H-1B ఆంక్షలు : భారీగానే ఇండియాలో అమెరికా టెక్‌ దిగ్గజాల ఉద్యోగాలు | FAAMNG ramp up India hiring as H-1B rules tighten 32k jobs added in 2025 | Sakshi
Sakshi News home page

H-1B ఆంక్షలు : భారీగానే ఇండియాలో అమెరికా టెక్‌ దిగ్గజాల ఉద్యోగాలు

Dec 26 2025 4:24 PM | Updated on Dec 26 2025 4:44 PM

FAAMNG ramp up India hiring as H-1B rules tighten 32k jobs added in 2025

భారతీయ ఐటీ నిపుణుల్లో H-1B వీసా ఆంక్షలు తీవ్ర ఆందోళన పుట్టిస్తున్నాయి. తమ భవిష్యత్తు  ఎలా ఉంటుందో తెలియక విదేశాల్లో ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులు గందరగోళంలో పడిపోయారు.  అమెరికాలో రెండోసారిఅధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పదవీ బాధ్యతలు,హెచ్‌1బీ వీసా ఆంక్షల వస్తున్న నేపథ్యంలో  భారత ఐటీరంగానికి ఊరట నిచ్చే విషయమిది.

మనీ కంట్రోల్‌ కథనం ప్రకారం  అమెరికాకు చెందిన ప్రధాన టెక్‌ సంస్థలు ఫేస్‌బుక్‌ (Facebook (Meta), అమెజాన్‌ (Amazon) ఆపిల్‌ (Apple) మైక్రోసాఫ్ట్‌ (Microsoft), నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) గూగుల్‌ (Alphabet) లాంటి  FAAMNG సంస్థలు భారతదేశంలో సమిష్టిగా 32వేల మంది కొత్త ఉద్యోగులను నియమించు కున్నాయి. ఇది రానున్న కాలంలో కొనసాగనుంది. పెరగనుంది కూడా అని నిపుణులు అంచనావేస్తున్నారు.

స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ Xpheno డేటా ప్రకారం, భారతదేశంలోని టెక్‌ దిగ్గజాల ఉద్యోగుల నియమాకల్లో ఇది సంవత్సరానికి 18 శాతం పెరుగుదల.  అలాగే  గత మూడేళ్ల కాలంలో ఇది అత్యధికం కూడా. ఫలితంగా మొత్తం భారతీయ ఐటీ ఉద్యోగుల సంఖ్య సంఖ్య 214,000కి చేరుకుంది. ఈ పెరుగుదల, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న AI ల్యాండ్‌స్కేప్‌లో ప్రత్యేక భారతీయ టెక్నాలజీ ప్రతిభకు నిదర్శనంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఏడాది మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు, దేశంలో AI మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం,  ఉద్యోగులను విస్తరించడం కోసం తమ పెట్టుబడులను రెట్టింపు చేశాయి. 

డిమాండ్ ఎక్కడ ఉంది?
ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, అమెరికన్ టెక్ దిగ్గజాలు సాధారణ పాత్రల కంటే  టార్గెటెడ్‌ రోల్స్‌లో మాత్రమే నియామకాలను కొనసాగిస్తున్నాయని TeamLease Digital CEO నీతి శర్మ అన్నారు. 2025లో, కంపెనీల్లో ఇంజనీరింగ్‌లో డేటా పాత్రలు, విశ్లేషణలు, క్లౌడ్ , సైబర్ సెక్యూరిటీ , గవర్నెన్స్ వంటి కొత్త డిజిటల్ నైపుణ్యాలపై దృష్టి సారించాయి. హెడ్‌ కౌంట్‌ తగ్గినా ఈ జాబ్స్‌కు డిమాండ్ దాదాపు 25-30 శాతం పెరిగిందని టీమ్‌ లీజ్‌ డేటా ద్వారా తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్‌ క్రిస్మస్‌ కానుక

అయితే ఏఐ విస్తరణ ప్రభావం ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు.ఎందుకంటే ఈ కంపెనీలు AI సామర్థ్యాకు దగ్గరగా వున్న నైపుణ్యాలను చూస్తున్నాయి తప్ప, నేరుగా AI రోల్స్‌ వైపు కాదు. నియామాకల్లో ఏఐ ప్రభావం రాబోయే రెండుమూడేళ్లలో  స్పష్టంగా కనిపించనుందని  నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు పెర్‌ఫ్లెక్సీటీ AI ,ఓపెన్ AI వంటి న్యూ జెన్‌ ఏఐ Aకంపెనీలు భారతదేశం తమ అగ్ర వినియోగదారు మార్కెట్లలో ఒకటిగా ఎదగాలని చూస్తున్నాయి, దేశంలో కార్యాలయాలు , డేటా సెంటర్‌లను ఏర్పాటుకు మొగ్గు చూపు తున్నాయి. 

అమెరికా టెక్ కంపెనీలు విదేశీ దేశాల నుండి నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను నియమించుకోవడానికి ఉపయోగించే కీలకమైన H-1B వీసా దరఖాస్తు నియమాలలో గణనీయమైన మార్పులతో భారతదేశంపై కూడా ఈ ప్రభావం కనిపించింది. ప్రతీ ఏడాది దాదాపు 70-75 శాతం భారతీయ దరఖాస్తుదారులవే.కానీ 2025లో ట్రంప్ పరిపాలన కొత్త వీసా దరఖాస్తులపై లక్ష డాలర్లు రుసుముతో వీటి సంఖ్య గణనీయంగా పడిపోయింది.

కంపెనీలు- పెట్టుబడులు
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో, విశాఖపట్నంలో పెద్ద ఎత్తున కృత్రిమ మేధస్సు (AI) హబ్‌ను ఏర్పాటు చేయడానికి Google 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. ఫలితంగా రానున్న ఐదేళ్లలో   లక్ష కంటే ఎక్కువ ఉద్యోగాలొస్తాయని అంచనా. మైక్రోసాఫ్ట్‌ కూడా 17.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ప్రకటించింది. అలాగే రానున్న ఐదేళ్లలో అమెజాన్‌ ఇండియాలో 35 బిలియన్లడాలర్లనుపెట్టుబడి పెడుతోంది. ఈ పెట్టుబడుల ఫలితంగా 2030 నాటికి భారతదేశంలో అదనంగా  10 లక్షల ఉద్యోగాలు  కల్పించాలని టెక్‌ కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఇవి ఇప్పటివరకు భారతదేశంలో ప్రకటించిన టెక్ మేజర్ల అతిపెద్ద పెట్టుబడులు. దీనికి తోడు OpenAI ఈ ఏడాది చివరినాటికి న్యూఢిల్లీలో తన మొదటి భారతదేశ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నామని ఆగస్టులో ప్రకటించింది. అలాగే మైక్రోసాఫ్ట్ హైదరాబాదులో 2.65 లక్షల చదరపు అడుగుల ప్రధాన కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్న విషయం గమనార్హం.

H-1B ఆంక్షలు -2026 నియామకాలపై ప్రభావం
H-1B ఆంక్షలు 2026లో భారతదేశంలో స్థానిక నియామకాలపై వపరిశ్రమ నిపుణులు  ఆశాజనకంగానే ఉన్నారు. 2026లో  నియామకాలు పెరగవచ్చు. అయితే టాలెంట్‌ మూమెంట్‌, సేవల కొనుగోళ్లు, విదేశాలకు ఉద్యోగులను పంపడం లాంటి అంశాలపై స్పష్టత వవచ్చిన తరువాత  గ్లోబల్‌ టెక్‌ సంస్థల నియామాకల్లో  క్లారిటీ రావచ్చని అంచనా. సాంప్రదాయిక టెక్ ,ఐటీ నియామకాలు ఎక్కువగా భర్తీ పాత్రలకే ఉంటాయి మరియు తక్కువ సింగిల్ డిజిట్‌లలో పెరుగుతాయి, బిగ్ టెక్ నియామకాలు 2026లో దాదాపు 16-20 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ శర్మ తెలిపారు. సామర్థ్యం ఆధారితంగా ఉంటాయి, AI, డేటా ప్లాట్‌ఫారమ్‌లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలుm భద్రతపై దృష్టి పెడతాయని కూడా చెప్పారు. అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్‌, నియామకాల మందగమనం ఉన్నప్పటికీ,  AI నేతృత్వంలోని ఉత్పాదకత లాభాలతో  భారతదేశం పెద్ద టెక్ ఉద్యోగాల  కల్పన  మాత్రం కొనసాగనుంది అనేది  ఐటీ  గ్రాట్యుయేట్లకు  ఊరటనిచ్చే అంశం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement