వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ ఇంటిపై కాల్పుల కలకలం రేపుతున్నాయి. ఒహియో రాష్ట్రం సిన్సినాటిలోని జేడీ వాన్స్ నివాసంపై అగంతకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేడీ వాన్స్ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. అయితే ఈ కాల్పులు జరిగిన సమయంలో జేడీవాన్స్ దంపతులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ ఘటన తర్వాత వాన్స్ నివాసం చుట్టూ భద్రతను పెంచారు. సీక్రెట్ సర్వీస్, ఎఫ్‌బీఐ బృందాలు కూడా దర్యాప్తు ప్రారంభించాయి. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘జేడీ వాన్స్‌ను లక్ష్యంగా చేసిన దాడి కావచ్చని’ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై జేడీ వాన్స్ కార్యాలయం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
అమెరికా ఉపాధ్యక్షుడి నివాసంపై కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఇది రాజకీయ ప్రేరేపిత దాడి కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన చర్చాంశనీయంగా మారింది.
ఈ ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలు (Midterm Elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్ (సెనేట్, హౌస్), గవర్నర్ ఎన్నికలు, రాష్ట్ర శాసన సభలు వంటి కీలక పదవులు ఖాళీ అవుతాయి.
America is not safe place even Vice President's house is not safe. Shooting at Vice President J.D. Vance's home, suspect arrested. The vice president and his family were not at home at the time of the shooting #Vance pic.twitter.com/ZQILiEsCdY
— Dharmendra Singh (@dharmendra135) January 5, 2026


