breaking news
Servants service
-
ట్రంప్, జేడీ వాన్స్ పరస్పరం విభిన్న వ్యాఖ్యలు
అమెరికాలో హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విదేశీ కార్మికుల సమస్యపై సాహసోపేతమైన ప్రకటన చేశారు. విదేశీ ఉద్యోగులను చౌక కార్మికులని పేర్కొనడంతో పాటు అమెరికాకు వారి అవసరం లేదని స్పష్టం చేశారు. సీన్ హన్నిటీతో జరిగిన పాడ్‌కాస్ట్ సంభాషణలో వాన్స్ మాట్లాడుతూ.. డెమొక్రాట్ మోడల్ ప్రకారం.. తక్కువ వేతనాలు తీసుకునే ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులు యూఎస్‌లో ఉన్నారని చెప్పారు. ఇది దేశంలోని ఉద్యోగాలు, వేతనాల శ్రేయస్సుకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అమెరికన్ కార్మికులను శక్తివంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా వారు అధిక వేతనాలు పొందుతారని, దేశం మెరుగుపడుతుందని తెలిపారు.భారతీయ టెక్నాలజీ రంగం, వైద్య రంగం నిపుణులు, వైట్ కాలర్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులుగా ఉన్న హెచ్-1బీ వీసాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంస్కరణల ప్రక్రియ మొదలైంది. ఇది గ్రీన్ కార్డ్, పౌరసత్వం కోసం భారతీయుల మార్గాలను నేరుగా ప్రభావితం చేయనుంది.వీసా సంస్కరణలుసెప్టెంబర్ 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమంది నాన్ ఇమ్మిగ్రెంట్ కార్మికుల ప్రవేశంపై పరిమితి విధించాలని భావించారు. దాంతో హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని సంస్కరించడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 21, 2025 తర్వాత దాఖలు చేసిన కొన్ని హెచ్-1బీ పిటిషన్లకు అర్హత షరతుగా అదనంగా రూ.1,00,000 డాలర్లు చెల్లించాలి. ఈ భారీ రుసుము పెంపు వీసా ప్రోగ్రామ్ లక్ష్యాన్ని, లబ్ధిదారులను గణనీయంగా ప్రభావితం చేయనుంది.ట్రంప్ వైఖరి నుంచి వాన్స్ ‘యూటర్న్’వలస ఉద్యోగులకు సంబంధించి వాన్స్ చేసిన వ్యాఖ్యలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వైఖరితో భిన్నంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో నిర్దిష్ట ప్రతిభ ఉన్న కార్మికులు లేరని చెప్పారు. ఆ కొరతను తీర్చడానికి విదేశీ ప్రతిభను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, వాన్స్ అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఈ చర్చ అమెరికన్ శ్రామిక శక్తికి కీలకం ఉంది. ఒకవైపు తక్కువ వేతనాల కోసం విదేశీ కార్మికులను తీసుకురావడం ద్వారా దేశీయ ఉద్యోగాలు దెబ్బతింటాయని విమర్శకులు భావిస్తున్నారు. మరోవైపు, ట్రంప్ సూచించినట్లుగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాల్లో ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి, ఆవిష్కరణలను కొనసాగించడానికి, తయారీ రంగంలో శిక్షణ ఇవ్వడానికి హెచ్-1బీ వీసాదారులు అవసరం అని పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు.ఇదీ చదవండి: ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్.. -
అయోధ్య పూజారులకు, సిబ్బందికి జీతాలు పెంపు
ఈ ఏడాది జనవరిలో అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు కొలువయ్యాడు. అదిమొదలు అయోధ్యకు భక్తుల తాకిడి అధికమయ్యింది. తాజాగా అయోధ్య రామాలయంలోని ప్రధాన అర్చకునితో పాటు శ్రీరాముని సేవలో నిమగ్నమైన సహాయ అర్చకులు, సేవాదార్లకు జీతాలను పెంచారు.రామాలయంలోని ప్రధాన అర్చకుడి జీతం రూ.3500 పెంచగా, సహాయ అర్చకులు, సేవాదార్ల వేతనాలు కూడా పెంచినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కాగా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు 20 మంది పూజారులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అర్చకులను నియమించాల్సిన ఆలయాల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు.దీంతో వారికి రామమందిర్ ట్రస్ట్ 15 రోజల పాటు సెలవు ఇచ్చింది. కాగా జీతాల పెంపు నేపధ్యంలో పూజారులంతా రామమందిర ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. రామమందిరం ట్రస్ట్ ప్రధాన అర్చకుడి వేతనాన్ని రూ.3500 పెంచగా, సహాయ పూజారి వేతనాన్ని రూ.2500 పెంచారు. అదేవిధంగా కొఠారీ, భండారీల జీతాలను కూడా పెంచారు. -
సేవకులకే సేవ..
సాక్షి,వీకెండ్: నిరాశ్రయులకు గూడు కల్పిస్తారు. అనాథలకు ఆశ్రయమిస్తారు. ఆపన్నులను ఆదుకుంటారు. అవసరార్థులకు ఆసరా అవుతారు. సేవా మార్గంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు సమాజ సేవలో తమదైన ముద్ర వేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులకు లోనవుతూ కూడా తమ బాధ్యత మరవడం లేదు. అలాంటి సంస్థలకు బాసటగా నిలుస్తామంటోంది కలశ ఫౌండేషన్. – ఎస్ సత్యబాబు ‘ఒక మంచి ఆశయంతో ఏర్పడిన సేవా సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది మనుగడ కోల్పోవడం అంటే దాని నీడలో ఆశ్రయం పొందుతున్న ఎందరో అభాగ్యులు వీధిన పడడమే. అంతేకాదు స్వచ్ఛంద సేవా స్ఫూర్తికి భంగం కలగడం కూడా’ అంటారు కలశ ఫౌండేషన్ ప్రతినిధులు. బంజారాహిల్స్‌లోని మెంటార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్పొరేట్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాౖటెన ఈ ఫౌండేషన్ కార్యకలాపాల గురించి సంస్థ ప్రతినిధులు చెప్పిన విశేషాలు వారి మాటల్లోనే... సేవా స్ఫూర్తి వర్ధిల్లాలి.. స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, జవసత్వాలు కోల్పోయిన ఎన్జీఓలకు ప్రాణం పోయడానికి కలశ ఆవిర్భవించింది. ఎన్జీఓలకు సేవ చేసే ఎన్జీఓగా మారాలనేది లక్ష్యం. ఒక సేవా సంస్థ ప్రారంభమవడం కాదు... అది కొనసాగడం ముఖ్యం. ఆ క్రమంలో మేం వారి కష్టాల్ని పంచుకుంటాం. అలాగే ఎవరైనా కొత్తగా ఎన్జీఓ నెలకొల్పడానికి అవసరమైన సాయం కూడా చేస్తాం. ఇబ్బందుల్లో ఉన్న సంస్థలను ఆదుకునేందుకు మా వంతు సహకారం అందజేస్తాం. దాతలను ఒప్పించి విరాళాలు అందేలా ప్రయత్నిస్తాం. దీని కోసం ఎన్జీఓ సంస్థల డేటా రూపొందించాం. వాటి స్థితిగతులు విశ్లేషిస్తున్నాం. మన సిటీలో చేయూత అవసరమైన ఎన్జీఓలు 1742 ఉన్నాయని గుర్తించాం. వీటిలో వికలాంగులు, వృద్ధులు, అనాథలు, నిరాశ్రయులు, పర్యావరణ కోసం, వేశ్య వృత్తి నుంచి బయటపడిన వారి కోసం పనిచేస్తున్నవి.. ఇలా 9 క్లస్టర్స్‌గా విభజించాం. వీటిలోనూ అన్ని రకాలుగా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రిటర్న్‌్స దాఖలు చేస్తున్న వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆశ్రయ్ ఆకృతి, గ్రీన్లేస్, పీపుల్స్ పవర్ (విశాఖ కేంద్రంగా పనిచేస్తోంది)లలో కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాం. వచ్చే వారం సాయినేత్ర ఫౌండేషన్‌లోనూ నిర్వహించనున్నాం. సామాజిక బాధ్యత... మెంటార్ కన్సల్టింగ్ కార్పొరేషన్ సామాజిక బాధ్యతలో భాగంగా భాగంగా ఈ ఫౌండేషన్ నిర్వహిస్తున్నాం. చాలా వరకూ సంస్థకు సంబంధించిన లాభాల నుంచే దీనికి ఖర్చు చేస్తున్నాం. దీనికి తోడు కంపెనీ ఉద్యోగులు తమ జీతాల్లో నుంచి రూ.100 మొదలుకుని ప్రతి నెలా వారి వారి స్థాయిల్లో డొనేట్ చేస్తున్నారు. తినడానికి తిండి లేకపోయినా భుజం తట్టే వాళ్లు ఉంటే చాలని మదర్ థెరిస్సా అన్నారు. ఆ భుజం తట్టే చేయి మాది కావాలనే తపన. ఇదే కాకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నాం. పలు అంశాలపై అవగాహన కోసం రన్లు, పబ్లిక్ క్యాంపెయిన్లు నిర్వహించనున్నాం. అలాగే రాజకీయ నేతల్లో చాలా మంది మంచివారున్నారు. ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తున్నవారున్నారు. అందరూ అవినీతి పరుల గురించే మాట్లాడతారు గానీ వీరిని పట్టించుకోరు. అందుకే అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించాలనే ఆలోచనతో ‘చాణక్య’ అవార్డులు అందజేయనున్నాం. గమనిక: ఇబ్బందుల్లో కూడా సేవా దృక్పథంతో ఎన్జీఓలను కొనసాగిస్తున్న వారు మమ్మల్ని సంప్రదించొచ్చు. మెయిల్ ఐడీ: info@mcmcpl.com


