మన రియల్‌ఎస్టేట్‌కు కలిసిరానున్న ట్రంప్‌ నిర్ణయం | Rising H-1B Visa Fees Boost India’s GCC Boom: Hyderabad & Bengaluru Lead Office Space Demand | Sakshi
Sakshi News home page

మన రియల్‌ఎస్టేట్‌కు కలిసిరానున్న ట్రంప్‌ నిర్ణయం

Sep 27 2025 11:57 AM | Updated on Sep 27 2025 12:04 PM

Trumps H1B Visa Move Boosts Indias Office Space Demand

మెట్రో నగరాల్లోని కార్యాలయ స్థలాలకు డిమాండ్‌

గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల ఏర్పాటుకు అవకాశాలు

దేశంలో ఆఫీసు స్పేస్‌ లీజులలో 40 శాతం వాటా జీసీసీలదే..

నగరంలో 52 లక్షల చ.అ. లీజుకు తీసుకున్న జీసీసీలు

పీఠం ఎక్కిన తొలి రోజు నుంచీ భారత్‌పై పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా నిర్ణయం.. దేశీయ స్థిరాస్తి రంగానికి ఊతమివ్వనుంది. ప్రత్యేకించి కార్యాలయ స్థలాలకు డిమాండ్‌ను కల్పించనుంది. వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్‌1బీ వీసా రుసుముల పెంపు నిర్ణయంతో.. దేశీయంగా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు అపార అవకాశాలు ఏర్పడతాయని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే బహుళ జాతి సంస్థల జీసీసీలకు హాట్‌ ఫేవరేట్‌ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్‌లకు ఇదొక వరంగా మారనుంది. అందుబాటులో అద్దెలు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, మెరుగైన మౌలిక వసతులు, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్‌ జీసీసీలకు హబ్‌గా మారే అవకాశాలున్నాయి. సాక్షి, సిటీబ్యూరో

జీసీసీలకు ఇండియా కేంద్రంగా అభివృద్ధి

చెందడంతో బహుళ జాతి కంపెనీలు ఇక దేశీయంగానే జీసీసీల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తాయి. దీంతో హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై వంటి టెక్నాలజీ హబ్‌ మెట్రోల్లోని ఆఫీసు స్పేస్‌లకు ఆదరణ ఏర్పడనుంది. ప్రస్తుతం దేశంలో 1700లకు పైగా జీసీసీలు ఉండగా.. వీటిల్లో 19 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 64 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌గా ఉంది. 2030 నాటికి 2,400 జీసీసీలకు, 2530 లక్షల మంది ఉద్యోగులకు, అలాగే వంద బిలియన్‌ డాలర్ల మార్కెట్‌కు విస్తరిస్తుందని కొల్లియర్స్‌ నివేదిక అంచనా వేసింది.

ఒక్కో నగరం ఒక్కో ప్రత్యేకత..

జీసీసీలు అనేవి బహుళ జాతి సంస్థల ఆఫ్‌షోర్‌ యూనిట్లు. ఇవి ప్రతిభ, సాంకేతికత, ఆవిష్కరణలను ఏకీకృతం చేసి కేంద్రాలు. దేశంలోని మెట్రో నగరాలు ఒక్కో రంగంలో కీలక హబ్‌లుగా ఉన్నాయి. బెంగళూరు ఐటీ, పరిశోధనాభివృద్ధికి, ముంబై బీఎఫ్‌ఎస్‌ఐకి, హైదరాబాద్‌ ఫార్మా, ఐటీ, కృత్రిమ మేధస్సుకు, పుణె ఇంజనీరింగ్‌కు, ఢిల్లీఎన్‌సీఆర్‌ ఈకామర్స్, చెన్నై తయారీ రంగాలకు కేంద్రాలుగా ఉన్నాయి. ఖర్చును ఆదా చేసే కేంద్రాల నుంచి ఆవిష్కరణ, విలువ ఆధారిత సేవలకు వ్యూహాత్మక కేంద్రాలుగా రూపాంతరం చెందుతున్నాయి. దేశంలోని జీసీసీలు కృత్రిమ మేధస్సు(ఏఐ), మెషిన్‌ లెరి్నంగ్, సైబర్‌ సెక్యూరిటీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయి.

అమెరికా కంపెనీలే ఎక్కువ..

భారత్‌లో జీసీసీల ఏర్పాటుకు అమెరికాకు చెందిన కంపెనీలే ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయి. 2021 నుంచి ఇండియాలో జరిగిన జీసీసీ లీజులలో యూఎస్‌ కంపెనీల వాటా ఏకంగా 70 శాతంగా ఉందంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఫార్చ్యూన్‌ 500 కంపెనీలు, గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజాలు ఈ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో యూకే, యూరప్‌ మిడిల్‌ ఈస్ట్‌ ఆఫ్రికా(ఈఎంఈఏ), ఆసియా పసిఫిక్‌ (ఏపీఏసీ) దేశాల జీసీసీలు కూడా ఇండియాలో జీసీసీలను విస్తరిస్తున్నాయి. 2025లో జరిగిన 2.8 కోట్ల చ.అ. జీసీసీ ఆఫీసు స్పేస్‌ లావాదేవీలలో జపాన్, ఆ్రస్టేలియా, సింగపూర్‌ వంటి ఏపీఏసీ దేశాల వాటా 10 శాతంగా ఉంది.

జీసీసీ స్పేస్‌ 10 కోట్ల చ.అ.

నాలుగేళ్లలో ఇండియాలోని ఏడు ప్రధాన నగరాలలో 10 కోట్ల చ.అ. స్థలాలను జీసీసీలు లీజుకు తీసుకున్నాయి. ఇది మొత్తం ఆఫీసు స్పేస్‌ డిమాండ్‌లో 36 శాతం. జీసీసీ లీజింగ్‌లలో టెక్నాలజీ రంగం ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. 37 శాతం లావాదేవీలలో ఐటీ రంగం తొలి స్థానంలో నిలవగా.. బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజినీరింగ్, తయారీ రంగాలు 40 శాతం స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అలాగే 2026లో 77.5 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలలో 2.93.2 కోట్ల చ.అ. స్థలాన్ని జీసీసీలు లీజుకు తీసుకుంటాయని ‘కొల్లియర్స్‌’ అంచనా వేసింది. అలాగే 2027లో 7.58.5 కోట్ల కార్యాలయ స్థల లావాదేవీలలో జీసీసీల వాటా 3.23.4 కోట్లతో, ఏటా 40 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా.

హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు

బహుళ జాతి సంస్థల జీసీసీలకు దక్షిణాది నగరాలు హాట్‌ ఫేవరెట్‌గా ఉన్నాయి. ప్రత్యేకించి ఐటీ హబ్‌లుగా పేరొందిన హైదరాబాద్, బెంగళూరు నగరాలు బహుళ జాతి సంస్థల జీసీసీలను ఆకర్షించడంలో తీవ్రపోటీపడుతున్నాయి. 202125 మధ్యకాలంలో ఈ రెండు నగరాలు మొత్తం జీసీసీ డిమాండ్‌లో 60 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.

2021తో పోలిస్తే 2025లో చెన్నైలో జీసీసీ లీజులు 5.3 రెట్లు పెరిగాయి. బెంగళూరు, హైదరాబాద్‌ 2021 నుంచి జీసీసీ లీజింగ్‌లలో 60 శాతం వాటాను నమోదు చేస్తున్నాయి. బెంగళూరులోని ఓఆర్‌ఆర్, హైదరాబాద్‌లోని సెకండరీ బిజినెస్‌ డి్రస్టిక్ట్‌(ఎస్‌బీడీ) ప్రాంతాలు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఫార్చ్యూన్‌500 కంపెనీలు ఈ కారిడార్లలో జీసీసీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2021 నుంచి దేశంలోని జీసీసీ లీజులలో ఈ కారిడార్ల వాటా ఏకంగా 37 శాతంగా ఉంది.

నగరంలో 355 జీసీసీలు..

ప్రస్తుతం హైదరాబాద్‌లో 355కు పైగా జీసీసీ సెంటర్లున్నాయి. అమెరికా, యూరప్, జపాన్, సౌత్‌ కొరియా దేశాలకు చెందిన జీసీసీలు నగరంలో కొలువుదీరాయి. మెక్‌ డొనాల్డ్స్, వాన్‌గార్డ్, సిటిజెన్‌ బ్యాంక్, హీనెకెన్, బారీకేల్‌బాట్, డైఇచి, హెచ్‌సీఏ హెల్త్‌కేర్‌ వంటి సంస్థలు హైదరాబాద్‌లో జీసీసీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2021లో నగరంలో 37 లక్షల చ.అ. స్థలాన్ని జీసీసీలు లీజుకు తీసుకోగా.. 2025 నాటికి 52 చ.అ.లకు చేరాయి.

5.09 కోట్ల ఆఫీసు స్పేస్‌..

దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌ మధ్యకాలంలో 5.09 కోట్ల చ.అ. గ్రేడ్‌ఏ ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 4.73 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 8 శాతం అధికం. అలాగే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో 7 నగరాలలో కొత్తగా 4.14 కోట్ల గ్రేడ్‌ఏ కార్యాలయ స్థలం సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంలో సప్లయి అయిన 3.78 కోట్ల చ.అ. స్పేస్‌తో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement