ట్రంప్‌, జేడీ వాన్స్‌ పరస్పరం విభిన్న వ్యాఖ్యలు | JD Vance calling H-1B workers low wage servants diverging Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌, జేడీ వాన్స్‌ పరస్పరం విభిన్న వ్యాఖ్యలు

Nov 15 2025 5:46 PM | Updated on Nov 15 2025 6:49 PM

JD Vance calling H-1B workers low wage servants diverging Trump

ఒకరు కావాలంటే.. మరొకరు వద్దంటున్నారు!

అమెరికాలో హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్‌ ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూఎస్‌ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విదేశీ కార్మికుల సమస్యపై సాహసోపేతమైన ప్రకటన చేశారు. విదేశీ ఉద్యోగులను చౌక కార్మికులని పేర్కొనడంతో పాటు అమెరికాకు వారి అవసరం లేదని స్పష్టం చేశారు. సీన్ హన్నిటీతో జరిగిన పాడ్‌కాస్ట్‌ సంభాషణలో వాన్స్ మాట్లాడుతూ.. డెమొక్రాట్ మోడల్ ప్రకారం.. తక్కువ వేతనాలు తీసుకునే ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులు యూఎస్‌లో ఉన్నారని చెప్పారు. ఇది దేశంలోని ఉద్యోగాలు, వేతనాల శ్రేయస్సుకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అమెరికన్ కార్మికులను శక్తివంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా వారు అధిక వేతనాలు పొందుతారని, దేశం మెరుగుపడుతుందని తెలిపారు.

భారతీయ టెక్నాలజీ రంగం, వైద్య రంగం నిపుణులు, వైట్‌ కాలర్‌ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులుగా ఉన్న హెచ్‌-1బీ వీసాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ సంస్కరణల ప్రక్రియ మొదలైంది. ఇది గ్రీన్ కార్డ్, పౌరసత్వం కోసం భారతీయుల మార్గాలను నేరుగా ప్రభావితం చేయనుంది.

వీసా సంస్కరణలు

సెప్టెంబర్ 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమంది నాన్ ఇమ్మిగ్రెంట్ కార్మికుల ప్రవేశంపై పరిమితి విధించాలని భావించారు. దాంతో హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని సంస్కరించడానికి సిద్ధమ​య్యారు. సెప్టెంబర్ 21, 2025 తర్వాత దాఖలు చేసిన కొన్ని హెచ్-1బీ పిటిషన్లకు అర్హత షరతుగా అదనంగా రూ.1,00,000 డాలర్లు చెల్లించాలి. ఈ భారీ రుసుము పెంపు వీసా ప్రోగ్రామ్‌ లక్ష్యాన్ని, లబ్ధిదారులను గణనీయంగా ప్రభావితం చేయనుంది.

ట్రంప్ వైఖరి నుంచి వాన్స్ ‘యూటర్న్’

వలస ఉద్యోగులకు సంబంధించి వాన్స్ చేసిన వ్యాఖ్యలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వైఖరితో భిన్నంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో నిర్దిష్ట ప్రతిభ ఉన్న కార్మికులు లేరని చెప్పారు. ఆ కొరతను తీర్చడానికి విదేశీ ప్రతిభను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, వాన్స్ అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఈ చర్చ అమెరికన్ శ్రామిక శక్తికి కీలకం ఉంది. ఒకవైపు తక్కువ వేతనాల కోసం విదేశీ కార్మికులను తీసుకురావడం ద్వారా దేశీయ ఉద్యోగాలు దెబ్బతింటాయని విమర్శకులు భావిస్తున్నారు. మరోవైపు, ట్రంప్ సూచించినట్లుగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాల్లో ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి, ఆవిష్కరణలను కొనసాగించడానికి, తయారీ రంగంలో శిక్షణ ఇవ్వడానికి హెచ్-1బీ వీసాదారులు అవసరం అని పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు.

ఇదీ చదవండి: ఏడు పవర్‌ఫుల్‌ ఏఐ టూల్స్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement