అయోధ్య పూజారులకు, సిబ్బందికి జీతాలు పెంపు | Trust Increased Salary For Chief Priest and Servants | Sakshi
Sakshi News home page

అయోధ్య పూజారులకు, సిబ్బందికి జీతాలు పెంపు

Aug 5 2024 12:46 PM | Updated on Aug 5 2024 1:25 PM

Trust Increased Salary For Chief Priest and Servants

ఈ ఏడాది జనవరిలో అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు కొలువయ్యాడు. అదిమొదలు అయోధ్యకు భక్తుల తాకిడి అధికమయ్యింది. తాజాగా అయోధ్య రామాలయంలోని ప్రధాన అర్చకునితో పాటు  శ్రీరాముని సేవలో నిమగ్నమైన సహాయ అర్చకులు, సేవాదార్లకు జీతాలను పెంచారు.

రామాలయంలోని ప్రధాన అర్చకుడి జీతం రూ.3500 పెంచగా, సహాయ అర్చకులు, సేవాదార్ల వేతనాలు కూడా పెంచినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కాగా ఆలయంలో పూజలు నిర్వహించేందుకు 20 మంది పూజారులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అర్చకులను నియమించాల్సిన ఆలయాల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు.

దీంతో వారికి రామమందిర్ ట్రస్ట్ 15 రోజల పాటు సెలవు ఇచ్చింది. కాగా జీతాల పెంపు నేపధ్యంలో పూజారులంతా రామమందిర ట్రస్టుకు కృతజ్ఞతలు తెలిపారు. రామమందిరం ట్రస్ట్ ప్రధాన అర్చకుడి వేతనాన్ని రూ.3500 పెంచగా, సహాయ పూజారి వేతనాన్ని రూ.2500 పెంచారు. అదేవిధంగా కొఠారీ, భండారీల జీతాలను కూడా పెంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement