
హెచ్–1బీ వీసాలపై లక్ష డాలర్ల ప్రకటనతో బెంబేలు
ఆందోళనకు గురైన అమెరికాలోని భారతీయులు
ఒక రోజు తర్వాత స్పష్టత ఇచ్చిన అమెరికా సర్కార్
అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల దరఖాస్తు రుసుముపై అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టించింది. దరఖాస్తుకు లక్ష డాలర్లు చెల్లించాలంటూ సంబంధిత ఉత్తర్వుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో జనం ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్నవారు, హెచ్–1బీ వీసా కోసం ప్రయత్నిస్తున్నారు బెంబేలెత్తిపోయారు. ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? అని ఆవేదనకు గురయ్యారు.
అమెరికా నుంచి స్వదేశాలకు వెళ్లాల్సిన వారు ఆగిపోయారు. ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ఇందులో భారతీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. విదేశాల్లో ఉన్న హెచ్–1బీ వీసాదారులైతే వెంటనే అమెరికాకు చేరుకోవడానికి పరుగులు పెట్టారు. పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి విమానం టికెŠక్‌ట్ కొనుగోలు చేయాల్సి వచి్చంది. అయితే, హెచ్–1బీ వీసాల విషయంలో కొత్త దరఖాస్తుదారులకు మాత్రమే లక్ష డాలర్లు వసూలు చేయనున్నట్లు అమెరికా ప్రభుత్వం వివరణ ఇచి్చంది. దీంతో చాలామంది ఊరట చెందారు. పెద్ద భారం భారం దిగిపోయినట్లుగా ఉపశమనం పొందారు.
టిక్కెట్‌కు రూ.7.04 లక్షలు
మహారాష్ట్రకు చెందిన ఒకరు హెచ్–1బీ వీసాతో అమెరికాలో సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. 11 ఏళ్లుగా అక్కడే ఉంటున్నాడు. తన తండ్రి వర్థంతి కార్యక్రమం కోసం ఇటీవలే అమెరికా నుంచి నాగపూర్ వచ్చాడు. మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. హెచ్–1వీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజు గురించి తెలియగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే అమెరికాకు ప్రయాణం కట్టాడు. అప్పటికప్పుడు విమానం టిక్కెట్ దొరకాలంటే మాటలు కాదు కదా! ప్రయాణం కోసం ఎక్కువ సొమ్ము చెల్లించక తప్పలేదు. నాగపూర్ నుంచి అమెరికాకు చేరుకోవడానికి 8,000 డాలర్లు (రూ.7.04 లక్షలు) ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రోహన్ మెహతా వాపోయాడు. సాధారణం అయ్యే ఖర్చు కంటే ఇది ఎన్నో రెట్లు అధికం. ట్రంప్ ప్రభుత్వం ముందే స్పష్టత ఇచ్చి ఉంటే తనకు ఈ భారం తప్పేదని ఆవేదన వ్యక్తంచేశాడు.
యూరప్ దేశాలే ముద్దు
దసరా, దీపావళి పండుగల కోసం స్వదేశానికి రావడానికి అమెరికాలోని భారతీయులు ముందే ప్లాన్ చేసుకున్నారు. హెచ్–1బీ వీసాలపై లక్ష డాలర్ల రుసుము విధిస్తున్నారని తెలియగానే విమానం టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. పండుగలకు వెళ్లలేమంటూ ప్రయాణాలు ఆపేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ నెల 19న ట్రంప్ ప్రభుత్వం నుంచి ప్రకటన వచి్చంది. దాంతో సోషల్ మీడియాలో ఇదే అంశంపై జోరుగా చర్చ సాగింది. అమెరికాలోని హెచ్–1బీ వీసాదారులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇప్పుడు ఇండియాకు వెళ్లకపోవడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చేశారు. స్వదేశంలో కుటుంబ సభ్యులతో పండుగలు చేసుకోవాలన్న ఆసక్తి చచి్చపోయిందని ఓ భారతీయుడు స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, భారత్‌లో ఉన్న వృత్తి నిపుణులు అమెరికా పట్ల విముఖత చూపుతున్నారు. ట్రంప్ దూకుడు నిర్ణయాలతో వారు పునరాలోచనలో పడ్డారు. ఉద్యోగాలకు యూరప్ దేశాలే బెటర్ అని అంచనాకొచ్చారు. ఆ దిశగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు.
పెళ్లి రద్దయ్యింది
ఇండియాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అతడికి ఇండియాలోనే పెళ్లి కుదిరింది. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. శనివారమే పెళ్లి జరగాల్సి ఉంది. వివాహం కోసం శుక్రవారం ఆనందంగా స్వదేశానికి బయలుదేరాడు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న తర్వాత ట్రంప్ విసిరిన వీసా బాంబు గురించి తెలిసింది. ఇప్పుడు ఇండియాకు వెళ్తే మళ్లీ వెనక్కి వస్తామో లేదో తెలియని పరిస్థితి. దాంతో ఆ యువకుడు ప్రయాణం ఆపేసి ఎయిర్‌పోరుŠట్ నుంచి ఇంటికి తిరిగివెళ్లాడు. ఇండియాలో జరగాల్సిన పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఇప్పటికే హెచ్–1బీ వీసాలు ఉన్నవారిపై లక్ష డాలర్ల రుసుము ఉండబోదని మొదటే చెబితే తనకు ఈ బాధ తప్పేదని ఆ యువకుడు పేర్కొన్నాడు.