఉండాలిచిప్(సెమీకండక్టర్) కావొచ్చు షిప్ కావొచ్చు. ఏదైనా భారత్‌లోనే తయారుకావాలి. వాటిని మనమే తయారుచేద్దాం. సముద్రవిపణిలో అగ్రగామిగా మారితే అంతర్జాతీయంగా పరపతి ఇనుమడిస్తుంది. ఇందుకు దేశీయనౌకాశ్రయాలే వెన్నుముక. దేశీయ సముద్రనౌకారంగం నవతరం సంస్కరణల దిశగా దూసుకుపోతోంది. పలు రకాల డాక్యుమెంట్లు, పత్రాల సమర్పణ, తనిఖీ వంటి సుదీర్ఘ ప్రక్రియకు దేశంలోని అన్ని ప్రధాన నౌకాశ్రయాల్లో చెల్లుచీటీ రాసేశాం. దీంతో ఒకే దేశం–ఒకే డాక్యుమెంట్, ఒకే దేశం–ఒకే నౌకాశ్రయం విధానంలో వాణిజ్యం, వ్యాపారం సులభతరమవుతుంది’’అని అన్నారు. రుణాలు ఇక సులువు ‘‘నౌకల తయారీ సంస్థలకు ఇప్పుడు సులభంగా రుణాలు లభిస్తున్నాయి. తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంక్‌ల నుంచి రుణాలను పొందగల్గుతున్నాయి. మౌలికవసతుల ఫైనాన్సింగ్ సదుపాయం ఇప్పుడు అన్ని నౌకలతయారీ సంస్థలకు అందుబాటులోకి వచ్చింది. మరో మూడు కీలక పథకాలపై ఎన్డీఏ సర్కార్ దృష్టిసారించింది. భారత్‌ను సముద్రయాన శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. రుణలభ్యతతో నూతన సాంకేతికత, ఆధునిక డిజైన్, అత్యున్నత ప్రమాణాలను సంస్థలు అందిపుచ్చుకుంటాయి. త్వరలో ఈ రంగంలో ప్రభుత్వం రూ.70,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది’’అని మోదీ అన్నారు. కార్యక్రమాల్లో భాగంగా రూ.7,870 కోట్ల విలువైన సముద్రయానసంబంధ అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. వీటికితోడు గుజరాత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోయే రూ.26,354 కోట్ల విలువైన ఇతర ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ మోదీ పాల్గొన్నారు. అహ్మదాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామికప్రాంతమైన ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌లో హెలికాప్టర్లో విహంగవీక్షణం చేశారు. అహ్మదాబాద్‌లోని లోథల్‌లో భారతీయ సముద్రయాన వారసత్వాన్ని చాటే నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మాణపనులనూ మోదీ పర్యవేక్షించారు. అంతకుముందు ఆయన భావ్‌నగర్‌కు చేరుకోగానే రోడ్‌షోలో పాల్గొన్నారు. -
‘ట్రంప్ H1B బాంబ్’పై భారత్ స్పందన
భారత్‌పై 50 శాతం సుంకాలతో టారిఫ్ బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా H1B వీసా ఫీజు పెంపు నిర్ణయంతో మరో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ..భారతీయ ఐటీ ఉద్యోగులు, అమెరికాలో పనిచేస్తున్న వలస కార్మికులు, విద్యార్థులపై ఈ నిర్ణయం ఆర్థిక-మానవీయ ఒత్తిడిని కలిగించే అవకాశం లేకపోలేదు అని పేర్కొంది. అమెరికా హెచ్-1బీ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నట్లు.. అధ్యయంన చేస్తున్నట్లు భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అంతేకాదు..నిపుణుల రాకపోకల వల్ల ప్రతిభావంతుల మార్పిడి (skilled talent exchange)తో ఇంతకాలం ఇరు దేశాలకూ పరస్పల లబ్ధి చేకూరింది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక అభివృద్ధికి కీలకంగా ఉంటూ వచ్చిందని, కాబట్టి ఈ నిర్ణయం ఇరుదేశాలనూ ప్రభావితం చేసే అంశమేనని పేర్కొంది. అగ్రరాజ్యం నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది. మానవీయ కోణంలో పరిశీలించి ఈ సమస్యపై చర్చించి పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. 90వ దశకంలో ఇతర దేశాల నుంచి స్కిల్ ఉన్న ఉద్యోగులను అమెరికాకు రప్పించే ఉద్దేంతో హెచ్-1బీ వీసా తెచ్చారు. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి అక్కడి టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను ఈ వీసా ద్వారా రప్పించుకుంటున్నాయి. ప్రస్తుతం.. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. అలా.. అక్కడ ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కూడా. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటి దరఖాస్తులపై ఏడాది అడ్మినిస్ట్రేషన్ ఫీజును ఏకంగా లక్ష డాలర్లుగా(రూ. 88 లక్షలకు పైగా) నిర్ణయిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి అంతేసి చెల్లించాల్సి వస్తుంది. 2024 లెక్కల ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం ఈ రెండు దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. -
H-1B visas: టీసీఎస్వే ఎక్కువ..
అమెరికాలో అత్యధిక నైపుణ్యమున్న విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్ -1బీ వీసాలకు సంబంధించి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025లో రెండవ అతిపెద్ద గ్రహీతగా అవతరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,500కి పైగా ఆమోదాలతో అమెజాన్ (10,044) తర్వాత స్థానంలో నిలిచింది.2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ తర్వాత అత్యధిక హెచ్ 1బీ వీసా అప్రూవల్స్ పొందిన కంపెనీల్లో మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), ఆపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951) ఉన్నాయి.అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులను గణనీయంగా ప్రభావితం చేసే చర్యను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్నారు. వార్షిక హెచ్ -1 బి వీసా ఫీజు 100,000 డాలర్లకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.2025 సెప్టెంబర్ 21 తర్వాత దాఖలు చేసిన పిటిషన్లకు ఈ పరిమితి వర్తిస్తుంది. పొడిగించకపోతే 12 నెలల తర్వాత ముగుస్తుంది. "ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు హెచ్-1బీ వ్యవస్థను దుర్వినియోగం చేశాయి. కంప్యూటర్ సంబంధిత రంగాలలో అమెరికన్ ఉద్యోగులకు గణనీయంగా హాని కలిగిస్తున్నాయి" అని పేర్కొంటూ ఐటీ అవుట్ సోర్సింగ్ కంపెనీలు హెచ్-1బీ ఆమోదాలపై ఎంతలా ఆధిపత్యం చెలాయించాయో ప్రభుత్వ ప్రకటన హైలైట్ చేసింది. -
H-1B వీసా ఉద్యోగి ఆరేళ్లు అమెరికాలో పనిచేస్తే లక్షల డాలర్లు ఖర్చు
-
H-1B Visa: కఠిన నిర్ణయంపై ట్రంప్ అలా.. మోదీ ఇలా!
హెచ్-1బీ వీసాల (H-1B visa applications) దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం లక్షలాది హెచ్1బీ వీసా ఉద్యోగులను కలవరపెడుతోంది. కంపెనీలు దరఖాస్తుల సంఖ్య తగ్గించవచ్చని.. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని.. ఇలా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్ 20న సంతకం చేసిన ప్రోక్లమేషన్(ప్రభుత్వ ప్రకటన) ప్రకారం.. హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులు.. కొత్తగా వీసా పొందేవారు.. వీసా పొడిగించుకునేవాళ్లు.. వీరందరూ ప్రతి సంవత్సరం 1,00,000 డాలర్లు చెల్లించాల్సిందే. గతంలో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫీజు కేవలం $1,500 డాలర్లు మాత్రమే ఉండేది..సెప్టెంబర్ 21 నుంచి, ఒక్కో హెచ్1బీ ఉద్యోగికి $100,000 (సుమారు ₹83 లక్షలు) చెల్లించని పక్షంలో అమెరికాలోకి ప్రవేశం నిషేధం విధించబడుతుంది. ఈ మార్పు ఆదివారం ఉదయం 12:01 AM EDT (భారత కాలమానం ప్రకారం 9:30 AM IST) నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిబంధన 12 నెలల పాటు అమలులో ఉంటుంది, అయితే అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థల సిఫారసు మేరకు దీన్ని పొడిగించే అవకాశం ఉంది. అయితే.. H-1B వీసా నిషేధ అంశంలో కొన్ని మినహాయింపులకు అవకాశం లేకపోలేదు. కానీ, ఇవి సర్వసాధారణంగా అందరికీ వర్తించవు, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (Department of Homeland Security) తమ స్వంత నిర్ణయాధికారంలో మాత్రమే ఇవి వర్తిస్తాయని సమాచారం. మినహాయింపులు వీళ్లకే!అత్యవసర విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పని చేసేవారు.. జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించని వాళ్లకు మినహాయింపు దక్కవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.. అలాగే.. అమెరికాలో కీలక రంగాల్లో పనిచేస్తున్న కంపెనీల ఉద్యోగులు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(R&D), ఆరోగ్యం, టెక్నాలజీ, డిఫెన్స్ వంటి రంగాల్లో పనిచేసే సంస్థల ఉద్యోగులకు మినహాయింపు దక్కే అవకాశం లేకపోలేదు. వీటితో పాటు జాతీయ ప్రయోజనాలకు అవసరమైన పరిశ్రమలు.. ఆరోగ్య సంరక్షణ, సైబర్ భద్రత, AI, బయోటెక్, ఎనర్జీ రంగాల విదేశీ ఉద్యోగులకూ ఆ మినహాయింపు ఉండొచ్చు.ఈ మినహాయింపులు సదరు సంస్థలు స్వయంగానో లేదంటే వాళ్లు వ్యక్తిగతంగానూ దరఖాస్తు చేసినా పరిశీలించే అవకాశం ఉంది. అయితే, అనుమతి ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ(హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ) నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.ట్రంప్ ఏమన్నారంటే..అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతను దృష్టిలోపెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మోదీ ఏమన్నారంటే.. ట్రంప్ నిర్ణయంపై భారత ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరని, కానీ.. విదేశాలపై ఆధారపడటమే మన ప్రధాన శత్రువు అని ఇవాళ జరిగిన గుజరాత్ సభలో అన్నారు. ‘నేడు భారత్ ‘‘విశ్వబంధు’’ స్ఫూర్తితో ముందుకుసాగుతోంది. ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువులు ఎవరూ లేరు. మన అతిపెద్ద శత్రువు ఇతరదేశాలపై ఆధారపడటమే. దీన్ని మనం ఓడించాలి. విదేశాలపై ఎక్కువగా ఆధారపడితే.. దేశ అభివృద్ధి విఫలమవుతుంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం అత్యధిక జనాభా కలిగిన దేశం ఆత్మనిర్భర్‌గా మారాలి. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. భారతదేశ అభివృద్ధిని, భావితరాలను పణంగా పెట్టలేం’ అని మోదీ పేర్కొన్నారు.అంత ఫీజు చెల్లించకపోతే..హెచ్1బీ వీసా ఫీజు చెల్లించకపోతే.. అమెరికాలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తారు. ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తారు. యూఎస్సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) వీసాను రద్దు చేయొచ్చు. కంపెనీలు గనుక ఆ ఫీజు చెల్లించలేకపోతే.. ఉద్యోగి అమెరికాలో కొనసాగలేరు. అంటే ఉద్యోగం పోతుందన్నమాట. దొడ్డిదారిన లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే.. అక్రమ వలసదారుడిగా పరిగణించబడే ప్రమాదం ఉంది. ఫీజు లేకుండా అమెరికాలో ఉండటం నేరంగా పరిగణించబడుతుంది. డిపోర్టేషన్ కూడా జరగొచ్చు. -
ఒక్కసారిగా యూఎస్‌కు విమాన ఛార్జీలు పెంపు
భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా యూఎస్‌కు రాకపోకలు సాగించే విమాన సర్వీసుల టికెట్ ధరలను ఆయా విమానయాన కంపెనీలు ఉన్నట్టుండి పెంచినట్లు తెలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సర్వీసులు అందిస్తున్న మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్.. వంటి కంపెనీలు యూఎస్ నుంచి హెచ్-1బీ, హెచ్-4 వీసాలు కలిగి విదేశాల్లో సర్వీసులు అందిస్తున్న తమ ఉద్యోగులను వెంటనే అమెరికా రావాలని అడ్వైజరీలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి యూఎస్‌కు సర్వీసులు నడుపుతున్న విమానయాన కంపెనీలు టికెట్ ధరలను పెంచినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి.యూఎస్ వెలుపల ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాలు కలిగిన కంపెనీ ఉద్యోగులను ఆయా సంస్థలు సెప్టెంబర్ 21, 2025లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరాయి. దాంతో భారత్ వంటి దేశాల్లో అమెరికా వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. రేపటిలోపు ట్రంప్ విధించిన గడువు ముగుస్తుండడంతో ఉద్యోగులు అత్యవసరంగా యూఎస్‌కు పయణమవుతున్నారు. ఇదే అదనుగా విమానయాన కంపెనీలు టికెట్ ఫేర్‌ను పెంచుతున్నాయి.డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై 1,00,000 అమెరికా డాలర్ల రుసుము విధిస్తూ ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అమెరికాలోనే ఉద్యోగులు తమ పనిని కొనసాగించాలని కోరుతూ, వెంటనే యూఎస్‌కు రావాలని మైక్రోసాఫ్ట్‌తోపాటు ఇతర టెక్ కంపెనీలు తమ సూచిస్తున్నాయి. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొందరు చెబుతున్నారు. సాధారణంగా హెచ్1-బీ వీసాలు లాటరీపై ఆధారపడతుంది. అందుకు నామినల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా జారీ అయితే మాత్రం వార్షిక రుసుము పే చేయాలి. ఈ ఫీజునే ట్రంప్ ప్రభుత్వం 1 లక్ష డాలర్లకు పెంచింది. ఇప్పటివరకు ఇది 4,000 డాలర్ల వరకు ఉండేది. ఈ రుసుమును సాధారణంగా కంపెనీలే భరిస్తాయి. దీని పెంపు కంపెనీలకు భారం కానుంది.ఇదీ చదవండి: ‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్ రావాలి’ -
‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్ రావాలి’
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సర్వీసులు అందిస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందిన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్.. వంటి కంపెనీలు యూఎస్ నుంచి వెళ్లి విదేశాల్లో సర్వీసులు అందిస్తున్న తమ ఉద్యోగులకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. యూఎస్ వెలుపల ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాలు కలిగిన తమ ఉద్యోగులను సెప్టెంబర్ 21, 2025లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై 1,00,000 అమెరికా డాలర్ల రుసుము విధిస్తూ ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అమెరికాలోనే ఉద్యోగులు తమ పనిని కొనసాగించాలని కోరుతూ, వెంటనే యూఎస్‌కు రావాలని మైక్రోసాఫ్ట్‌తోపాటు ఇతర టెక్ కంపెనీలు తమ సూచిస్తున్నాయి. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపిస్తున్నాయి.ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొందరు చెబుతున్నారు. సాధారణంగా హెచ్1-బీ వీసాలు లాటరీపై ఆధారపడతుంది. అందుకు నామినల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా జారీ అయితే మాత్రం వార్షిక రుసుము పే చేయాలి. ఈ ఫీజునే ట్రంప్ ప్రభుత్వం 1 లక్ష డాలర్లకు పెంచింది. ఇప్పటివరకు ఇది 4,000 డాలర్ల వరకు ఉండేది. ఈ రుసుమును సాధారణంగా కంపెనీలే భరిస్తాయి. దీని పెంపు కంపెనీలకు భారం కానుంది.అమెరికా స్థానికులకు ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు ఈ చర్యలు తోడ్పడుతాయని వైట్ హౌస్ పేర్కొంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తోపాటు ఇతర టెక్ కంపెనీలు కూడా H-1B వీసా నిబంధనలలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఉద్యోగులకు ఈ సూచనలు జారీ చేస్తున్నాయి. హెచ్-1బీ వీసాపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో జుకర్‌బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ వ్యవహారంపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ..‘అభివృద్ధి చెందుతున్న విధాన మార్పును అంచనా వేస్తున్నందున ఇది ముందు జాగ్రత్త చర్యగా భావించాలి. మా ఉద్యోగుల భద్రతను నిర్ధారించడం అత్యంత ప్రాధాన్యతగా ఉంది’ అన్నారు.ట్రంప్ తీసుకొచ్చిన ఈ నిబంధన సెప్టెంబరు 21 నుంచి వర్తించనుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి హెచ్-1బీ వీసాదారులు ఎవరైనా అమెరికాలోకి ప్రవేశించాలన్నా.. లేదా ప్రవేశించే ప్రయత్నాల్లో భాగంగా ఈ వీసాకు దరఖాస్తు చేసుకున్నా లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
H-1B వీసాలపై ట్రంప్ పిడుగు
-
భారతీయులకు ఘోర అవమానం.. యూఎస్ హోవార్డ్ అనుచిత వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పనికి రాని వ్యక్తులు అమెరికాలోకి రాకుండా ఆపేయాల్సిందే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన భారతీయులనే టార్గెట్ చేసి ఇలా అవమానించారని కామెంట్స్ చేస్తున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా (H1-B)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక ఫీజును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం భారత్‌తో పాటు, చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది.ఈ సందర్భంగా ప్రతీ హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో, హెవార్డ్ మాట్లాడుతూ..‘ఐటీ కంపెనీలు అమెరికన్లనే నియమించుకోవాలి. పనికి రాని వ్యక్తులను అమెరికాలోకి రావడాన్ని ఆపేయాల్సిందే. కేవలం అత్యుత్తమైన, విలువైన వ్యక్తులు మాత్రమే అమెరికాలోకి రావాలి. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.“Stop this nonsense of letting people come to America on visas for free. Only valuable people are welcome,” says US Commerce Secretary Howard Lutnick hiking H1B visa fee pic.twitter.com/SwGh3D9sih— Shashank Mattoo (@MattooShashank) September 19, 2025దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హెచ్1బీ వీసాలపై భారతీయులే ఎక్కువ సంఖ్యలో అమెరికాకు వెళ్తారు. ఈ నేపథ్యంలో హోవార్డ్.. భారతీయులను ఉద్దేశించే ఇలా కామెంట్స్ చేశారని, అవమానించే విధంగా మాట్లాడరని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో హెచ్1బీ వీసా కలిగి ఉన్న వారి సంఖ్య 28లక్షలుగా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. హెచ్1బీ వీసా ద్వారా.. ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. అమెరికా ప్రతీ ఏడాది 85వేల వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. -
హెచ్1 బీ వీసా.. భారతీయులకు బిగ్ షాక్
-
అమెరికా వీసా, గ్రీన్‌కార్డులపై కొత్త రూల్స్.. ట్రంప్ బిగ్ షాక్!
వాష్టింగన్: వీసాలు, గ్రీన్ కార్డ్ విషయంలో అమెరికా మరో బాంబు పేల్చింది. అమెరికాలో హెచ్-1బీ(H-1B) వీసా, గ్రీన్ కార్డ్ రూల్స్ మొత్తం మార్చబోతున్నట్టు యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత గ్రీన్ కార్డ్ వ్యవస్థ పెద్ద కుంభకోణంగా మారిపోయిందని ఆరోపించారు. దీంతో, ఇకపై అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఊహించిన షాక్ తగిలింది.అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో హెచ్-1బీ(H-1B) వీసా, గ్రీన్ కార్డ్ అమలు విషయంలో కొత్త రూల్స్ తీసుకువస్తున్నాం. ప్రస్తుత లాటరీ పద్ధతిని రద్దు చేయబోతున్నాం. కేవలం నైపుణ్యం, వేతనం ఆధారంగా వీసాలు జారీ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుత H-1B వీసా వ్యవస్థ విదేశీ కార్మికులను అమెరికన్ ఉద్యోగ అవకాశాలను భర్తీ చేయడానికి అనుమతించే ఒక స్కాంగా మారిపోయింది. అమెరికన్ కార్మికులను నియమించడమే మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. గ్రీన్ కార్డ్‌ను సైతం మార్చబోతున్నాం. ప్రస్తుత గ్రీన్ కార్డ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి.The current H1B visa system is a scam that lets foreign workers fill American job opportunities. Hiring American workers should be the priority of all great American businesses. Now is the time to hire American. pic.twitter.com/l27HEhF7C3— Howard Lutnick (@howardlutnick) August 26, 2025ప్రస్తుతం ఉన్న లాటరీ వ్యవస్థ ద్వారా అర్హత లేని, తక్కువ వేతనం పొందే వ్యక్తులకు కూడా గ్రీన్ కార్డ్ లభిస్తోందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. సగటు అమెరికన్ వార్షిక ఆదాయం $75,000 ఉండగా, గ్రీన్ కార్డ్ హోల్డర్ సగటు వార్షిక ఆదాయం $66,000 మాత్రమే ఉంది. ఇది తక్కువ సంపాదన ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడమే అవుతుంది అంటూ లాజిక్ చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, తాము ఈ కొత్త సంస్కరణలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లాలనుకునే వారిపై కొత్త విధానం ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మార్పులు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.🚨 BREAKING: Howard Lutnick reveals he will now seek to have the United States federal government OWN a portion of the patents currently owned by universities as a result of new inventions."If we give them the money, don't you think it's fair the USA and taxpayers who funded it… pic.twitter.com/uFKGdj5rV1— Eric Daugherty (@EricLDaugh) August 26, 2025ఇదిలా ఉండగా.. ఈ కొత్త విధానంలో H-1B వీసాలను ఎక్కువ జీతాలు ఉన్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. దీంతోపాటు, ట్రంప్ ప్రభుత్వం 'గోల్డ్ కార్డ్' అనే కొత్త వీసా ప్లాన్ కూడా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికాలో $5 మిలియన్లు పెట్టుబడి పెట్టే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పిస్తారు. ఈ కార్డ్‌కు అప్లై చూసుకోడానికి దాదాపు 2,50,000 మంది దరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నారని, దీని వల్ల $1.25 ట్రిలియన్ల పెట్టుబడులు వస్తాయని లుట్నిక్ తెలిపారు. -
హెచ్–1బీ, పౌరసత్వం గగన కుసుమమే!
వాషింగ్టన్: నిపుణులైన విదేశీ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియను ట్రంప్ సర్కారు సమూలంగా ప్రక్షాళన చేయనుంది. అమెరికా పౌరసత్వ పరీక్షలను అత్యంత కఠినతరం చేయనుంది. న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్∙డైరెక్టర్ జోసెఫ్ పలు అంశాలపై మాట్లాడారు. ఇకపై దేశీ ఉద్యోగులకు అత్యధిక వేతానాలిచ్చే అమెరికా కంపెనీలను మాత్రమే పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తామన్నారు. పలు అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను హెచ్–1బీ వీసాలపై రప్పించుకుని అల్ప వేతనాలకు నియమించుకుంటూ స్థానికుల ఉపాధికి గండి కొడుతున్నాయంటూ అధికార రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులు చాలాకాలంగా గగ్గోలు పెడుతుండటం తెలిసిందే. ఈ ఆందోళనలకు ట్రంప్ సర్కారు తాజా నిర్ణయాలు చెక్ పెడతాయని భావిస్తున్నారు. అయితే వ్యాపార వర్గాలు, కంపెనీలకు మాత్రం ఇది మింగుడు పడకపోవచ్చని అమెరికా మీడియా కోడై కూస్తోంది. విదేశీయుల కోసం అనుసరిస్తున్న పౌరసత్వ పరీక్ష మరీ సులభతరంగా ఉందని జోసెఫ్ ఆక్షేపించారు. ‘‘పరీక్షలో తేలికపాటి ప్రశ్నలున్నాయి. ఇది చట్టస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇకపై కఠిన ప్రశ్నలతో పరీక్షను మరింత పకడ్బందీగా మారుస్తాం’’అని స్పష్టం చేశారు. -
యూఎస్ కల.. వీసా ఎలా?
వీసా వస్తుందో లేదో..?నాకు అమెరికా యూనివర్సిటీలో సీటు ఖరారైంది. అప్పులు చేసి అన్ని విధాలుగా సిద్ధమయ్యా. ఆగస్టులో వెళ్లాలి. కానీ ఇంతవరకూ వీసా ఇంటర్వ్యూకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో మొదటి సెమిస్టర్‌కు వెళ్లగలనా? లేదా అనే భయం వెంటాడుతోంది. – శశాంక్ ఇరుకుపాటి (అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన మహబూబ్‌నగర్ విద్యార్థి)సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు భారతీయ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలవర పెడుతున్నాయి. స్టూడెంట్ వీసాలకు ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని కాన్సులేట్ అధికారులను అగ్రదేశం ఆదేశించడం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న వారిని గందరగోళానికి గురి చేస్తోంది. తమ దేశంలోని కొన్ని యూనివర్సిటీల్లో ఉగ్రవాద సమర్థనీయ చర్యలున్నాయని అమెరికా ప్రభుత్వం అనుమానిస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అంటున్నారు. అమెరికా రావాలనుకునే ప్రతి విద్యార్థి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని అధికారులకు అమెరికా ఆదేశాలు ఇచ్చింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయోనని అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ వీసా కోసం సిద్ధమైతే అమెరికా ప్రభుత్వం నుంచి రోజుకో నిర్ణయం వెలువడుతోందని కంగారు పడుతున్నారు. అయితే అమెరికా నిర్ణయాలు భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది కల్గించవని ప్రవాస భారతీయులు అంటున్నారు. కానీ అమెరికా ఈ ఏడాది 41 శాతం విద్యార్థి వీసాలను తిరస్కరించింది. ఇందులో భారతీయుల వీసాలు 38 శాతం ఉండటం గమనార్హం. కాగా ఇప్పటికే వీసా ఇంటర్వ్యూకు తేదీ ఖరారైన వారిని అనుమతించాలని అమెరికా సూచించడం ఆయా విద్యార్థులకు ఊరటనిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికి 6 వేల మందికి తిరస్కరణ: భారత్ నుంచి ప్రతి ఏటా 7 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. ఇందులో 3 లక్షల మంది అమెరికా దేశానికే వెళ్తున్నారు. చదువు కోసం ఆ దేశానికి మన విద్యార్థులు ప్రతి ఏటా రూ.లక్ష కోట్లు చెల్లిస్తున్నారని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికన్ యూనివర్సిటీలు ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే సెమిస్టర్లకు రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. మనవారు మొదటి సెమిస్టరే ఎంపిక చేసుకుంటారు. దీంతో ఆరు నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నిస్తారు. విద్యార్థులకు ఎఫ్1 వీసా ఇస్తారు. దీన్ని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అంటారు. అమెరికాలో ఫుల్ టైం విద్యకు ఇది అవకాశం కల్పిస్తుంది. కాగా 2023లో 1.03 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు ఇచ్చినట్టు బ్యూరో ఆఫ్ కాన్సులేట్ అఫైర్స్ నెలవారీ నివేదిక పేర్కొంది. అయితే 2023–24లో ఎఫ్1 వీసాలను భారీగా తగ్గించారు. ప్రపంచ వ్యాప్తంగా 6.79 లక్షల మంది దరఖాస్తు చేస్తే ఇందులో 2.79 లక్షలు అప్లికేషన్లను అమెరికన్ కాన్సులేట్లు తిరస్కరించాయి. 2024 తొలి 9 నెలల్లోనే భారతీయ విద్యార్థులు 38 శాతం మందికి అమెరికా వీసాలు తిరస్కరించింది. ఈ ఏడాది తొలి సెమిస్టర్ కోసం దాదాపు 78 వేల మంది వీసా కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 24 వేల మందికి ఇంటర్వ్యూ తేదీలు వచ్చాయి. కొందరి ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో 6 వేల మంది వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యారు. ఇక 54 వేలమంది ఇంటర్వ్యూ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిని అడ్డుకునేందుకే.. అమెరికన్ కాన్సులేట్ వర్గాలు, కన్సల్టెన్సీ సంస్థలు, ప్రవాస భారతీయుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. వీసాల విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నదే అమెరికా ఆలోచన. ఉద్రిక్తతతలు, అసాంఘిక కార్యకలాపాలు, సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్న వారిని తమ దేశంలోకి రాకుండా చేయాలని ఆ దేశం భావిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలిస్తోంది. అమెరికా వెళ్ళే ముందు వారు ఎవరిని సంప్రదిస్తున్నారు? వారి నేపథ్యం ఏమిటి? ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఎవరితో ఉండాలనే ఆలోచనలో ఉన్నారు? ఏ కన్సల్టెన్సీని ఎంపిక చేసుకుంటున్నారు? ఆ కన్సల్టెన్సీ ద్వారా గతంలో ఎంతమందిని పంపారు? వాళ్ళ నేపథ్యం ఏమిటి? ఇలాంటి వివరాలు అమెరికా కన్సల్టెన్సీ వర్గాలు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న తమ స్నేహితులు, బంధువులకు..అనుమానించదగ్గ వ్యక్తులు, రెడ్ లిస్ట్‌లో ఉన్న దేశాల వారితో సంబంధం ఉంటే మరింత లోతుగా పరిశీలించే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు ఇబ్బంది లేదు! ప్రస్తుతానికి భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులెదురయ్యే అవకాశం లేదని కన్సల్టెన్సీల ప్రతినిధులు, విదేశీ విద్యకు సంబంధించిన నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి అమెరికా కొన్ని దేశాలపైనే దృష్టి పెట్టిందని అంటున్నారు. తమ దేశానికి వస్తున్న 41 దేశాల విద్యార్థులను కేటగిరీలుగా విభజించింది. రెడ్ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న దేశాలను చేర్చారు. ఇంకా చెప్పాలంటే ఇస్లాం వాదంతో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఆప్ఘనిస్తాన్, ఇరాన్, లిబియాతో పాటు భూటాన్, క్యూబా సహా 11 దేశాలున్నాయి. ఉగ్రవాద ప్రేరేపిత, ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలతో వాణిజ్య మైత్రి కొనసాగిస్తున్న 10 దేశాలను ఆరంజ్ కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలో పాకిస్తాన్, రష్యా సహా పది దేశాలున్నాయి. వీటిపై కొంత సమయం తీసుకుని ఆంక్షలు విధిస్తారు. వైరి పక్ష దేశాలతో సంబంధాలున్నప్పటికీ, హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశాలను ఎల్లో కేటగిరీలో చేర్చారు. వీటిపై దశల వారీగా ఆంక్షలు పెట్టాలని భావిస్తున్నారు. ఇక భారత్ మిత్ర పక్షంలోనే ఉండటం వల్ల.. ఇతరత్రా కారణాలతో తప్ప ఇక్కడి విద్యార్థులకు ఈ తరహా ఇబ్బందులేవీ లేనట్టేనని అంటున్నారు. అమెరికా స్నేహితులతో జాగ్రత్త అమెరికా రావాలనుకునే వాళ్ళు ముందుగా సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అక్కౌంట్స్ ఉన్నాయనేది చూసుకోవాలి. అనుమానం ఉన్న వ్యక్తులతో ఎలాంటి సామాజిక సంబంధం ఉన్నా, వీసా విషయంలో ఇబ్బందులు తప్పవు. సాధారణంగా అమెరికాలో ఉండే స్నేహితులను మనవాళ్ళు నమ్ముతారు. అయితే వాళ్ళ నేపథ్యం, వాళ్ళు అమెరికాలో ఎలా ఉంటున్నారనేది కూడా ముఖ్యమే. – సిరిమళ్ళ వీరేంద్ర (అమెరికాలో ఎంఎస్ చేస్తున్న భారతీయ విద్యార్థి) తప్పుడు సర్టిఫికెట్లు, పార్ట్టైమ్తోనే ఇబ్బంది వీసాలు పూర్తిగా ఆపేయలేదు. వ్యక్తిగత వివరాలు, వెళ్ళే వర్సిటీ గురించి వాకబు చేయమని మాత్రమే అమెరికా ఆదేశించింది. భారతీయుల పట్ల అమెరికాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కాకపోతే తప్పుడు ధ్రువపత్రాలతో వెళ్ళాలనుకున్నా, అక్కడికెళ్ళి పార్ట్‌టైం ఉద్యోగం చేస్తామన్నా, ఆ దిశగా లావాదేవీలున్నా వీసాకు ఇబ్బందులెదురవుతాయి. – జయవర్థన్ ఏకాటి (కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకుడు) -
ఇండియన్ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు!
వాషింగ్టన్: అమెరికాను మరోసారి గొప్పదేశంగా మారుస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్ణయాలతో అమెరికాలో ఉంటున్న భారతీయుల బెంబేలెత్తిపోతున్నారు. ఎవరిని ఎప్పుడు వెళ్లగొడతారో తెలియక హడలిపోతున్నారు. అక్రమ వలసదారుల పేరిట 300 మంది భారతీయులను ఇటీవల అమెరికా నుంచి వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. అమెరికాలోకి భారతీయులు అక్రమంగా అడుగుపెట్టడానికి ఇండియన్ ట్రావెల్ ఏజెంట్లే ధనదాహమే కారణమని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అందుకే సదరు ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతోంది. ‘‘అమెరికాకు భారతీయులను అక్రమంగా పంపిస్తున్న ఏజెంట్లను గుర్తించే పనిలో మిషన్ ఇండియాకు సంబంధించిన కాన్సులర్ అఫైర్స్ అండ్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది నిమగ్నమయ్యారు. మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం’’అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్రమాలకు పాల్పడుతున్న ఇండియన్ ట్రావెల్ ఏజెన్సీల యజమానులు, ప్రతినిధులపై వీసా ఆంక్షలు విధించడానికి చర్యలు చేపట్టామని స్పష్టంచేసింది. ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన వలసలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదని తేలి్చచెప్పింది. మనుషుల స్మగ్లింగ్ అనేది పెద్ద నేరమని వెల్లడించింది. అమెరికాకు రావాలనుకుంటే ముందు తమ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని విదేశీయులకు సూచించింది. చట్టాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అక్రమంగా వలస వచ్చినవారికే కాకుండా.. అలా రావడానికి సహకరించిన వారికి కూడా శిక్షలు ఉంటాయని ఉద్ఘాటించింది. హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి మరోవైపు హెచ్–1బీ వీసాలపై అమెరికాలోని అతివాదుల దృష్టి పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి వీసాలను ఎందుకు రద్దు చేయకూడదని అధికార డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారు లారా ఎలిజబెత్ లూమర్ ప్రశ్నించారు. చట్టపరమైన ఈ తాత్కాలిక వర్క్ వీసాలతో భారతీయులు ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. హెచ్–1బీ వీసాలను రద్దు చేయాలంటూ ట్రంప్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ వాదనలు వినిపిస్తున్నారు. ‘‘అక్రమ వలసదారులను బయటకు పంపిస్తున్నాం, బాగానే ఉంది.. మరి హెచ్–1బీ వీసాదారుల సంగతేమిటి?’’అని లారా ఎలిజబెత్ లూమర్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘హెచ్–1బీ వీసాల కుంభకోణాన్ని ట్రంప్ ప్రభుత్వం అడ్డుకోకపోతే కోట్లాది మంది అమెరికన్లకు అసంతృప్తే మిగులుంది’’అని మరో పౌరుడు పోస్టు చేశాడు. గత 30 ఏళ్లుగా కుంభకోణం జరుగుతోందని ఆరోపించాడు. టెక్నాలజీ కంపెనీలు ఈ స్కామ్‌ను అడ్డం పెట్టుకొని వందల కోట్ల డాలర్లు ఆర్జించాయని విమర్శించాడు. అవే కంపెనీలు 2020లో ట్రంప్‌ను ఓడించాయని చెప్పాడు. అమెరికన్ల ప్రయోజనాలను పణంగా పెట్టి టెక్ కంపెనీలకు ట్రంప్ చీఫ్ లేబర్‌ను కానుకగా ఇస్తున్నాడని మండిపడ్డాడు. విదేశీయులను బయటకు వెళ్లగొట్టి, ఉద్యోగాలన్నీ అమెరికన్లకే ఇవ్వాలని మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) గ్రాడ్యుయేట్లతో ఈ పని ప్రారంభించాలని చెప్పాడు. అమెరికాను అమ్మకానికి పెట్టొద్దని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరాడు. -
హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు
అమెరికాలో హెచ్ 1 బీ వీసా సాధించాలనేది ఐటీ ఉద్యోగుల కల. భారతీయ IT నిపుణులు, టెక్ సంస్థల నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఇచ్చే హెచ్1 బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. తాజాగా హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ దారుణంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత వీసా దరఖస్తులు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసా దరఖాస్తుల సంఖ్య నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 26.9 శాతం తగ్గిందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ సంవత్సరం కేవలం 358,737 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి - ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 480,000లతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2025 లో 470,342 అర్హత గల రిజిస్ట్రేషన్లు 343,981 చేరాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ దరఖాస్తుల 308,613గా ఉంది.ప్రత్యేక లబ్ధిదారులు 442,000 నుండి 339,000 కు తగ్గారు ఒక్కో దరఖాస్తుదారుని సగటు రిజిస్ట్రేషన్లు 1.06 నుండి 1.01 కి తగ్గాయి. బహుళ రిజిస్ట్రేషన్లు కలిగిన లబ్ధిదారుల తరపున కేవలం 7,828 దరఖాస్తులు మాత్రమే దాఖలు కాగా గత ఏడాది ఈ సంఖ్య 47,314గా ఉంది. అయితే, పాల్గొనే కంపెనీల సంఖ్య 57,600 వద్ద సాపేక్షంగా స్థిరంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, అనిశ్చితులే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వాదనలను కొట్టిపారేసిన యూఎస్సీఐఎస్ రిజిస్ట్రేషన్ శాతం తగ్గడానికి కారణం ట్రంప్ విధానాలు, వీసా నిబంధనలు కాదని వెల్లడించింది.. మోసాలు, అన్యాయమైన రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు తాము తీసుకుంటున్న చర్యలే కారణమని పేర్కొంది.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో ట్రంప్ పరిపాలనలో విధానాలు, యుఎస్ చట్టాన్ని ఒక్కసారి ఉల్లంఘించిన వ్యక్తుల వీసాలను రద్దు చేసే "క్యాచ్-అండ్-రివోక్" నియమాన్ని తిరిగి ప్రవేశపెట్టడం. వీసా సంబంధిత రుసుము పెంపు, ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చిందంటున్నారు టెక్ సంస్థ యజమానులు. జనవరిలో, H-1B రిజిస్ట్రేషన్ రుసుమును 10 డాలర్ల నుంచి 215 కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ చర్య ముఖ్యంగా స్టార్టప్‌లు. చిన్న సంస్థలకు చాలాఎక్కువగా ప్రభావితం చేసిందని గ్రాడింగ్.కామ్ వ్యవస్థాపకురాలు మమతా షెఖావత్ అన్నారు. అయితే హెచ్ 1-బి వీసాల డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినా, 2026లో అందుబాటులో ఉన్న 85,000 వీసాల కోసంరిజిస్ట్రేషన్ల సుమారు 3.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం.చదవండి: అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకి -
హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి
టెక్సాస్: భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత రోహిత్ జాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘హెచ్–1బీ వీసాలను రద్దు చేయాలి. ఆ కార్యక్రమాన్నే ఆపేయాలి. హెచ్–1బీ వీసాదారులను అమెరికా నుంచి పంపించేయాలి’’అంటూ ట్రంప్ సర్కారుకు మతిలేని సూచనలు చేశారు. హెచ్–1బీ, ఇతర వీసాదారుల వీసాలు పునరుద్ధరించాలన్న రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్కారి్మక్ వ్యాఖ్యలను జాయ్ వ్యతిరేకించారు. అమెరికాను పోటీలో ముందు నిలపడంలో హెచ్–1బీ వీసా విధానం పాత్ర ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై ఆన్లైన్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. హెచ్–1బీ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులేనన్నది తెలిసిందే. వారంతా జాయ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఆయన తన వలస నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ‘మీరు సౌకర్యవంతంగా స్థిరపడ్డాక అందుకు దోహదపడ్డ నిచ్చెనను లాగేయాలని అనుకుంటున్నారా?’అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాయ్ కుటుంబం ఆ వీసా పథకం ద్వారానే లబ్ధి పొందిన విషయాన్ని మర్చిపోవద్దని అంటున్నారు. అమెరికా కంపెనీలు నిపుణులైన విదేశీయులను నియమించుకునేందుకు హెచ్–1బీ వీసా వీలు కలి్పస్తుంది. 2022లో జారీ అయిన 3.2 లక్షల హెచ్–1బీ వీసాల్లో 77 శాతం భారతీయులే దక్కించుకున్నారు. 2023లో 3.86 లక్షల వీసాల్లోనూ 72.3 శాతం వాటా వారిదే. హెచ్–1బీ వర్క్ వీసా తొలుత మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. తరువాత ఆరేళ్ల పొడిగించుకోవచ్చు. -
బయోమెట్రిక్స్, చిరునామా
వాషింగ్టన్: వీసాల విషయంలో రోజుకో కొత్త నిబంధనతో ఆశావహులకు అమెరికా చుక్క లు చూపుతోంది. హెచ్–1బీ వీసా దరఖా స్తుదారులు ఇంటి చిరునామా, బయో మెట్రిక్ డేటా వంటి వ్యక్తిగత సమాచారం అందజే యాలని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మి గ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) తాజాగా ఆదేశించింది. ఈ మేరకు వివరాలు సమర్పించాలంటూ వారికి రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్ఎఫ్ఈ) జారీ చేస్తోంది. అమె రికాలోని 240కి పైగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదవాలని కలలుగనే అంతర్జాతీయ విద్యార్థు లకు ఇది కొత్త సమస్యగా మారనుంది. దీని వెనక ఉద్దేశాలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమ వుతున్నాయి. హెచ్–1బీ వీసా దరఖాస్తులకు బయోమెట్రిక్స్ అవస రమే ఉండదని ఇమ్మిగ్రేషన్ అటార్నీలు అంటున్నారు. -
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
వాషింగ్టన్: అమెరికా వీసా విధానంపై కఠిన వైఖరిని విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమర్థించుకున్నారు. ‘‘అమెరికా వీసాలు (US Visas) హక్కు కాదు. కొందరికి మాత్రమే లభించే అదృష్టం. మా చట్టాలు, విలువలను గౌరవించే వారికే అమెరికాలో ప్రవేశం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. వలస నిబంధనలను మరింత కఠినతరం చేస్తామన్నారు. అమెరికా వర్సిటీల్లోని పాలస్తీనా (Palestine) అనుకూల విద్యార్థులపై చర్యల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.వీసాదారులంతా తమ అర్హత ప్రమాణాలను నిరంతరం అందుకుంటూ ఉండాల్సిందేనన్నారు. లేదంటే వాటిని రద్దు చేయాల్సి రావచ్చని హెచ్చరించారు. ‘‘అమెరికాకు ఎవరు రావచ్చో, ఎవరు రాకూడదో చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారమే ప్రతి వీసా దరఖాస్తునూ పరిశీలిస్తారు. ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించేవారు, అందుకు ఇతరులను ఒప్పించే వ్యక్తులు సైతం యూఎస్ వీసాలకు అనర్హులు’’ అన్నారు.గతేడాది అమెరికా (America) వర్సిటీల క్యాంపస్‌లలో జరిగిన ఘటనలను మార్కో రూబియో (Marco Rubio) ప్రస్తావించారు. అమెరికాలో 11 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులున్నారు. ‘‘నిరసనల సందర్భంగా వారిలో పలువురు క్యాంపస్‌లను మూసేశారు. యూదు విద్యార్థులను వేధించారు. రహదారులను దిగ్బంధించారు. భవనాలనూ ముట్టడించారు’’ అని రూబియో చెప్పుకొచ్చారు. ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. వీసా ఉల్లంఘనల విషయంలో విదేశీయులకు రాజ్యాంగ రక్షణ వర్తించదు’’ అన్నారు. చదవండి: అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు -
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
అమెరికాలోని మనోళ్లపై తెంపరి ట్రంప్ మరో బాంబు పేల్చారు. గ్రీన్‌కార్డు, హెచ్1బీ వీసాలపై అక్కడ చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా మరో వేధింపుల పర్వానికి తెరతీశారు. వాళ్లు నిరంతరం తమ ఐడీ కార్డును విధిగా వెంట ఉంచుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కఠిన నిబంధనను శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచే అమల్లోకి తెచ్చింది. లేదంటే జరిమానాలతో పాటు కఠినచర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇంకా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోని అక్రమ వలసదారులను గుర్తించడంలో ప్రభుత్వానికి దోహదపడుతుందంటూ అక్కడి న్యాయస్థానం కూడా ఈ కఠిన నిబంధనకు పచ్చజెండా ఊపింది. అమెరికా పౌరసత్వంలేని 18 ఏళ్లు నిండిన వారంతా తమ చట్టబద్ధ నివాసానికి సంబంధించిన ఐడీ కార్డును 24 గంటలూ వెంట ఉంచుకోవాల్సిందేనని కొత్త నిబంధన సూచిస్తోంది. విదేశీయుల నమోదు చట్టం (1940)లోని ఈ విదేశీయుల నమోదు ఆవశ్యకత (ఏఆర్ఆర్) నిబంధనలు గతంలో ఉన్నవే. కానీ వాటిని ఏనాడూ అమలుచేయలేదు. కోర్టు అనుమతితో కోట్ల మంది అక్రమవలసదారులే లక్ష్యంగా ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 54 లక్షల మంది భారతీయులున్నారు. 2022 గణాంకాల ప్రకారం 2.,2 లక్షల మంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నారు. అయితే మొత్తం అక్రమ వలసదారుల్లో వీరు కేవలం 2 శాతమేనని సమాచారం. ఏమిటీ నిబంధనలు ? అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు, చాన్నాళ్లుగా అమెరికాలో అక్రమంగా ఉంటూ ఇప్పటిదాకా వివరాలు నమోదు చేసుకోని వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను తెచ్చారు. వాటి ప్రకారం అమెరికాకు వచ్చి 30 రోజులకు మించి ఉండాలనుకునే వాళ్లు తమ వీసా, ఐడీ కార్డులను కచి్చతంగా అనుక్షణం వెంట ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో అధికారులు సోదాలు, తనిఖీల వేళ ప్రశ్నిస్తే వెంటనే వాటిని చూపించాలి. లేదంటే జరిమానాలు, ఇతర కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదు. దీని ప్రకారం అమెరికా పౌరసత్వం లేని 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఐడీ కార్డును వెంటే ఉంచుకోవాలి. అమెరికా పౌరులు కాని 14 ఏళ్లు నిండిన టీనేజర్ వివరాలను విధిగా నమోదు చేయించుకోవాలి. 14వ పుట్టినరోజుకు ముందు నమోదు చేసినా మళ్లీ కొత్తగా నమోదు చేసుకుని మరోసారి వేలిముద్రల వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు టీనేజర్ 325ఆర్ దరఖాస్తు సమరి్పంచాలి. వారి తల్లిదండ్రులు సైతం 30 రోజుల్లోపు కచి్చతంగా నమోదు చేయించుకోవాలి. ..అయినా ఉండనివ్వరు మరోసారి నమోదు చేసుకున్నా వారిని అమెరికాలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ సర్కారు స్పష్టం చేసింది. అక్రమవలసదారుల వాస్తవిక సంఖ్యను తేల్చడం, వారిని కనిపెట్టి వెళ్లగొట్టడమే రీ రిజి్రస్టేషన్ లక్ష్యమని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. తాజాగా నమోదు సమయంలో కొత్త అడ్రస్, వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలపాల్సి ఉంటుంది. వాటిని కావాలని మార్చి రాస్తే స్వదేశానికి బదులు జైలుకు పంపవచ్చని కూడా తెలుస్తోంది. కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాక కూడా పేర్లను నమోదు చేయనివారు సోదాలు, తనిఖీల్లో దొరికితే భారీ జరిమానా, ఆర్నెల్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అడ్రస్ అప్డేట్ చేయకుంటే 5 వేల డాలర్ల జరిమానా గ్రీన్‌కార్డు, వీసాదారులు మరో చోటుకు మారితే కొత్త చిరునామాను ప్రభుత్వానికి కచ్చితంగా తెలియజేయాలి. 10 రోజుల్లోపు తెలపని పక్షంలో 5,000 డాలర్ల జరిమానా విధిస్తారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక గ్రీన్‌కార్డు, హెచ్–1బీ వీసాదారులు తమ సమాచారాన్ని మరోసారి నమోదు చేయించుకోవాల్సిన పనిలేదు. కాకపోతే గ్రీన్‌కార్డ్, హెచ్1బీ ఐడీ కార్డును మాత్రం ఎప్పుడూ విధిగా వెంట ఉంచుకోవాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
H1B visa: దిగ్గజ టెక్ కంపెనీల హెచ్చరిక.. ఉద్యోగుల గుండెల్లో గుబులు
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా నలబైమూడు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్1బీ వీసా ఉద్యోగుల్ని అప్రమత్తం చేశాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలకు భయపడి దేశాన్ని విడిచి వెళతారేమో.. ఆ పనిచేయొద్దని సూచిస్తున్నాయి. అమెరికా వీడే హెచ్1బీ వీసా దారులు భవిష్యత్‌లో తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుందో,రాదోనన్న అనుమానాల్ని వ్యక్తమవుతున్న తరుణంలో ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికాలో దిగ్గజ టెక్ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఐటీ కంపెనీలు తమ హెచ్1బీ వీసా ఉద్యోగుల్ని అలెర్ట్ చేశాయి. దేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించాయి. అమెరికా వదలిసే వారి సొంత దేశాలకు వెళితే.. అలాంటి వారిని అమెరికా ఆహ్వానించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ హైలెట్ చేసింది.అయితే, హెచ్1బీ వీసాల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జన్మత: పౌరసత్వాన్ని రద్దు అమలైతే.. వారి పిల్లలకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేకుండా పోయే అవకాశం ఉండదనే ఆందోళన చెందుతున్నారు. అమెరికా పౌరసత్వం లేకపోతే అమెరికాలో అక్రమంగా ఉన్నట్లే కదా అని మాట్లాడుతున్నారు. అమెరికా ప్రభుత్వం హెచ్1బీ ప్రోగ్రామ్ కింద ప్రతి ఏడాది లాటరీ సిస్టం ద్వారా 65,000 వీసాలను విదేశీయులకు అందిస్తుంది. ఈ వీసా ఉన్న ఉద్యోగులు అమెరికాలో ఉన్నత ఉద్యోగులు, ఆ దేశం ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుంటారు. ఈ వీసా ఎక్కువ మంది భారతీయులకు ఇవ్వగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా, కెనడా పౌరులకు అందిస్తుంది. హెచ్1బీ వీసా దారుల్ని అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ యాపిల్ కంపెనీలు నియమించుకోవడంలో ముందంజలో ఉన్నాయి. ట్రంప్ కఠినమైన వీసా నియమాల్ని అమలు చేయడం వల్లే ఏర్పడిన అనిశ్చితితో హెచ్1బీ వీసా దారులు మరిన్ని కష్టాల్ని ఎదుర్కోనున్నట్లు నివేదకలు తెలిపాయి. -
ట్రంప్ సంచలన నిర్ణయం.. హెచ్-1బీ వీసాలో మార్పులు
వాషింగ్టన్: అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా హెచ్-1బీ వీసా అమలులో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పాత దరఖాస్తులను ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్‌వే(ఫ్లాగ్) డిలీజ్ చేస్తోంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం మరో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వారి విషయంలో ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు దేశాల వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు. పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ సైతం విధించారు. ఇక, తాజాగా అమెరికా హెచ్1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి సారించింది.ఇందులో భాగంగానే అమెరికా హెచ్-1బీ వీసా అమలులో మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే పాత దరఖాస్తులను ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్‌వే(ఫ్లాగ్) డిలీట్ చేస్తోంది. త్వరలోనే వీసాల జారీ కోసం యూఎస్ ఇమిగ్రేషన్ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కారు వెల్లడించింది. అందుకే, పాత రికార్డులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ కోసం కొత్త వ్యవస్థను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రవేశపెట్టనుంది.తాజా ఆదేశాల ప్రకారం.. మార్చి 20 నుంచి ఐదేళ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. అంటే.. ఉదాహరణకు ఓ దరఖాస్తుకు సంబంధించిన 2020 మార్చి 22న తుది నిర్ణయం వెలువడి ఉంటే.. ఈ ఏడాది మార్చి 22న దాని రికార్డులను తొలగిస్తారు. హెచ్-1బీ సహా అన్ని తాత్కాలిక లేబర్ కండిషన్ అప్లికేషన్స్, శాశ్వత లేబర్ సర్టిఫికేట్ అఫ్లికేషన్లపై ఈ తొలగింపు ప్రభావం పడనుందని ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం నోటీసులు జారీ చేసింది.ఇక, ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్‌వే(ఫ్లాగ్) అనేది అమెరికాలో కార్మికులకు సహాయపడే పోర్టల్. ఇదిలా అమెరికా, విదేశీ కార్మికులకు రక్షణ కల్పిస్తుంది. ఈ పోర్టల్‌లో H-1B, H-1B1, H-2A, H-2B, E-3 వీసాలు, శాశ్వత కార్మిక ధృవీకరణ దరఖాస్తులు సేవ్ చేసి ఉంటాయి. ఇక, ట్రంప్ నిర్ణయంతో గత ఐదేళ్లకు ముందుగా సేవ్ చేయబడిన దరఖాస్తులను ఈరోజు రాత్రి నుంచి తొలగించనున్నట్టు కార్మిక శాఖ ఉపాధి మరియు శిక్షణ పరిపాలన, విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం (OFLC) తెలిపింది. ఉద్యోగులకు సంబంధించి ఐదు సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశించారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొంది.H-1B Chaos: America’s Visa Purge BeginsThe U.S. Department of Labor is wiping H-1B visa applications from its system, a bombshell for global tech talent. It’s a policy shift that screams isolationism—thousands of skilled workers now face uncertainty. Advocates say it’s about… pic.twitter.com/pBy8YJROrL— Brain Snacks-Learn with laughter!!! (@NgChinSiang2) March 19, 2025 -
హెచ్ 1 బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు
-
ఈ ఏడాది హెచ్1బీ వీసాలు కష్టమే
సాక్షి, అమరావతి: అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న హెచ్1బీ వీసాలు (H1B visas) ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారయ్యింది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే హెచ్1బీ వీసాలు పొందడంలో మల్టీ నేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత హెచ్1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించింది. దీనితో నైపుణ్యం కలిగిన మానవ వనరులను బహుళజాతి కంపెనీలు ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేక అష్ట కష్టాలు పడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85,000 మందికి మించి హెచ్1బీ వీసాలు జారీ చేయకూడదన్న పరిమితిని విధించింది. మార్చి7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాల కోసం ఇప్పటికే 4,23,028 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతాయన్న అంచనాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదిక వెలువరించింది.కంపెనీలపై తీవ్ర ప్రభావంప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే దరఖాస్తు చేసుకున్నవారిలో 20 శాతంకు మించి హెచ్1బీ వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. తాజా కఠిన నిబంధనల వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అమెరికా కోల్పోతోందని, ఈ నిర్భంధ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకు వస్తున్నాయని ఫోర్బ్స్ తన నివేదికలో వ్యాఖ్యానించింది.ఇతర వీసాల జారీ సులభంహెచ్1బీ వీసాకంటే ఇతర వీసాలు మంజూరు సులభంగా ఉంటోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకులు కోటాలో జారీ చేసే బీ1/బీ2 వీసాలు 72 శాతం మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే జే1 వీసాలు 89 శాతానికి ఇమిగ్రేషన్ అధికారుల ఆమోదముద్ర పడింది. అమెరికాలో హెచ్1బీ వీసాలు కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీల్లో రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షలపైనే వేతనం లభిస్తుంది. అందుకే ప్రతీ భారతీయుడు హెచ్1బీ వీసా కింద అమెరికాకు వెళ్లి పనిచేయాలనుకుంటాడు. అయితే మారిన పరిస్థితులు స్థానిక యువత ఆశలకు గండికొట్టిందని ఎంఎన్సీ కంపెనీలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
హెచ్-1బీ వీసాదారులకు అలర్ట్!
వాషింగ్టన్ : 2025-26 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 7 నుంచి ప్రారంభమై మార్చి 24న ముగియనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విభాగం అధికారికంగా ప్రకటించింది.భారత్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉండే హెచ్-1బీ వీసా ఉద్యోగులకు ఆయా కంపెనీలు స్పాన్సర్ చేస్తుంటాయి. అందుకు అయ్యే ఈ-రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంది. ఉద్యోగికి ఏదైనా సంస్థ హెచ్-1బీ వీసా ఇచ్చేందుకు ఈ-రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపెనీలు పది డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కంపెనీలే ఏకంగా ఏడాదికి 125 డాలర్ల రుసుము చెల్లించాల్సి వస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. The initial registration period for the fiscal year 2026 H-1B cap will run from noon ET on March 7 to noon ET on March 24. Prospective petitioners & representatives must use a USCIS online account to register each beneficiary ... (1/3)— USCIS (@USCIS) February 5, 2025హెచ్-1బీ రిజిస్ట్రేషన్ గతేడా జోబైడెన్ ప్రభుత్వం బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఆ విధానం ఈ ఏడాది కొనసాగుతుంది. ఈ విధానంలో ప్రతి దరఖాస్తుదారుడి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా ఒక్కసారి మాత్రమే అతడి పేరు లాటరీలో నమోదవుతుంది. -
వర్క్ పర్మిట్లపై బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలి
వాషింగ్టన్: అమెరికాలో ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) గడువు 180 రోజుల నుంచి అటోమేటిక్‌గా 540 రోజులకు పెరిగేలా వెసులుబాటు కల్పిస్తూ జో బైడెన్ ప్రభుత్వ హయాంలో నిర్ణయించారు. దీనివల్ల హెచ్–1బీ వీసాదార్ల జీవిత భాగస్వాములకు ప్రయోజనం చేకూరుతోంది. జో బైడెన్ ప్రభుత్వం పాలనలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది జనవరి 13న డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఫైనలైజ్ చేసింది.అయితే, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. వలసదార్ల విషయంలో నూతన అధ్యక్షుడు ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. వర్క్ పర్మిట్ల రెన్యూవల్ గడువును 180 నుంచి 540 రోజులకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు జాన్ కెన్నెడీ, రిక్ స్కాట్ గురువారం కాంగ్రెస్‌లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ఆమోదించాలని వారు డిమాండ్ చేశారు. ఈఏడీ గడువు పెంచడాన్ని రద్దు చేయకపోతే అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నవారిని గుర్తించడం చాలా కష్టమవుతుందని పేర్కొన్నారు. -
ట్రంప్.. విద్యార్థుల జంప్!
సాక్షి, అమరావతి: అమెరికాలోని డల్లాస్‌లో చదువుకుంటున్న సురేష్‌ది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లె. ఏటా రూ.40 లక్షలు ఖర్చవుతుండగా కొంత అప్పు చేసి, పార్ట్ టైం ఉద్యోగం (Part time job) చేస్తూ ఫీజులు కడుతున్నాడు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన నిబంధనలు సురేష్ కు పిడుగుపాటులా మారాయి. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు (Visa Cancel) చేస్తామని హెచ్చరించడంతో హతాశుడయ్యాడు. పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకు అయ్యే ఖర్చులెలా సమకూర్చుకోవాలో తెలియక, మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి రాలేక తల పట్టుకుంటున్నాడు.కరిగిపోతున్న కల..అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవడమనేది మన విద్యార్థుల కల. తమ పిల్లలను అప్పు చేసైనా సరే అమెరికా పంపాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. సంపన్న కుటుంబాలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. కానీ అక్కడికి వెళ్లిన తరువాత మన విద్యార్ధులు పడే అగచాట్లు సాధారణంగా బయటకు రావు. ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తుంటారు. దూరపు కొండలు నునుపు అన్నట్లు అమెరికా చదువులు, ఉద్యోగాలు దూరం నుంచి చూసేవారికి అందంగానూ, గొప్పగానూ కనిపిస్తుంటాయి. ట్రంప్ రాకతో వాస్తవాలు బయటకు వస్తున్నాయి.ఇంటి అద్దెకూ చాలవు..ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్ధులు (Indian Students) ఉండగా వీరి సంఖ్య ఏటా 35 శాతం పెరుగుతోంది. చైనాను కూడా ఈ విషయంలో మనవాళ్లు వెనక్కు నెట్టేశారు. అయితే అమెరికా వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు. ఆ అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తుంటారు. వీరికి సగటున గంటకు 10 డాలర్ల వరకూ చెల్లిస్తారు. మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్) చేస్తున్న విద్యార్ధి వారానికి 20 గంటలు పాటు పని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.70 వేల వరకూ సంపాదిస్తాడు. దీన్ని ఇంటి అద్దె, కళాశాల ఫీజు, భోజనం, రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి. అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవాలంటే 1,700 డాలర్లు అంటే దాదాపు రూ.1.46 లక్షలు చెల్లించాలి. మెయింటెనెన్స్ ఖర్చులు అదనం. ఒక విద్యార్ధి నెలంతా పార్ట్‌టైమ్ జాబ్ చేసినా ఇంటి అద్దె, ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం ఖరాకండిగా చెబుతుండటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.బతుకు భారం.. పోనీ ఎలాగోలా ఇంటి దగ్గర్నుంచి అప్పులు చేసి డబ్బు తెప్పించి చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నా వచ్చే జీతంలో ప్రతి రూ.100కి ప్రభుత్వానికి రూ.30 పన్ను కింద చెల్లించాలి. ఆ మిగిలిన దానిలోనే అన్ని ఖర్చులూ భరించాలి. అలా అయినా ఎలాగోలా గడుపుదామంటే గ్రీన్ కార్డ్ రావడం పెద్ద ప్రహసనం. మన దేశానికి ఏటా 7 వేల గ్రీన్ కార్డులు (అమెరికా పౌరసత్వం) మాత్రమే ఇస్తుండగా పోటీపడుతున్న వారు లక్షల్లో ఉన్నారు.2012లో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి ఇప్పుడు ఇస్తున్నారంటే ఇక ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి రావాలంటే కనీసం 40 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకూ అదనపు ట్యాక్స్‌లు కడుతూ.. హెచ్1 వీసాపై బిక్కుబిక్కుమంటూ జీవించాలి. చదవండి: అన్నంత పనీ చేసిన డొనాల్డ్ ట్రంప్!ఇంత కష్టం ఉన్నప్పటికీ అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వెళుతున్న వారికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) షాక్ ఇస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 18 వేల మందికి పైగా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్న వారిని గుర్తించి ‘ఐస్’ టీమ్ అదుపులోకి తీసుకుంది. దీంతో భారతీయ విద్యార్ధులు అమెరికాలో పార్ట్‌టైమ్ జాబ్స్‌ను వదులుకుంటున్నారు. దండిగా డబ్బులుంటేనే రండి.. అమెరికాలో చదువుకోవాలనుకుంటే ముందుగా అంత ఆర్థ్ధిక స్తోమత ఉందో లేదో చూసుకోవాలి. ఏదో అప్పు చేసి కొంత డబ్బు సమకూర్చుకుని ఇక్కడికి రావడం సరైన విధానం కాదు. అమెరికాలో ప్రస్తుతం పార్ట్‌టైమ్ జాబ్స్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు.కాబట్టి చదువుకుంటూ సంపాదించడం ఇక కుదరకపోవచ్చు. జాబ్ వచ్చినా ఇక్కడ ఖర్చులతో పోల్చితే సంపాదించేది ఏమాత్రం సరిపోదు. అమెరికాకు రావాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’’ – మణితేజ, డాలస్, అమెరికా -
అమెరికా వృద్ధిలో కీలకంగా భారతీయులు
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా వర్కర్లంటే అమెరికా ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమించే చౌక కార్మికులని, అక్కడి వేతనాల స్థాయిని కుదించేస్తారనేది అపోహ మాత్రమేనని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా ఎకానమీ వృద్ధిలో భారతదేశం, భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ వృద్ధిపై నిస్పృహకు లోను కావాల్సిన అవసరమేమీ లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ విధానాలపైన, 250 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమ మీద వాటి ప్రభావాలపైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో పరిణామాలేమీ భారత ఐటీ పరిశ్రమ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్–1బీ వీసాలనేవి నాన్–ఇమిగ్రెంట్ వీసాలే కావడం వల్ల వివాదాస్పద వలసల సమస్యకు, వాటికి సంబంధమేమీ లేదని పేర్కొన్నారు. హెచ్–1బీ వీసాల్లో 70 శాతం వీసాలు భారతీయులకే లభిస్తుండటమనేది మన నైపుణ్యాలకు నెలకొన్న డిమాండ్‌కి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం వృద్ధి సాధనపై దృష్టి పెట్టడమనేది ఇరు దేశాలు కలిసి పని చేసేందుకు మరింతగా అవకాశాలను కల్పించగలదని సింగ్ చెప్పారు. భారతీయ కంపెనీలు అమెరికాలో అక్కడివారికి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు 1.1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేశాయని సింగ్ చెప్పారు. -
H1B వీసాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
హెచ్1బీ వీసాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్:అత్యుత్తమమైన నైపుణ్యమున్న వ్యక్తులే తమ దేశానికి రావాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. మంగళవారం(జనవరి21) వైట్‌హౌజ్‌లో ట్రంప్ ఈ విషయమై ఒరాకిల్,ఓపెన్ఏఐ,సాఫ్ట్‌బ్యాంక్ సీఈవోలతో కలిసి మీడియాతో మాట్లాడారు.‘హెచ్1బీ వీసాలపై విభిన్నమైన వాదనలున్నాయి. రెండు వాదనలకు నేను మద్దతిస్తున్నాను. నేను కేవలం ఇంజినీర్ల గురించే మాట్లాడడం లేదు. అన్ని స్థాయిల్లో నైపుణ్యమున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. హెచ్1బీ వీసాలపై నాకు వ్యక్తిగత అవగాహన ఉంది. నాణ్యమైన మానవవనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలి. దేశంలో వ్యాపారాల విస్తరణను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒరాకిల్,సాఫ్ట్‌బ్యాంక్ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజినీర్ల అవసరం ఉంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఇలాన్‌మస్క్ హెచ్1బీ వీసాలకు మద్దతిస్తున్నారు.హెచ్1బీ వీసాల జారీని నేను ఆపడం లేదు’అని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కాగా, హెచ్1బీ వీసాలపై ఇటీవల రిపబ్లికన్లలోనే భిన్న వాదనలు వినిపించాయి. కొందరు హెచ్1బీ వీసాల జారీని పూర్తిగా ఆపేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే అమెరికాలో స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ మాత్రం హెచ్1బీ వీసాల జారీని సమర్థించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వ్యక్తులు అమెరికాకు రావాల్సిన అవసరం ఉందన్నారు. #WATCH | Washington DC | On H1B visas, US President Donald Trump says, "... I like both sides of the argument but I also like very competent people coming to our country, even if that involves them training and helping others that may not have the qualifications... About HB1, I… pic.twitter.com/ALFRoHUWgD— ANI (@ANI) January 22, 2025 ఇదీ చదవండి: ట్రంప్ 2.0..భారత్‌కు దక్కిన అరుదైన గౌరవం -
హెచ్-1బీ వీసా కొత్త రూల్స్ : వాళ్లకి నష్టం, భారతీయులకు ఇష్టం!
హెచ్-1బీ వీసాలకు సంబంధించిన కొత్త నియమాలు ఈ రోజు (జనవరి 17, 2025) అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం కీలకమైన, మంచి వేతనాలను అందుకునే ఉద్యోగాల్లో భారతీయులకు ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. హెచ్-1బీ వీసా ద్వారా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు వారి ఉద్యోగ స్థితి ఆధారంగా అమెరికాలో ఉండటానికి అనుమతి లభిస్తుంది.పదవీ విరమణ అధ్యక్షుడు జో బిడెన్ పరిపాలనలో తుది వలస విధాన సంస్కరణలలో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకీకరించడమే కాకుండా సమర్థవంతమైన విదేశీ ఉద్యోగులకు మాత్రమే మరిన్ని అవకాశాలందించే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు సమాచారం. దీని వల్ల వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది.డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ H-1B ఫైనల్ రూల్ , H-2 ఫైనల్ రూల్ ప్రకారం, H-1B నాన్-ఇమ్మిగ్రెంట్ , H-2 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్‌ల నిబంధనలు మారతాయి. ప్రపంచ ప్రతిభను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించిన H-1B వీసా ప్రోగ్రామ్ మార్పులు భారతీయులకే ఎక్కువ.2023లో H-1B వీసా హోల్డర్లలో 70 శాతం కంటే ఎక్కువ భారతీయ నిపుణులు ఉన్నందున, ఈ మార్పులు వారికే ఎక్కువప్రయోజనం చేకూరుస్తాయి.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) "H-1B తుది నియమం ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా, ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడానికి మెరుగైన యజమానులను అనుమతించేందుకు H-1B ప్రోగ్రామ్‌ను ఆధునీకరిస్తుందని వెబ్సైట్లో అని పేర్కొంది. హెచ్-1బీ వీసా కీలక మార్పులు హెచ్-1బీ వీసా ప్రక్రియ మరింత సులభతరం అయ్యింది. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను 'స్పెషాలిటీ ఆక్యుపేషన్' కింద నియమించుకోవడం కంపెనీలకు ఇక సులభతరం. కంపెనీలు వారి నిర్దిష్ట శ్రామిక శక్తి అవసరాల ఆధారంగా H-1B కార్మికులను నియమించుకోవచ్చు, F-1 విద్యార్థి వీసాల నుంచి హెచ్-1బీ వీసాలకు మారడం ఈజీ. ప్రాసెసింగ్ జాప్యం కూడా తగ్గుతుంది. యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.జనవరి 17, 2025 నుండి కొత్త రూల్ ప్రకారం ఫారం I-129 తప్పనిసరి అవుతుంది. హెచ్-1బీ వీసా ప్రక్రియను సరళీకృతం చేసే దిశగానే దీన్ని తీసుకొచ్చింది. అయితే మంచి వేతనాలను అందుకునే అమెరికన్ ఉద్యోగులను తొలగించేందుకే ఈ మార్పులని విమర్శలు వినబడుతున్నాయి. హెచ్-1బీ వీసా మార్పులు అమెరికా ఉద్యోగులకు నష్టమని, అమెరికన్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఆరోపించారు. వారి స్థానంలో తక్కువ వేతనాలకే వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకుంటున్నాయని విమర్శించారు. మరోవైపు రాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మార్పులను ఎంతవరకు అంగీకరిస్తారు? తిరిగి ఎలాంటి సంస్కరణలు తీసుకురానున్నరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. -
ఒకే ఒరలో రెండు కత్తులు!
అమెరికా రిపబ్లికన్ పార్టీలో టెక్ మితవాదులు, జాతీయ మితవాదులు వేర్వేరు వర్గాలు. ఇరువురూ ఒక్కటై డోనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు తోడ్పడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంప్ విజయం తర్వాత మొదటిసారి ఈ రెండు వర్గాలూ పరస్పరం కత్తులు దూసుకున్నాయి. అమెరికా జనాభాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతేతరులతో భర్తీ చేయడానికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది జాతీయవాద మితవాదుల ఆరోపణ. అందివచ్చే ఎలాంటి అవకాశాలైనా సరే వాడుకుని అమెరికా యావత్ ప్రపంచాన్ని జయించాలని టెక్ రైటిస్టులు అనుకుంటారు. అయితే ట్రంప్ దగ్గర టెక్ రైటిస్టులకే ప్రాధాన్యత లభిస్తోంది. కలసికట్టుగా ఎన్నికలు గెలిచినా, ఇప్పుడు ఒక వర్గం ఓడిపోబోతోంది.మొన్న క్రిస్మస్ రోజు అమెరికా సోషల్ మీడియా భగ్గుమంది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కేంద్రబిందువుగా సంస్కృతి పరమైన విష పోరాటం మొదలైంది. విమర్శకులు ఆయనపై విద్వేషంతో బుసలు కోట్టారు. అసభ్య వ్యాఖ్యలతో దాడి చేశారు. మస్క్ కూడా వారితో ఢీ అంటే ఢీ అన్నాడు. అసలేమిటి ఈ వివాదం? వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్‌ను డోనాల్డ్ ట్రంప్ తన ఏఐ–పాలసీ సీనియర్ సలహాదారుగా నియమించుకోడంతో అమెరికాలో అగ్గి రాజుకుంది. ‘మాగా’ (ఎంఏజీఏ– మేక్ అమెరికా గ్రేట్ అగైన్) వాదానికి గట్టి మద్దతుదారు, ఇంటర్నెట్ ట్రోలింగ్ సుప్రసిద్ధుడు అయిన లారా లూమర్ పెట్టిన పోస్టు తీవ్ర మితవాదులను అట్టుడికించింది. ‘అమెరికా ఫస్ట్’ ఉద్యమానికి ట్రంప్ వెన్నుపోటు పొడిచాడంటూ రగిలిపోయారు. కృష్ణన్ భారతీయ వలసదారు. అమెరికా పౌరుడు. ఆయన భారతీయ మూలాలను ‘మాగా’ మితవాద శిబిరం సహించలేక పోయింది. హెచ్–1బి వీసా విధానంపై మండిపడింది. అమెరికన్ కంపెనీలు నిపుణులైన వలసదారులను నియమించుకోడానికి ఇది వీలు కల్పిస్తోంది. ఇలా వచ్చి పనిచేస్తున్న వారిలో మూడొంతుల మంది ఇండియన్లే. ఈ నేపథ్యంలో శ్రీరామ్ కృష్ణన్ నియామకానికి స్పందనగా ఇంటర్నెట్లో జాత్యహంకారం జడలు విప్పింది. జాతీయ వాదులు భారతీయ టెక్ వర్కర్లపై విద్వేషపూరితమైన మీమ్స్‌తో సోషల్ మీడియాను ముంచెత్తారు. వారిని ‘మూడో ప్రపంచ ఆక్రమణ దారులు’గా లూమర్ అభివర్ణించాడు. అంతేకాదు, అతడో సిద్ధాంతం లేవనెత్తాడు. దాని పేరు ‘గ్రేట్ రీప్లేస్మెంట్ థియరీ’. అమెరికా జనా భాలో తెల్లవాళ్ల స్థానాన్ని ఇతర దేశాల శ్వేతే తరులతో భర్తీ చేయడా నికి ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందన్నది లూమర్ సిద్ధాంతం. హెచ్–1బి వీసా విధానానికి మస్క్ మద్దతునిజానికి శ్వేత ఆధిక్యానికి మస్క్ వ్వతిరేకం ఏమీ కాదు. తన సొంతమైన ‘ఎక్స్’ వేదిక మీద దాన్ని సమర్థించినట్లే కనిపించేవాడు. అయినా, తనకు విశేషమైన అవకాశాలు అందించిన, అపార సంపద కట్టబెట్టిన ప్రభుత్వ విధానం (హెచ్–1బి) మీద ఇప్పుడు జరుగు తున్న దాడిని సహించలేక పోయాడు. అమెరికా పౌరుడిగా మారక ముందు మస్క్ కూడా వలస వచ్చినవాడే. దక్షిణాఫ్రికా నుంచి హెచ్–1బి వీసా మీద వచ్చి స్థిరపడ్డాడు. ఆయన కూడా తన కంపెనీల్లో అలాంటి వారిని నియమించుకున్నాడు. ఈ హెచ్–1బి వీసా విధానానికి మద్దతు ఇస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు. ఈ విధానం వల్ల అమెరికా గొప్ప ప్రతిభావంతులను సమకూర్చుకుంది అని అతడి వాదన. ఐటీ కేంద్రమైన సిలికాన్ వ్యాలీకి ఈ దృక్పథం ఇబ్బందికరమైంది కానప్పటికీ, రిపబ్లికన్ పార్టీలోని తిరోగమన, జాతీయ వాద వర్గాలకు మస్క్ అభిప్రాయం అసంతృప్తి కలిగించింది ‘అమెరికా ప్రజలు ఎప్పటికీ అమెరికాను ఒక స్పోర్ట్స్ టీమ్ లేదా కంపెనీ అనుకోరు’ అంటూ జాక్ పొసొబిక్ బదులిచ్చాడు. వీటన్నిటికీ బదు లిస్తూ, ‘ఈ అంశం మీద నేను యుద్ధానికి సిద్ధం, దాని పర్యవ సానాలు మీ ఊహక్కూడా అందవు’ అంటూ మస్క్ తన విమర్శకు లను హెచ్చరించాడు. దీంతో ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ రంగంలోకి దిగాడు. హెచ్–1బి వీసాలు పెద్ద స్కామ్ అనీ, వాటిని సమర్థించి మస్క్ తన ‘నిజ స్వరూపం’ బయట పెట్టుకున్నాడని ప్రతి దాడికి దిగాడు.నిజానికి హెచ్–1బి వీసాలను వ్యతిరేకించడం ‘మాగా’ పంథా కాదు. ఈ విధానంలో లోపాలు ఉన్నాయి కాబట్టి దీని పట్ల వ్యతిరేకత వచ్చింది. ఇండిపెండెంట్ సెనెటర్ బెర్నీ శాండర్స్ గతంలో మాట్లా డిన ప్రకారం, వ్యాపారవేత్తలు అత్యంత నిపుణులైన వలస ఉద్యోగులను నియమించుకుని సిబ్బంది వ్యయాలు గణనీయంగా తగ్గించు కోడానికి హెచ్–1బి పదునైన ఆయుధంలా ఉపకరిస్తుంది. మస్క్ సమ్మిళిత వలసవాదంగా పేర్కొంటూ అత్యంత నిపుణులైన విదేశీ ఉద్యోగులకు ఇప్పుడు మద్దతు ఇస్తున్నాడు. అయితే, ఎక్స్ వేదిక మీద జాతివివక్ష అంశంలో దొంగాటలు ఆడాడు. నియో నాజీలతో సంబంధాలు నెరిపే జర్మన్ తీవ్ర మితవాద పార్టీకి గట్టి మద్దతు ఇచ్చాడు. సయోధ్య కుదిరేనా?రిపబ్లికన్ పార్టీలోని ఈ రెండు మితవాద వర్గాల ఐక్యత ప్రశ్నా ర్థకంగా మారింది. ఏమైనా ఇవి తమ విభేదాలు పరిష్కరించుకున్నా యని ఒక దశలో అనిపించింది. జాతీయ మితవాదులకు, టెక్ మిత వాదులకు మధ్య సయోధ్యకు కాబోయే ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ ఒక ఉదాహరణ. పీటర్ థియల్ అనే మితవాద టెక్ బిలియనీర్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న కంపెనీలో వాన్స్ పనిచేశాడు. అడ్డూ ఆపూ లేని స్వేచ్ఛావిపణులను ఈ కాబోయే ఉపాధ్యక్షుడు విమర్శించాడు. తద్వారా మంచి పలుకుబడి ఉన్న జాతీయ మితవాద నేతలను ఆకట్టుకున్నాడు. హెచ్–1బి వీసా ఉద్యోగులను నియమించుకునే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నప్పటికీ వాన్స్ హెచ్–1బి వీసాలను వ్యతిరేకించాడు. పార్టీని ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా సమైక్యం చేయడం ఆయన బాధ్యత కావడం ఇందుకు కారణం కావచ్చు. అయితే ఎన్నికల తరువాత దాన్ని పక్కన పెట్టారు.ట్రంప్ పదవి చేపట్టిన తర్వాత టెక్ రైట్–నేషనలిస్ట్ రైట్ మధ్య ఉద్రిక్తతలు ఎలా ఉండబోతున్నాయన్న దానికి తాజా ఘర్షణ ఒక ప్రివ్యూ లాంటిది. జాతీయవాదులు వారు కోరుకున్నది చాలావరకు సాధించుకుంటారు. మూకుమ్మడి దేశ బహిష్కరణలు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు. ఇది వారికి ఆనందం కలిగించి తీరు తుంది. సిలికాన్ వ్యాలీతో వారి పోరు విషయాన్ని ప్రస్తుతానికి ఆయన పట్టించుకోడు. ట్రంప్ గత హయాంలోనూ ఇదే జరిగింది. బడా కార్పొరేట్ల ప్రయోజనాలు పక్కన పెట్టి సామాన్యులకు మేలు చేసే ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తానని 2016లో చేసిన వాగ్దానాన్ని ఆయన పూర్తిగా విస్మరించాడు. ఇది జాతీయ మితవాదులు కోరుకున్నదానికి విరుద్ధం. భారీ వ్యాపార సంస్థలకు, ధనికులకు ట్రంప్ అప్పట్లో పన్నులు తగ్గించాడు. మరోవంక, ‘ముస్లిం బ్యాన్’, అక్రమ వలస దారుల పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం వంటి కఠిన చర్యలను టెక్ అధిపతులు, సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకించారు. టెక్ రైట్‌కే ప్రాధాన్యం?ఈసారి టెక్ మితవాద వర్గానికి పాలనలో ప్రాధాన్యం లభిస్తోంది. మస్క్, టెక్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కొత్తగా ఏర్పా టైన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్–డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న మెంట్ ఎఫిషియన్సీ) నిర్వహించబోతున్నారు. బిలియనీర్ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ఈ విభాగం సిబ్బంది నియామకంలో తోడ్పడతాడు. ఇక శ్రీరామ్ కృష్ణన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధాన రూపకల్పనలో అధ్యక్షుడికి సలహాలు ఇస్తాడు. ట్రంప్ ఇతర నియా మకాల్లో సైతం ధనికవర్గాలకు, శక్తిమంతులకు ప్రాధాన్యం ఇచ్చాడు. ప్రభుత్వం వారితో స్నేహపూర్వకంగా ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక జాతీయ మితవాదుల్లోని కొద్దిమంది ముఖ్యులకూ ట్రంప్ క్యాబినెట్లో చోటు లభించనుంది.ట్రంప్ ‘న్యూయార్క్ పోస్ట్’తో మాట్లాడుతూ, ‘నేనెప్పుడూ వీసా లను ఇష్టపడ్డాను. వీసాలకు నేను ఎప్పుడూ అనుకూలమే. అందుకే వాటిని అమలు చేశాను’’ అన్నాడు. ఈ ప్రకటన ద్వారా మస్క్‌కు ఆయన పూర్తి మద్దతు పలికాడు. చిట్టచివరిగా ఇంకో విషయం ప్రస్తా వించాలి. సంపన్నుల చేతిలో ముఖ్యంగా క్రితంసారి కంటే ఈసారి మరింత ఎక్కువ అధికారం ఉంటుంది. అలీ బ్రెలాండ్ వ్యాసకర్త సీనియర్ పత్రికా రచయిత(‘ది అట్లాంటిక్’ సౌజన్యంతో) -
భారత్‌కు తిరిగిరాకుండానే హెచ్1బీ రెన్యూవల్!
వాషింగ్టన్: ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో స్వదేశానికి రాకుండానే అమెరికా గడ్డ మీదనే హెచ్–1బీ వీసా రెన్యూవల్ కోరుకునే వేలాది మంది భారతీయుల కల త్వరలో నెరవేరే అవకాశాలు మెరుగయ్యాయి. అమెరికన్ సంస్థల్లో పనిచేస్తూ హెచ్–1బీ వీసా పొందిన విదేశీ ఉద్యోగులు తమ వీసా రెన్యూవల్ కోసం ఖచ్చితంగా తమ తమ స్వదేశాలకు స్వయంగా వెళ్లి స్టాంపింగ్ పూర్తి చేయించుకుని తిరిగి అమెరికాకు రావాల్సి వచ్చేది. చాన్నాళ్ల నుంచి ఇదే నిబంధన అమల్లో ఉంది. అయితే ఇకపై ఏ దేశానికి చెందిన హెచ్–1బీ వీసాదారులైనాసరే స్వదేశానికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే రెన్యూవల్‌కు సాధ్యాసాధ్యాలపై గత ఏడాది అమెరికా ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగమైన దాదాపు 20,000 మంది హెచ్–1వీ వీసాదారులు సంబంధిత ధృవీకరణ పత్రాలను విజయవంతంగా సమర్పించడంతో అందరికీ వీసా రెన్యువల్ సుసాధ్యమైంది. ఇలా పైలట్ ప్రాజెక్టు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా విజయవంతంగా పూర్తికావడంతో ఇకపై హెచ్–1బీ వీసాదారులు అందరికీ తమ దేశంలోనే రెన్యూవల్ చేయాలని అమెరికా యోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అత్యధికంగా లబ్దిపొందేది భారతీయులే. ఎందుకంటే ఏటా హెచ్–1బీ వీసాదారుల్లో భారతీయులే గణనీయమైన స్థాయిలో ఉన్నారు. 2023లో మొత్తం 3,86,000 హెచ్–1బీ వీసాలు మంజూరైతే అందులో 72.3 శాతం వీసాలు భారతీయులకే దక్కాయి. 2022 ఏడాదిలో ఏకంగా 77 శాతం వీసాలను మనవాళ్లే ఒడిసిపట్టారు. వీసా రెన్యూవల్ స్టాంపింగ్ కోసం లక్షల రూపాయల ఖర్చుపెట్టి విమాన టికెట్లు కొనుగోలు చేసి భారత్‌కు తిరిగి రావడం, వీసా అపాయిమెంట్లకు సంబంధించిన స్లాట్ బుకింగ్ సమస్యలు, దరఖాస్తు పరిశీలన ప్రక్రియకు చాలా రోజులు వేచి ఉండటం, తిరిగి మళ్లీ లక్షలు ఖర్చుపెట్టి అమెరికాకు తిరిగిరావడం ఎంతో వ్యయప్రయాసాలతో కూడిన వ్యవహారం. స్వదేశంలో రెన్యూవల్ అమలైతే ఈ బాధలన్నీ తీరతాయని అక్కడి హెచ్–1వీ వీసాలున్న భారతీయులు ఆశిస్తున్నారు. ఈ అవకాశం ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సూచనప్రాయంగా తెలిపింది. కాబోయే అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాలకు పూర్తి మద్దతు తెలిపిన తరుణంలో అమెరికా గడ్డ మీదనే వీసా రెన్యూవల్ సదుపాయం త్వరలో అమల్లోకి వస్తుండటం గమనార్హం. హెచ్–1బీతోపాటు విద్యార్థి వీసా కోటాలోనూ భారతీయులే అత్యధికంగా ఉండటం విశేషం. గత ఏడాది అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏకంగా 3,31,000 మంది భారతీయులు విద్యార్థి వీసాలు పొందారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్తుల్లో భారతీయుల సంఖ్యే అధికం. 2008/09 విద్యాసంవత్సరం నుంచి చూస్తే ఇంతమంది భారతీయ విద్యార్థులు అమెరికాకు రావడం ఇదే తొలిసారి. -
డాలర్ డ్రీమ్స్‌పై మరో పిడుగు!
హెచ్–1బీ వివాదంతో సతమతమవుతున్న భారత విద్యార్థుల డాలర్ కలలపై మరో పిడుగు పడబోతుందా? విద్యార్థుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని అమెరికాలో స్థానిక విద్యార్థులు గొంతెత్తుతుండటం ఈ అనుమానానికి తావిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అమెరికా టెక్ వర్కర్లు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అమెరికాలో అత్యధికంగా ఉండే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతేడాది లక్ష మంది విద్యార్థులుఅంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా ఎఫ్ –1 వీసాలపై ఉన్నవారు ఓపీటీ ప్రోగ్రామ్‌ను ఎంచుకుంటున్నారు. తొలుత తాత్కాలిక నైపుణ్యాభివృద్ధి కోసం ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమం ఎఫ్–1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు స్టెమ్ డిగ్రీ కలిగి ఉంటే మూడేళ్ల వరకు అమెరికాలో పనిచేసేందుకు అనుమతిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) రంగాల్లోని గ్రాడ్యుయేట్లకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. అమెరికా లో అత్యధి కంగా అంతర్జాతీయ విద్యార్థులైన భారతీయ విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు, చివరికి హెచ్–1బీ వీసాల కోసం ఈ కార్యక్రమంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. చాలా మంది విద్యార్థులు స్టెమ్ ఓపీటీ ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో సుమారు 97,556 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో చేరారు. కోర్టు చెప్పినా... విదేశీ ఉద్యోగులను పెంచే ఓపీటీ ప్రోగ్రామ్‌ను అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వలసకు ఉపయోగపడుతోందని అమెరికన్లు వాదిస్తున్నారు. అమెరికన్ల నుంచి ఉద్యోగాలను దూరం చేయడమేనని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్స్ విమర్శిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ 2023లో వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ (వాష్టెక్) కోర్టుకెళ్లింది. అయితే, కేసును సమీక్షించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. కార్యక్రమానికి ఆమోదం తెలిపే దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. మరోసారి చర్చలు.. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తరుణంలో నైపుణ్యం కలిగిన కార్మికుల వలసలపై ఈ చర్చలు తీవ్రమయ్యాయి. ‘‘ఓపీటీ ప్రోగ్రామ్ విదేశీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తరహాలో గెస్ట్ వర్కర్ స్కీమ్. విశ్వవిద్యా లయాలు విద్యకు బదులుగా వర్క్ పర్మిట్లను విక్రయిస్తు న్నాయి. డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) తరహాలో చట్టవి రుద్ధం. ఈ పోటీ నుంచి అమెరికన్ కాలేజీ గ్రాడ్యు యేట్లను రక్షించడానికి ఈ ఓపీటీని రద్దు చేయాలి’’ అని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్.. ఎక్స్‌లో పేర్కొంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా సాగుతున్న ఈ కార్యక్రమం.. యూఎస్ జాబ్ మార్కెట్లలోకి దొడ్డిదారి ప్రవేశమని విమర్శించింది. ప్రశ్నార్థకంగా భవిష్యత్...అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మద్దతు దారులు సైతం.. హెచ్–1బీ వీసాలపై మండిపడుతున్నారు. హెచ్–1బీ వీసా హోల్డర్లు, ప్రధానంగా భారతీయులు అమెరికన్ కార్మికుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారని, పాశ్చాత్య నాగరికతకు ముప్పుగా పరిణమిస్తున్నారని వారు వాదిస్తున్నారు. అమెరికాలో ఇంజనీర్ల కొరత నేపథ్యంలో నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభా వంతులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ట్రంప్‌తోపాటు.. ఎలన్ మస్క్, వివేక్ రామ స్వామి వంటి ప్రముఖులు చెబుతు న్నారు. ఈ ఓపీటీ కార్యక్రమాలను వారు సమ ర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీటీ కార్య క్రమం భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నా ర్థకంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్మార్ట్ పీపుల్ కావాలి
వాషింగ్టన్: స్థానిక అమెరికన్లకే అధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రిపబ్లికన్ల ఎన్నికల హామీకి విరుద్ధంగా విదేశీయులకు హెచ్–1బీ వీసాల జారీని ప్రపంచ కుబేరుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ సహ సారథి వివేక్ రామస్వామి సమర్థిస్తున్న వేళ కాబోయే అమెరికా అధ్యక్షుడు మరోసారి హెచ్–1బీ వీసాలను సమర్థించారు. అమెరికాకు ఎల్లప్పుడూ కేవలం సమర్థవంతులైన వ్యక్తులే అవసరమని ట్రంప్ నొక్కి చెప్పారు. ‘‘ అమెరికాకు ఎల్లప్పుడూ సమర్థవంతులైన వ్యక్తులే కావాలని నేను ఆశిస్తా. స్మార్ట్ జనం మాత్రమే అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలి. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో ఉద్యోగ కల్పన జరగ బోతోంది. దేశానికి నైపుణ్యవంతమైన కార్మికుల అవసరం చాలా ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బుధవారం అమెరికాలోని మార్–ఏ–లాగో రిసార్ట్‌లో ట్రంప్‌ను స్థానిక మీడియా పలకరించింది. ‘‘హెచ్–1బీ వీసాలపై నా అభిప్రాయం ఎన్నటికీ మారదు. నిఫుణులే అమెరికాకు కావాలి’’ అని స్పష్టంచేశారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీకి సంయుక్త సారథులుగా నియమితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీ వీసాల జారీని సమర్థిస్తూ వ్యాఖ్యానించడం, వారికి ఇప్పటికే ట్రంప్ మద్దతు పలకడం తెల్సిందే. అయితే అమెరికన్లకే తొలి ప్రాధాన్యం అంటూ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చారని అమెరికన్ మీడియా చేస్తున్న వాదనలను ట్రంప్ తోసిపుచ్చారు. మొదట్నుంచీ తాను హెచ్–1బీకి అనుకూలమేనని పునరుద్ఘాటించారు. కేవలం అత్యంత నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకే ఉపాధి కల్పిస్తూ స్థానిక సాధారణ, తక్కువ నైపుణ్యమున్న అమెరికన్లకు సరైన ఉద్యోగాలు దక్కకపోతే ఆగ్రహావేశాలు భవిష్యత్తులో పెరిగే ప్రమాదముందని రాజకీయ పండితుడు క్రేగ్ ఆగ్రనోఫ్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ఐటీ రంగంలో ముఖ్యమైన ఉద్యోగాలన్నీ హెచ్–1బీ వీసాదారులకే తన్నుకు పోతే స్థానిక ఐటీ ఉద్యోగార్థుల పరిస్థితి ఏంటి?’ అనే ప్రశ్నకు ఇంతకాలం ఏ నేతా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని క్రేగ్ వ్యాఖ్యానించారు. స్థానిక అమెరికన్లతో పోలిస్తే తక్కువ వేతనాలకే ఎక్కువ నైపుణ్యాలున్న విదేశీయులు లభిస్తుండటంతో అమెరికన్ కంపెనీలు హెచ్–1బీ వీసా విధానం ద్వారా విదేశీయులకే అధిక ప్రాధాన్యతనిచ్చి అమెరికాకు రప్పిస్తుండటం తెల్సిందే. -
హెచ్1బీ వీసా రగడలో అనూహ్య పరిణామాలు!
హెచ్–1బీ వీసాలపై రగడలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటికి అనుకూలంగా మాట్లాడడం.. ఆయన మద్దతుదారుల్ని షాక్‌కు గురి చేసింది. అదే సమయంలో.. టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్(Elon Musk) కాస్త మెత్తబడ్డారు. హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని ప్రకటించిన ఆయన.. ఇప్పుడు స్వరం మార్చారు. ఈ పాలసీలో భారీ సంస్కరణలు అవసరం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించేవే హెచ్–1బీ(H1B) వీసాలు. అయితే.. ఈ వీసా వ్యవస్థ సజావుగా నడవడం లేదని.. దానికి భారీ సంస్కరణలు అవసరమని తాజాగా ఇలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ వ్యక్తి చేసిన పోస్టుకు ఆయన బదులిచ్చారు.Easily fixed by raising the minimum salary significantly and adding a yearly cost for maintaining the H1B, making it materially more expensive to hire from overseas than domestically. I’ve been very clear that the program is broken and needs major reform.— Elon Musk (@elonmusk) December 29, 2024హెచ్–1బీ వీసా మీద సౌతాఫ్రికా నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు ఇలాన్ మస్క్. అయితే ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులుగా ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ని నియమించారు. అయితే.. అమెరికా ఫస్ట్ అమలుకు ట్రంప్ ఏరికోరి నియమించిన ఈ ఇద్దరే బీ1 వీసా విధానానికి మద్దతు ప్రకటించడం.. ట్రంప్ మద్దతుదారులకు ఏమాత్రం సహించడం లేదు. దీనికి తోడు.. 👉తాజాగా.. వైట్‌హౌస్ ఏఐ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ ఇటీవల నియమించారు. అయితే నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్‌కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది.👉మరోవైపు నెట్టింట జోరుగా చర్చ నడిచింది. అయితే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు ఇలాన్ మస్క్ సూచిస్తూ వస్తున్నారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా.👉ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. కౌంటర్‌గా కొందరు వ్యతిరేక పోస్టులు పెట్టారు. ఒకానొక టైంలో సహనం నటించిన మస్క్.. బూతు పదజాలం ప్రయోగించిన సందేశం ఉంచారు.👉ఇక.. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే.. విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని.. అమెరికాను మరోమారు గొప్ప దేశంగా తయారు చేస్తానని(Make America Great Again) తన ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు అప్పుడు సంకేతాలిచ్చారు. కానీ, ఇప్పుడు ఆయన తన అభిప్రాయం మార్చుకున్నారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఇటు డెమోక్రాట్లలో.. అటు రిపబ్లికన్లలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. -
హెచ్–1బీ వీసాలకు ట్రంప్ దన్ను
వాషింగ్టన్: నిపుణులైన విదేశీ కార్మికులకు అమెరికా సంస్థల్లో ఉపాధికి ఉద్దేశించిన హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమని వ్యాఖ్యానించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మద్దతు లభించింది. హెచ్–1బీ వీసాల జారీని అమెరికాలో పలువురు వ్యతిరేకిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పని చేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాలను వ్యతిరేకించేవారు తమ అభిప్రాయం మార్చుకోవాలని మస్క్ సూచించడం తెల్సిందే. కేవలం నైపుణ్యత మీదనే మనగలిగే స్పేస్ఎక్స్, టెస్లా వంటి సృజనాత్మక సంస్థలకు హెచ్–1బీ వీసాదారుల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులు కానున్న మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీకి మద్దతు తెలుపుతున్నారు. దీన్ని రిపబ్లికన్ పారీ్ట సీనియర్లు తప్పుబడుతున్నారు. స్థానిక అమెరికన్లకే అధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానానికి ఇది విరుద్ధమంటున్నారు. వాళ్ల వైఖరిని మస్క్ తప్పుబట్టారు. హెచ్–1బీ వీసాల కోసం ఎంతకైనా తెగిస్తానని శనివారం ప్రకటించారు. -
ఇలాన్ మస్క్ బూతు ప్రయోగం
హెచ్-1బీ వీసా, ఇమ్మిగ్రేషన్ సంస్కరణల విషయంలో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్'(Elon Musk) మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్-1బీ వీసాలను వ్యతిరేకిస్తున్న వారిపై బూతు ప్రయోగం కూడా చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.స్పేస్ ఎక్స్ఎం, టెస్లా వంటి కంపెనీలను స్థాపించడానికి మాత్రమే కాకుండా.. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నానంటే దానికి కారణం హెచ్-1బీ వీసా (H-1B Visa) అని మస్క్ స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసాల కారణంగానే దేశం బలమైన దేశంగా అవతరించింది. కాబట్టి వీసాలను వ్యతిరేకిస్తున్నవారు ఓ అడుగు వెనక్కి వేయండి అని టెస్లా బాస్ అన్నారు.నిజానికి హెచ్-1బీ వీసాలను జారీ చేయడం వల్ల అమెరికాలోని ఉద్యోగాలను బయటి వ్యక్తులు సొంతం చేసుకుంటారు. కాబట్టి అమెరికా ఫస్ట్ నినాదాన్ని అమలు చేయనంటే ఈ వీసాల జారీ చేయకూడదని కరడుగట్టిన రిపబ్లికన్లు చెబుతున్నారు. దీనిపై ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.The reason I’m in America along with so many critical people who built SpaceX, Tesla and hundreds of other companies that made America strong is because of H1B.Take a big step back and FUCK YOURSELF in the face. I will go to war on this issue the likes of which you cannot…— Elon Musk (@elonmusk) December 28, 2024త్వరలో ప్రారంభం కానున్న ట్రంప్ క్యాబినెట్‌లోని.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) కో-హెడ్స్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్-1బీ వీసాల ద్వారా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ అమలు చేయనున్నారు. దీనిపై కూడా కొన్ని వ్యతిరేఖ నినాదాలు వినిపిస్తున్నాయి.10 లక్షల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలుఇదిలా ఉండగా భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే.. భారతీయులకు వరుసగా రెండో ఏడాది ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ 'నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా'లను జారీ చేసింది. ఇందులో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు (పర్యాటకుల వీసాలు) ఉన్నట్లు సమాచారం. -
హెచ్1బీ వీసాల రక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమే
వాషింగ్టన్: టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్–1బీ వీసాల విషయంలో ఇటీవల విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మద్దతిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎలాన్ మస్క్ శనివారం స్పందించారు. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పనిచేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాల విషయంలో అభిప్రాయం మార్చుకోవాలని వాటి వ్యతిరేకులకు సూచించారు. ‘‘నాతోపాటు ఎంతోమంది అమెరికాకు రావడానికి, స్పేస్ఎక్స్, టెస్టా వంటి సంస్థలు స్థాపించడానికి కారణం హెచ్–1బీ వీసాలే. ఈ వీసాలతోనే మేము ఇక్కడికొచ్చి పనిచేశాం. అవకాశాలు అందుకున్నాం. హెచ్–1బీ వీసాలతోనే అమెరికా బలమైన దేశంగా మారింది. ఇలాంటి వీసాలను వ్యతిరేకించడం మూర్ఖుపు చర్య. దాన్ని నేను ఖండిస్తున్నా. ఈ వీసాలు ఉండాల్సిందే. ఈ విషయంలో అవసరమైతే యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నా’’అని మస్క్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నా డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి వలసలు తగ్గిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. విదేశీయులకు వీసాలు ఇచ్చే విషయంలో కఠినంగా వ్యవహరించబోతున్నట్లు ఇప్పటికే ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్క అత్యంత సన్నిహితుడైన ఎలాన్ మస్క్ హెచ్–1బీ వీసాలకు మద్దతుగా గొంతు విప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృత్రిమ మేధపై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ సలహాదారుడిగా భారత అమెరికన్ వెంచర్క్యాలిటలిస్టు శ్రీరామ్ కృష్ణన్‌ను ట్రంప్ ఇటీవల నియమించారు. నిపుణులైన వలసదార్ల కోసం గ్రీన్‌కార్డులపై పరిమితి తొలగించాలని కృష్ణన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని రిపబ్లికన్ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై రగడ మొదలైంది. -
Laura Loomer: భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు
లారా లూమర్.. సోషల్ మీడియాలో ఈవిడ చేస్తున్న క్యాంపెయిన్ గురించి తెలిస్తే సగటు భారతీయుడికి రక్తం మరిగిపోవడం ఖాయం. అమెరికా ఉద్యోగాల్లో సొంత మేధోసంపత్తికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్న ఈ అతి మితవాద ఇన్ఫ్లుయెన్సర్.. భారతీయులపై మాత్రం తీవ్ర అక్కసు వెల్లగక్కుతోంది. ఈ క్రమంలో చీప్ లేబర్ అంటూ భారతీయులను, ఇక్కడి పరిస్థితులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేసింది.కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతికి చెందిన శ్రీరామ్ కృష్ణన్‌ను కృత్రిమ మేధ (ఏఐ) రంగ సలహాదారుగా నియమించారు. అయితే ఈ నియామకాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారతీయులను ఉద్దేశించి లారా లూమర్ వివాదాస్పద పోస్టులు చేశారు. అమెరికా ఫస్ట్ నినాదానికి శ్రీరామ్ కృష్ణన్ ద్రోహం చేస్తున్నాడని, గ్రీన్‌కార్డుల విషయంలో అతని వైఖరి భారత్‌లాంటి దేశాలకు మేలు చేసేలా ఉంటుందని.. తద్వారా అమెరికాలోని STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) గ్రాడ్యుయేట్స్‌కు గడ్డు పరిస్థితులు తప్పవని చెబుతోందామె. అదే టైంలో..హెచ్1బీ వీసాల విషయంలోభారతీయులపై వివక్షాపూరితంగా ఆమె చేసిన పోస్టులు దుమారం రేపుతున్నాయి. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, ఉషా వాన్స్లాంటి వాళ్లు అమెరికా ఫస్ట్ నినాదానికి కట్టుబడి ఉండాలని ఆమె కోరుతున్నారు. ‘‘నేను ఓటేసింది అమెరికాను మరోసారి గొప్పగా తయారు చేస్తారని. అందుకోసం హెచ్1బీ వీసాలను తగ్గిస్తారని.అంతేగానీ పెంచుకుంటూ పోతారని కాదు. భారత్‌లో అంత మేధోసంపత్తి ఉంటే అక్కడే ఉండిపోవచ్చు కదా.అమెరికాకు వలస రావడం దేనికి?. అంత హైస్కిల్ సొసైటీ అయితే.. ఇలా చెత్తకుప్పలా ఎందుకు తగలడుతుంది?( తాను పోస్ట్ చేసిన ఓ ఫొటోను ఉద్దేశిస్తూ..)..@VivekGRamaswamy knows that the Great Replacement is real. So does @JDVance. It’s not racist against Indians to want the original MAGA policies I voted for. I voted for a reduction in H1B visas. Not an extension. And I would happily say it to their face because there’s nothing… https://t.co/vO2e33USE1 pic.twitter.com/EH4hpJxiNH— Laura Loomer (@LauraLoomer) December 24, 2024మీకు భారతీయుల్లాంటి చీప్ లేబర్ కావాలనే కదా వీసా పాలసీలను మార్చేయాలనుకుంటున్నారు. ఆ విషయం మీరు ఒప్పుకుంటే.. నేనూ రేసిస్ట్ అనే విషయాన్ని అంగీకరిస్తా. మీలాంటి ఆక్రమణదారులు నిజమైన ట్రంప్ అనుచరుల నోళ్లు మూయించాలనుకుంటారు. కానీ, ఏం జరిగినా నేను ప్రశ్నించడం ఆపను. అసలు మీకు అమెరికాను మరోసారి గొప్పగా నిలబెట్టాలనే(Make America Great Again) ఉద్దేశమూ లేదు. ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు’’ అని తీవ్ర స్థాయిలో సందేశాలు ఉంచారు. ఇంతకు ముందు.. భారత సంతతికి చెందిన కమలా హారిస్ పోటీ చేసినప్పుడు కూడా లారా లూమర్ ఈ తరహాలోనే జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్‌ను లక్ష్యంగా చేసుకుని..టెక్ బిలియనీర్లు మార్ ఏ లాగో(ట్రంప్ నివాసం)లో ఎక్కువసేపు గడుపుతూ.. తమ చెక్ బుక్‌లను విసిరేస్తున్నారు. అలాంటివాళ్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీలను తిరగరాయాలనుకుంటున్నారు. తద్వారా.. భారత్, చైనా లాంటి దేశాల నుంచి అపరిమితంగా బానిస కూలీలు రప్పించుకోవచ్చనేది వాళ్ల ఆలోచన అయి ఉండొచ్చు అంటూ ఆ పోస్టులోనే ఆమె ప్రస్తావించారు.Quite the change of tune. Wonder if he got “the call”. pic.twitter.com/o1Gp8dNYyo— Laura Loomer (@LauraLoomer) December 28, 2024కాంట్రవర్సీలకు జేజేమ్మ!31ఏళ్ల వయసున్న లారా ఎలిజబెత్ లూమర్.. పోలిటికల్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జర్నలిస్ట్ కూడా. మొదటి నుంచి ఈమె శైలి వివాదాస్పదమే. గతంలో అక్కడి ప్రత్యక్ష ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసి ఓడారామె. ఆపై కొన్ని క్యాంపెయిన్లను ముందుండి నడిపించారు. తాను ఇస్లాం వ్యతిరేకినంటూ బహిరంగంగా ప్రకటించి.. ఆ మతంపై చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలూ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు.. తన ద్వేషపూరితమైన పోస్టుల కారణంగా సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫామ్‌లు, పేమెంట్స్ యాప్స్, ఆఖరికి ఫుడ్ డెలివరీ యాప్‌లు కూడా ఆమెపై కొంతకాలం నిషేధం విధించాయి.కిందటి ఏడాది ఏప్రిల్‌లో ఆమెను ఎన్నికల ప్రచారకర్తగా నియమించుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే.. రిపబ్లికన్లు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. అధ్యక్ష రేసు బైడెన్ తప్పుకున్న తర్వాత అదే రిపబ్లికన్లు ట్రంప్‌ను ప్రొత్సహించి లూమర్ను ప్రచారకర్తగా నియమించారు. ఆ టైంలో ట్రంప్‌తో ఆమెకు అఫైర్ ఉన్నట్లు కథనాలు రాగా.. ఆమె వాటిని ఖండించారు. ఒకరకంగా చూసుకుంటే.. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో ఈమెకు కూడా కొంత క్రెడిట్ ఇవ్వొచ్చు. అలాంటి లూమర్ ఇప్పుడు.. ట్రంప్ పాలనలో కీలకంగా మారబోతున్న ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలను తీవ్రంగా విమర్శిస్తోంది. మస్క్ సొంత ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగానే ఆమె తీవ్ర పదజాలంతో సందేశాలు పోస్ట్ చేస్తుండడం గమనార్హం. ‘‘ఎలాన్ మస్క్‌కు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషీయెన్సీ(DOGE) బాధ్యతలు అప్పగించడం సుద్ధ దండగ. అతనొక స్వార్థపరుడు. మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్(MAGA) పేరుతో ఇమ్మిగ్రేషన్ పాలసీలలో తలదూర్చాలనుకుంటున్నాడు. తద్వారా అమెరికన్ వర్కర్లకు హాని చేయాలనుకుంటున్నాడు. వివేక్ రామస్వామి చేస్తున్న క్యాంపెయిన్ ఎందుకూ పనికి రానిది. రిపబ్లికన్లు అతిత్వరలో వీళ్లను తరిమికొట్టడం ఖాయం. మస్క్, రామస్వామిలు ట్రంప్‌కు దూరం అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు’’ అని విమర్శించిందామె. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ ఆమెపై వెటకారంగా ఓ పోస్ట్ చేసి వదిలేశాడు..@VivekGRamaswamyThe technocratic state is more dangerous than the administrative state.Your silence on the censorship of those who wanted to put a limit on the power of big tech is deafening.DOGE can’t be allowed to be utilized as a vanity project to enrich Silicon Valley. https://t.co/81EYNTLkqx— Laura Loomer (@LauraLoomer) December 27, 2024అయితే.. మస్క్ తేలికగా తీసుకుంటున్నా లూమర్ మాత్రం తన విమర్శల దాడిని ఆపడం లేదు. మస్క్ పచ్చి స్వార్థపరుడని, చైనా చేతిలో పావు అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. మార్ ఏ లాగో(ట్రంప్ నివాసం)లో మస్క్ ఎక్కువసేపు గడుపుతున్నాడని.. తనకు లాభం వచ్చే పనులు ట్రంప్‌తో చేయించుకునేందుకు ప్లాన్లు వేసుకుంటున్నాడని, తన స్నేహితుడు జీ జిన్‌పింగ్(చైనా అధ్యక్షుడు) కోసమే ఆరాటపడుతున్నాడంటూ తిట్టిపోసింది.ఎగిరిపోయిన బ్లూ టిక్.. మరో చర్చతప్పుడు సమాచారం, విద్వేషపూరిత సందేశాలు పోస్ట్ చేస్తోందన్న కారణాలతో.. గతంలో లారా లూమర్(Laura Loomer) ట్విటర్ అకౌంట్‌పైనా నిషేధం విధించారు. అయితే ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలుచేసిన కొన్నాళ్లకే..ఫ్రీ స్పీచ్ పేరిట చాలా మంది అకౌంట్లు పునరుద్ధరణ అయ్యాయి. అందులో ట్రంప్ అకౌంట్ కూడా ఉందన్నది తెలిసిందే. I mean right after @elonmusk called me a troll today, my account verification was taken away, my subscriptions were deactivated and I was banned from being able to buy premium even though I was already paying for premium.Clearly retaliation. https://t.co/fVskKH9Trg— Laura Loomer (@LauraLoomer) December 27, 2024అయితే తాజాగా లారా ఎలిజబెత్ లూమర్ హెచ్1బీ వీసాల వ్యవహారంతో ఎలాన్ మస్క్‌నే టార్గెట్ చేయడంపై.. ఆమెపై ఎక్స్(పూర్వపు ట్విటర్) చర్యలకు ఉపక్రమించింది. ఆమె అకౌంట్ నుంచి బ్లూ టిక్ ఎగిరిపోవడంతో పాటు ఓ వార్నింగ్ కూడా ఇచ్చింది.ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె మరో పోస్ట్ చేశారు. ట్విటర్(ఇప్పుడు ఎక్స్) కొనుగోలు చేయాలన్న ఆలోచన వచ్చినప్పటినుంచి వాక్ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతోన్న మస్క్.. ఇప్పుడు తోక ముడిచారా? అని ఆమె ప్రశ్నించారు. -
భారతీయులకు 10 లక్షలకు పైగా అమెరికా వీసాలు
భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే.. భారతీయులకు వరుసగా రెండో ఏడాది ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ 'నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా'లను జారీ చేసింది.గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో చదువుకోవడానికి వెల్లవారు మాత్రమే కాకుండా, సందర్శనార్ధం వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఇటీవల జారీ చేసిన 10 లక్షల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలలో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు (పర్యాటకుల వీసాలు) ఉన్నట్లు సమాచారం.హెచ్-1బీ (H-1B) వీసాల రెన్యువల్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా రిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అమలు చేసింది. దీని వల్ల ఎంతోమంది భారతీయులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాగా.. గత నాలుగు సంవత్సరాలలో భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే సందర్శకుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. 2024 మొదటి 11 నెలల్లో 20 లక్షల కంటే ఎక్కువ మంది ఇండియన్స్ యుఎస్ వెళ్లారు. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 26 శాతం ఎక్కువ.ఇప్పటికే 50 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు యుఎస్‌ని సందర్శించడానికి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వీసాలను ప్రతిరోజూ జారీ చేస్తున్నట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది.చదువుకోవడానికి ఇండియా నుంచి అమెరికా (America) వెళ్లే విద్యార్థులకు కూడా వీసాలను జారీ చేస్తున్నారు. ఈ వీసాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అంటే అక్కడ ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు స్పష్టమవుతోంది. 2008 - 2009 విద్యాసంవత్సరంలో అమెరికాకు ఎక్కువ మంది విద్యార్థులను పంపిన దేశంగా 'భారత్' రికార్డ్ క్రియేట్ చేసింది. సుమారు 3,31,000 మంది భారతీయులు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు సమాచారం.ఎక్స్ఛేంజ్ విజిటల్ వీసాలు పొందిన భారతీయులు కూడా యునైటెడ్ స్టేట్స్లో ఉండగలుగుతున్నారు. USలో వారి ప్రోగ్రామ్‌లను పూర్తి చేసిన తర్వాత రెండు సంవత్సరాల పాటు అక్కడే ఉండవచ్చు. కాబట్టి ఇది వారి కెరీర్, విద్యను కొనసాగించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఎక్స్ఛేంజ్ విజిటర్స్ స్కిల్స్ లిస్ట్ నుంచి ఇండియాను తొలగించడం వల్ల భారతీయ J-1 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లకు ఎక్కువ సౌలభ్యం లభించింది. మొత్తం మీద భారతదేశం నుంచి అమెరికాకు వివిధ కారణాల వల్ల వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..
చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్లే వ్యక్తులు కొత్త వీసా నిబంధనల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 2025 జనవరి 1 నుంచి భారతదేశంలోని యూఎస్ ఎంబసీలో.. వీసా అపాయింట్మెంట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి అనేక మార్పులు చేయనున్నారు. అంతే కాకుండా యూఎస్ 'డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ' కూడా హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో పెద్ద మార్పును తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న మార్పులు వీసా ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవతం చేస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండా అపాయింట్‌మెంట్‌ని ఒకసారి రీషెడ్యూల్ చేయవచ్చు. అయితే మీరు రెండోసారి రీషెడ్యూల్ చేసినా లేదా అపాయింట్‌మెంట్‌ని మిస్ చేసినా.. మీకు మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ అవసరం. దీనికోసం మీరు మళ్ళీ సుమారు రూ. 15,730 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.రెండోసారి రీషెడ్యూల్ చేసిన సమయానికి వెళ్తే మళ్ళీ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అపాయింట్మెంట్ రోజున మీరు తప్పకుండా సమయానికి చేరుకోవాలి. అప్పుడే వీసా ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని యూఎస్ ఎంబసీ తెలిపింది.హెచ్-1బీ వీసా నిబంధనలలో మార్పులుయూఎస్ హెచ్-1బీ వీసాను చాలామంది దుర్వినియోగం చేస్తున్న కారణంగా.. దీనిని నిరోధించడానికి కొన్ని మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై నిపుణులు మాత్రమే ఈ వీసాను పొందవచ్చు.2025 జనవరి 17 నుంచి హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు తమ విద్యార్హత నేరుగా వారు దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించుకోవాలి. ఈ నిబంధన ప్రకారం.. ఎలాంటి స్పెషలైజేషన్ లేని వారు హెచ్-1బీ వీసా పొందడం కష్టం.సింపుల్‌గా చెప్పాలంటే, ఐటీ ఫీల్డ్ ఉద్యోగాల కోసం.. మీరు కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉంటే మాత్రమే మీకు హెచ్-1బీ వీసా లభిస్తుంది. అంతే కాకుండా.. ఇప్పుడు హెచ్-1బీ వీసా పొడిగింపు ప్రక్రియ కూడా సులభతరం కానుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మునుపటి ఆమోదాల ఆధారంగా పొడిగింపు అభ్యర్థనను ప్రాసెస్ చేయనున్నారు. ఇలా చేయడం వల్ల పేపర్ వర్క్ తగ్గడం మాత్రమే కాకుండా.. నిర్ణయాలు త్వరగా వచ్చేస్తాయి. కంపెనీలు కూడా హెచ్-1బీ ప్రోగ్రామ్ నిబంధనలను అనుసరిస్తున్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా తనిఖీ చేయడం జరుగుతుంది.ఇంటర్వ్యూ మినహాయింపులో మార్పులుఇంటర్వ్యూ మినహాయింపులో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో యూఎస్ వీసా కోసం అప్లై చేసుకున్న వ్యక్తి ఇకపై ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్త అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి పాత రికార్డులు ఉపయోగించనున్నారు. ఈ రూల్ తరచుగా యూఎస్ వెళ్లాలనుకునే వారికి ప్రయోజనం చేకూర్చుతుంది.ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలుమార్పులు ఎందుకంటే?హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో చేసిన ఈ మార్పులు.. టెక్ పరిశ్రమతో సహా కీలక పరిశ్రమల అవసరాలను తీర్చడానికి యూఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చూపిస్తుంది. సిలికాన్ వ్యాలీ.. ఇతర యూఎస్ టెక్ హబ్‌లకు నైపుణ్యం కలిగిన కార్మికులకు భారతదేశం ప్రధాన వనరు. కాబట్టి.. ఈ మార్పులు బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి మాత్రమే కాకుండా, ఐటీ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతాయి. -
భారతీయులకు బైడెన్ గుడ్‌న్యూస్.. ఇకపై హెచ్1బీ వీసా ఈజీ!
-
హెచ్–1బీ వీసా సులభతరం
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసా కార్యక్రమం కింద వేగంగా ఉపాధి పొందాలనుకునే భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. వేగంగా ఉపాధి కల్పించేందుకు వీలుగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ హెచ్–1బీ వీసా నిబంధనల్లో కీలకమార్పులు చేసింది. దీంతో హెచ్–1బీ వీసా పొందడం మునపటితో పోలిస్తే అత్యంత సులభంకానుంది. అమెరికా కంపెనీలు తమ ఉద్యోగాల కోసం విదేశీయులను ఎంపికచేసుకునే ప్రక్రియను సులభతరంచేయడం ఇందుకు మరో కారణం. నైపుణ్య ఉద్యోగాలకు సంబంధించిన వీసాల జారీ, అనుమతి ప్రక్రియలను వేగవంతం చేయడం, నిబంధనల సడలింపు ప్రక్రియ వంటి నిర్ణయాలు 2025 జనవరి 17వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎఫ్–1 విద్యార్థి వీసాలతో అమెరికాలోకి అడుగుపెట్టిన భారతీయులు ఇకపై సులువుగా తమ వీసాను హెచ్–1బీ వీసాగా మార్చుకోవచ్చు. దీంతో వీరికి అక్కడి కంపెనీలు వేగంగా ఉద్యోగాలు కల్పించేందుకు వీలవుతుంది. థిరిటికల్, టెక్నికల్ నిపుణులుగా వీరికి ఉద్యోగాచ్చేందుకు అక్కడి సంస్థలకు అవకాశం చిక్కుతుంది. అంతర్జాతీయ మార్కెట్లకు తగ్గట్లుగా, ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా అమెరికన్ సంస్థలను తీర్చిదిద్దే లక్ష్యంతో వీసా నిబంధనలను సడలిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ మంగళవారం ప్రకటించింది. అమెరికా సంస్థలు కార్మిక కొరత సమస్యను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. జనవరి 20వ తేదీన నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయడానికి కొద్దిరోజుల ముందు బైడెన్ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వేగ వంతం చేయనుంది. ‘‘హెచ్–1బీ వీసా విధానం ద్వారా అమెరికా సంస్థలు అత్యంత నైపుణ్యమైన ఉద్యోగులకు నియమించుకునే అవకాశాలను విస్తృతంచేశాం. దీంతో అంతర్జాతీయ మేధతో అన్ని రంగాల్లో అమెరికా ఎంతో ప్రయోజనం పొందనుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ మంత్రి అలెజాండ్రో ఎన్.మయోర్కాస్ చెప్పారు. ‘‘1990లో హెచ్–1బీ విధానం మొదలెట్టాక అమెరికా దేశ ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా ఈ పద్దతిని నవీకరించాల్సిన అవసరం ఇంతవరకు రాలేదు’’అని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం.జడ్డూ హెచ్–1బీ విధానాన్ని మెచ్చుకున్నారు.భారతీయులకు ఏ రకంగా ఉపయోగం?యూఎస్సీఐఎస్ ద్వారా హోంల్యాండ్ సెక్యూ రిటీ విభాగం ఏటా లాటరీ విధానం ద్వారా కేవలం 65,000 వరకు హెచ్–1బీ వీసాలనే జారీచేసేది. అడ్వాన్స్డ్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉన్న సందర్భాల్లో మరో 20వేల హెచ్– 1బీ వీసాలనే ఇచ్చేది. ఈ కోటా పరిమితి అనేది ఇన్నాళ్లూ లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు లేదు. దీంతో ఈ నిబంధనలోని లొసుగును దుర్వినియోగం చేస్తూ చాలా మంది ‘రీసెర్చ్’మాటున వీసాలు సాధించారని, దీంతో భారత్ నుంచి వచ్చే నైపుణ్య అభ్యర్థులకు లాటరీ ద్వారా వీసా పొందే అవకాశాలు తగ్గిపోయాయని ఆరోపణలు ఉండేవి. దీంతో వీటికి చెక్ పెడుతూ ఇకపై లాభాపేక్షలేని, ప్రభుత్వ సంబంధ పరిశోధనా సంస్థలకు తొలిసారిగా కోటా పరిమితిని విధి స్తూ, కోటాను నిర్వచిస్తూ నిబంధనల్లో మా ర్పులు తెచ్చారు. దీంతో నాన్‌ప్రాఫిట్, గవర్న మెంటల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి పోటీ తగ్గి ఆ మేరకు భారతీయులకు లాటరీలో అధిక ప్రా ధాన్యత, లబ్ధిచేకూరుతుందని భావిస్తున్నా రు. ప్రతి ఏటా హెచ్–1బీ వీసా పొందుతున్న వారిలో భారత్, చైనా దేశస్థులే అధికంగా ఉంటున్నారు. -
హెచ్-1బీ వీసా : భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత ఆమెరికాలో ఉండే భారతీయులు, అక్కడ చదువుకునే భారతీయ విద్యార్థుల భవితపై అనే సందేహాలు నెలకొన్ని నేపథ్యంలో యూఎస్ ప్రకటన లక్షలాది మంది భారతీయ టెకీల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అధికారం నుంచి వైదొలగడానికి కొద్ది రోజుల ముందు బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ నిబంధనలను సడలించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకరించే నిర్ణయాన్ని ప్రకటించింది. 2025 జనవరి 17 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త నియమాలు కొత్త ఉద్యోగాల్లోకి మారడానికి వారికి సహాయపడతాయి. అలాగే అత్యంత నిపుణులైన టెకీలను నిలుపుకోవడానికి యజమానులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని USCIS డైరెక్టర్ ఉర్ ఎం జద్దౌ చెప్పారు.హెచ్ 1 బీ వీసా : కీలకమైన అప్డేట్స్F-1 విద్యార్థి వీసాదారులు, ఉద్యోగాలు, H-1B స్థితికి మారడం, తద్వారా అమెరికాలో కొనసాగడం వంటి మార్పులు ఉండనున్నాయి.దరఖాస్తుదారులు తమ హెచ్-1బీ దరఖాస్తులను సమర్పించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఐ-129 అప్లికేషన్ ఫారంను ఉపయోగించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ వీసా దరఖాస్తు తమ డిగ్రీతో నేరుగా ముడిపడి ఉన్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించాలి. దీంతో వీసాల జారీలో దుర్వినియోగాన్ని తగ్గించాలనేది లక్ష్యం.అంతేకాదు హెచ్1 బీ వీసా నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకునే, జరిమానాలు విధించే, లేదా వీసా (VISA) లను రద్దు చేసే అధికారం మరింత ఉంటుంది. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేని విధానమైన డ్రాప్ బాక్స్ సిస్టమ్ ను మరింత సరళతరం చేయ నున్నారు. అభ్యర్థుల మునుపటి దరఖాస్తు రికార్డులపై ఆధారపడటాన్ని విస్తరించవచ్చు, పునరుద్ధరణలను వేగవంతం చేయవచ్చు.గతంలో H-1B వీసాకు అనుమతి లభించినవారి ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. కొన్ని షరతులతో పిటిషన్ సంస్థపై నియంత్రణ ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు అర్హతను పొడిగిస్తుంది.కాగా ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతీ ఏడాది వేలాదిమంది ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు H-1B వీసాలపై ఆధారపడతాయి. హెచ్-1బీ వీసా హోల్డర్లలో సింహభాగం భారతదేశానికి చెందినవారే. 2023లో, జారీ చేసిన వీసాల్లో భారతీయులు 72.3శాతంఉన్నారు.H-1B వీసా దరఖాస్తులు తరచుగా వార్షిక పరిమితిని మించిపోవడంతో వీసాలు లాటరీ విధానంద్వారా కేటాయిస్తున్నారు. దీంతో కొంతమంది నష్టపోతున్న సంగతి తెలిసిందే. -
అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..
గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా.. 2023–24లో ఈ సంఖ్య 3,31,602కి చేరింది. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. – రెబెకా డ్రామ్ ఏయూ క్యాంపస్: గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) కార్యాలయం కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కాన్సులేట్ నుంచి రోజుకి సగటున 1,600 వరకు వీసాలు ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కాన్సులేట్‌లో సిబ్బందిని రెట్టింపు చేసినట్లు తెలిపారు.వచ్చే ఏడాది సిబ్బందిని మూడు రెట్లు పెంచి రోజుకు 2,500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా అమెరికా–భారత్ సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఏపీలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. ఈ సందర్భంగా రెబెకా డ్రామ్ ఇంకా ఏమన్నారంటే..అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు..అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన విద్యార్థుల్లో 303.3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది 336 మంది రాగా ఈ సంవత్సరం 1,355 మంది వచ్చారు. ప్రస్తుతం 8 వేల మంది వరకు అమెరికన్ విద్యార్థులు భారత్‌లో ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా 2023–24లో ఈ సంఖ్య 13 శాతం వృద్ధితో 3,31,602కి చేరింది. మాస్టర్స్, పీహెచ్డీ కోర్సులకు అత్యధిక శాతం మంది విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ గతేడాది 35 వేలు, ఈ ఏడాది 47 వేల స్టూడెంట్ వీసా ఇంటర్వూ్యలు నిర్వహించింది.బీ1, బీ2 వీసాలకు గరిష్టంగా ఏడాది కాలం.. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. గతేడాది భారత్‌లో 1.4 మిలియన్ వీసాలను ప్రాసెస్ చేశాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు.స్టెమ్ కోర్సులనే ఎక్కువగా చదువుతున్నారు.. అమెరికా కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ అధికారి అలెక్స్ మెక్లీన్ మాట్లాడుతూ.. తమ దేశానికి వస్తున్న విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, మెడిసిన్ (స్టెమ్) కోర్సులను ఎక్కువగా చదువుతున్నారని తెలిపారు. యూఎస్‌లో ఉన్నత విద్యకు విద్యార్థులను పంపే దేశాల జాబితాలో ఈ ఏడాది భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ భాగస్వామ్యం అమెరికాను ఎంతో బలోపేతం చేస్తుందన్నారు. అమెరికాకు వస్తున్నవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారని చెప్పారు.మహిళలను సైతం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్‌పై స్పందిస్తూ ఈ కేంద్రం ఎంతో బాగా పనిచేస్తోందని తెలిపారు. తరచూ ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది అమెరికన్ నావికా సిబ్బంది ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి ఎన్సీసీ విద్యార్థినులతో మాట్లాడారని గుర్తు చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందిస్తూ రెండు దేశాల సంస్కృతుల మధ్య కొంత వైవిధ్యం ఉంటుందని.. వీటిని అలవాటు చేసుకోవడం, పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఆత్మహత్యలను నివారించడానికి తాము పూర్తిస్థాయిలో పనిచేస్తున్నామని తెలిపారు. -
హెచ్1బీ వీసా రెన్యువల్ కోసం తిప్పలు!
అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న మనోళ్లకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అంటే అందరికీ కాదులెండి కొంత మందికి మాత్రమే. అమెరికా అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వీసా. ఇది లేకపోతే అక్కడికి వెళ్లడం కుదరని అందరికీ తెలుసు. యూఎస్ వీసా రావాలంటే ఎంత కష్టపడాలో తెలుకోవాలంటే.. అది దక్కించుకున్న వారిని అడిగితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. యూఎస్ వీసా దక్కించుకోవడానికే కాదు.. రెన్యువల్ కూడా కష్టపడాల్సి వస్తోందట. ఈ విషయాన్ని ఓ ఎన్నారై సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. వీసా రెన్యువల్ కష్టాలను పీడకలగా పేర్కొంటూ ‘రెడిట్’లో తన వ్యథను వ్యక్తపరిచాడు.హెచ్1బీ వీసా రెన్యువల్ (H1B visa renewal) కోసం ముప్పు తిప్పలు పడుతున్నట్టు అమెరికాలోని భారత పౌరుడొకరు వాపోయాడు. తనలాగే ఎవరైనా ఉంటే బాధలు పంచుకోవాలని కోరాడు. ‘నెల రోజుల నుంచి హెచ్1బీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ల కోసం వెతుకుతున్నాను. నవంబర్‌లోపు స్టాంప్ వేయించుకోవడానికి ఇండియాకు వెళ్లాలి. కానీ డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్ దొరికేట్టు కనబడడం లేదు. ఈ పరిస్థితి నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీసా రెన్యువల్ స్లాట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. నాలాగే ఎవరైనా ఉన్నారా? మనం ఇప్పుడు ఏం చేయాల’ని తన గోడు వెళ్లబోసుకున్నాడు.తాము కూడా వీసా రెన్యువల్ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నామంటూ పలువురు ఎన్నారైలు స్పందించారు. ‘నేను కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నాను. నవంబర్ లేదా డిసెంబర్ స్లాట్ల కోసం వెతుకుతున్నా.. కానీ ఇప్పటివరకు విడుదల కాలేదు. నేను ఎలాగైనా ఇండియా వెళ్లాలి. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ త్వరలో విడుదలవుతాయని ఆశిస్తున్నాన’ని ఒకరు తెలిపారు. ‘వీసా రెన్యువల్ కోసం వేలాది మంది ఆగస్ట్ నుంచి ఎదురు చూస్తున్నారు. నవంబర్, డిసెంబర్ స్లాట్లను జూలైలో తెరిచారు. మరికొన్ని స్లాట్ కూడా త్వరలో విడుదలవుతాయి. కానీ స్లాట్లు దొరకడం కష్టమ’ని మరొకరు పేర్కొన్నారు. డ్రాప్‌బాక్స్ వీసా స్లాట్స్ గ్యారంటీ లేకపోవడంతో తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోలేకపోతున్నామని ఇంకొరు వాపోయారు.డ్రాప్‌బాక్స్ స్కీమ్ అంటే?డ్రాప్‌బాక్స్ స్కీమ్ ప్రకారం దరఖాస్తుదారులు వ్యక్తిగత ఇంటర్వ్యూకి హాజరుకాకుండా వీసా పునరుద్ధరణ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. భారత పౌరులు సమర్పించిన పత్రాలను చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ ప్రాసెస్ చేస్తుంది. రెన్యువల్ కోసం దరఖాస్తుదారులు తమ పత్రాలను భారతదేశంలోని వీసా కేంద్రాలలో ఎక్కడైనా సమర్పించేందుకు వీలుంది. అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ వీసా వినియోగదారులు తమ డ్రాప్‌బాక్స్ అపాయింట్మెంట్ల కోసం ఇండియాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. యూఎస్ కాన్సులేట్ కేవలం 2 రోజుల ముందు స్లాట్లు విడుదల చేస్తోంది. దీంతో అమెరికా నుంచి ఇండియా రావడానికి హెచ్1బీ వీసా వినియోగదారులు కష్టపడాల్సి వస్తోంది. H1B Dropbox Visa Slots for India are a Nightmare!byu/AccomplishedPolicy94 inusvisaschedulingచదవండి: హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్ -
తెలుగు విద్యార్థుల డెస్టినేషన్‌గా యూఎస్
సాక్షి హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు తమ డెస్టినేషన్‌గా అమెరికాను ఎంపిక చేసుకుంటున్నారు. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు యూఎస్ చదువుల కోసం బ్యాగ్‌లు సర్దిపెట్టుకుంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో లెక్కల ఆధారంగా 2016తో పోల్చితే 2024 నాటికి అమెరికాలో తెలుగు వారి సంఖ్య నాలుగింతలు పెరిగిందని స్పష్టమవుతోంది. ప్రధానంగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూ జెర్సీ, డల్లాస్, నార్త్ కరోలినా, ఇల్లినాయిస్, వర్జీనియా, అట్లాంటా, ఫ్లోరిడా, జార్జియా, నాష్విల్లే తదితర సిటీల్లో తెలుగు వారి ప్రాబల్యం వేగంగా పెరుగుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎంతలా ఉందంటే యూఎస్‌లో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషలు 350 ఉండగా అందులో తెలుగు 11వ స్థానంలో నిలిచింది.ఐటీ, ఫైనాన్స్ రంగాలపై ఆసక్తి.. అమెరికా వెళుతున్న వారిలో దాదాపు 75 శాతం పైగా ఇక్కడ ఇక్కడే స్థిరపడుతున్నారు. ప్రధానంగా డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే తదితర ప్రాంతాల్లో తెలుగు వారి ప్రభావం కనిపిస్తోంది. గతంలో స్థిరపడిన తెలుగు ప్రజలు పెట్టుబడులతో ముందుకొస్తున్నారు. మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. అయితే 80 శాతం కంటే ఎక్కువ మంది యువకులు ఐటీ, ఫైనాన్స్ రంగాలపైనే ఆసక్తి చూపిస్తున్నారని స్థానిక సర్వేల్లో వెల్లడైంది. 3.2 లక్షల నుంచి 12.3 లక్షల వరకు.. యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం 2016 నాటికి అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 3.2 లక్షల మంది ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 12.3 లక్షలకు చేరింది. గతంలో వెళ్లి స్థిరపడిన నాలుగు తరాలకు చెందిన తెలుగు వారు, ఇటీవల కొత్తగా వెళ్లిన వారు సైతం అంతా అమెరికాను తమ సొంత ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నారు. తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా కాలిఫోరి్నయాలో 2 లక్షల మంది ఉండగా, టెక్సాస్ 1.5 లక్షలు, న్యూజెర్సీ 1.1 లక్షలు, ఇల్లినాయిస్ 83 వేలు, వర్జీనియా 78 వేలు, జార్జియా 52 వేల మంది ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.హిందీ, గుజరాతీ, తరువాతి స్థానంలో తెలుగు.. అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో అత్యధికంగా హిందీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, మూడో స్థానంలో తెలుగు ప్రజలు ఉన్నారు. అమెరికాలో సుమారు 350 విదేశీ భాషలు వాడుకలో ఉండగా అందులో తెలుగు భాష 11 స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్యా ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టం చేస్తోంది. ఏటా 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు అమెరికా వస్తున్నారని ఉత్తర అమెరికా తెలుగు భాషా సంఘం మాజీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది హెచ్1బి వీసా హోల్డర్లు ఉంటున్నారు. ఇందులో 80 శాతం మంది తెలుగు సంఘంలో సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. -
అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు
అమెరికా హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజు పెంపుపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసా ధరఖాస్తు రుసుముల పెంపుతో ఇండియన్ ఐటీ కంపెనీలు గణనీయమైన సవాళ్లు, వారి ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. భారత్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ అమెరికాలో కొరత ఉన్న కొన్ని ప్రత్యేకమైన విభాగాల్ని భర్తీ చేస్తేందుకు పలు ఐటీ కంపెనీలు అత్యంత నైపుణ్యం ఉన్న వేలాది మంది టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. అయితే ఈ తరుణంలో హెచ్-1బీ సహా కొన్ని కేటగిరీల అప్లికేషన్ ఫీజులను పెంచింది అమెరికా.రూ.లక్షా పదివేలకు చేరిన ఎల్-1 వీసా దరఖాస్తు ఫీజు తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర ఒకేసారి రూ.38వేల నుంచి (460 డాలర్లు), రూ.64వేలకు (780 డాలర్లకు) పెంచింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను రూ.829 (నాడు 10 డాలర్ల) నుంచి రూ.17వేలకు (215 డాలర్లు) పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును రూ.38వేల ( 460 డాలర్ల) నుంచి రూ.లక్షా పదివేలకు (1,385 డాలర్లకు) పెంచారు.ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను రూ.3లక్షల నుంచి (3,675 డాలర్ల) నుంచి ఏకంగా రూ.9లక్షలకు ( 11,160 డాలర్లకు) పెంచినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్లో పేర్కొంది.వీసా దారుడిపై అదనపు భారంఫలితంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుడు ఉద్యోగం ఇచ్చినందుకు లేదా చేస్తున్న ఉద్యోగం కాలపరిమితి పెంచుతున్నందుకు అమెరికాకు అదనంగా 33వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని వీసా దారుడు అప్లయి చేసుకున్న ప్రతి సారి చెల్లించాల్సి ఉంటుంది. వీసా ఫీజులపై కోర్టులో వాదనలుదీనిపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు.. భారత్ ఐటీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాన్ని మరింత ఖరీదైనదిగా చేసే ప్రయత్నం చేస్తోందని ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ సంస్థ వాస్డెన్ లా మేనేజింగ్ అటార్నీ జోనాథన్ వాస్డెన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో వీసా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీజుల పెంపును సవాలు చేస్తూ కోర్టులో వాదిస్తున్న వారిలో వాస్డెన్ ఒకరు. ఇది అమెరికాకే నష్టంఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ సైతం వీసా రుసుముల పెంపుపై భారత్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గణనీయమైన డిమాండ్-సప్లై గ్యాప్ ఉన్న సమయంలో ఫైలింగ్ ఫీజుల పెరుగుదల వ్యాపారంపై తీవ్రం ప్రభావాన్ని చూపుతోందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అన్నారు. అదే సమయంలో వీసా ఫీజుల పెంపు అమెరికా ఆర్ధిక వ్యవస్థకు ప్రతికూలం ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. భిన్నాభిప్రాయలు వ్యక్తం ఫీజు పెంపుదల వల్ల కాలక్రమేణా హెచ్-1బీ వీసాల వినియోగం తగ్గుతుందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ, మరికొందరు కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు అయ్యే ఖర్చులను భరిస్తూనే ఉంటాయని మరోలా స్పందిస్తున్నారు. -
హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
వాషింగ్టన్: అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, ఆపిల్, డెల్, ట్విటర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. నాన్–ఇమ్మిగ్రెంట్లను తొలగిస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికాలో 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని తొలగించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. లే–ఆఫ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రధానంగా హెచ్–1బీ వీసాలతో అమెరికా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కంపెనీ యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తే 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. ఇలాంటి వారికి యూఎస్ సిటిజెన్íÙప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్(యూఎస్సీఐఎస్) తీపి కబురు అందించింది. హెచ్–1బీ వీసాదారులు ఉద్యోగం పోతే 60 రోజులు దాటినా కూడా అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండొచ్చని వెల్లడించింది. అయితే, నాన్–ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలోనే ఉన్న జీవిత భాగస్వామిపై డిపెండెంట్‌గా మారొచ్చు. అంటే హెచ్–4, ఎల్–2 వీసా పొందొచ్చు. ఈ వీసాలు ఉన్నవారికి పని చేసుకొనేందుకు(వర్క్ ఆథరైజేషన్) అనుమతి లభిస్తుంది. స్టూడెంట్(ఎఫ్–1), విటిటర్ (బి–1/బి–2) స్టేటస్ కూడా పొందొచ్చు. కానీ, బి–1/బి–2 వీసా ఉన్నవారికి పని చేసుకొనేందుకు అనుమతి లేదు. 60 రోజుల గ్రేస్ పిరియడ్‌లోనే వీసా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్సీఐఎస్ సూచించింది. -
లేఆఫ్స్‌కు గురయ్యారా?.. హెచ్1- బీ వీసాలో కొత్త నిబంధనలు
అగ్రరాజ్యం అమెరికా హెచ్-1 బీ వీసాలో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందనే అంచనాలు,పలు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభం, ప్రాజెక్ట్‌ల కొరత, చాపకింద నీరులా ఏఐ వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా చోటోమోటా స్టార్టప్స్ నుంచి బడబడా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికాలో ఉంటూ లేఆఫ్స్‌కు గురైన హె-1బీ వీసా దారుల కోసం యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్)కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.ఫలితంగా లేఆఫ్స్ గురైన విదేశీయులు 60 రోజుల గ్రేస్ పిరయడ్ కంటే ఎక్కువ రోజులు అమెరికాలో నివసించేందుకు అవకాశం కలగనుంది. కొత్త నిబంధనల ప్రకారం.. గ్రేస్ పిరయడ్లో నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్చుకునేందుకు అప్లయ్ చేసుకోవచ్చు.స్టేటస్ అప్లికేషన్‌ను అడ్జెస్ట్మెంట్ చేయాలని కోరుతూ ఫైల్ చేయొచ్చు. ఉద్యోగులు ఏడాది పాటు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)అర్హత పొందేలా ధరఖాస్తు ఫైల్ చేసుకోవచ్చు. దీంతో పలు హెచ్1-బీ వీసాలో కొత్త మార్పులు చేస్తూ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. -
అమెరికా వెళ్లేవారికి అలర్ట్: కొత్త ఫీజులు రేపటి నుంచే..
అమెరికా వెళ్లాలనుకుని వీసా ప్రయత్నాల్లో ఉన్నవారికి షాకింగ్ వార్త ఇది. ఏప్రిల్ 1 నుంచి వలసేతర అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజులో భారీ పెరుగుదల ఉండబోతోంది. వీసా ఫీజు ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ఈ పెంపు హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసాలకు వర్తిస్తుంది. 8 ఏళ్ల తర్వాత పెంపు అమెరికాలో నివసించడానికి వచ్చే భారతీయులు ఎక్కువగా హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాలు తీసుకుంటారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఫీజుల పెంపుదల జరుగుతోంది. గతంలో 2016లో ఫీజులు పెంచారు. వీసాల పెంపుదల తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. వీసా కొత్త ఫీజులు ఇలా.. కొత్త హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, దీని కోసం ఫారమ్ I-129 ఉంటుంది. దీని రుసుము 460 డాలర్లు నుండి 780 డాలర్లకు పెరగనుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.38,000 నుంచి రూ.64,000కు పైగా పెరుగుతుంది. ఇది కాకుండా హెచ్1బీ రిజిస్ట్రేషన్ ఫీజు 10 డాలర్లు(రూ. 829) నుంచి 215 డాలర్లు (సుమారు రూ. 17,000) పెరుగుతుంది. ఇక ఎల్-1 వీసా రుసుము ఏప్రిల్ 1 నుంచి మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతానికి ఇది 460 డాలర్లు (సుమారు రూ. 38,000) ఉంది. ఇది ఏప్రిల్ 1 నుండి 1385 డాలర్లకు (రూ. 1,10,000) పెరుగుతుందని అంచనా. ఎల్-1 అమెరికాలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ కింద వస్తుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల బదిలీ కోసం దీన్ని రూపొందించారు. అలాగే ఈబీ-5 వీసా ఫీజులు కూడా మూడు రెట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం 3675 డాలర్లు (దాదాపు రూ. 3 లక్షలు) ఉండగా 11160 డాలర్లకు (దాదాపు రూ.9 లక్షలు) పెరగవచ్చని అంచనా. ఈబీ-5 వీసాను 1990లో యూఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద అధిక ఆదాయ విదేశీ పెట్టుబడిదారులు అమెరికన్ వ్యాపారాలలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా వారి కుటుంబాలకు వీసాలు పొందవచ్చు. కనీసం 10 మంది అమెరికన్లు ఉద్యోగాలు పొందగలిగేలా ఈ వ్యాపారం ఉండాలి. -
గుడ్‌న్యూస్.. హెచ్-1బీ వీసా నమోదు గడువు పొడగింపు
వాషింగ్టన్: 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువును యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పొడిగించింది. మార్చి 22వ తేదీతో ఈ గడువు ముగియనుండగా మరో మూడు రోజులు అంటే మార్చి 25 వరకూ పొడిగించినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తాత్కాలికంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గడువును యూఎస్సీఐఎస్ పొడిగించింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చని వివరించింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్-1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి. -
హెచ్–1బీ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ మార్చి 22
వాషింగ్టన్: 2025వ సంవత్సరానికి గాను హెచ్–1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువు మార్చి 22వ తేదీతో ముగియనుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చని వివరించింది. అదేవిధంగా, హెచ్–1బీ క్యాప్ పిటిషన్లకు ఏప్రిల్ ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. నాన్ క్యాప్ దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉండే తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్–1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి. -
హెచ్-1బీ వీసా ప్రక్రియ ఇక మరింత సులభతరం!
హెచ్-1బీ వీసా కోసం అప్లయ్ చేశారా? ప్రాజెక్ట్ నిమిత్తం అమెరికాకు వెళ్లే యోచనలో ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. హెచ్1- బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ఫిబ్రవరి 28,2024న యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ విభాగం (యూఎస్సీఐఎస్) మైయూఎస్సీఐఎస్ పేరుతో కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పద్దతిలో హెచ్-1బీ వీసా ప్రాసెస్ మరింత సులభ తరం అయ్యేలా ఆర్గనైజేషనల్ అకౌంట్‌ను వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించింది. హెచ్-1బీ వీసా ప్రాసెస్ వేగవంతం ప్రపంచ వ్యాపంగా ఆయా కంపెనీలు తమ ప్రాజెక్ట్‌ల నిమిత్తం ఉద్యోగుల్ని అమెరికాకు పంపిస్తుంటాయి. ఇందుకోసం ఉద్యోగులు హెచ్-1బీ వీసా తప్పని సరిగా ఉండాలి. ఇప్పుడు ఆ హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వేగవంతం జరిగేలా చర్యలు తీసుకుంది జోబైడెన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా మైయూఎస్సీఐఎస్లోని ఆర్గనైజేషనల్ అకౌంట్లో సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు, లీగల్ అడ్వైజర్లు హెచ్1-బీ వీసా రిజిస్ట్రేషన్, హెచ్-1బీ పిటిషిన్ ప్రాసెస్ చేయొచ్చు. కొత్త పద్దతి హెచ్-1బీ వీసా పిటిషనర్లకు వరం జోబైడెన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మైయూఎస్సీఐఎస్ ఈ కొత్త వీసా పద్దతి హెచ్-1బీ వీసా పిటిషనర్లకు వరంగా మారుతుందని వీసా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వీసా ప్రాసెస్‌లో సంస్థలే హెచ్-1బీ ప్రాసెస్ చేసుకోవచ్చు.హెచ్-1బీ రిజిస్ట్రేషన్, పిటిషన్స్‌తో పాటు ఫారమ్ ఐ-907కి సంబంధించిన కార్యకలాపాల్ని చక్కబెట్టుకోవచ్చు. ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు అంతేకాదు మైయూఎస్సీఐఎస్ ఉన్న డేటా ఆధారంగా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అధికారులు వలసదారుల (noncitizens) అర్హతని బట్టి ఇచ్చే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు కల్పించాలా? వద్దా? అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని యూఎస్సీఐఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దశ చాలా అవసరం మార్చి 2024 నుండి సంస్థలు హెచ్-1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో పాల్గొనడానికి కొత్త ఆర్గనైజేషనల్ అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ పిటిషన్లను ఫైల్ చేయాలనుకుంటున్న వారికి ఈ దశ చాలా అవసరం. ఫారమ్ ఐ-907 అంటే? ఇందులో కొత్త మొత్తాన్ని చెల్లించి వీసా ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసులు పొందవచ్చు. ఉదాహరణకు పిటిషన్స్, అప్లికేషన్లు. హెచ్-1బీ రిజిస్ట్రేషన్, హెచ్-1బీ పిటిషన్స్ అంటే? ఉదాహరణకు భారతీయులు అమెరికాలో ఏదైనా సంస్థలో పనిచేయాలనే వారికి హెచ్-1బీ వర్క్ పర్మిట్ తప్పని సరి. ఈ హెచ్-1బీ వీసా అప్లయ్ చేయడాన్ని హెచ్-1బీ రిజిస్ట్రేషన్ అంటారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఎంపికైనా అభ్యర్ధులకు తర్వాత జరిగే ప్రాసెస్‌ను హెచ్-1బీ పిటిషన్ అని అంటారు. -
జోబైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హెచ్-4 వీసా దారులకు భారీ ఊరట!
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-4 వీసా దారులకు ‘ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్’ విధానాన్ని అమలు చేయనుంది. తద్వారా కొన్ని లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. హెచ్1- బీ వీసా దారులైన భార్య భర్తలు వారి 21ఏళ్ల లోపు వయస్సున్న పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా హెచ్-4 వీసాను జారీ చేస్తుంటారు. ఈ వీసా ఉంటే సరిపోదు ఉద్యోగం చేసేందుకు వీలుగా తప్పని సరిగా ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ధరఖాస్తు అనంతరం అధికారులు ఆథరైజేషన్ చేస్తారు. కానీ ఇక్కడే హెచ్-4 వీసా దారులకు ఆథరైజేషన్ సమయం ఎక్కువ కావడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఈ నేపథ్యంలో వారికి లబ్ధి చేకూరేలో జోబైడెన్ ప్రభుత్వం హెచ్-4 వీసా దారులు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ధరఖాస్తు ప్రక్రియను మరింత సులభ తరం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా, అమెరికన్ సెనెట్‌లో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో ‘జాతీయ భద్రతా ఒప్పందానికి’ ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. ప్రస్తుతమున్న నిబంధనలు మార్చి హెచ్-4 వీసాదారులకు ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్ కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు వైట్‌హౌట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా హెచ్-4 వీసా దారులకు లబ్ధి చేకూరుతుందని జోబైడెన్ తెలిపారు. -
వీసా ఫీజులు పెంచిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ, ఎల్–1, ఈబీ–5 తదితర నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపు ప్రకారం..భారతీయ టెక్కీలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే హెచ్–1బీ వీసా ఫీజు ప్రస్తుతమున్న 460 డాలర్ల నుంచి ఏకంగా 780 డాలర్లకు పెరిగింది. హెచ్–1బీ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 10 అమెరికన్ డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరగనుంది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. అదే విధంగా, ఎల్–1 వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు, ఇన్వెస్టర్ల వీసాగా పిలిచే ఈబీ–5 కేటగిరీ వీసా ఫీజును ప్రస్తుతమున్న 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచుతున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం బుధవారం ఒక నోటిఫికేషన్లో వివరించింది. 2016 తర్వాత మొదటిసారిగా చేపట్టిన వీసా ఫీజుల పెంపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానుంది. -
‘హెచ్-1బీ వీసా’.. ఆన్లైన్ ఫైలింగ్‌పై కీలక అప్డేట్!
అగ్రరాజ్యం అమెరికా వీసాల పునరుద్దరణ, జారీ వంటి అంశాలపై వరుస ప్రకటనలు చేస్తోంది. కొద్ది రోజుల స్వల్ప వ్యవధిలో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులకు ఎన్ని వీసాలు జారీ చేసిందో తెలిపింది. ఆ తర్వాత హెచ్-1 బీ వీసా రెన్యువల్ కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అయితే తాజాగా, ఈ ఏడాది 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1 బీ వీసా దరఖాస్తుల్లో కొన్ని మార్పులు చేసింది. కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనుంది. అవేంటనేది ఒక్కసారి పరిశీలిస్తే ♦2025 ఆర్థిక సంవత్సరానికి ప్రారంభ రిజిస్ట్రేషన్ వ్యవధి 2024 మార్చి 6 నుంచి ప్రారంభమై మార్చి 21 వరకు ఉంటుంది. దీనిని వీసా ఇన్షియల్ రిజిస్ట్రేషన్ పిరియడ్ అంటారు. ఈ స్వల్ప వ్యవధిలో సంస్థలు హెచ్ -1 బీ వీసా స్పాన్సర్ చేయాలనుకునే తమ ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లను సమర్పించాలి. ♦ప్రతి ఏటా కేవలం 65 వేల హెచ్-1బీ వీసాలను మాత్రమే యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) జారీ చేస్తుంది. అలాగే అమెరికాలో ఉన్నత విద్యనభ్యంసించిన 20 వేల మంది విదేశీ విద్యార్ధులకు ఈ వీసాలను అందజేస్తుంది. ♦ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం 2025లో సైతం నిబంధనలకు లోబడి 65 వేల హెచ్-1బీ వీసాలను జారీ చేస్తామని తెలిపింది. యూఎస్సీఐఎస్ విభాగం హెచ్-1 బీ వీసాల ధరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 1న (ఆర్ధిక సంవత్సరం) నుంచి చేపట్టనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ♦అక్టోబర్ నుంచి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తూ, మోసాలను తగ్గించేలా వీసా జారీలపై కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ♦ఇక ఈ వీసాల కోసం ధరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పుడు ధృవీకరణ పత్రాలు లేదంటే లేదా చెల్లని డాక్యుమెంట్లను జత చేస్తే హెచ్-1బీ ధరఖాస్తులను తిరస్కరించడం లేదా రద్దు చేయడం జరుగుతుందని యూఎస్సీఐఎస్ అధికారులు సూచిస్తున్నారు. ♦ఈ ఏడాది ప్రత్యేకం హెచ్-1 బీ వీసా అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ అందులో మోసాలకు చెక్‌పెట్టేలా ఆర్గనైజేషనల్ అకౌంట్స్ విధానాన్ని ప్రారంభించనుంది. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థలోని ఉద్యోగులకు హెచ్-1 బీ వీసా అప్లికేషన్‌ను రూపొందించే ప్రక్రియలో ఆయా వ్యాపార సంస్థలు, న్యాయ సలహాదారులు ఈ అకౌంట్స్ ద్వారా సమన్వయం చేసుకునే వీలు లభిస్తుంది. ఈ అకౌంట్ ద్వారా, నాన్ ఇమిగ్రంట్ వర్కర్ కోసం సమర్పించే ఫామ్ ఐ 129 (I-129), ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీస్‌కు అవకాశం కల్పించే ఫామ్ ఐ 907 (I-907) లను సులభంగా అప్లై చేయవచ్చు. ♦ఈ విధానం ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయని, ఇది హెచ్ 1 బీ వీసా ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో ఒక ముందడుగు గా భావిస్తున్నామని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం జాడౌ తెలిపారు. ♦ఐ -129, హెచ్ -1 బి పిటిషన్ల ఆన్ లైన్ ఫైలింగ్‌ను ప్రారంభించిన తర్వాత, మొత్తం హెచ్ -1 బీ అప్లికేషన్ విధానం పూర్తిగా ఎలక్ట్రానిక్ అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ నుంచి, అప్లికేషన్ పై తీసుకున్న తుది నిర్ణయాన్ని విదేశాంగ శాఖకు తెలియజేసే వరకు అంతా ఆన్ లైన్ అవుతుందని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం జాడౌ తెలిపారు. చదవండి👉 ‘హెచ్-1బీ వీసా’.. జోబైడెన్ ప్రభుత్వం కీలక ప్రకటన! -
‘హెచ్-1బీ వీసా’.. జోబైడెన్ ప్రభుత్వం కీలక ప్రకటన!
హెచ్ -1బీ వీసా రెన్యువల్‌పై అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు ఉద్యోగ ప్రయోజనాల కోసం దేశంలో తాత్కాలికంగా ఉండేందుకు వీలు కల్పించే హెచ్-1బీ వీసాను ఇక్కడే (అమెరికాలో) ఉండి తమ వీసాల పునరుద్ధరణ కోసం అప్లయ్ చేసుకోవాలని కోరింది. పాస్ పోర్ట్, వీసా మంజూరు, రెన్యువల్ చేసే యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కార్యాలయం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ డ్రైవ్‌లో ప్రారంభ దశలో 20,000 మంది దరఖాస్తుదారులు వీసా రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం, పైలట్ డ్రైవ్ కింద వీసా రెన్వువల్ చేసుకునేలా యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో వెసులు బాటు ఉంది. కానీ వీసా రెన్యువల్ కోసం దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల ప్రారంభంలో స్టేట్ డిపార్ట్మెంట్ షేర్ చేసిన నిబంధనల ప్రకారం 20,000 మంది దరఖాస్తుదారులు ప్రస్తుతం యుఎస్‌లో ఉండాలి. పునరుద్ధరణ ప్రక్రియ సమయంలో దేశం విడిచి వెళ్లకూడదు. హెచ్-1బీ వీసా కోసం దేశం వదిలి ప్రస్తుతం అమెరికన్ టెక్ సెక్టార్లో ఎక్కువ మంది భారతీయ నిపుణులే ఉన్నారు. వారికి అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా అందిస్తుంది. ఈ వీసా వ్యవధి ఆరేళ్లు మాత్రమే. ఆరేళ్ల తర్వాత రెన్యువల్ కోసం మన దేశానికి వచ్చి చేసుకోవాల్సి ఉంటుంది. వీసా రెన్యువల్ కోసం తప్పని తిప్పలు అయితే, వీసాల పునరుద్ధరణ సమయంలో భారతీయులకు అనేక ఇబ్బందులు తలెత్తుతుండేవి. ఒక్కసారి హెచ్-1బీ వీసా రెన్యువల్ కాకపోతే భార్య, పిల్లలతో కలిసి అమెరికాను వదిలి సొంత దేశమైన భారత్‌కు రావాల్సి వచ్చేది. దీంతో ప్రతి ఏడాది అమెరికాలో నివసిస్తున్న లక్షల మంది భారతీయులు బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. మోదీ పర్యటన.. రూల్స్ పక్కన పెట్టిన అమెరికా ప్రధాని మోదీ గత ఏడాది అమెరికా పర్యటించారు. పర్యటన అనంతరం జోబైడెన్ ప్రభుత్వ దాదాపూ 20 ఏళ్లగా అమలు చేస్తున్న నియమనిబంధనలు పక్కన పెట్టేసింది. వీసా రెన్యువల్ కోసం అమెరికాను వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడే ఉండి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత హెచ్-1బీ వీసా పునరుద్ధరణ కోసం పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. 2022లో మొత్తం 3.2 లక్షల హెచ్-1బీ వీసాలు ఇక మోదీ ఎఫెక్ట్‌తో అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు హెచ్-1బీ వీసా రెన్యువల్‌తో పాటు, వీసాల జారీ విషయంలో ప్రత్యేక ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ సిటిజన్‌షిప్ సర్వీసెస్ (USCIS) ప్రకారం జారీ 2022లో అగ్రరాజ్యం వలసదారులకు 4.41 లక్షల హెచ్-1బీ వీసాలను జారీ చేయగా.. అందులో భారతీయులు 3.2 లక్షల మంది పొందారు. -
భారతీయులకు మరో శుభవార్త.. యూఎస్ వీసాల జారీలో సరికొత్త రికార్డులు!
భారత్‌లో యూఎస్ వీసాల జారీలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో వీసాల మంజూరు 60 శాతం పెరిగాయి. బీ1, బీ2 విజిటింగ్ వీసాల కింద దాదాపు 7లక్షల వీసాలు జారీ చేయగా.. లక్షా 40 వేల స్టూడెంట్ వీసాలు జారీ చేసింది అమెరికన్ ఎంబసీ. ఫలితంగా విజిటర్ వీసా అపాయింట్మెంట్ కోసం నిరీక్షించే సమయం 75 శాతం తగ్గింది. గత ఏడాది ఏకంగా 1.4 మిలియన్ యూఎస్ వీసాల్ని అందించింది. ఈ ఏడాది హెచ్1బీ వీసాల మంజూరును పరిశీలిస్తామని యూఎస్ ఎంబసీ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రతి 10 వీసాల్లో ఒకరిది భారతీయులదేనని తెలిపింది. నిరీక్షణ సమయం తగ్గింది ప్రాసెస్ మెరుగుదల,పెట్టుబడుల కారణంగా విజిటింగ్ వీసాల కోసం అపాయింట్మెంట్ నిరీక్షణ సమయాన్ని సగటున 1,000 రోజుల నుండి 250 రోజులకు తగ్గించాయి. దీంతో విజిటింగ్ వీసాలు (B1/B2) యూఎస్ ఎంబసీ చరిత్రలో రెండవ సారి 7లక్షల కంటే అత్యధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. విదేశీ విద్యార్ధుల్లో భారతీయులే అధికం భారత్‌లోని యుఎస్ కాన్సులర్ బృందం 2023లో 1,40,000 స్టూడెంట్ వీసాలను జారీ చేసింది. ఈ మంజూరు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారీ మొత్తంలో భారతీయులకు మంజూరు చేసి వరుసగా మూడవ సంవత్సరం రికార్డు సృష్టించింది.తద్వారా అమెరికాలోని అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో భారతీయ విద్యార్థులే ఎక్కువమంది ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్లో చదువుతున్న ఒక మిలియన్ విదేశీ విద్యార్థులలో నాలుగో వంతు కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. హెచ్1బీ వీసా దారలు సైతం 2023లో భారతీయులు, వారి కుటుంబ సభ్యుల కోసం 3,80,000 ఉద్యోగ వీసాలకు ప్రాసెసింగ్ చేయాల్సి వచ్చింది. యూఎస్ మిషన్‌కు కనీస అపాయింట్మెంట్ వెయిట్ టైమ్‌ని తగ్గించేందుకు వీలుగా కాన్సులర్ బృందం భారత్‌లోని చెన్నై, హైదరాబాద్‌లలో పిటిషన్ ఆధారిత వీసా ప్రాసెసింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది. మరోవైపు ఈ సంవత్సరం పైలట్ ప్రోగ్రామ్ అర్హతగల హెచ్1 బీ హోల్డర్లను యునైటెడ్ స్టేట్స్లో వారి వీసాలను పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది. భారతీయులకు శుభవార్త మహమ్మారి కారణంగా ఆలస్యం అయిన 31,000 ఇమ్మిగ్రెంట్ వీసా క్యూను యూఎస్ ముంబై కాన్సులేట్ జనరల్ తగ్గించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్‌ను కలిగి ఉన్నవారు, షెడ్యూలింగ్ కోసం సిద్ధంగా ఉన్న అభ్యర్ధులు ఇప్పుడు స్టాండర్డ్, ప్రీ-పాండమిక్ అపాయింట్మెంట్ విండోలో అపాయింట్మెంట్ పొందవచ్చని ఈ సందర్భంగా వీసా కోసం ఎదురు చూస్తున్నవారికి ఎంబసీ శుభవార్త చెప్పింది. -
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన!
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా ధరఖాస్తుల కోసం ఆన్లైన్ ఫైలింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని తెలిపింది. దీంతో పాటు హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ల సమర్పణను ప్రారంభించే ఆర్గనైజేషనల్ అకౌంట్స్‌ను ప్రారంభించనుంది. వీటిని సంస్థాగత ఖాతాలు అని పిలుస్తారు. సంస్థాగత ఖాతాల్లో ఒక సంస్థ లేదా ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వారి కోసం సంస్థ తరుపున పనిచేసే న్యాయపరమైన వ్యవహారాలు చూసుకునే ప్రతినిధులను హెచ్ -1బీ రిజిస్ట్రేషన్లు, ఫారమ్ ఐ-129, వలసేతర వర్కర్ కోసం ప్రీమియం ప్రాసెసింగ్ దరఖాస్తుదారుల కోసం ఫారమ్-ఐ 907ను అనుమతి ఇస్తుంది. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) విభాగాల్లో కీలక మార్పులు చేటుచేసుకున్నాయి. వాటిల్లో ప్రధానంగా ఫీచర్లు: హెచ్-1బీ రిజిస్ట్రెంట్ ఖాతాలతో చట్టపరమైన ప్రతినిధులు, సంస్థల కోసం సంస్థాగత ఖాతాలు మెరుగైన డిజైన్ కేస్ మేనేజ్మెంట్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఫైలింగ్ ఆప్షన్స్ : హెచ్-1బీ పిటిషనర్లు తమ సంస్థ ఖాతాల ద్వారా ఫారమ్‌లు ఐ-129, అనుబంధిత ఫారమ్ ఐ-907 ప్రీమియం ప్రాసెసింగ్ అభ్యర్థనలను ఆన్లైన్లో ఫైల్ చేయవచ్చు. ఆన్లైన్ ఫైలింగ్ కోసం చట్టపరమైన ప్రతినిధి ద్వారా చేసుకోవచ్చు. లేదంటే పేపర్ ఆధారిత ఫైలింగ్‌ని ఎంచుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ : హెచ్-1బీ వీసా నమోదు ప్రక్రియ ప్రత్యేకంగా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. యూజర్ ఫీడ్ బ్యాక్ : యూఎస్సీఐఎస్ వివిధ స్టేక్ హోల్డర్స్‌తో కలిసి యుజబిలిటి టెస్టింగ్‌ను నిర్వహించనుంది. ఫలితంగా ఆర్గనైజేషనల్ అకౌంట్ పూర్తి స్థాయిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కంటిన్యూడ్ ఫీడ్‌బ్యాక్ : యూఎస్ సీఐఎస్ వినియోగదారుల అభిప్రాయాన్ని సేకరించి, యూజర్ ఎక్స్పీరీయన్స్ను అందించే ప్రయత్నాలు చేయనుంది. నేషనల్ ఎంగేజ్మెంట్: యూఎస్సీఐఎస్ జనవరి 23, జనవరి 24న నేషనల్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రక్రియ ద్వారా సంస్థలు, చట్టపరమైన ప్రతినిధులకు నిర్దేశం చేసేందుకు సంస్థాగత ఖాతాల సమాచారాన్ని అందిస్తుంది. ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ : హెచ్-1బీ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తులను సమాచార సెషన్లకు హాజరు కావడానికి యూఎస్సీఐఎస్ ప్రోత్సహిస్తుంది. సంస్థాగత ఖాతాలు, ఆన్లైన్ ఫైలింగ్ వివరాలు హెచ్ -1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పేజీలో అందుబాటులో ఉంటాయి. -
అమెరికన్ వీసా మంజూరులో మార్పులు.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
డాలర్ డ్రీమ్‌ను నెరవేర్చుకోవాలనుకునే ప్రతి పౌరుడి కలల్ని నిజం చేసేలా అమెరికా ప్రభుత్వం వీసాల మంజూరులో తగు మార్పులు చేస్తూ వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ తరుణంలో 2023 వీసాల జారీ అంశంలో జోబైడెన్ ప్రభుత్వం ఏయే మార్పులు చేసిందో తెలుసుకుందాం. హెచ్-1బీ, ఈబీ-5, స్టూడెంట్ వీసాలు (ఎఫ్, ఎం, జే) సహా వివిధ కేటగిరీలను ప్రభావితం చేసేలా 2023లో గణనీయమైన మార్పులు చేసింది. వాటిల్లో హెచ్-1బీ వీసా పునరుద్ధరణకు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే టెక్నాలజీ రంగాల్లో ప్రతిభావంతులైన నిపుణులకు హెచ్-1 బీ వీసా తప్పని సరి. ఇప్పుడీ వీసాల పునరుద్ధరణ కోసం ఈ ఏడాది పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. జనవరిలో అమెరికా విదేశాంగ శాఖ హెచ్-1బీ డొమెస్టిక్ వీసా రెన్యువల్ పైలట్‌ను పరిమితంగా ప్రవేశపెట్టి 20,000 మందిని తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు అనుమతించింది. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు వీసా రెన్యూవల్ కోసం వారి దేశానికి వెళ్లే పనిలేకుండా తమ దేశంలోనే రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే వారి జీవిత భాగస్వాములు ఈ ప్రక్రియకు అనర్హులుగా గుర్తించింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లలో అధిక ప్రాతినిధ్యాన్ని అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం 2023లో కఠిన చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం. అయితే ఇప్పుడు యజమానులు ప్రతి నమోదుదారుకు పాస్ పోర్ట్ సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నో పేపర్.. ఇకపై అంతా అన్లైన్ 2023లో అమెరికా ప్రభుత్వం వీసా ధరఖాస్తును ఆన్లైన్లోనే చేసుకునే వెసలు బాటు కల్పించింది. పేపర్ వర్క్ వల్ల చిన్న చిన్న పొరపాట్లు తలెత్తి వీసా రిజెక్ట్‌లు అవుతున్న సందర్భాలు అనేకం. దీని వల్ల అభ్యర్ధులు అమెరికాకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల్ని అధిగమించేలా పేపర్‌పై ధరఖాస్తు చేసుకోవడాన్ని తగ్గించింది. ఆన్లైన్లో వీసా ప్రాసెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈబీ-5 వీసా దరఖాస్తుదారులకు అక్టోబర్ 2023 లో, యూఎస్ఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) ఈబీ -5 వీసా విధానంలో మార్పులు చేసింది. ఎవరైతే ఈబీ-5 వీసా పొంది దాన్ని రీఎంబర్స్మెంట్ చేయించుకున్న రెండేళ్ల తర్వాత గ్రీన్ కార్డ్‌కు అర్హులుగా గుర్తిస్తుంది. ఈ ఏడాది ఈబీ-5 వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ వేగాన్ని కూడా యూఎస్ సీఐఎస్ గణనీయంగా పెంచింది. ఈబీ–5 వీసా అంటే.. అమెరికాలో గ్రీన్కార్డ్కు దాదాపు సమానమైన గుర్తింపు ఉన్నదే ఈబీ–5 వీసా. అంతటి ప్రాధాన్యమున్న ఈ వీసా పొందాలంటే వ్యక్తులు అమెరికాలో కనీసం 8 లక్షల అమెరికన్ డాలర్లను (భారతీయ కరెన్సీలో రూ.6.57 కోట్లు) పెట్టుబడిగా పెట్టడంతోపాటు కనీసం 10 ఉద్యోగాలను కల్పించాలి. దాంతో వారికి పెట్టుబడిదారుల హోదా కింద ఈబీ–5 వీసాను జారీచేస్తారు. ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయాలంటే గతంలో 5 లక్షల అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని నిబంధన ఉండేది. కానీ, ఈ వీసాల కోసం డిమాండ్ పెరుగుతుండడంతో యూఎస్సీఐఎస్ ఈ కనీస పెట్టుబడి మొత్తాన్ని 2022లో 8 లక్షల డాలర్లకు పెంచింది. స్టూడెంట్ వీసా పాలసీల అప్ డేట్ అమెరికన్ కాన్సులర్ అధికారులు చేసే వీసా ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఖర్చులకు అనుగుణంగా ఎఫ్, ఎం, జే వీసాల ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు జోబైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక, కాన్సులర్ అధికారులు ఇప్పుడు విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలిస్తారని తెలిపింది. -
అమెరికాలోనే హెచ్–1బీ వీసాల రెన్యూవల్
వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులకు అమెరికా స్టేట్ ఫర్ వీసా సరీ్వసెస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రెటరీ జూలీ స్టఫ్ట్ శుభవార్త చెప్పారు. హెచ్–1బీ వీసాల రెన్యూవల్ (స్టాంపింగ్) కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని, అమెరికాలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ నుంచి మూడు నెలలపాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కొన్ని కేటగిరీల్లో హెచ్–1బీ వీసాలకు డొమెస్టిక్ రెన్యూవల్ ప్రక్రియ డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో భారత ఐటీ నిపుణులు హెచ్–1బీ వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాజా నిర్ణయంతో వీరికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వ్యయ ప్రయాసలు తప్పుతాయి. అయితే, తొలి దశలో 20,000 మందికే ఈ వెసులుబాటు కలి్పంచనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత దశల వారీగా మరికొంతమందికి అవకాశం కలి్పస్తారు. డిసెంబర్ నుంచి మూడు నెలల్లోగా హెచ్–1బీ వీసా గడువు ముగిసేవారు వీసా రెన్యూవల్ (స్టాంపింగ్)ను అమెరికాలోనే చేసుకోవచ్చు. అమెరికా వీసాలకు భారత్‌లో భారీ డిమాండ్ ఉందని జూలీ స్టఫ్ట్ గుర్తుచేశారు. వీసా కోసం కొన్ని సందర్భాల్లో ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వస్తోందని చెప్పారు. భారతీయులకు సాధ్యమైనంత త్వరగా వీసా అపాయింట్మెంట్లు ఇవ్వాలని భావిస్తున్నామని వివరించారు. ఇందులో ఒక మార్గంగా డొమెస్టిక్ వీసా రెన్యూవల్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. దీనివల్ల భారతీయ టెకీలకు లబ్ధి కలుగుతుందన్నారు మనవారికి 1.4 లక్షల వీసాలు 2022లో భారత విద్యార్థులకు రికార్డు స్థాయిలో 1.4 లక్షలకుపైగా వీసాలు జారీ చేసినట్లు స్టఫ్ట్ వెల్లడించారు. అమెరికా వర్సిటీల్లో తరగతుల ప్రారంభానికి ముందే భారత్‌లో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేయడానికి సిబ్బంది కొన్నిసార్లు వారమంతా పనిచేస్తున్నారని తెలిపారు. -
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త!
అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. హెచ్-1బీ వీసా రెన్యూవల్ కోసం దేశం వచ్చే అవసరం లేకుండా అక్కడే ఉండి వీసా రెన్యూవల్ చేసుకునే అవకాశాన్ని బైడెన్ ప్రభుత్వం కల్పించనుంది. కొన్ని కేటగిరీల హెచ్-1బీ వీసాలను దేశీయంగానే (అమెరికాలో ఉండి) రెన్యువల్ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్‌ను డిసెంబర్ నెలలో ప్రారంభించనుంది. తద్వారా అమెరికాలో ఉంటున్న ఎక్కువ మంది భారత ఐటీ నిపుణులకు లబ్ధి చేకూరనున్నట్లు యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో యూఎస్ వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అమెరికా వీసా కావాలంటే సుమారు ఆరు నెలల లేదంటే ఏడాది పాటు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇకపై అలా ఎదురు చూసే అవసరం లేకుండా ప్రణాళికల్ని సిద్ధం చేశాం. ఇందులో భాగంగా అమెరికాలో ఉంటూ యూఎస్ వీసా రెన్యూవల్ కోసం ఎదురు చూస్తున్న విదేశీయుల (అందులో భారతీయులు కూడా ఉన్నారు) కోసం ప్రత్యేకంగా డొమెస్టిక్ వీసా రెన్యూవల్ ప్రోగ్రామ్‌ను త్వరలో ప్రారంభించనున్నాం. డిసెంబర్లో ప్రారంభించబోయే వీసా రెన్యూవల్ పైలెట్ ప్రోగ్రామ్‌లో సుమారు 20వేల వీసాల్ని రెన్యూవల్ చేసే అవకాశం కల్పించనున్నాం. ఈ ప్రాజెక్ట్‌తో అమెరికాలో నివసిస్తున్న ఎక్కువ మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుంది. దశల వారీగా వీసా రెన్యూవల్ సంఖ్యను మరింత పెంచుతాం’’ అని జూలీ స్టఫ్ అన్నారు. 20 ఏళ్ల క్రితం అమెరికాలో నివసిస్తున్న నిపుణుల్లో భారతీయులే ఎక్కువ. అయితే ఈ నిపుణులకు స్థానిక కంపెనీలు హెచ్-బీ వీసాను అందిస్తుంటాయి.రెన్యూవల్ సైతం అక్కడే ఉండి చేసుకోవచ్చు. ఈ వీసా రెన్యూవల్ ప్రాసెస్ 2004 వరకు ఉండేది. అయితే క్రమంగా వీసా నిబంధనలు మారాయి. అలా అమెరికాలో ఉంటున్న భారతీయులు వీసా రెన్యూవల్ కోసం భారత్ వచ్చి వీసా రెన్యూవల్ చేయించుకుని తిరిగి వెళ్లే వారు. కానీ భారత ప్రధాని మోదీ ఈ ఏడాది జూన్ 21 నుంచి 24 వరకు చేసిన అమెరికా పర్యటనతో వీసా జారీలలో అనేక మార్పులు చేస్తూ వచ్చింది. తాజాగా 20 ఏళ్ల తర్వాత అమెరికాలోనే ఉండి హెచ్-1 బీ వీసాలను అక్కడే ఉండి రెన్యూవల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయం తీసుకున్నారు. -
హెచ్–1బీ ప్రోగ్రాంలో మార్పులు
వాషింగ్టన్: ఐటీ తదితర కీలక రంగాలకు చెందిన విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో పని చేసెందుకు వీలు కలి్పంచే కీలకమైన హెచ్–1బీ వీసా ప్రోగ్రాంలో మార్పుచేర్పులను బైడెన్ సర్కారు ప్రతిపాదించింది. అర్హత ప్రమాణాలు తదితరాలను మరింత క్రమబద్ధం చేయడం, తద్వారా వీసా ప్రక్రియ సామర్థ్యాన్ని పెంచడం, ఎఫ్–1 స్టూడెంట్లకు, పారిశ్రామికవేత్తలకు, నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్లకు మెరుగైన పరిస్థితులు కలి్పంచేందుకు ఈ మార్పులు దోహదపడతాయని చెబుతోంది. సదరు నిబంధనలను సోమవారం విడుదల చేయనున్నారు... ► ప్రస్తుత ప్రక్రియలో ఒక దరఖాస్తుదారు తరఫున ఎన్ని ఎక్కువ రిజి్రస్టేషన్లు నమోదయితే లాటరీలో ఎంపికయ్యే అవకాశాలు అంత పెరుగుతాయి. ► ప్రతిపాదిత విధానంలో ఒకరి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు నమోదైనా ఎంపిక ప్రక్రియలో ఒక ఎంట్రీగానే పరిగణిస్తారు. ► తద్వారా కొందరికే ఎక్కువ అడ్వాంటేజీకి బదులు అర్హులందరికీ సమానావకాశం దక్కుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. ► ఈ ప్రతిపాదనలపై అందరూ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు వెల్లడించవచ్చని డీహెచ్ఎస్ పేర్కొంది. ► అమెరికా ఏటా విడుదల చేసే 60 వేల హెచ్–1బీ వీసా కోటాలో మార్పుండదు. -
సాక్షి ఇమ్మిగ్రేషన్ లైవ్ టాక్ షో
-
ఆయన గెలిస్తే భారతీయ టెక్కీల అమెరికా ఆశలు గల్లంతే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే హెచ్-1బీ (H-1B) వీసాల జారీని ఎత్తేస్తానని రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను "ఒప్పంద దాస్యం"గా అభివర్ణించారు. లాటరీ ఆధారిత ఈ వీసా వ్యవస్థను తొలగించి దాన్ని మెరిటోక్రాటిక్ అడ్మిషన్‌తో భర్తీ చేస్తానని ప్రమాణం చేశారు. అమెరికా వెళ్లే భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకునేది హెచ్-1బీ వీసానే. ఇది వలసేతర వీసా. సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి యూఎస్ కంపెనీలకు ఇది అనుమతిస్తుంది. (Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!) భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు ఈ హెచ్-1బీ వీసాపైనే ఆధారపడుతుంటాయి. రామస్వామి స్వయంగా ఈ వీసా ప్రోగ్రామ్‌ను 29 సార్లు ఉపయోగించుకోవడం గమనార్హం. రామస్వామి స్వయంగా 29 దరఖాస్తులు 2018 నుంచి 2023 వరకు రామస్వామి పూర్వ కంపెనీ రోవాంట్ సైన్సెస్ కోసం H-1B వీసాల కింద ఉద్యోగులను నియమించుకోవడానికి 29 దరఖాస్తులను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించింది. అయినప్పటికీ H-1B వీసా వ్యవస్థ సక్రమంగా లేదని రామస్వామి చెప్పినట్లుగా యూఎస్ రాజకీయ వార్తా పత్రిక పొలిటికో పేర్కొంది. రామస్వామి 2021 ఫిబ్రవరిలో రోవాంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రకటించే వరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. స్వతహాగా వలసదారుల సంతానమైన రామస్వామి.. ఇమ్మిగ్రేషన్ పాలసీని ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. సరిహద్దును కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని, అమెరికాలో జన్మించిన పత్రాలు లేని వలసదారుల పిల్లలను బహిష్కరిస్తానని కూడా చెప్పారు. (దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..) కాగా H-1B వీసాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2021 ఆర్థిక సంవత్సరానికి 85,000 వీసా స్లాట్లు అందుబాటులో ఉండగా అమెరికన్ కంపెనీలు ఏకంగా 7,80,884 దరఖాస్తులను సమర్పించాయి. అంతకుముందు ఏడాది కంటే ఆ సంవత్సరంలో కాగా H-1B వీసా దరఖాస్తులు 60 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. -
అమెరికాలో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్న భారతీయులు.. కారణం అదేనా?
అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారనుందా? ఓ వైపు ఆర్ధిక మాంద్యం, మరోవైపు లేఆఫ్స్‌తో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా అక్కడ నెలకొన్న పరిస్థితులు. అగ్రరాజ్యంలో శాశ్వత నివాస హోదా పొందాలంటే ‘గ్రీన్ కార్డ్’ తప్పని సరి. ఇప్పుడీ గ్రీన్ కార్డ్ పొందే విషయంలో లక్షల మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు లక్ష మందికిపైగా పిల్లలు వారి తల్లిదండ్రుల్ని వదిలి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. 18లక్షలు దాటిన సంఖ్య అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. అయితే, ఇప్పుడా హెచ్1బీ వీసా దారులు అమెరికాలో శాస్వత నివాసం ఉండేందుకు గ్రీన్ కార్డ్ కావాలి. వారి సంఖ్య 18 లక్షలు దాటింది. 134ఏళ్లు ఎదురు చూడాలా? ప్రతి ఏడాది ఆయా దేశాల బట్టి అగ్రరాజ్యం గ్రీన్ కార్డ్‌లను మంజూరు చేస్తుంది. అలా భారత్‌కు ప్రతి ఏడాది 7 శాతం అంటే 65,000 గ్రీన్ కార్డ్‌లను అందిస్తుంది. అయితే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న 18 లక్షల మందికి వాటి (గ్రీన్ కార్డ్) ప్రాసెసింగ్‌కు పడుతున్న సమయాన్ని లెక్కలోకి తీసుకుంటే ఎదురు చూడాల్సి సమయం అక్షరాల 134 ఏళ్లు. తల్లిదండ్రుల నుంచి విడిపోవడం తప్పదా? ఉద్యోగం చేస్తూ చాలా సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న ఇతర దేశస్థులకు పర్మినెంట్ రెసిడెన్సీ హోదాను గ్రీన్ కార్డ్ కల్పిస్తుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో హెచ్-1బీ వంటి వీసాలు ఉంటాయి. చాలా మంది ఉద్యోగం చేస్తూనే అక్కడ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వీరి పిల్లలు.. 21ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు తల్లిదండ్రుల వద్ద ఉండొచ్చని హెచ్-4 వీసా నిబంధనలు చెబుతున్నాయి. ఈలోపు తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ వస్తే మంచిదే! లేకపోతే.. పిల్లలు, సొంత దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డ్ అంటే ఏంటి? అమెరికాలో గ్రీన్‌కార్డ్, సిటిజన్ షిప్ కావాలంటే హెచ్1బీ అనే వర్క్ పర్మిట్ మీద అక్కడికి వెళ్లాలి. ఆ వర్క్ పర్మిట్ రావాలంటే అమెరికాలో ఉన్న కంపెనీ మన దేశంలో ఉన్న మనకి ఈ హెచ్1బీ వీసా ఇస్తుంది. హెచ్1 బీ వీసా వచ్చింది. అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడ కనీసం 6 ఏళ్ల పని చేయాల్సి ఉంటుంది. అనంతరం గ్రీన్ కార్డ్ కోసం అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అన్వేక కారణాల వల్ల నిర్ణీత సమయంలో ఆ గ్రీన్ కార్డ్‌ను పొందలేకపోతే తిరిగి స్వదేశానికి వెళ్లాలి. ఒక ఏడాది పాటు అక్కడే ఉండి హెచ్1బీ వీసా మీద అమెరికాకు వచ్చి గ్రీన్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. గ్రీన్ కార్డ్ వచ్చిన 5 ఏళ్ల తర్వాత అమెరికా పౌరులుగా (american citizenship) గుర్తింపు పొందుతాం. గ్రీన్ కార్డ్‌కి, సిటిజన్ షిప్కి తేడా హెచ్1 బీ వీసాతో అమెరికాకు వెళ్లి ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం పొందాలంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అదే గ్రీన్ కార్డ్, లేదంటే అమెరికా సిటిజన్ షిప్ ఉంటే ఉద్యోగాలు త్వరగా వస్తాయి. జీతాలు సైతం భారీగా ఉంటాయి. భారత్‌లో ఉంటే కష్టమే భారత్‌లో ఉండి హెచ్1బీ వీసా తెచ్చుకోవడం కొంచెం కష్టమే. కాబట్టే భారతీయ విద్యార్ధులు చదువు కోసం అమెరికా వెళతారు. ఎడ్యుకేషన్ వీసాతో అమెరికా వెళ్లి 2ఏళ్ల పాటు చదివితే హెచ్1 బీ వీసా లేకపోయినా మరో 3ఏళ్లు అక్కడ ఉండే అవకాశం కలుగుతుంది. రెండేళ్లు చదువు పూర్తి చేసుకున్న అనంతరం జాబ్ చేస్తాం కాబట్టి హెచ్1 బీ వీసా వెంటనే పొందవచ్చు. మోదీ పర్యటనతో ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముందు బైడెన్ సర్కార్ అమెరికాలోని భారతీయులకు మేలు కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిమెంట్ ఆధరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడి) కోసం కొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది. దీంతో అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వేలాది మంది భారతీయులకు ప్రయోజనం కలగనుంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్ కార్డ్ అర్హతలను సరళతరం చేసింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హతలకు సంబంధించి కొత్త మార్గ దర్శకాలు జారీ చేసింది. అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వారి కలను సాకారం చేసుకునేందుకు ఈ నిర్ణయం దోహద పడుతుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లి అక్కడే శాస్వతంగా స్థిరపడాలనుకునే వలసదారులకు అమెరికా పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ గ్రీన్ కార్డ్ లను జారీ చేస్తారు. అమెరికా ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం.. ప్రతి ఏటా లక్షా 40 వేల గ్రీన్ కార్డ్‌లను జారీ చేస్తారు. అయితే, ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్యలో మాత్రమే గ్రీన్ కార్డ్ కార్డ్‌లను జారీ చేస్తారు. ప్రస్తుతం, మొత్తం ధరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. ఈ ఏడీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే గ్రీన్ కార్డ్‌లను జారీ చేస్తున్నారు. తాజాగా, ఈఏడీ నిబంధనల్ని సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలగనుంది.గ్రీన్ కార్డ్ కోసం కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ నూతన మార్గదర్శకాలు వర్తింప చేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. చదవండి👉మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం -
హెచ్-1బీ: భారతీయ టెక్ నిపుణులకు శుభవార్త
US-Canada H-1B visa holders: అమెరికా హెచ్-1 బి వీసాదారులకు కెనడా శుభవార్త వెల్లడించింది. హెచ్-1 బీ వీసాదారులు ఇకపై కెనడాలో కూడా పనిచేయవచ్చని తాజాగా ప్రకటించింది. అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను ఆకర్షించేందుకు యూఎస్ హెచ్-1 వీసా హోల్డర్లకు ఓపెన్ వర్క్ పర్మిట్లను ఇవ్వడం ప్రారంభించింది. దీని ద్వారా అమెరికాలో ఉన్న 75 శాతం భారత హెచ్-1బీ వీసాదారులకు ప్రయోజనం చేకూరనుంది. (హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన అదానీ) ఈ కొత్త పథకం ద్వారా కెనడా ప్రభుత్వం10వేల మంది దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ వీసా హోల్డర్లు కెనడాలో మూడు సంవత్సరాల పాటు పని చేయడానికి అనుమతిస్తుంది. ఈ వీసా హోల్డర్ల కుటుంబ సభ్యుల చదువుకోవచ్చు లేదా దేశంలో పని చేసుకోవచ్చు. ఇందుకు తాత్కాలిక నివాస వీసా, వర్క్ లేదా స్టడీ పర్మిట్ లభిస్తుందని పేర్కొంది. ఇప్పటిదాకా యూఎస్‌లో పని చేసే హెచ్-1 బీ హోల్డర్లు స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసాను ఉపయోగించేవారు. కాగా 2023 వసంవత్సరం జులై 16వతేదీ నాటికి హెచ్1 బి వీసా హోల్డర్లు, వారితో పాటు కుటుంబ సభ్యులు కెనడాకు రావడానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కెనడా ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. టెక్ కంపెనీలు ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల ఉద్యోగులను నియమించు కుంటాయి. (అత్యధిక ట్యాక్స్ కట్టే బీటౌన్ భామ ఎవరో తెలుసా? నెటవర్త్ తెలిస్తే షాకవుతారు) -
ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్.. హెచ్–1బీ వీసా రెన్యువల్ ఇక అక్కడే!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాలో ఉపాధి పొందిన భారతీయులకు శుభవార్త!. వర్క్ వీసాల రెన్యువల్ కోసం ఆయా వీసాదారులు ఇకపై స్వదేశం(భారత్)కు వెళ్లిరావాల్సిన పనిలేకుండా వారికి అమెరికాలోనే పునరుద్ధరణ సేవలు పొందే సదావకాశం కల్పించాలని అమెరికా సర్కార్ యోచిస్తోంది. ఈ నిర్ణయం అమలైతే వేలాది మంది భారతీయులకు ఎంతో సమయం, విమాన ఖర్చులు ఆదా అవుతాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా భారతీయులకు అగ్రరాజ్యం అందిస్తున్న కానుకగా ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు అభివర్ణించారు. నైపుణ్య ఉద్యోగాల్లో నియామకాల కోసం అమెరికా కంపెనీలు విదేశీయులకు హెచ్–1బీ వీసాలిచ్చి అమెరికాకు రప్పించడం తెల్సిందే. ఇలా హెచ్–1బీ వీసాలు పొందుతున్న వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉండటం విశేషం. ‘వీసా రెన్యువల్ కోసం సొంత దేశానికి వెళ్లకుండానే అమెరికాలోనే ఆ పని పూర్తయ్యేలా మొదట పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలుచేస్తాం. త్వరలోనే ఇది మొదలుపెడతాం. హెచ్–1, ఎల్ వీసా దారులకు ఇది ఎంతో ఉపయోగకరం’ అని ఆ అధికారి వెల్లడించారు. 2004 ఏడాదికి ముందువరకు నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల్లో కొన్ని విభాగాల వీసాలకు అమెరికాలోనే రెన్యువల్/స్టాంపింగ్ ఉండేది. తర్వాత పద్దతి మార్చారు. హెచ్–1బీ వంటి వీసాదారులు ఖచ్చితంగా సొంత దేశం వెళ్లి వీసా పొడిగింపు సంబంధ స్టాంపింగ్‌ను పాస్‌పోర్ట్‌పై వేయించుకోవాలి. ఈ ప్రయాస తగ్గించాలనే అమెరికా భావిస్తోంది. కాగా, గత కొద్దినెలలుగా వీసాల జారీ ప్రక్రియను అమెరికా ప్రభుత్వం మరింత సరళతరం, వేగవంతం చేయడం విదితమే. చదవండి: దేశ ఆయుధ పరిశ్రమలో నవశకం ! -
ప్రతినిధుల సభలో అమెరికా పౌరసత్వ చట్టం
వాషింగ్టన్: గ్రీన్‌కార్డుల జారీలో దేశాల వారీ కోటాను ఎత్తివేయడంతోపాటు హెచ్–1బీ వీసాల జారీలో మార్పుల కోసం ఉద్దేశించిన అమెరికా పౌరసత్వ చట్టం–2023ను అధికార డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం 1 కోటి మందికిపైగా అమెరికా పౌరసత్వం కల్పించేందుకు రోడ్‌మ్యాప్ రూపొందిస్తారు. అక్రమంగా వలస వచ్చిన వారికి, ధ్రువ పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారికి పౌరసత్వం లభించనుంది. గ్రీన్‌కార్డ్ జారీ సులభం కానుంది. దేశాలవారీ కోటా రద్దు చేస్తారు. తక్కువ వేతనం ఇచ్చే పరిశ్రమల్లో పనిచేసేవారు కూడా గ్రీన్‌కార్డులు సులువుగా పొందవచ్చు. హెచ్1బీ వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. -
భారతీయులకు ఈసారి 10 లక్షలకుపైగా వీసాలు..!
వాషింగ్టన్: భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నవేళ భారతీయుల వీసా ప్రక్రియను వేగిరం చేసి ఈ ఏడాది 10 లక్షలకుపైగా వీసాలు జారీచేస్తామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. విద్యార్థి వీసాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేందుకు బైడెన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని అమెరికా సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా విభాగం) డొనాల్డ్ లూ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు. ‘ వీసా ప్రాసెసింగ్ ప్రక్రియలో హెచ్–1బీ, ఎల్–వీసాలకూ తగిన ప్రాధాన్యత కల్పిస్తాం. విద్యార్థి వీసాలు, ఇమిగ్రెంట్ వీసాలుసహా మొత్తంగా ఈ ఏడాది ఏకంగా 10 లక్షలకుపైగా వీసాలను మంజూరుచేస్తాం. ఈసారి సమ్మర్ సీజన్లో అమెరికాలో విద్యనభ్యసించనున్న భారతీయ విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్‌ను పూర్తిచేస్తాం’ అని చెప్పారు. బీ1(వ్యాపారం), బీ2(పర్యాటక) కేటగిరీలుసహా తొలిసారిగా వీసా కోసం దరఖాస్తుచేసుకున్న వారి అప్లికేషన్ల వెరిఫికేషన్ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉన్న విషయం విదితమే. అమెరికాకు వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్ రెండోస్థానంలో ఉంది. కొన్ని చోట్ల 60 రోజుల్లోపే.. ‘హెచ్–1బీ, ఎల్ వీసాల జారీపైనా దృష్టిపెట్టాం. భారత్‌లోని కొన్ని కాన్సులేట్లలో ఈ వీసాల కోసం వేచిఉండే కాలం 60 రోజుల్లోపే. అమెరికా, భారత్ ఇరుదేశాల ఆర్థికవ్యవస్థకు ఈ వర్కింగ్ వీసాలు కీలకం. అందుకే వీటి సంగతీ చూస్తున్నాం’ అని వెల్లడించారు. ‘ పిటిషన్ ఆధారిత నాన్ఇమిగ్రెంట్ విభాగాల కింద దరఖాస్తుచేసిన వీసాదారులు తమ వీసా రెన్యువల్ కోసం మళ్లీ స్వదేశానికి వెళ్లిరావాల్సిన పనిలేకుండా అమెరికాలోనే పని పూర్తిచేసుకునేలా ఏర్పాటుచేయదలిచాం. ఇక ఆర్థిక అనిశ్చితి కారణంగా ఉద్యోగాలు కోల్పోయి 60 రోజుల్లోపు అమెరికాను వీడాల్సిన ప్రమాదం ఎదుర్కొంటున్న హెచ్–1బీ వీసాదారులకు.. అవకాశమున్న మరికొన్ని ‘వెసులుబాట్ల’ను వివరిస్తూ అదనపు సమాచారాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఇచ్చింది’ అని వివరించారు. -
H-1B వీసాదారులకు శుభవార్త..
-
వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు
వాషింగ్టన్: ఆర్థిక సంక్షోభ భయాలతో అమెరికాలో టెక్ కంపెనీలు హెచ్–1బీ వీసాదారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తరుణంలో వారి జీవితభాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని అమెరికా న్యాయమూర్తి ఒకరు తీర్పు చెప్పారు. దీంతో అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు పోయి ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయ టెకీలకు పెద్ద ఊరట లభించినట్లయింది. అమెరికాలో ప్రత్యేక ఉపాధి, నైపుణ్య వృత్తుల్లోకి తీసుకునేందుకు అక్కడి కంపెనీలు నాన్ ఇమిగ్రెంట్ హెచ్–1బీ వీసాలతో భారత్‌వంటి దేశాలకు చెందిన విదేశీ నిపుణులకు కొలువులు కల్పిస్తున్న విషయం విదితమే. అయితే ఇలా ఏటా వేలాదిగా తరలివస్తున్న హెచ్–1బీ వీసాదారులు, వారి భాగస్వాముల కారణంగా స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ వాషింగ్టన్‌లోని జిల్లా కోర్టులో దావా వేసింది. హెచ్–1బీ వీసాదారుల జీవితభాగస్వాములూ జాబ్ కార్డ్ సాధించి ఉద్యోగాలు చేసేందుకు వీలు కల్పిస్తున్న ఒబామా కాలంనాటి నిబంధనలను కొట్టేయాలని సంస్థ కోరింది. ఈ దావాను అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల దాదాపు లక్ష మంది జీవితభాగస్వాములకు పని చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కేసును మార్చి 28వ తేదీన జిల్లా మహిళా జడ్జి తాన్య చుత్కాన్ విచారించారు. ‘అమెరికా ప్రభుత్వం పూర్తి బాధ్యతతోనే వారికి వర్క్ పర్మిట్ ఇచ్చింది. వీరితోపాటే వేర్వేరు కేటగిరీల వారికీ తగు అనుమతులు ఇచ్చింది. విద్య కోసం వచ్చే వారికి, వారి జీవిత భాగస్వామికి, వారిపై ఆధారపడిన వారికి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఉపాధి అనుమతులు కల్పించింది. విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, ఉద్యోగుల జీవితభాగస్వాములకూ అనుమతులు ఉన్నాయి’ అంటూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ పిటిషన్‌ను జడ్జి కొట్టేశారు. అయితే తీర్పును ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని సంస్థ తెలిపింది. అభినందనీయం ‘ఉద్యోగాలు పోయి కష్టాల్లో ఉన్న హెచ్–1బీ హోల్డర్ల కుటుంబాలకు ఈ తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వలసదారుల హక్కుల సమానత్వ వ్యవస్థ సాధనకు ఇది ముందడుగు’ అని వలసదారుల హక్కులపై పోరాడే భారతీయ మూలాలున్న అమెరికా న్యాయవాది అజయ్ భుటోరియా వ్యాఖ్యానించారు. గత ఏడాది నవంబర్ నుంచి చూస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్‌సహా అమెరికాలోని చాలా ఐటీ కంపెనీలు దాదాపు 2,00,000 మంది ఉద్యోగులను తొలగించాయని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో పేర్కొనడం తెల్సిందే. ఇలా ఉద్యోగాలు పోయిన వారిలో 30–40 శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే కావడం విషాదం. -
ఇండియన్ టెక్కీలకు ఊరట.. హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు
అమెరికాలోని ఇండియన్ టెక్కీలకు ఊరట నిస్తూ హెచ్-1బీ వీసాలపై యూఎస్ కోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. యూఎస్ టెక్ సెక్టార్‌లోని విదేశీ ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా హెచ్-1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు అమెరికాలో పని చేయవచ్చని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కొన్ని వర్గాల హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు ఉపాధి అధికార కార్డులను ఇచ్చే ఒబామా కాలం నాటి నిబంధనలను కొట్టివేయాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!) సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అమెజాన్ , యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు కూడా వ్యతిరేకించాయి. హెచ్-1బీ వర్కర్ల జీవిత భాగస్వాములకు యూఎస్ ఇప్పటివరకు దాదాపు లక్ష వర్క్ ఆథరైజేషన్ కార్డులు జారీ చేసింది, వీరిలో గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఉన్నారు. హెచ్-1బీ వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేలా కోర్టు ఇచ్చిన తీర్పుపై అక్కడి ప్రముఖ కమ్యూనిటీ నాయకుడు, వలసదారుల హక్కుల కోసం పోరాడే న్యాయవాది అజయ్ భూటోరియా హర్షం వ్యక్తం చేశారు. అయితే కోర్టు తీర్పుపై అప్పీల్ వెళ్లనున్నట్లు సేవ్ జాబ్స్ యూఎస్ఏ తెలిపింది. (గంగూలీ ముద్దుల తనయ.. అప్పుడే ఉద్యోగం చేస్తోంది.. జీతమెంతో తెలుసా?) -
పర్యాటక వీసాతోనూ ఉద్యోగ దరఖాస్తులు: అమెరికా
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో ఉద్యోగం కోల్పోయి కొత్త కొలువు దొరక్క దేశం వీడాల్సి వస్తుందేమోనని ఆందోళన పడుతున్న హెచ్–1బి వీసాదారులకు, ముఖ్యంగా భారత టెకీలకు భారీ ఊరట! బిజినెస్ (బి–1), పర్యాటక (బి–2) వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకూ హాజరు కావచ్చని ఆ దేశ పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. ‘‘అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం చూసుకోలేని పక్షంలో అమెరికా వీడటం తప్ప మరో మార్గంలేదనే అపోహలో ఉన్నారు. మరింత కాలం దేశంలో ఉండేందుకు వారికి పలు మార్గాలున్నాయి. 60 రోజుల్లోపు వీసా స్టేటస్‌ను (బి–1, బి–2కు) మార్చుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ ముగిశాక కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చు’’ అని వివరించింది. అయితే ఉద్యోగం దొరికాక అందులో చేరేలోపు వీసా స్టేటస్‌ను తదనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయమై పలువురు వెలిబుచ్చిన పలు సందేహాలకు సమాధానంగా సంస్థ ఈ మేరకు ట్వీట్ చేసింది. బి–1 వీసాను స్వల్పకాలిక బిజినెస్ ప్రయాణాలకు, బి–2ను ప్రధానంగా పర్యాటక అవసరాలకు అమెరికా జారీ చేస్తుంటుంది. మాంద్యం దెబ్బకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా గత నవంబర్ నుంచి అమెరికాలోనే 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులయ్యారు. వీరిలో కనీసం లక్ష మంది భారతీయులేనని అంచనా! -
అమెరికాలో మన టెకీల మెడపై... ‘గడువు’ కత్తి!
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్–1బీ ప్రొఫెషనల్స్ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘సదరు కుటుంబాలకు ఇది పెను సంక్షోభం. వారికి చూస్తుండగానే సమయం మించిపోతోంది. అమెరికాలో పుట్టిన తమ పిల్లలను వెంటపెట్టుకుని వారి త్వరలో దేశం వీడాల్సిన పరిస్థితులు దాపురించాయి’’ అంటూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగం పోయిన 60 రోజుల గ్రేస్ పీరియడ్లోగా మరో ఉద్యోగం గానీ, ఉపాధి గానీ చూసుకోని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. జాబ్ మార్కెట్ అత్యంత ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత తక్కువ సమయంలో మరో ఉద్యోగం వెతుక్కోవడం చాలామందికి దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. దొరికినా అత్యంత సంక్లిష్టంగా ఉన్న హెచ్–1బీ మార్పు తదితర నిబంధనల ప్రక్రియను గ్రేస్ పీరియడ్లోపు పూర్తి చేయడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో దాన్ని కనీసం 180 రోజులకు పెంచాలంటూ ఆసియా అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన అధ్యక్షుని సలహా కమిటీ ఇటీవలే సిఫార్సు చేయడం తెలిసిందే. ‘‘దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నా అవి ఆమోదం పొంది అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. ఈలోపు 60 రోజుల గ్రేస్ పీరియడ్ పూర్తయ్యే వారికి నిస్సహాయంగా దేశం వీడటం మినహా మరో మార్గం లేదు’’ అంటూ ఎఫ్ఐఐడీఎస్ ఆవేదన వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్ పెంపు సిఫార్సును పరిశీలించి నిర్ణయం తీసుకునే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. భారీగా ఉద్వాసనలు...: గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలుకుని పలు దిగ్గజ కంపెనీలు కొన్నాళ్లుగా భారీగా ఉద్యోగుల తొలగింపు బాట పట్టడం తెలిసిందే. దాంతో గత నవంబర్ నుంచి అమెరికాలో కనీసం 2.5 లక్షల మందికి పైగా ఐటీ తదితర ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ‘‘వీరిలో దాదాపు లక్ష మంది దాకా భారతీయులేనని అంచనా. ఆదాయ పన్ను చెల్లించే హెచ్–1బి ఇమిగ్రెంట్లయిన వీరు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెదుక్కుని సదరు కంపెనీ ద్వారా హెచ్–1బికి దరఖాస్తు చేసుకోలేని పక్షంలో దేశం వీడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు’’ అని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. -
గ్రేస్ పీరియడ్: హెచ్1బీ వీసాదారులకు భారీ ఊరట!
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో వరుసపెట్టి ఉద్యోగాలు కోల్పోతున్న హెచ్-1బి ఉద్యోగులకు ఊరట. ఉద్యోగం పోయిన రెండు నెలల్లోపే కొత్త కొలువు వెతుక్కోవాలన్న నిబంధనను సడలించి గ్రేస్ పీరియడ్‌ను ఆర్నెల్లకు పెంచాలని అధ్యక్షుని సలహా సంఘం సిఫార్సు చేసింది. తద్వారా కొత్త ఉపాధి అవకాశం వెతుక్కునేందుకు వారికి తగినంత సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. దీనికి అధ్యక్షుని ఆమోదం లభిస్తే కొన్నాళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది భారత టెకీలకు భారీ ఊరట కలగనుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల మేరకు వారంతా 60 రోజుల్లోగా మరో ఉపాధి చూసుకోలేని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్‌ను 180 రోజులకు పెంచాల్సిందిగా సిఫార్సు చేసినట్టు ఆసియా అమెరికన్లు తదితరులపై అధ్యక్షుని సలహా సంఘం సభ్యుడు అజన్ జైన్ భుటోరియా వెల్లడించారు. అమెరికాలో 2022 నవంబర్ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఏకంగా 80 వేల మంది భారతీయులేనని అంచనా! గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఊరట! మరోవైపు, ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో ఆమోదిత ఐ-140 ఉపాధి ఆధారిత వీసా పిటిషన్లుండి, ఐదేళ్లకు పైగా గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నవారికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు (ఈఏడీ) జారీ చేయాలని అధ్యక్షుని సలహా కమిటీ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇమిగ్రెంట్ వారి వీసా దరఖాస్తులపై తుది నిర్ణయం వెలువడేదాకా అమెరికాలో వృత్తి, ఉద్యోగాలు కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని కమిటీ సభ్యుడు అజన్ జైన్ భుటోరియా తెలిపారు. -
ఉద్యోగం ఒక్కటే కాదు.. అమెరికాలో అసలుకే మోసం
గత కొద్ది రోజులుగా అమెరికాలో ఉద్యోగాలు పోగోట్టుకున్న వారికి ఎలాంటి ఊరట లేదని యూఎస్సీఐఎస్(USCIS), మరియు అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ( US Department of Homeland Security) తేల్చిచెప్పింది. హెచ్1బీ(H1B) వీసా మీద అమెరికాకు వచ్చి ఉద్యోగం చేస్తున్న వాళ్లు ఎవరైనా లేఆఫ్ కింద ఉద్యోగం పోతే కేవలం 60 రోజులు మాత్రమే వారు ఆ దేశంలో ఉండవచ్చు. ఒక వేళ 60 రోజుల్లో మరో ఉద్యోగం రాకపోతే.. తక్షణం అమెరికా వీడాల్సి ఉంటుంది. ఒక వేళ అమెరికా వదలి వెళ్లకపోతే వాళ్లు చట్ట విరుద్ధంగా ఉన్నారన్నముద్ర పడుతుంది. ఈ మేరకు యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ (US House of Representatives) కు సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తరపున ఆ సంస్థ డైరెక్టర్ జడ్డో ఒక లేఖ రాశారు. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను యూఎస్సీఐఎస్ అమెరికా ప్రభుత్వం పెంచవచ్చన్న ఊహాగానాలకు ఇప్పుడు తెరపడినట్టయింది. -
హెచ్–1బీ, ఎల్1 రెన్యువల్ ఇక అమెరికాలోనే
వాషింగ్టన్: ‘డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్’ ప్రక్రియను పునఃప్రారంభించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, ప్రధానంగా భారతీయులకు ఎక్కువ మేలు జరుగనుంది. హెచ్–1బీ, ఎల్1 వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల గడువు ముగిస్తే స్వదేశానికి తిరిగి వెళ్లి, రెన్యువల్ చేసుకోవాల్సిన పని ఉండదు. అమెరికాలోనే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. 2004 వరకూ నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల రెన్యువల్, ఎక్సటెన్షన్ స్టాంపింగ్‌ను అమెరికాలోనే చేసేవారు. తర్వాత ఈ విధానాన్ని రద్దుచేశారు. ఇప్పుడు పునరుద్ధరించబోతున్నారు. త్వరలోనే ఇది అమల్లోకి రాబోతోంది. -
అమెరికాలో నివసిస్తున్న ఇండియన్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త!
ఆర్ధిక మాంద్యం దెబ్బకు చేస్తున్న ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు. దీంతో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్న భారతీయులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘దేశీయ వీసా రీవాలిడేషన్’ పేరుతో హెచ్-1బీ, ఎల్1 వీసాలను అమెరికాలోనే పునరుద్దరించే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం అమెరికాలో లేఆఫ్స్‌కు గురై.. కొత్త జాబ్ కోసం అన్వేషిస్తున్న వారికి భారీ ఊరట కలగనుంది. 2004 కి ముందు వీసా పునరుద్ధరణ లేదా స్టాంపింగ్ కోసం అమెరికాను విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, మార్పులు చేయడంతో హెచ్-1బీ వీసా దారులు రెన్యువల్ కోసం తమ సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా పొడిగింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపులతో ఈ సమస్యను పరిష్కరించాలని జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వీసా ఉంటేనే ఎంట్రీ లేఆఫ్స్ గురైన ఉద్యోగులు వీసా పునరుద్దరించేందుకు సమయం పడుతుంది. ఆ లోగా వీసా గడువు దాటితే దేశం వదిలి వెళ్లి పోవాలి. లేదంటే కొత్త ఉద్యోగం వెతుక్కొని వీసా రెన్యూవల్ చేయించుకోవాలి. అక్కడే వీసా లబ్ధి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వీసా రెన్యూవల్, ఉన్న ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగం దొరుకుతుందా? లేదా? అన్న సందిగ్ధంతో ఆందోళన చెందుతున్నారు. జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి ఈ ఆందోళనలపై అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వీసాల రెన్యూవల్ విషయంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ఈ తరుణంలో వీసాల విషయంలో జోబైడెన్ ప్రభుత్వం విధించిన నిబంధనల్ని సడలించింది. వీసా రెన్యూవల్ కోసం కొత్త కొత్త పథకాల్ని అందుబాటులోకి తెస్తుంది. తాజాగా అమెరికా ప్రభుత్వం వీసా రెన్యూవల్‌ను చేసేందుకు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. విదేశీ ఉద్యోగులు వీసా రెన్యూవల్లో ఇబ్బందులు పడకుండా వీసాల పునరుద్దరణ (రెన్యూవల్), స్టాంపింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఇబ్బందుల్ని తొలగించాలనే సాధారణంగా ఆయా రంగాల్లో నిపుణులైన భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారికి హెచ్-1బీ వీసా తప్పని సరి. ఆ వీసాలను అమెరికన్ కంపెనీలు అభ్యర్ధులు అందిస్తాయి. అందుకే ఆ వీసాలకు భారీ ఎత్తున డిమాండ్ ఉంది. ప్రతి ఏడాది ఆ వీసాలు పొందిన చైనా, భారతీయులు వేలల్లో అమెరికాకు వెళుతుంటారు. అక్కడి వెళ్లిన వారు వీసా గడువు ముగిసి.. రెన్యూవల్ చేయించుకునే సమయంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఆ సమస్యల్ని అధిగమించేందుకు జోబైడెన్ ప్రభుత్వం నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (ఎన్ఐవీ) కేటగిరీల వీసా సేవల్ని పునఃప్రారంభించే ప్రణాళికలపై తీవ్రంగా కృషి చేస్తుంది.ఈ ఏడాది చివర్లో పైలట్‌ను ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం. వీసాలను పునరుద్ధరించడానికి దరఖాస్తుదారులు విదేశాలకు వెళ్లే అవసరాన్ని తగ్గిస్తుంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఎన్ని వీసాలో చెప్పలేం వీసాలను ఎన్ని పునరుద్దరిస్తారని విషయంపై యూఎస్ కాన్సులేట్ అధికారులు మాట్లాడుతూ.. వీసా రెన్యూవల్ ప్రాజెక్ట్ ప్రారంభంలో ఎంత మంది వీసా హోల్డర్లు అర్హులు అవుతారనే దానిపై స్పష్టత ఇవ్వలేం. తక్కువ సంఖ్యలో ప్రారంభించింది. దశల వారీ వీసాల జారీని పెంచుకుంటూ వెళతామని అన్నారు. -
మార్చి 1 నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తుల స్వీకరణ
వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త. 2023–24 సంవత్సరానికి గాను మార్చి ఒకటో తేదీ నుంచి హెచ్1బీ వీసాలకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఆదివారం తెలిపింది. మార్చి 17వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంటుందని, మార్చి 31కల్లా వీసా హోల్డర్ల పేర్లను ప్రకటిస్తామని పేర్కొంది. అమెరికా కంపెనీల్లో పనిచేసే విదేశీ సాంకేతిక నిపుణులకు ఇచ్చే నాన్–ఇమిగ్రాంట్ వీసా హెచ్1బీ. ఏడాదికి 85 వేల వరకు హెచ్1బీ వీసాలను మంజూరు చేస్తుంటారు. ఇందులో అత్యధికంగా లాభపడేది భారత్, చైనా దేశస్తులే. టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి రంగాలకు చెందిన ఈ వీసా దారులు ఆరేళ్ల వరకు అమెరికాలో ఉండి పని చేసుకునేందుకు వీలుంటుంది. ఆరేళ్ల తర్వాత శాశ్వత నివాసం లేదా గ్రీన్‌కార్డుకు అర్హులవుతారు. -
హెచ్1బీ వీసా ఫీజుల బాదుడు !
వాషింగ్టన్: హెచ్–1బీ వీసా దరఖాస్తు సహా అన్ని ఇమిగ్రేషన్ ఫీజుల మోత మోగించేందుకు అమెరికా సిద్ధమైంది. సంబంధిత ప్రతిపాదనలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ప్రచురించింది. 460 డాలర్లుగా ఉన్న హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను ఏకంగా 780 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. వలసేతర వీసాల్లో భారతీయులు అధికంగా పొందే హెచ్–1బీ వీసా దరఖాస్తు ధరను భారీగా పెంచడంపై విమర్శలొస్తున్నాయి. మిగతా ఫీజులూ దాదాపు ఇలాగే భారీగా ఉన్నాయి. ఓ–1 దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచనున్నారు. అంటే ఒక్కసారిగా 229 శాతం పెంపు అన్నమాట. ఎల్–1 ధరను 460 డాలర్ల నుంచి ఏకంగా 1,385 డాలర్లకు పెంచేయనున్నారు. అంటే ఏకంగా 332 శాతం పెరుగుదల. హెచ్–2బీ దరఖాస్తుల ధర 460 డాలర్ల నుంచి ఒకేసారి 1,080 డాలర్లకు చేరుకోనుంది. అయితే, ఇవి ప్రతిపాదనలు మాత్రమేనని మార్చి ఏడో తేదీలోపు వచ్చే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ధరలు మారుస్తామని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వివరణ ఇచ్చింది. ఒకవేళ ఈ ఫీజులు అమలైతే అదనంగా తీసుకునే బయోమెట్రిక్ సేవల ఫీజును రద్దుచేస్తామని ప్రతిపాదించింది. 2016 ఏడాది నుంచి ఇప్పటివరకు ఫీజులు పెంచలేదని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వాదిస్తోంది. వీసా ఎదురుచూపులు తగ్గించేందుకు కృషి భారత్‌లో వీసా దరఖాస్తు దారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. సుదీర్ఘకాలం వీసా కోసం ఎదురుచూస్తున్న వారి ఆందోళనను తాము అర్థం చేసుకుంటామన్నారు. వీసా దరఖాస్తుల పరిశీలనను చకచకా పూర్తి చేసేందుకుగాను విదేశాంగ శాఖ సిబ్బంది పెంచామన్నారు. -
Surbhi Gupta: ‘మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’
అమెరికాతో పాటు అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. అమెరికా టెక్ సంస్థలు ఉద్యోగులతో పాటు వలసేతర హెచ్1బి వీసా హోల్డర్లని విధుల నుంచి తొలగిస్తున్నాయి. వారిలో మెటాలో ప్రొడక్ట్ మేనేజర్ పనిచేస్తున్న సురభిగుప్తా ఒకరు. తాజాగా మెటాలో ఉద్యోగం కోల్పోవడంపై జర్నలిస్ట్ సవితా పటేల్‌తో మాట్లాడారు. మెటాలో ఉద్యోగం, లేఫ్స్పై హెచ్ 1 బీ వీసాపై ఆమె మనోగతం ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఆ రోజు మా అమ్మ పుట్టిన రోజు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మెటా ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించింది. లేఆఫ్స్‌పై నాతో పాటు నా సహచర ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటల (స్థానిక కాలమానం) మెటా నుంచి మెయిల్. ఉద్యోగం నుంచి నన్ను తొలగించారని. ఈ ఏడాది ప్రారంభంలో మెటాలో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరాను. నా విధుల్ని నేను చక్కగా నిర్వర్తిస్తా. నా ఉద్యోగం పోయిందని తెలిసి నా టీమ్ సభ్యులు షాక్‌గురయ్యారు. ఉద్యోగం కోల్పోయారు కదా మీకెలా అనిపించింది నా స్కూల్ డేస్‌లో ఓ టీచర్ ఎప్పుడూ ఒక మాట చెప్పే వారు. వర్క్ ఈజ్ వర్షిప్. అదే మోటోతో పనిచేస్తున్నాను. కానీ నా ఉద్యోగం పోయిందని తెలిసి టైటానిక్ షిప్‌లా మునిపోతున్నట్లు అనిపించింది. మెయిల్, ఆ తర్వాత ల్యాప్‌టాప్ యాక్సెస్ కోల్పోయాను. అందుకు విరుద్ధంగా లింక్డ్ ఇన్‌లో చాలా మంది సహోద్యోగులు, మాజీ సహోద్యోగులు, స్నేహితులు ఇలా చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు. నాకు అప్పుడే అనిపించింది నా అనేవాళ్లు ఈ దేశంలో చాలా మంది ఉన్నారని. మార్చి వరకే డెడ్‌లైన్ ఇక మెటాలో నా లాస్ట్ వర్క్ డే జనవరి వరకు ఉంది. నాకు హెచ్1 -బీ వీసా (అమెజరికాలోని సంస్థలు ఆరు సంవత్సరాల వరకు విదేశీయులను నియమించుకోవడానికి అనుమతించే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా) తో మరో 60 రోజులు యూఎస్‌లో ఉండొచ్చు. కాబట్టి మార్చి ప్రారంభం వరకు మరో ఉద్యోగం వెతుక్కునేందుకు సమయం ఉంది. ఉద్యోగం వెతుక్కోవడం కొంచెం కష్టమే డిసెంబరులో సెలవుల కారణంగా ఉద్యోగం వెతుక్కోవడం కొంచెం కష్టమే. కానీ మరో ఉద్యోగంలో చేరే విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాను. అనుకున్నది సాధిస్తా. ‘ఔర్ కుచ్ అచ్చా మిల్ జాయేగా’ జీవితంతో ఎప్పుడు రాజీ పడకూడదు. అనుకున్నది సాధించేలా సంక్షోభంలోనూ అవకాశాల్ని ఎలా చేజిక్కించుకోవాలి నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. అంతేకాదు ఇప్పుడు మనం ఒకటి కోల్పోయామంటే భవిష్యత్‌లో ('ఔర్ కుచ్ అచ్చా మిల్ జాయేగా') ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందని చెప్పేవారు. మెటా నన్ను ఫైర్ చేసిన తర్వాత మరో జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించా. హెచ్1-బీ వీసాపై ఆధారపడి ఉంది కానీ అమెరికాలో పని చేయడం, ఇక్కడ ఉండే హక్కు నా హెచ్1-బీ వీసాపై ఆధారపడి ఉంటుంది. నేను 2009లో యుఎస్‌కి వచ్చా. ఎవరి ప్రోత్సాహాం లేకుండా స్వశక్తి, తెలివి తేటలతో నా కెరియర్ను నిలబెట్టుకున్నాను. అందుకోసం ఏళ్ల తరబడి కష్టపడ్డాను. టెస్లా, ఇన్ట్యూట్ (Intuit) వంటి కంపెనీల్లో పనిచేశా. మంచి మంచి ప్రొడక్ట్‌లను తయారు చేశా. టాప్ రేటింగ్‌లో పనిచేశా. పన్నులు చెల్లించా. ఇక్కడి (యూఎస్) ఆర్థిక వ్యవస్థకు 15 సంవత్సరాలకు పైగా సహకరించాను. ఇక్కడే పర్మినెంట్ నివసించే హక్కు పొందాను. నేను మిస్ భారత్ కాలిఫోర్నియా అందాల పోటీల్లో నా ఆరాధ్య, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ చేతుల మీదిగా కిరీటం పొందాను. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడిచాను. టెక్ కంపెనీల ఉద్యోగాల తొలగింపుపై అమెరికా టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు భారతీయుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయినా సరే మెటా, అమెజాన్, ట్విట్టర్ లే ఆఫ్‌లు భారతీయులు అమెరికాకు రావాలని, ఇక్కడే స్థిరపడాలన్న కలల్ని నాశనం చేయవు’ అంటూ సురభిగుప్తా తన మనోగతాన్ని వివరించారు. చదవండి👉 ప్చ్, పాపం..మెటాలో ‘సురభిగుప్తా’ ఉద్యోగం ఊడింది! -
రూ.13 వేలు కడితే అమెరికా హెజ్1బీ వీసా..! ఇలాంటి స్కామర్లతో జర భద్రం..
ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలతో మోసాలకు పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ లింక్డ్ఇన్ యూజర్ స్కామర్లు వీసాలు ఇప్పిస్తామని రూ.లక్షలు కాజేస్తున్న విషయాన్ని వెల్లడించాడు. అమెరికా హెచ్1బీ వీసా ఇప్పిస్తామని 160 డాలర్లు(రూ.13వేలు) కడితే దరఖాస్తు ప్రక్రియ మొదలు పెడుతామని సందేశాలు పంపుతున్నారని పేర్కొన్నాడు. ఓ టాప్ సోడా కంపెనీల పేరుతో ఈ ఆఫర్ లెటర్ పంపుతున్నారని చెప్పాడు. మొదట రూ.13వేలే అని చెప్పినా ఆ తర్వాత ఆశావాహుల నుంచి లక్షలు కాజేస్తున్నారని వివరించాడు. ఈ స్కామర్లు పంపే ఈ-మెయిళ్లు ప్రపంచంలోని టాప్ 500 కంపెనీల పేరుతో కూడా ఉంటాయని సదరు వ్యక్తి వివరించాడు. మీకు నమ్మకం కల్పించేందుకు వాళ్లు డమ్మీ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నాడు. ఇలాంటి స్కామర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. నిజంగా జాబ్ ఆఫర్ ఇచ్చే ఏ సంస్థ అయినా డబ్బులు వసూలు చేయదు. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని లింక్డ్ఇన్ యూజర్ సూచించాడు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే! -
హెచ్ - 1బీ వీసా: భారతీయులకు భారీ ఉపశమనం
అమెరికా వీసాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న భారతీయులకు భారీ ఉపశమనం కలగనుంది. వచ్చే ఏడాది జూన్ లేదా జులై తర్వాత వీసాల మంజూరుకయ్యే రోజులు బాగా తగ్గిపోతాయని, నెలకి లక్ష వీసాలు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ తెలిపారు. ఇక వీసాల అనుమతులు,స్లాట్ల గురించి వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం. ♦ రాయబార కార్యాలయంలో లక్ష హెచ్ - 1బీ వీసాలకు డ్రాప్‌బాక్స్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 26 వేల స్లాట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంది ♦ హెచ్-1బీ, బీ1/ బీ2 డ్రాప్ బాక్స్ కోసం వేచి ఉండే సమయాన్ని 9 నెలలకు తగ్గించగలిగాం. ♦ ఎంబసీ ఉద్యోగులు, ఇతర ఉన్నతాధికారులు వీసాల అనుమతి కోసం సంబంధిత అధికారులకు అప్లికేషన్లను నిర్విరామంగా పంపిస్తున్నారు. ♦ వచ్చే ఏడాది మే నెల నుంచి హెచ్-1బీ వీసా డ్రాప్ బాక్స్కోసం వేచి చూసే సమయం 9 నెలల నుంచి 4 లేదా 5 నెలలకు తగ్గుతుందని, దశల వారిగా 3 నెలలు ఇలా సమయం తగ్గించే ప్రయత్నం చేస్తామని మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ వివరించారు. #CNBCTV18Exclusive | #DropBox cases in categories of #student visas, H-1B & L visa & B1/B2 visas are a priority. 1,28,000 H-1B applicants in the queue for H-1B Drop Box applications, says Don Heflin, Minister Counselor for Consular Affairs pic.twitter.com/WapB7vPdtV — CNBC-TV18 (@CNBCTV18Live) November 22, 2022 -
మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్1బీ వీసా హోల్డర్లలో కలవరం
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. టెక్ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటం, ఆదాయాలు పడిపోతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మెటా మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 13 శాతం. ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాలు వెల్లడించారు. ‘కోవిడ్ మహమ్మారి తర్వాత కూడా భారీ వృద్ధి ఉంటుందనే అంచనాతో పెద్ద యెత్తున ఉద్యోగులను తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నేను ఊహించిన విధంగా జరగలేదు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ రిప్లై) ఆన్లైన్ కామర్స్ మళ్లీ పాత స్థాయికి వచ్చేసింది. స్థూల ఆర్థిక మందగమనం, పెరిగిన పోటీ, ప్రకటనలు తగ్గడం వంటి కారణాలతో ఆదాయాలు నేను ఊహించిన దానికన్నా తగ్గాయి. నేను పరిస్థితిని తప్పుగా అంచనా వేశాను. దీనికి బాధ్యుణ్ని నేనే‘ అని ఆయన పేర్కొన్నారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో కూడా కోతల పర్వం నడుస్తున్న నేపథ్యంలో మెటాలోనూ ఉద్వాసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ మొదలైనవి మెటాలో భాగంగా ఉన్నాయి. తీసివేస్తున్న ఉద్యోగులకు ఈమెయిల్స్ వస్తాయని, వారికి కంపెనీ సిస్టమ్స్ ఇక అందుబాటులో ఉండవని జుకర్‌బర్గ్ తెలిపారు. మాజీ ఉద్యోగులకు 16 వారాల బేసిక్ పేతో పాటు కంపెనీలో పని చేసిన ప్రతి ఏడాదికిగాను 2 వారాల జీతం లభిస్తుంది. 6 నెలల పాటు వారితో పాటు వారి కుటుంబ సభ్యులకూ హెల్త్ ఇన్సూరెన్స్ పని చేస్తుంది. ఇదీ చదవండి: క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్! టెక్ సంస్థలకు సవాళ్లు.. కోవిడ్ సమయంలో లాక్డౌన్ల వల్ల ఇళ్లకే పరిమితం కావడంతో ప్రజలు సోషల్ మీడియాను గణనీయంగా ఉపయోగించారు. దీంతో ఆయా కంపెనీలకూ భారీగా ఆదాయాలు వచ్చాయి. అయితే, లాక్డౌన్లు ముగిసి, ప్రజలు తిరిగి దైనందిన జీవితాల్లో పడిపోయిన తర్వాత వాటి ఆదాయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రత్యేకంగా మెటా విషయానికొస్తే.. డిజిటల్ యూనివర్స్ ’మెటావర్స్’ పై భారీగా పెట్టుబడులు పెడుతుండటం ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది. అటు టెక్ దిగ్గజం యాపిల్ ప్రైవసీ టూల్స్ సైతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సమస్యగా మారుతున్నాయి. వీటి వల్ల యూజర్ల అనుమతి లేకుండా వారిని ట్రాక్ చేయడం, ప్రత్యేకంగా టార్గెట్ చేసే ప్రకటనలు చూపడం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ లాంటి సంస్థలకు కష్టతరమవుతోంది. అలాగే యువత ఎక్కువగా టిక్‌టాక్ వైపు మళ్లుతుండటం ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్‌లోని ఉద్యోగుల్లో కలవరం.. ఏయే దేశాల్లో ఏ మేరకు కోతలు ఉంటాయనేది తెలియకపోవడంతో భారత్‌లోని మెటా ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌లకు సంబంధించి మెటాకు భారత్‌లో 300–400 మంది ఉద్యోగులు ఉన్నారు. వీటిలో 60 మంది సిబ్బంది గల వాట్సాప్ బృందమే చిన్నది. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ ఇటీవలే రాజీనామా చేసి పోటీ సంస్థ స్నాప్‌లో చేరారు. హెచ్1బీ వీసా హోల్డర్లకు సహకారం ఉద్వాసనకు గురైన వారిలో హెచ్1బీ వీసాహోల్డర్లు ఉంటే ఇమ్మిగ్రేషన్ పరంగా వారికి అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను కంపెనీ అందిస్తుందని జుకర్‌బర్గ్ తెలిపారు. తమ దేశంలో పని చేసేందుకు విదేశీయులకు అమెరికా ఈ వీసాలు జారీ చేస్తుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే, తమ వీసాను స్పాన్సర్ చేసే మరో కంపెనీలో ఉద్యోగాన్ని 60 రోజుల్లోగా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వీసా గడువు ముగిసిపోతుంది. పలు అమెరికన్ కంపెనీల్లో భారత్, చైనా నుంచి చాలా మటుకు ఉద్యోగులు ఉన్నారు. ప్రధానంగా ఫేస్బుక్లో వీరి సంఖ్య 15శాతం పైనే. ఉద్యోగాల్లో కోతల వల్ల ఇలాంటి హెచ్1బీ వీసాహోల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. -
ట్విటర్ తొలగింపులు, మాజీ ఉద్యోగులకు కొత్త చిక్కులు
ఎలన్ మస్క్ తొలగించిన ట్విటర్ ఉద్యోగులకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని తెలుస్తోంది. వీలైనంత త్వరగా మరో సంస్థలో ఉద్యోగం పొందితే సురక్షితంగా ఉండొచ్చని, లేదంటే దేశ వదిలి వెళ్లాల్సి ఉంటుందని అమెరికన్ చట్టాలు చెబుతున్నాయి. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్లో ఉద్యోగం కోల్పోవడంతో పాటు..చట్టాల ప్రకారం అమెరికాలో నివసించేందుకు అనర్హులుగా పరిణగణలోకి తీసుకునే అవకాశం ఉంది. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) డేటా ప్రకారం.. అమెరికన్ వర్క్ వీసాలైన హెచ్-1బీ, ఎల్-1లతో ఉద్యోగులు ట్విటర్లో పనిచేస్తున్నారు. ఎలన్ మస్క్ తొలగించిన ఉద్యోగుల్లో పైన పేర్కొన్న వీసా లబ్ధిదారులైతే మరిన్ని ఇబ్బందులు పడనున్నారు. వాటి నుంచి సురక్షితంగా ఉండేందుకు సదరు ఉద్యోగులు 60 రోజుల్లో మరో కొత్త జాబ్, లేదంటే అమెరికన్ సంస్థల నుంచి స్పాన్సర్ షిప్ పొందాల్సి ఉంది. ఆ రెండు అంశాల్లో విఫలమైతే..తమ దేశంలో నివసించేందుకు అమెరికా ప్రభుత్వం ఒప్పుకోదు. కాగా, ట్విటర్ మొత్తం ఉద్యోగుల్లో 8శాతం (625 నుంచి 670) మంది హెచ్-1బీ వీసా హోల్డర్స్ ఉన్నారు. హెచ్-1బీ వీసా హోల్డర్లు హెచ్-1బీ వీసాదారులకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ, ఎల్-1, ఓ-1 వీసాలపై పనిచేసే కార్మికులకు ఇది చాలా కష్టం. అరుదైన పరిస్థితుల్లో తప్ప, వారు ఉద్యోగం కోల్పోయిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని లాక్వెస్ట్ మేనేజింగ్ పార్టనర్ పూర్వీ ఛోతాని తెలిపారు. సాధారణంగా ఒక హెచ్-1బి ఉద్యోగిని తొలగిస్తే.. మరో సంస్థలో ఉద్యోగం పొందందేకు సుమారు 60రోజుల గ్రేస్ పిరియడ్ ఉంటుంది. ఖచ్చితమైన గ్రేస్ పీరియడ్ సదరు కార్డు హోల్డర్లను ఎంపిక చేసుకునే సంస్థపై ఆధారపడి ఉంటుంది. ఇక మస్క్ తొలగించిన ఉద్యోగులు హెచ్-1 బీ వీసా వచ్చే ఏడాది సెప్టెంబర్ 30,2023 వరకు సమయం ఉంది. 60 రోజుల్లో మరో జాబ్ పొందడం పెద్ద కష్టమేమి కాదని ఛోతాని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గత ఆరేళ్లలో హెచ్-1బీ క్యాప్ లాటరీలో ఎంపికైన హెచ్-1బీ వర్కర్లు వచ్చే లాటరీ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. 60 రోజుల గ్రేస్ పీరియడ్ లో మరో స్పాన్సర్‌ను పొందలేకపోతే వారు తమ సొంత దేశం నుంచి అమెరికాలో జాబ్ కోసం ప్రయత్నించవచ్చు. ఎల్-1 వీసా హోల్డర్ల ఎన్-1ఏ వీసా అటే అమెరికా ప్రభుత్వం జారీ చేసిన నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సేవలు విదేశీ డైరెక్టర్లు లేదా మేనేజర్లను యూఎస్‌లో ఉన్న వారి కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ తరహా వీసాను జారీ చేస్తుంది. ఈ తరహా వీసాపై ఉద్యోగం చేసేవారు..జాబు కోల్పోతే వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. మరి ట్విటర్ తొలగించిన ఎల్-1ఏ వీసా ఉద్యోగులకు భవిష్యత్ ఎలా ఉంటుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ -
భారతీయులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే అమెరికా వీసా!
వాషింగ్టన్: భారతీయులకు బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ పునర్ప్రారంభమైన తరుణంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు మంజూరు చేయాలని కాన్సులర్ అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించింది. అయితే డిసెంబర్ 31వరకు దరఖాస్తు చేసుకున్న నిర్దిష్ట కేటగిరీల దరఖాస్తుదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఎఫ్, హెచ్-1,హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్,ఎం, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే విసాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల లోపు రెనివల్ చేయించుకునే వారికి కూడా ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కానీ గతంలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ నాన్ఇమిగ్రాంట్ వీసా అపాయింట్మెంట్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం ఎక్కువ కాలం ఉండనుంది. కరోనా సమయంలో కలిగిన ఇబ్బందులే ఇందుకు కారణమని అమెరికా చెప్పింది. ఇప్పటికే వీసా దరఖాస్తు రుసుం చెల్లించిన వారు వీసాల జారీకీ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా ఎంబసీ పేర్కొంది. కరోనా సమయంలో పేమెంట్ చేసిన వారి వ్యాలిడిటీని 2023 సెప్టెంబర్ 23వరకు పొడిగించనున్నట్లు తెలిపింది. చదవండి: పరాన్నజీవులూ, వెళ్లిపొండి -
వర్క్‌పర్మిట్లపై యూఎస్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు, హెచ్1బీ వీసా హోల్డర్ల జీవితభాగస్వాములు సహా కొన్ని ఇమ్మిగ్రెంట్ కేటగిరీలకు చెందినవారి వర్క్ పర్మిట్ కాలపరిమితిని 18నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో యూఎస్‌లో పనిచేస్తున్న పలువురు భారతీయ ఐటీ ఉద్యోగులకు ఊరట లభించనుంది. కాలపరిమితి ముగిసిన వర్క్‌పర్మిట్లకు 18నెలల పొడిగింపు ఇచ్చే వెసులుబాటు ఈనెల 4నుంచి అమలవుతుంది. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్న వీరి వర్క్‌పర్మిట్ కాలపరిమితి ఆటోమేటిగ్గా 180 నుంచి 540 రోజులకు పెరుగుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. పెండింగ్‌లో ఉన్న ఈఏడీ దరఖాస్తులతో పనిభారం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ (అమెరికా ఇమ్మిగ్రేషన్ సేవల శాఖ) డైరెక్టర్ జడోయ్ చెప్పారు. ఇప్పటివరకు ఉన్న నియమాల ప్రకారం యూఎస్ పౌరులు కానివారు వర్క్‌పర్మిట్ కాలపరిమితి ముగిశాక మరో 180 రోజుల పొడిగింపు ఆటోమేటిగ్గా వస్తుంది. ఈ గడువులో వాళ్లు పర్మిట్ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. తాజా నిర్ణయం దాదాపు 87వేల మంది ఇమ్మిగ్రెంట్లకు ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయాన్ని ఇండో అమెరికన్ సంఘాలు స్వాగతించాయి. -
2022కు హెచ్1బీ వీసా కోటా పూర్తి
వాషింగ్టన్: ఈ సంవత్సరానికి హెచ్1బీ వీసా పరిమితి 65,000కు సరిపడా దరఖాస్తులు అందాయని అమెరికా మంగళవారం ప్రకటించింది. విదేశీ ఉద్యోగస్తులు అమెరికాలో పనిచేసేందుకు ఈ వీసాను కేటాయిస్తారు. టెక్ కంపెనీలకు ఈ వీసా చాలా అవసరం. అమెరికా చట్ట సభలు విధించిన ప్రకారం ఏటా 65వేల వరకు గరిష్టంగా ఈ వీసాలను కేటాయిస్తారు. మరో 20వేల వీసాలను యూఎస్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఎగ్జెంషన్ కింద కేటాయిస్తారు. ఈ రెండు కేటగిరీలకు సరిపడా దరఖాస్తులు తమకు ఇప్పటికే అందాయని యూఎస్ పౌర, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) తెలిపింది. ఈ వీసా దరఖాస్తుల పరిశీలన, ఆమోదం తదితర ప్రక్రియలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. -
మార్చి 1 నుంచి హెచ్1–బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
వాషింగ్టన్: భారత టెకీలు ఎంతో ఆత్రంగా ఎదురుచూసే హెచ్1–బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఉన్నవారిని అమెరికా కంపెనీలు ఈ వీసాల కింద ఉద్యోగాల్లో నియమించుకుంటాయి. 2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి మార్చి 18 వరకు జరుగుతుందని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఒక ప్రకటనలో వెల్లడించింది. హెచ్1–బీ వీసాలను ఆశించే వారు, కంపెనీ ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్‌కు 10 డాలర్ల రుసుము (రూ.750) చెల్లించాలి. ఆ తర్వాత లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి మార్చి 31లోగా వీసా వచ్చిన వారికి తెలియజేస్తామని స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది టెక్నాలజీ కంపెనీలు భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగుల్ని హెచ్1–బీ వీసా ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం ప్రతీ ఏడాది యూఎస్సీఐఎస్ 65 వేల హెచ్1–బీ వీసాలను మంజూరు చేస్తుంది. అవే కాకుండా అమెరికా యూనివర్సిటీ నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్ సబ్జెక్టుల్లో) అంశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల హెచ్1–బీ వీసాలను ఏటా మంజూరు చేస్తుంది. ఈ వీసాల్లో అగ్రభాగం భారతీయ టెక్కీలకే దక్కుతుంటాయి. -
హెచ్-1బి వీసా దరఖాస్తు దారులకు శుభవార్త..!
2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బి వీసాల ప్రాథమిక రిజిస్ట్రేషన్లు మార్చి 1 నుంచి మార్చి 18 వరకు కొనసాగనున్నాయి. ఈ మధ్య కాలంలో దరఖాస్తుదారులు, ప్రతినిధులు(పిటిషనర్ తరఫున వీసాకోసం అప్లయ్ చేసే వారు) ఆన్లైన్ ద్వారా హెచ్-1బీ వీసాకోసం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజాగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి హెచ్-1బీ క్యాప్ కోసం ఓ ప్రత్యేక సంఖ్యను కేటాయించనున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ నంబర్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్‌ను ట్రాక్ చేయొచ్చని పేర్కొంది. దరఖాస్తు స్టేటస్‌ను మాత్రం ఈ నంబర్ ద్వారా ట్రాక్ చేయలేరని స్పష్టం చేసింది.అమెరికాలో పని చేయాలంటే విదేశీయులకు హెచ్-1బీ విసా తప్పనిసరి. పరిమితకాలంతో ఈ వీసాను అమెరికా ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని టెక్ నిపుణులు హెచ్-1బీ వీసా కోసం ఎదురు చూస్తుంటారు. వారిలో ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది. ఈ వీసా కార్యక్రమం ద్వారా యుఎస్ కంపెనీలు భారతీయులను నియమించుకోవచ్చు. అమెరికాలో అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 65,000 హెచ్-1బి వీసాలు జారీ చేయగా, 20,000 వీసాలు యుఎస్ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్ల కోసం రిజర్వ్ చేశారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హెచ్-1బి వీసాలను అందుకున్న వారిలో అమెజాన్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. హెచ్-1బీ వీసా కోసం పిటిషనర్లు, వారి తరఫు ప్రతినిధులు మైయూఎస్సీఐఎస్ ఆన్లైన్ అకౌంట్‌ను వినియోగించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో అభ్యర్థి 10 డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. స్వియ రిజిస్ట్రేషన్ చేసుకునే వారు.. ఫిబ్రవరి 21 నంచి మైయూఎస్సీఐఎస్ ఆకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చని వివరించింది. మార్చి 31 నాటికి ఎంపిక దరఖాస్తుకు ఎంపికైన వారి వివరాలు.. మైయూఎస్సీఐఎస్ అకౌంట్‌కు అందుతాయని పేర్కొంది. దరఖాస్తు యాదృచ్ఛికంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల హెచ్-1బి వీసా దరఖాస్తుదారులకు నిర్వహించే వ్యక్తిగత ఇంటర్వ్యూను అమెరికా రద్దు చేసింది. (చదవండి: 5 నిమిషాల్లో పాన్కార్టులోని పేరు, పుట్టిన తేదీని మార్చుకోండి ఇలా..!) -
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీసాల జారీ విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 సంవత్సరానికి గానూ..హెచ్-1బీ, ఎల్-1, ఓ-1 వీసాలకోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. తాజా నిర్ణయంతో.. వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు కాన్సులేట్‌కు వెళ్లి భౌతికంగా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. హెచ్-2 వీసా, ఎఫ్-ఎమ్ వీసా, ఎకాడమిక్ జే వీసాలపై ఇప్పటికే అమల్లో ఉన్న ఈ నిబంధనను.. 2022 డిసెంబర్ 31 వరకు పొడగిస్తూ కాన్సులర్ అధికారులకు విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ ఆదేశాలు జారీ చేశార. అయితే స్థానిక పరిస్థితులు, అవసరాల మేరకు కాన్సులేట్ అధికారులు ఇన్‌పర్సన్ ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశముంది. అందువల్ల సంబంధిత వెబ్సైట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విదేశాంగశాఖ సూచించింది. చదవండి: విషాదం: నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 32 మంది సజీవ దహనం -
హెచ్1–బి వీసాలకు మళ్లీ ‘లాటరీ’యే
వాషింగ్టన్: వృత్తి నిపుణులకు మంజూరు చేసే హెచ్1–బి వీసాల కేటాయింపును పాత పద్దతిలో ‘లాటరీ’ విధానంలోనే కొనసాగించాలని అమెరికా నిర్ణయించింది. అమెరికా ప్రతి ఏటా 85 వేల హెచ్1– బి వీసాలను (నిర్ణీత కోటా 65 వేలు,, అమెరికా వర్శిటీల్లో పీజీ.. ఆపై కోర్సులు చేసిన వారికి అదనంగా 20 వేల హెచ్1–బి వీసాలు) జారీ చేస్తోంది. టెక్ కంపెనీలు, ఇతర సంస్థలు ఈ కోటాకు మించి హెచ్1–బి వీసా దరఖాస్తులు సమర్పిస్తే... లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి వీసాలను కేటాయించేవారు. 2022 ఆర్థిక సంవత్సరానికి గాను అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కు 3 లక్షలకు పైగా దరఖాస్తులు అందిన విషయం గమనార్హం. అత్యంత ప్రతిభావంతులనైన వృత్తి నిపుణులనే అమెరికాలోకి అనుమతించాలనే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లాటరీ పద్దతికి స్వస్తి పలికి ఈ ఏడాది జనవరి 8న కొత్త విధానాన్ని తెచ్చింది. వేతనాల ఆధారంగా హెచ్1–బి వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది. అత్యధిక వేతనాలు పొందుతున్న వారికే ప్రాధాన్యత క్రమంలో మొదట వీసాలు దక్కుతాయి. ఈ ఏడాది మార్చి 9 నుంచి దీన్ని అమలు చేయాలని భావించినా... అది ఆలస్యమైంది. మరోవైపు సెప్టెంబరులో వేతనాల ఆధారిత వీసా కేటాయింపు విధానాన్ని కాలిఫోర్నియా ఉత్తర జిల్లా కోర్టు కొట్టివేసింది. దాంతో లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ సర్కారు నిర్ణయించింది. అత్యధిక వేతనాల ఆధారంగా హెచ్1–బి వీసాలను జారీచేస్తే ఇతర దేశస్తుల కంటే భారత టెకీలకు అధిక ప్రయోజనం చేకూరేది. -
భారీగా తగ్గిన హెచ్1–బీ వీసాలు
వాషింగ్టన్: అమెరికా కలల ప్రయాణానికి కరోనా మహమ్మారి అడుగడుగునా అడ్డు పడుతోంది. భారతీయ టెక్కీల్లో అత్యధిక డిమాండ్ ఉండే హెచ్1–బీ వీసాల సంఖ్య గత దశాబ్దంలో ఎన్నడూ లేని విధంగా తగ్గిపోయింది. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలకి కొరత లేదు. జాబ్ ఓపెనింగ్స్ భారీ సంఖ్యలో ఉన్నాయి. కానీ హెచ్1–బీ ఉద్యోగస్తుల సంఖ్య పడిపోయింది. కోవిడ్ నేపథ్యంలో అమెరికా ప్రయాణాలపై, వీసాలపై ఆంక్షలు విధించడంతో ఈ వలసేతర వీసాలు తగ్గాయి. రెండేళ్లలో 19 శాతం తగ్గిపోయిన ఉద్యోగులు అమెరికా కార్మిక శాఖ వెల్లడించిన గణాంకాలను బ్లూమ్‌బర్గ్ న్యూస్ విశ్లేషించింది. గత ఏడాదితో పోల్చి చూస్తే సెప్టెంబర్ 2021 నాటికి హెచ్–1బీ కేటగిరి కింద విదేశీ ఇంజనీరింగ్, మ్యాథ్‌మేటిక్స్ ఉద్యోగస్తులు 12.6% తగ్గిపోయారు. కరోనా ముందు అంటే 2019లో పోల్చి చూస్తే ఇదే కేటగిరిలో 19% హెచ్1–బీ వీసాలు తగ్గిపోయాయి. కరోనా కారణంగా లాక్డౌన్లు విధించడం, వీసాల జారీ ప్రక్రియ మందగించడం, కోవిడ్ ముప్పుతో అమెరికాకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాలతోనే హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘2020 మార్చి నుంచి కొత్త వీసాల జారీ ప్రక్రియ బాగా నెమ్మదించింది. లాక్డౌన్ ఆంక్షలతో ఒకానొక దశలో కొన్నాళ్ల పాటు దాదాపు నిలిచింది. స్టెమ్ (సైన్స్, సాంకేతికం, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కేటగిరీలో ఉద్యోగులు తగ్గిపోయాయి. కొన్ని కంపెనీలు విదేశాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్‌కి అనుమతినివ్వడంతో హెచ్–1బీ వీసాల సంఖ్య తగ్గిపోయింది’ అని కాలిఫోర్నియా యూనిర్సిటీ ప్రొఫెసర్ పేరి గోవణ్ణ చెప్పారు. ప్రతీ ఏడాది కొత్తగా 85 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంటారు. స్టెమ్‌లో గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లో కరోనా కారణంగా ఉద్యోగాలు పోయాయి. కానీ త్వరగానే ఆయా రంగాలు కోలుకోవడంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టుగా అమెరికా కార్మిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 4,97,000 ఉద్యోగాలు ఉన్నాయని 2020 నుంచి పోల్చి చూస్తే 9% తగ్గిందని, 2019తో పోల్చి చూస్తే 17% తగ్గిందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ వెల్లడించింది. -
హెచ్1బీ భాగస్వాములకు భారీ లబ్ధి
వాషింగ్టన్ : భారత్ నుంచి వచ్చే వారితో సహా వలసదారులకి ప్రయోజనం చేకూరేలా అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు (భర్త/భార్య) ఆటోమేటిక్‌గా వర్క్ ఆథరైజేషన్ కల్పించడానికి అంగీకరించింది. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే ఐటీ నిపుణుల భార్యలకి ఈ నిర్ణయంతో ఎంతో ఊరట లభించింది. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) హెచ్–1బీ వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులు (భార/భర్త, 21 ఏళ్ల వయసులోపు పిల్లలు)కి హెచ్–4 వీసా జారీ చేస్తుంది. ఈ వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) కలిగి ఉండాలి. దీనిని ఎప్పటికప్పుడు వారు పొడిగించుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇకపై అలాంటి బాధ లేకుండా ఉద్యోగం చేయడానికి వీలుగా ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్‌తో కూడిన హెచ్–4 వీసాను మంజూరు చేయడానికి బైడెన్ సర్కార్ పచ్చ జెండా ఊపింది. ఈ నిర్ణయంతో భారత్ నుంచి వెళ్లే మహిళలకే అత్యధికంగా లబ్ధి చేకూరనుంది. ఈఏడీని పొడిగించుకోవడాన్ని సవాల్ చేస్తూ హెచ్–4 వీసాదారుల తరఫున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్ఏ) కోర్టులో పిటిషన్ వేసింది. ‘హెచ్–4 వీసాదారులు తరచూ రెగ్యులేటరీ పరీక్ష ఎదుర్కోవాలి. అయితే గతంలో హోంల్యాండ్ ఏజెన్సీ వారికి ఉద్యోగం రాకుండా నిషేధం విధించింది. దీంతో రీ ఆథరైజేషన్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండా వారు అత్యధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది’అని ఏఐఎల్ఏ లాయర్ జాన్ వాస్డెన్ చెప్పారు. దీనిపై బైడెన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రస్తుతం 90 వేలమందికి పైగా హెచ్–4 వీసాదారులకు వర్క్ ఆథరైజేషన్ ఉంది. -
ఉద్యోగాల్లో వివక్ష.. భారీ మూల్యం చెల్లించనున్న ఫేస్బుక్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ నెత్తిన మరోపిడుగు పడింది. ఉద్యోగుల విషయంలో వివక్ష ప్రదర్శిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో భారీ పెనాల్టీ విధించింది అమెరికా న్యాయ విభాగం. 14.5 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో సుమారు 107 కోట్ల రూపాయల దాకా) పెనాల్టీకి ఆదేశించింది. ఈ మేరకు ఫేస్బుక్ ఒక మెట్టు కిందకు దిగి.. ఒప్పందానికి రావడంతో వాదప్రతివాదనలకు ఆస్కారం లేకుండా వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్‌ను ఉల్లంఘించిందనే ఆరోపణల ఆధారంగా ఫేస్బుక్ మీద అమెరికా న్యాయ విభాగం గత డిసెంబర్లో ఒక కేసు నమోదు చేసింది. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు బదులు తాత్కాలిక ఉద్యోగులకు(విదేశీ ఉద్యోగులు, హెచ్ 1-బీ వీసాదారులు తదితరులు) ప్రాధాన్యత ఇవ్వడంలాంటి చర్యలకు పాల్పడింది ఫేస్బుక్. ఇది ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ నిబంధనలకు విరుద్దమేనని లేబర్ విభాగం సైతం వాదించింది. ఈ తరుణంలో సెటిల్మెంట్కు ముందుకొచ్చిన ఫేస్బుక్.. భారీ పెనాల్టీ చెల్లింపునకు అంగీకరించింది. ఇక ఫేస్‌బుక్‌తో జరిగిన ఈ సెటిల్మెంట్ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు అమెరికా అటార్నీ జనరల్(సహాయక) క్రిస్టన్ క్లార్క్ . 35 ఏళ్లలో ఇదే అతిపెద్ద సివిల్ రైట్స్ విభాగపు సెటిల్మెంట్గా పేర్కొన్నారు. స్వదేశీ ఉద్యోగులకు బదులు.. తాత్కాలిక వీసాదారులకు పీఈఆర్ఎం కింద (permanent labor certification program) ఫేస్బుక్ ఉద్యోగాలు ఇవ్వడంపైనే ప్రధాన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. సివిల్ పెనాల్టీ కింద 4.75 మిలియన్ డాలర్లు, ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపించినందుకు మరో 9.5 మిలియన్ డాలర్లు పెనాల్టీ చెల్లించాలని ఒప్పందం చేసుకుంది ఫేస్బుక్. చదవండి: మాజీ ఉద్యోగి చిచ్చు..వందల కోట్లు ఖర్చుకు సిద్ధమైన జుకర్‌బెర్గ్ ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ కలత.. రాజీనామా? -
H-1B Visa: లాటరీ ద్వారానే హెచ్–1బీ వీసాలు
వాషింగ్టన్: భారతీయులకు భారీగా ఊరట కలిగేలా అమెరికా న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ పద్ధతి ద్వారా హెచ్–1బీ వీసాల మంజూరుకు బదులుగా వేతనాల ఆధారంగా వీసాలు ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన ప్రతిపాదనల్ని అమెరికా ఫెడరల్ జడ్జి కొట్టేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన అధికారాలన్నీ ఉపయోగించుకొని వలస విధానంలో ఎన్నో మార్పుల్ని తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా సంక్షోభ సమయంలో విదేశాల నుంచి వలసలకు అడ్డుకట్ట వేయడానికి వేతనాల అధారంగా హెచ్–1బీ వీసాలను జారీ చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అయితే ఈ ప్రతిపాదనల్ని కాలిఫోరి్నయాలోని జిల్లా కోర్టుకు చెందిన ఫెడరల్ న్యాయమూర్తి జడ్జి జెఫ్రీ ఎస్ వైట్ కొట్టేశారు. అప్పట్లో తాత్కాలిక అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రిగా చాద్ వుల్ఫ్ నియామకం చట్టబద్ధంగా జరగలేదని, అందుకే ఆయన ఆధ్వర్యంలో చేసిన ఈ సవరణల్ని కొట్టేస్తున్నట్టుగా న్యాయమూర్తి స్పష్టం చేశారు. వేతనాల ఆధారంగా హెచ్–1బీ వీసాలు మంజూరు చేస్తే విదేశాల నుంచి తక్కువ వేతనాలకు వచ్చే వారి సంఖ్య తగ్గి పోతుందని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని పేర్కొంటూ అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఫెడరల్ న్యాయమూర్తి దానిని కొట్టేయడంతో భారతీయులకు భారీగా ఊరట లభించింది. ఐటీ కంపెనీలు హెచ్–1బీ వీసా మీద భారత్, చైనా నుంచి భారీ సంఖ్యలో టెక్కీలకు ఉద్యోగాలు ఇస్తుంటాయి. ట్రంప్ తీసుకువచ్చిన సవరణల ప్రకారం వేతనాల ఆధారంగా వీసాలు ఇస్తే కనుక అత్యంత నైపుణ్యం కలిగిన, భారీ వేతనాలు అందుకొనే వారికి మాత్రమే అమెరికా వెళ్లే అవకాశం లభిస్తుంది. తక్కువ వేతనానికి ఉద్యోగుల్ని నియమించుకోవడానికి వీలు కాదు. అందుకే టెక్ కంపెనీలన్నీ ఈ ప్రతిపాదనల్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతీ ఏడాది 65 వేల హెచ్–1బీ వీసాలను మంజూరు చేస్తారు. దానికి అదనంగా మరో 20 వేల వీసాలు అడ్వాన్స్ డిగ్రీ ఉన్న వారికి ఇస్తారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదట అన్నవిధానంతో పాటు లాటరీ విధానం ద్వారా ఈ వీసాలను మంజూరు చేస్తారు. -
గ్రీన్‌కార్డుకు ఇక సూపర్ ఫీ!
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న భారతీయులకు ఊరట లభించనుంది. అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రతినిధుల సభకు చెందిన జ్యుడీషియరీ కమిటీ రూపొందించిన రీకన్సిలియోషన్ బిల్లులో వివరాల ప్రకారం... గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు సూపర్ ఫీ చెల్లించడానికి ముందుకు వస్తే గ్రీన్కార్డుని అప్పటికప్పుడే పొందవచ్చు. అదే విధంగా లీగల్ డ్రీమర్స్ (తల్లిదండ్రుల హెచ్–1బీ వీసాతో చిన్నారులుగా దేశానికి వచ్చి 21 ఏళ్లు నిండిన వారు) ఈ సప్లిమెంటరీ ఫీజు కడితే వారికి శాశ్వత నివాసం, పౌరసత్వం లభిస్తుంది. త్వరలోనే ఈ బిల్లు కాంగ్రెస్ ముందుకు రానుంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల్ని ప్రతీ ఏడాది అమెరికా 1.40 లక్షలు మంజూరు చేస్తుంది. దీంట్లో ఏ ఒక్క దేశానికీ 7 శాతానికి మించి గ్రీన్‌కార్డులు మంజూరు చేయకూడదనే పరిమితి ఉంది. భారతీయులు అధిక సంఖ్యలో గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేస్తూ ఉండడంతో ఈ కోటా వల్ల దరఖాస్తుదారులు ఎక్కువగా పెరిగిపోతున్నారు. కాటో ఇనిస్టిట్యూట్‌కు చెందిన వలస విధాన నిపుణుడు డేవిడ్ బెయిర్ అధ్యయనం ప్రకారం ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం వేచి చూస్తున్న భారతీయుల సంఖ్య ఏప్రిల్ 2020 నాటికి 7.41 లక్షలుగా ఉంది. వీరందరికీ కార్డు రావాలంటే 84 ఏళ్లు వేచి చూడాలని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ ఫీ చెల్లిస్తే గ్రీన్‌కార్డు రావడం అన్నది సువర్ణావకాశమని బెయిర్ అన్నారు. 5 వేల డాలర్లు చెల్లించే వారందరికీ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తే అంతకు మించినది ఏముంటుందని పేర్కొన్నారు. ఇక అత్యవసర రంగాలైన ఆరోగ్యం, ఆహారం, వ్యవసాయంతో పాటుగా రవాణా, ఐటీకి చెందిన కంపెనీల్లో పని చేసేవారికి వారి యాజమాన్యం స్పాన్సర్ చేయకపోయినా.. 5 వేల డాలర్లు చెల్లించి గ్రీన్‌కార్డు పొందే అవకాశం ఉంటుంది. ఒక రకంగా బైడెన్ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే ఈ పని చేస్తూ ఉందని న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ లా సంస్థ వ్యవస్థాపకుడు సైరస్ డి మెహతా అన్నారు. బడ్జెట్ రీ కన్సిలేషన్ బిల్లులో భాగంగా దీనిని చేర్చడంతో కాంగ్రెస్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందుతుందని మెహతా ధీమాగా చెప్పారు. బిల్లులో ఏముందంటే.. ► ఉద్యోగ ఆధారిత వలసదారులు గ్రీన్‌కార్డు ప్రయార్టీ తేదీ కంటే ఇంకా రెండేళ్లు ఎక్కువ గా నిరీక్షించాల్సి వచి్చనప్పుడు 5 వేలడాలర్ల సూపర్ ఫీ చెల్లిస్తే అప్పటికప్పుడు వారికి గ్రీన్ కార్డు మంజూరు చేస్తారు. ► కుటుంబ ఆధారిత వలసదారులు, అమెరికా పౌరులెవరైనా స్పాన్సర్ చేస్తే గ్రీన్‌కార్డు రావాల్సిన సమయంలో కంటే రెండేళ్లు ఎక్కువ నిరీక్షించిన తర్వాత సప్లిమెంట్ ఫీజు కింద 2,500 డాలర్లు చెల్లించాలి. ► వలస విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ దేశాల పరిమితి కోటా ఎత్తేయడం, హెచ్–1బీ వీసా వార్షిక కోటా పెంచడం వంటి వాటికి ఈ బిల్లులో చోటు దక్కలేదు. -
డ్రీమర్ల కల తీర్చనున్న అమెరికా
వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న చట్టబద్ధ వలసదారుల పిల్లల ‘పౌరసత్వం’ కల నిజమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది. అమెరికాలో హెచ్–1బీ, ఇతర దీర్ఘకాలిక నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్’లుగా పిలుస్తారు. ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు. అప్పుడు వారివారి స్వదేశాలకు అమెరికా సాగనంపుతుంది. ఈ ప్రమాదం నుంచి వీరందరినీ బయటపడేసేందుకు బైడెన్ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని వైట్‌హౌస్ ప్రకటించింది. భారీసంఖ్యలో డ్రీమర్ల తల్లిదండ్రులు దశాబ్దాలుగా అమెరికా శాశ్వత నివాస ధ్రువీకరణ ‘గ్రీన్ కార్డు’ కోసం ఎదురుచూస్తున్నారు. వీరు గ్రీన్‌కార్డుల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుండటంతో వారి పిల్లల వయసు 21 దాటుతోంది. అలాంటి వారు అమెరికాను వీడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రీమర్లు 21ఏళ్ల వయసులోపు వరకూ డిపెండెంట్లుగా తమ తల్లిదండ్రులతోపాటే అమెరికాలోనే ఉండొచ్చు. 21 ఏళ్లు దాటితే వారికి ఆ డిపెండెంట్ హోదా పోతుంది. అమెరికా పౌరసత్వ కల వీరందరికీ అలాగే ఉండిపోయింది. ‘ఇంప్రూవ్ ది డ్రీమ్’ గణాంకాల ప్రకారం రెండు లక్షల మంది డ్రీమర్లు ఉన్నారని, అందులో అధికశాతం మంది భారతీయులేనని సమాచారం. వీరి పౌరసత్వ కల నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ చెప్పారు. అమెరికా వలస విధానంలో సంస్కరణలు తేవాల్సిన తరుణం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇమ్మిగ్రేషన్ బిల్లు సెనేట్‌కు పంపారు. పాత చట్టానికి సవరణలు, వాడని వీసాలను స్వాధీనం చేసుకోవడం, చాన్నాళ్లు వేచి ఉండే పద్ధతికి స్వస్తి పలకడం, ‘ఒక్కో దేశానికి గరిష్ట పరిమితిలోనే అనుమతులు’.. ఇలా అనేక కుటుంబ ఆధారిత వలస విధానంలో సంస్కరణలు ఆ బిల్లులో ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. డ్రీమర్లు అమెరికాలో పనిచేసుకునేందుకు, చట్టం అనుమతించిన వయసు పరిమితిని దాటినా వారికి రక్షణ కల్పించే అంశాలూ ఈ బిల్లులో ఉన్నాయని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కూడా అయిన జెన్‌సాకీ చెప్పారు. -
హెచ్–1బీ వీసాల జారీకి రెండోసారి లాటరీ
వాషింగ్టన్: హెచ్–1బీ వర్క్ వీసా కోసం ఎదురు చూస్తున్న భారత ఐటీ నిపుణులకు శుభవార్త. ఈ వీసాల జారీకి రెండోసారి లాటరీ నిర్వహించాలని యూఎస్ సిటిజెన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) నిర్ణయించింది. మొదటి దశలో వీసాలు పొందలేని వారికి ఈ విధంగా మరో అవకాశం లభించనట్లే. హెచ్–1బీ వీసాల జారీకి ఈ ఏడాది ప్రారంభంలో కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించారు. అయితే, అర్హులైన వారు చాలామంది వీసాలు పొందలేకపోయారు. అందుకే రెండోసారి లాటరీ నిర్వహించాలని నిర్ణయించినట్లు యూఎస్సీఐఎస్ గురువారం ప్రకటించింది. ఏటా కేవలం 65వేల హెచ్–1బీ వీసాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. హెచ్–1బీ అనేది నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా. దీనితో అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను స్వదేశంలో ఉద్యోగాల్లో నియమించుకోవచ్చు. రెండోసారి లాటరీ విషయంలో పిటిషన్ ఫైలింగ్ ఆగస్టు 2 నుంచి నవంబర్ 3 వరకు ఉంటుందని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. -
H-1B Visa: భారత టెక్కీలకు మరో ఛాన్స్!
H-1B Visa Second Lottery: భారత టెక్కీలకు ఊరట ఇచ్చే వార్త ప్రకటించింది యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ. రెండో రౌండ్ లాటరీ పద్ధతిలో హెచ్-1బీ వీసాలు జారీ చేయనున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయినందున.. జులై 28న మరికొందరిని ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్‌లో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఆగష్టు 2 నుంచి ప్రారంభం కాబోయే పిటిషన్ ఫైలింగ్ ప్రక్రియ నవంబర్ 3తో ముగియనన్నుట్లు అర్హులైన అభ్యర్థులకు సూచించింది. ఇదిలా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30) హెచ్-1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లలో (ఏప్రిల్ 1 నుంచి 30 దాకా నమోదు చేసుకున్నవాళ్ల) మొదటి లాటరీలో ఎంపిక చేసింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో ఎంపికలు చేయలేకపోయామని, కాబట్టే, ఇప్పుడు రెండో లాటరీ నిర్వహిస్తున్నట్లు USCIS వెల్లడించింది. తద్వారా అదనంగా వందల మంది ఆశావాహ టెక్కీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఇది స్టెమ్-ఓపీటీ స్టూడెంట్స్‌కు భారీ ఊరట ఇవ్వనుంది. కాగా, హెచ్-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్ -1 బీ వీసాలను జారీ చేస్తుంటుంది. తద్వారా చైనీయులకు-భారతీయులకు ఆయా దేశాల ,ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరునుంది. హెచ్-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. వీరు మాత్రమే హెచ్-1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. -
హెచ్–1బీ వీసాలను రెట్టింపు చేయండి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత నానాటికీ తీవ్రమవుతోందని యూఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ప్రొఫెషనల్ వర్క్‌ఫోర్స్ అవసరం భారీగా పెరుగుతోందని గుర్తుచేసింది. కొరతను అధిగమించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జో బైడెన్ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు(పార్లమెంట్) విజ్ఞప్తి చేసింది. విదేశీ నిపుణులను రప్పించడానికి వీలుగా హెచ్–1బీ వీసాల సంఖ్యను రెట్టింపు చేయాలని సూచించింది. గ్రీన్‌కార్డుల జారీ విషయంలో అమల్లో ఉన్న దేశాలవారీ కోటా వ్యవస్థను ఎత్తివేయాలని పేర్కొంది. తగినంత మంది వృత్తి నిపుణులు అందుబాటులో లేకపోతే ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని యూఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సుజానే క్లార్క్ చెప్పారు. ఈ పరిణామం నూతన ఉద్యోగాల సృష్టికి అడ్డంకిగా మారుతుందని అన్నా రు. ఎంప్లాయ్మెంట్ ఆధారిత వీసాలను ప్రతిఏ టా కేవలం 1,40,000 మాత్రమే ఇస్తున్నారని, వీటిని 2,80,000 పెంచాలని విజ్ఞప్తి చేశారు. -
H1-B, వీసాల తిరస్కరణ: భారీ ఊరట
వాషింగ్టన్: ముందస్తు నోటీసు ఇవ్వకుండా వీసాలను అధికారులు తిరస్కరించేందుకు వీలు కల్పించే ట్రంప్ పాలనా కాలపు విధాన నిర్ణయాన్ని తొలగించనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. ఈ నిబంధన తొలగింపుతో లీగల్ ఇమ్మిగ్రేషన్‌కు ఉన్న అడ్డంకులు మరింతగా తగ్గనున్నాయి. జోబైడెన్-హారిస్ నేతృత్వంలో తీసుకున్న విధాన చర్యలు దేశ చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు అనవసరమైన అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడుతుందని యుఎస్సీఐఎస్ డైరెక్టర్ ట్రేసీ రెనాడ్ చెప్పారు. అలాగే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలకు సంబంధించి వలసదారులపై భారాన్ని తగ్గించాలన్న లక్ష్యానికనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ట్రంప్ 2018లో తెచ్చిన ఈ నిబంధన హెచ్1బీతో సహా ఎల్1, హెచ్2బీ, జే1, జే2, ఎఫ్, ఓ తదితర వీసా అప్లికేషన్లపై పడింది. తాజాగా ఆర్ఈఎఫ్, ఎన్ఓఐడీ నిబంధనలను మారుస్తున్నట్లు, కొన్ని రకాల ఎంప్లాయ్ ఆధరైజేషన్ డాక్యుమెంట్ల కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. 2013లో తీసుకువచ్చిన నిబంధనలనే తిరిగి అమలు చేస్తామని, 2018లోతెచ్చిన నిబంధనను తొలగిస్తామని తెలిపింది. తాజా నిర్ణయంతో అప్లికేషన్లలో తప్పులను సవరించుకునే వీలు వీసా దరఖాస్తుదారులకు కలగనుంది. 2018 నిబంధన ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వీసాలు తిరస్కరించేందుకు ఏజెన్సీ అధికారులకుఅవకాశం ఉండేది. దీని ప్రభావం పలు ఐటీ కంపెనీల ఉద్యోగులపై పడింది. చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ సజావుగా కొనసాగేందుకు తాము తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని హోమ్లాండ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో తెలిపారు. చదవండి : Petrol Price: రూ.102 దాటేసింది! -
మోసపూరితంగా ‘హెచ్1బీ’.. వెలుగులోకి భారీ స్కాం..!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో పని చేయాలను కొనే భారతీయ వృత్తి నిపుణులకు హెచ్1–బీ వీసాలను అక్రమ మార్గాల్లో మంజూరు చేయిస్తూ క్లౌడ్‌జెన్ ఎల్ఎల్సీ అనే టెక్నాలజీ కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ‘బెంచ్ అండ్ స్విచ్’ పద్ధతిలో ఈ సంస్థ సాగించిన కుంభకోణం అమెరికా టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరంలో వెలుగుచూసింది. ప్రస్తు తం అక్కడి ఫెడరల్ కోర్టులో ‘క్లౌడ్‌జెన్’పై వీసాల దుర్వినియోగం అభియోగాల కేసు నడుస్తోంది. మే 28న జరిగిన వాదనల్లో ‘క్లౌడ్‌జెన్’ వైస్ ప్రెసిడెంట్ జొమాన్ చొక్కలక్కల్ తాము మోసపూరితంగా పలువురికి హెచ్1–బీ వీసాలు ఇప్పించినట్లు న్యాయస్థానంలో అంగీకరించారు. ఈ కేసులో సెప్టెంబర్ 16న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ సంస్థకు సుమారు 10 లక్షల డాలర్ల జరిమానా, ఐదేళ్లపాటు అవకాశం ఉంది. ఈ వ్యవహారం అక్కడి ఎన్ఆర్ఐలలో పెద్ద దుమారమే రేపుతోంది. రొమేనియా, కెనడా కేంద్రంగా నడుస్తున్న క్లౌడ్‌జెన్ టెక్నాలజీ కంపెనీకి చెందిన ఒక శాఖ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోనూ ఉంది. ప్రస్తుతానికి ఈ సంస్థ మూతబడింది. కుంభకోణం జరిగింది ఇలా.. అమెరికా కేంద్రంగా నడిచే పలు కంపెనీల్లో ఉద్యోగాలు పొందే విదేశీ వృత్తి నిపుణులకు హెచ్1–బీ వీసాలు మంజూరు చేస్తారు. నిబంధనల ప్రకారం ముందుగా అక్కడ ఉన్న కంపెనీలతో ‘క్లౌడ్‌జెన్’ ఒప్పందం చేసుకొని నిపుణులను సరఫరా చేయాలి. ఏదైనా కంపెనీ ఫలానా వృత్తి నిపుణుడు కావాలని కోరినప్పుడు మాత్రమే అందుకు అర్హుడిని గుర్తించాలి. ఆపై వీసా ప్రాసెసింగ్ పూర్తి చేసి వారిని అమెరికా తీసుకువెళ్లాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. కానీ ‘క్లౌడ్‌జెన్’ మాత్రం నకిలీ కాంట్రాక్టులను లేబర్ డిపార్ట్మెంట్, హోంల్యాండ్ సెక్యూరిటీకి సమర్పించి అనుమతులు పొందేది. ఈ అనుమతులతో హెచ్1బీ వీసాలు దరఖాస్తు చేసేది. ఇలా వీసాలు లభించగానే భారతీయ నిపుణులను అమెరికా పంపేది. కానీ నిజంగా చేసేందుకు ఉద్యోగాలు లేకపోవడంతో వారికి అవసరమైన ఉద్యోగాలను వెతికిపెట్టే పని కూడా ‘క్లౌడ్‌జెన్’ చేసేది. విదేశీ వృత్తి నిపుణులు అందుబాటులో ఉండటంతో (బెంచ్) ఆ తర్వాత కాలంలో అమెరికా కంపెనీలకు అవసరమైన నిపుణులను వెంటనే అందించేది. ఇలా అక్కడి మార్కెట్లో అయాచిత లబ్ధి పొందేది. అప్పుడు ఆయా సంస్థలు భారతీయ వృత్తి నిపుణుల తరఫున ఇమ్మిగ్రేషన్ పత్రాలను (స్విచ్) సమర్పించేవి. ఉద్యోగాలు పొందిన భారతీయ వృత్తి నిపుణుల నుంచి ‘క్లౌడ్‌జెన్’ కమిషన్ తీసుకొనేది. ఇలా 2013 మార్చి నుంచి 2020 డిసెంబర్ వరకు సుమారు 5 లక్షల డాలర్లను క్లౌడ్‌జెన్ సంపాదించింది. ఈ కంపెనీకి శశి పల్లెంపాటి ప్రెసిడెంట్‌గా, వైస్ ప్రెసిడెంట్‌గా జొమాన్ చొక్కలక్కల్, సుదీప్ చందక్ వ్యవహరిస్తున్నారని సంస్థ వెబ్సైట్ పేర్కొంది. -
అమెరికాలో వెలుగుచూసిన ఘరానా మోసం
న్యూయార్క్, హైదరాబాద్ : అమెరికాలో ఓ ఘరానా మోసం వెలుగుచూసింది. హైదరాబాద్ కేంద్రంగా హెచ్1బీ వీసా స్కామ్ బయటపడింది. క్లౌడ్‌జెన్ అనే ఓ టెక్ కంపెనీ 'బెంచ్ అండ్ స్విచ్' తరహా మోసానికి పాల్పడింది. థర్డ్ పార్టీ కోసం పని ఉందంటూ భారత్ నుంచి ఉద్యోగులకు బోగస్ కాంట్రాక్టులు ఇచ్చింది. కాంట్రాక్టుల ఆధారంగా హెచ్1బీ వీసాలు జారీ చేసింది. అమెరికా చేరుకున్న తర్వాత ఉద్యోగులకు పని వెతికి.. అడిగిన కంపెనీకి హెచ్1బీ వీసా కలిగిన ఉద్యోగులను సరఫరా చేసింది. సాధారణంగా హెచ్1బీ ప్రాసెస్ ద్వారా ఉద్యోగులను పొందడానికి సుదీర్ఘ ప్రయాస పడాల్సి ఉంటుంది. అయితే, వీసాతో రెడీగా ఉన్న ఉద్యోగులను కలిగి ఉండడం క్లౌడ్‌జెన్‌కు మార్కెట్లో అడ్వాంటేజ్‌గా మారింది. ఉద్యోగుల నుంచి కమీషన్ల రూపంలో.. 2013 నుంచి 2020 మధ్య 5 లక్షల డాలర్ల మేర వసూళ్లు చేసింది. రికార్డుల ప్రకారం పల్లెంపాటి శశి క్లౌడ్‌జెన్ సంస్థకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కంపెనీ వెబ్సైట్ ప్రకారం మానస్పాస్, హైదరాబాద్ గచ్చిబౌలి.. కెనడా, రొమేనియా దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. కాగా, క్లౌడ్‌జెన్ కంపెనీ ప్రతినిధులు టెక్సాస్‌లోని హూస్టన్ కోర్టులో తమ నేరాన్ని అంగీకరించారు. చదవండి : పెళ్లైన 2 రోజులకే భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం -
H-1B Visa: భాగస్వాముల వీసాలకు గూగుల్ మద్దతు
వాషింగ్టన్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం కలిగిన వలసదారులైన హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు వర్క్ వీసాలు అందించేందుకు గూగుల్ సంస్థ మద్దతు ప్రకటించింది. ఈ విషయంపై ఇప్పటికే పలు సంస్థలు సానుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ సైతం ఈ జాబితాలో చేరింది. అమెరికాకు వచ్చే వలసదారులకు గూగుల్ మద్దతుగా ఉంటుందని ఆ సంస్థ సీఈవో సుందర్‌పిచాయ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్4ఈఏడీ(ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆవిష్కరణలు పెరిగి ఉద్యోగ సృష్టి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. Google is proud to support our nation’s immigrants. We joined 30 other companies to protect the H-4 EAD program which spurs innovation, creates jobs and opportunities, and helps families. https://t.co/AvmEbLve3C — Sundar Pichai (@sundarpichai) May 14, 2021 హెచ్4 వీసాల వల్ల ఉద్యోగాల్లో పోటీ తత్వం దెబ్బతింటోందని అక్కడి కోర్టులో దాఖలైన కేసులో గూగుల్ మరో 30 సంస్థల తరపున అఫిడవిట్ సమర్పించింది. హెచ్1బీ వీసాదారు కుటుంబసభ్యులకు అవకాశం కల్పించే వ్యవస్థను కోరుకుంటున్నామని పేర్కొంది. దాని ద్వారా సుమారు 90వేల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆ సంస్థ న్యాయ విభాగం ఉపాధ్యక్షురాలుకేథరిన్ లఖవేరా తెలిపారు. హెచ్1బీ వీసా కలిగిన వారు తమ భాగస్వామితో పాటు పిల్లలు కూడా అమెరికాలో ఉండేందుకు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అనుమతి ఇస్తుంది. ‘వలసదారులకు మద్దతుగా నిలిచేందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. మరో 30 సంస్థలతో కలిసి హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాం. దీని వల్ల ఆవిష్కరణలు, ఉద్యోగ అవకాశాలుపెరుగుతాయి. ఈ కార్యక్రమం వారి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది’ అని పిచాయ్ ట్వీట్ చేశారు. అడోబ్, అమెజాన్, యాపిల్, ఈబే, ఐబీఎం, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, పేపాల్, ట్విటర్ సహా ఇతర కంపెనీలు హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అనేక ఆంక్షలు విధించారు. ఇక జోబైడెన్ అధ్యక్షుడుఅయిన తర్వాత ట్రంప్ విధించిన నియమ నిబంధనలు, ఆంక్షలను ఉపసంహరించిన విషయం తెలిసిందే. చదవండి: భారతీయ టెక్కీలకు భారీ ఊరట -
టెకీల జీవిత భాగస్వాముల కలలు ఆవిరి!
అమెరికాలోని భారతీయ టెకీల జీవిత భాగస్వాముల కలలు ఆవిరవుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్సీఐఎస్) వారికి చుక్కలు చూపుతోంది. హెచ్4(డిపెండెంట్) వీసాలు కలిగి ఉండే హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ చట్టబద్ధంగా ఎలాంటి ఉద్యోగాలైనా చేసేందుకు అనుమతించే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్–ఈఏడీ (అంటే వర్క్ పర్మిట్ అన్నమాట) జారీలో తీవ్ర జాప్యం చేస్తోంది. కరోనా పేరు చెప్పి నెలల తరబడి వారి ఈఏడీ రెన్యూవల్ దరఖాస్తులను పక్కన పెట్టేసింది. ఫలితంగా మార్చి 31 నాటికి సుమారు 91 వేల మంది భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. దేశంకాని దేశంలో అహోరాత్రులు కష్టపడి చేస్తున్న ఉద్యోగం హఠాత్తుగా ఊడిపోవడంతో వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఈఏడీ రెన్యూవల్‌కు 14 నుంచి 16 నెలలు పడుతోందని, ఈ పరిణామం తమ జీవితాలను అస్తవ్యస్తం చేస్తోందని వాపోతున్నారు. తమ గోడును పట్టించుకునే వారు లేక విలవిల్లాడుతున్నారు. హెచ్4 వీసాలు కలిగిన జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకొనే హక్కు కల్పించిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ అంశంపై స్పందించాలంటూ నిత్యం వందలాది మంది ఆయనకు మెయిల్స్ పంపుతున్నారు. అమెరికా నుంచి కంచర్ల యాదగిరిరెడ్డి హెచ్1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అది లభించడానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. ఈలోగా జీవిత భాగస్వామి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలంటే విద్యార్హతలు ఉన్నా అమెరికాలో పని చేయడానికి గతంలో ఆ అవకాశం ఉండేది కాదు. ఇది ఆయా కుటుంబాలకు ఇబ్బందిగా ఉందని గ్రహించిన నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లో కొత్త ప్రతిపాదన తెచ్చారు. హెచ్1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న వారి జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా హెచ్4 ఈఏడీ బిల్లును ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో 2016 నుంచి హెచ్1బీ జీవిత భాగస్వాములకు ఈఏడీ లభిస్తోంది. దీనివల్ల 1.34 లక్షల మంది భారతీయ మహిళలు యూఎస్సీఐఎస్ నుంచి ఈఏడీ పొంది ఉద్యోగాల్లో చేరారు. జీవిత భాగస్వామి హెచ్1బీ గడువుకు అనుగుణంగా హెచ్4 వీసా రెన్యూవల్ చేస్తారు. కానీ ఏడాదిన్నరగా యూఎస్సీఐఎస్ ఈఏడీ రెన్యూవల్ చేయట్లేదు. చాలా మంది 15 నుంచి 20 నెలలుగా రెన్యూవల్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. కరోనా కేసులతోపాటు మరికొన్ని కారణాలను చూపుతూ యూఎస్సీఐఎస్ ఈఏడీల పునరుద్ధరణలో జాప్యం చేస్తోందని, 90 వేల మందికిపైగా భారతీయ గృహిణులు, వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ సంస్థకు చీమకుట్టినట్లు కూడా లేదని భారతీయ, అమెరికన్ ఇమ్మిగ్రేషన్ నిపుణుడు ఇందర్జిత్ అహ్లూవాలియా మండిపడ్డారు. మునుపెన్నడూ తాను ఇలాంటి దురుసుతనాన్ని చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. హెచ్4 ఈఏడీకి మరికొన్ని సంగతులు... ► హెచ్1బీ వీసా మూడేళ్లు ఉంటే అంతే కాలానికి హెచ్4 ఈఏడీ జారీ చేస్తారు. మామూలుగా ఆరేళ్లుగా రెన్యూవల్‌కు ముందే హెచ్1బీతోపాటే హెచ్4 జారీ చేసేవారు. ఇప్పుడు హెచ్1బీ జారీ అయి ఏడాది దాటినా హెచ్4 ఈఏడీ ఇవ్వడం లేదు. ► హెచ్ 4 ఈఏడీ కలిగి ఉన్న జీవిత భాగస్వాములు అమెరికాలో ఏ ఉద్యోగమైన చేసుకునేందుకు అర్హులు. వీరికి హెచ్1బీ మాదిరి ఆంక్షలు ఉండవు. కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలే చేయాలన్న నిబంధనేమీ లేదు. కానీ భారతీయుల్లో 95 శాతం మంది టెకీ ఉద్యోగాలే చేస్తున్నారు. న్యాయస్థానాల్లో డజన్లకొద్దీ కేసులు... తమ ఈఏడీలను రెన్యూవల్ చేయడంలో యూఎస్సీఐఎస్ కావాలని తాత్సరం చేస్తోందంటూ బాధితులు అమెరికాలోని వివిధ రాష్ట్రాల కోర్టుల్లో రోజూ డజన్లకొద్దీ పిటిషన్లు వేస్తున్నారు. ‘‘న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప మాకు గత్యంతరం లేదు. మేము పడుతున్న ఇబ్బందులను కోర్టులైనా అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నాం’’ అని కంభాలపాటి అనూష అన్నారు. ఆమె టెక్సాస్‌లోని డాలస్ కోర్టులో తనకు న్యాయం చేయాలంటూ మరో 250 మందితో కలసి పిటిషన్ వేసింది. అమెరికన్ ఎకానమీలో భారతీయ వలసదారులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారంటూ ప్రశంసించడమే తప్ప అవసరమైన సందర్భాలలో ఆదుకోవడానికి అమెరికా కాంగ్రెస్ సభ్యులు ముందుకు రావట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఏడీ కార్డు రెన్యూవల్ చేయలేదు హెచ్4 వీసాపై సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నాకు 10 నెలల నుంచి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఉద్యోగ ఆధారిత కార్డు (ఈఏడీ) రెన్యూవల్ చేయకపోవడంతో మా కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దానికి తోడు నా రెండేళ్ల కుమారుడు ఆటిజం వ్యాధి చికిత్సకు నెలకు అవసరమైన 2,500 డాలర్లు సమకూర్చలేక నరకయాతన అనుభవిస్తున్నా. – ప్రియాంక జొన్నలగడ్డ 11 నెలలుగా ఉద్యోగం లేదు కేన్సర్ బారిన పడిన నేను 11 నెలలుగా ఉద్యోగం లేక అల్లాడుతున్నా. నా భర్త జీతం కుటుంబ అవసరాలకూ సరిపోవట్లేదు. నా వ్యాధికి చికిత్స తీసుకునేందుకు వీలుగా తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ఈఏడీ మంజూరు చేయాలని యూఎస్సీఐఎస్ను వేడుకున్నా. కానీ కేన్సర్ బారినపడిన మీరు ఇంకా పనిచేయగల పరిస్థితిలో ఉన్నారా అంటూ యూఎస్సీఐఎస్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ఇంకెందుకు బతికున్నానా అనిపించింది’’ – గీతా సుశీల్కర్ అసలే కరోనా.. ఆపై అసలే కరోనా హమమ్మారి, దీనికితోడు కుటుంబంలో ఒకరి ఉద్యోగం పోగొట్టుకున్న 90 వేల మందికిపైగా భారతీయ కుటుంబాలు అప్పటివరకు వస్తున్న ఆదాయానికి గండిపడటంతో సంసారం గడవడం గగనమై చితికి పోయాయి. కెరీర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయ యువతీయువకులు ఇప్పుడు నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. – జాన్ మేయర్ ,హాఫ్ మన్ లా గ్రూపు నిపుణుడు -
భారతీయ టెక్కీలకు భారీ ఊరట
వాషింగ్టన్: డాలర్ డ్రీమ్స్ కలలుకంటున్న భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభించింది. హెచ్1బీ సహా విదేశీ వర్కర్స్ వీసాలపై నిషేధం విధిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వుల గడువు మార్చి 31తో ముగిసింది. అధ్యక్షుడు అధ్యక్షుడు బైడెన్ ఆ నిషేధాన్ని మళ్లీ పొడిగిస్తూ ఎలాంటి ఉత్వర్వులు జారీ చేయకపోవడంతో అమెరికాకు వెళ్లాలనుకునే వివిధ దేశాలకు చెందిన టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు. గత ఏడాది కరోనా సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకొని ప్రపంచ మార్కెట్లు మూతపడిన సమయంలో ట్రంప్ హెచ్–1బీ సహా వలసేతర వీసాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించారు. తొలుత డిసెంబర్ 31వరకు నిషేధం విధించారు. ఆ తర్వాత ఆ నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. తాను అధికారంలోకి వస్తే వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. అమెరికాలో దీనిపై పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించాయి. హెచ్1బీపై నిషేధం కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని, నిపుణులైన పనివారు దొరకరని కొందరు వాదిస్తే, తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులు దొరకడం వల్ల స్థానికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. వీసాలపై నిషేధాన్ని కొనసాగించాలంటూ కొందరు రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు బైడెన్‌కు లేఖలు కూడా రాశారు. కరోనా సంక్షోభంతో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, దాదాపుగా కోటి మంది అమెరికన్లు ఉద్యోగాల్లేకుండా ఉన్నారని అందుకే హెచ్–1బీలపై నిషేధం పొడిగించాల్సిందేనంటూ మిసౌరీ సెనేటర్ జోష్ హాలీ ఆ లేఖలో పేర్కొన్నారు. -
H1B Visa: హెచ్1బీ వీసాలపై గుడ్‌న్యూస్
వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు తెచ్చిన హెచ్1బీ వీసా నిషేధాన్ని కొనసాగించకూడదని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తెచ్చిన నిషేధ కాలవ్యవధి బుధవారం ముగుస్తుండగా, దీన్ని పొడిగించకూడదని బైడెన్ భావించినట్లు తెలిసింది. ఈ నిషేధం కారణంగా పలు టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాజాగా నిషేధం తొలగిపోవడం, నిషేధాన్ని బైడెన్ వద్దనుకోవడం.. టెక్ కంపెనీలకు మంచిదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇంకా వైట్‌హౌస్ అధికారిక ప్రకటన చేయలేదు. కొందరు అధికారులు మాత్రం నిషేధాన్ని వెంటనే ఎత్తివేస్తే అమెరికా కంపెనీలకు మంచిది కాదని, అందువల్ల నెమ్మదిగా తొలగించాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా కొత్త గ్రీన్ కార్డులు జారీ చేయకూడదన్న ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ రద్దుచేయడం తెల్సిందే. ఈ నిర్ణయాలు అమెరికాకు, ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమని బైడెన్ వ్యాఖ్యానించారు. వీసాపై నిషేధాన్ని అమెరికాలో లేబర్ యూనియన్లు స్వాగతించాయి. హెచ్1బీ ప్రాథమిక ఈ–రిజిస్ట్రేషన్ ఎంపిక పూర్తి రాబోయే ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ విదేశీ వర్కర్ వీసాల పరిమితి పూర్తయినట్లు అమెరికా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రాథమిక రిజిస్ట్రేషన్ íపీరియడ్‌లో సరిపడ్డా ఈ– అప్లికేషన్లు వచ్చాయని, 2022 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసాలకు సంబంధించి ప్రాథమిక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపింది. అమెరికాలో ఉద్యోగానికి వెళ్లే భారతీయ ఐటీ నిపుణులకు ఈ వీసాలు ఎంతో కీలకం. ఈ వీసాల కోసం సరైన ఆధారాలతో సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తామని అమెరికా పౌరసత్వం మరియు వలసదారుల సేవా కేంద్రం (యూఎస్సీఐఎస్) పేర్కొంది. అమెరికా కంపెనీల్లో పనిచేయాలంటే విదేశీ వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసాలు తప్పనిసరి. వీటికి కేవలం భారత్ నుంచే కాక పలు దేశాల నుంచి గట్టి పోటీ ఉంది. -
హెచ్1బీ వీసా సమస్యలు పరిష్కరిస్తాం
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ టెక్కీలు అత్యధికంగా వినియోగించే హెచ్–1బీ తదితర వీసాలపై గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకువచ్చిన త్రీ పాలసీ మెమొస్ విధానం కారణంగా ఏర్పడిన ప్రతికూలతను పరిష్కరిస్తామని జో బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేసినప్పటికీ దాని వల్ల ఏర్పడిన వ్యతిరేక ప్రభావాల్ని సవరించే అంశాలను పునఃపరిశీలిస్తామని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ శుక్రవారం ప్రకటించింది. జో బైడెన్ ప్రభుత్వ నిర్ణయంతో భారత్ సహా విదేశీ టెక్కీలకు భారీగా ఊరట లభించనుంది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో విధిం చిన ఆంక్షలతో భారతీయ వృత్తి నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసా చెల్లుబాటు కాలం, యాజమాన్యానికి, ఉద్యోగులకి మధ్య ఉన్న సంబంధాలు, విదేశీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఆంక్షలు విధించింది. విదేశీయులకు కనీస వేతనం అమలు వాయిదా హెచ్1–బీ వీసా వినియోగదారులకు కూడా అమెరికన్లతో సమానంగా అధిక వేతనాన్ని చెల్లించాలంటూ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయం అమలును బైడెన్ సర్కార్ మే 14వరకు వాయిదా వేసింది. తక్కువ వేతనానికి భారతీయులు సహా ఇతర విదేశీయుల్ని పనిలోకి తీసుకోవడం వల్ల అమెరికన్లకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయన్న ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఏర్పడింది. అయితే బైడెన్ నిర్ణయం అమలును వాయిదా వేయడంతో భారతీయ టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు. -
ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ : బైడెన్ తాజా నిర్ణయం
వాషింగ్టన్: భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో తీపి కబురు అందించారు. హెచ్-1బీ వీసాల వేతనాలకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేశారు. హెచ్-1బీ వీసాపై అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ట్రంప్ సర్కారు గతంలో తెచ్చిన నిబంధన అమలును మరింత ఆలస్యం చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కార్మిక శాఖ శుక్రవారం ప్రచురించిన ఫెడరల్ నోటిఫికేషన్లో, మే 14 వరకూ దీని అమలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. తమ నిర్ణయం అమెరికాలోని కొంతమంది విదేశీయుల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల వేతన ప్రయోజనాలను కాపాడనుందని తెలిపింది. ఫలితంగా భారతీయ ఐటీ నిపుణులకు కూడా భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కాలపరిమితిని మరింత ఆలస్యం చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం ఇది మే 14 నుండి అమలులోకి రానుందని తెలిపింది. దీన్ని పొడిగించేముందు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా అమెరికా సంస్థలపై విదేశీ ఉద్యోగుల వేతన భారం తగ్గడంతోపాటు, విదేశీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయంటూ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ తప్పనిసరి కనీస వేతననిబంధనను తీసుకొచ్చారు. దీనిపై ఇరువైపులా నిరసన భారీగానే వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో బైడెన్ తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే బైడెన్ తాజా నిర్ణయాన్ని ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్(ఫెయిర్) సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా ఉద్యోగులు, సంస్థల భద్రత నిమిత్తం మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలు నిలుపుదలతో కరోనా సంక్షోభంలో చిక్కుకున్న వారి పరిస్థితి మరింత క్షీణిస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం


