హెచ్‌-1బీ వీసాల జారీ.. కీలక మార్పులు చేసిన అమెరికా | DHS Ends Lottery, Adopts Weighted H‑1B System Impact on India Tech Sector | Sakshi
Sakshi News home page

హెచ్‌-1బీ వీసాల జారీ.. కీలక మార్పులు చేసిన అమెరికా

Dec 23 2025 10:48 PM | Updated on Dec 23 2025 10:55 PM

DHS Ends Lottery, Adopts Weighted H‑1B System Impact on India Tech Sector

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ వీసాల జారీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్‌-1బీ కోసం ప్రస్తుతమున్న లాటరీ విధానాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) రద్దు చేసింది. బదులుగా  వెయిటేజ్‌ సిస్టమ్‌ను ప్రవేశ పెట్టింది.  

తద్వారా ఉన్నత ఉద్యోగాలు,అధిక శ్రేణి వేతన దారులు, ఉన్నత నైపుణ్యం ఉన్న విదేశీయులకు మాత్రమే హెచ్‌-1బీ వీసా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 27,2026 నుంచి ఈ కొత్త హెచ్‌-1బీ వీసా విధానం అమల్లోకి రానుంది.  

వీసా పరిమితి యథాతథం
అమెరికా ప్రభుత్వం ప్రకటించిన తాజా మార్పుల ప్రకారం..ప్రతి సంవత్సరం 65,000 హెచ్‌‑1బీ వీసాలు, అమెరికాలో ఉన్నత డిగ్రీ పొందిన వారికి అదనంగా 20,000 వీసాలు యథాతథంగా కొనసాగన్నాయి. అయితే, ఈ కొత్త విధానం అమెరికన్ కార్మికులను రక్షించడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, భారతీయ ఐటీ రంగానికి తీవ్ర సవాళ్లు విసరనుంది. పెద్ద కంపెనీలు లాభపడతాయి, కానీ స్టార్టప్‌లు, తక్కువ వేతన ఆఫర్లు ఇచ్చే సంస్థలు వెనుకబడే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement