అమెరికన్‌ వీసా మంజూరులో మార్పులు.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే! | Major Changes Happening In US Visa Rules In 2023 That Every Student Should Know It - Sakshi
Sakshi News home page

2023 Year Roundup: యూఎస్‌ వీసా మంజూరులో భారీ మార్పులు.. ప్రతి విద్యార్ధి తెలుసుకోవాల్సిన విషయాలు

Published Mon, Dec 18 2023 7:00 PM | Last Updated on Thu, Jan 4 2024 2:27 PM

Us Visa Rule Changes In 2023 - Sakshi

డాలర్‌ డ్రీమ్‌ను నెరవేర్చుకోవాలనుకునే ప్రతి పౌరుడి కలల్ని నిజం చేసేలా అమెరికా ప్రభుత్వం వీసాల మంజూరులో తగు మార్పులు చేస్తూ వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ తరుణంలో 2023 వీసాల జారీ అంశంలో జోబైడెన్‌ ప్రభుత్వం ఏయే మార్పులు చేసిందో తెలుసుకుందాం. హెచ్-1బీ, ఈబీ-5, స్టూడెంట్ వీసాలు (ఎఫ్, ఎం, జే) సహా వివిధ కేటగిరీలను ప్రభావితం చేసేలా 2023లో గణనీయమైన మార్పులు చేసింది. వాటిల్లో 

హెచ్-1బీ వీసా పునరుద్ధరణకు  
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే టెక్నాలజీ రంగాల్లో ప్రతిభావంతులైన నిపుణులకు హెచ్-1 బీ వీసా తప్పని సరి. ఇప్పుడీ వీసాల పునరుద్ధరణ కోసం ఈ ఏడాది పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. జనవరిలో అమెరికా విదేశాంగ శాఖ హెచ్-1బీ డొమెస్టిక్ వీసా రెన్యువల్ పైలట్ను పరిమితంగా ప్రవేశపెట్టి 20,000 మందిని తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు అనుమతించింది. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు వీసా రెన్యూవల్‌ కోసం వారి దేశానికి వెళ్లే పనిలేకుండా తమ దేశంలోనే రెన్యూవల్‌ చేసుకోవచ్చని తెలిపింది. అయితే వారి జీవిత భాగస్వాములు ఈ ప్రక్రియకు అనర్హులుగా గుర్తించింది.

 

హెచ్-1బీ రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు 
హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లలో అధిక ప్రాతినిధ్యాన్ని అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం 2023లో కఠిన చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం. అయితే ఇప్పుడు యజమానులు ప్రతి నమోదుదారుకు పాస్ పోర్ట్ సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

నో పేపర్‌.. ఇకపై అంతా అన్‌లైన్‌ 
2023లో అమెరికా ప్రభుత్వం వీసా ధరఖాస్తును ఆన్‌లైన్‌లోనే చేసుకునే వెసలు బాటు కల్పించింది. పేపర్‌ వర్క్‌ వల్ల చిన్న చిన్న పొరపాట్లు తలెత్తి వీసా రిజెక్ట్‌లు అవుతున్న సందర్భాలు అనేకం. దీని వల్ల అభ్యర్ధులు అమెరికాకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల్ని అధిగమించేలా పేపర్‌పై ధరఖాస్తు చేసుకోవడాన్ని తగ్గించింది. ఆన్‌లైన్‌లో వీసా ప్రాసెస్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.  

ఈబీ-5 వీసా దరఖాస్తుదారులకు  
అక్టోబర్ 2023 లో, యూఎస్‌ఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) ఈబీ -5 వీసా విధానంలో మార్పులు చేసింది. ఎవరైతే ఈబీ-5 వీసా పొంది దాన్ని రీఎంబర్స్‌మెంట్‌ చేయించుకున్న రెండేళ్ల తర్వాత గ్రీన్‌ కార్డ్‌కు అర్హులుగా గుర్తిస్తుంది. ఈ ఏడాది ఈబీ-5 వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ వేగాన్ని కూడా యూఎస్ సీఐఎస్ గణనీయంగా పెంచింది.
 

ఈబీ–5 వీసా అంటే..
అమెరికాలో గ్రీన్‌కార్డ్‌కు దాదాపు సమానమైన గుర్తింపు ఉన్నదే ఈబీ–5 వీసా. అంతటి ప్రాధాన్యమున్న ఈ వీసా పొందాలంటే వ్యక్తులు అమెరికాలో కనీసం 8 లక్షల అమెరికన్‌ డాలర్లను (భారతీయ కరెన్సీలో రూ.6.57 కోట్లు) పెట్టుబడిగా పెట్టడంతోపాటు కనీసం 10 ఉద్యోగాలను కల్పించాలి. దాంతో వారికి పెట్టుబడిదారుల హోదా కింద ఈబీ–5 వీసాను జారీచేస్తారు. ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయాలంటే గతంలో 5 లక్షల అమెరికన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని నిబంధన ఉండేది. కానీ, ఈ వీసాల కోసం డిమాండ్‌ పెరుగుతుండడంతో యూఎస్‌సీఐఎస్‌ ఈ కనీస పెట్టుబడి మొత్తాన్ని 2022లో 8 లక్షల డాలర్లకు పెంచింది.

స్టూడెంట్ వీసా పాలసీల అప్ డేట్
అమెరికన్ కాన్సులర్ అధికారులు చేసే వీసా ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఖర్చులకు అనుగుణంగా ఎఫ్, ఎం, జే వీసాల ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు జోబైడెన్‌ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక, కాన్సులర్ అధికారులు ఇప్పుడు విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలిస్తారని తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement