హెచ్‌-1బీ వీసా ప్రక్రియ ఇక మరింత సులభతరం!

Uscis Launches System To Streamline H-1b Visa Application Process - Sakshi

హెచ్‌-1బీ వీసా కోసం అప్లయ్‌ చేశారా? ప్రాజెక్ట్‌ నిమిత్తం అమెరికాకు వెళ్లే యోచనలో ఉన్నారా? అయితే మీకో గుడ్‌ న్యూస్‌. 

హెచ్‌1- బీ వీసా రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ను సులభతరం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ఫిబ్రవరి 28,2024న యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్‌ విభాగం (యూఎస్‌సీఐఎస్‌) మైయూఎస్‌సీఐఎస్‌ పేరుతో కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పద్దతిలో హెచ్‌-1బీ వీసా ప్రాసెస్‌ మరింత సులభ తరం అయ్యేలా ఆర్గనైజేషనల్‌ అకౌంట్‌ను వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించింది.   

హెచ్‌-1బీ వీసా ప్రాసెస్‌ వేగవంతం
ప్రపంచ వ్యాపంగా ఆయా కంపెనీలు తమ ప్రాజెక్ట్‌ల నిమిత్తం ఉద్యోగుల్ని అమెరికాకు పంపిస్తుంటాయి. ఇందుకోసం ఉద్యోగులు హెచ్‌-1బీ వీసా తప్పని సరిగా ఉండాలి. ఇప్పుడు ఆ హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ వేగవంతం జరిగేలా చర్యలు తీసుకుంది జోబైడెన్‌ ప్రభుత్వం. ఇందులో భాగంగా మైయూఎస్‌సీఐఎస్‌లోని ఆర్గనైజేషనల్‌ అకౌంట్‌లో సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు, లీగల్‌ అడ్వైజర్లు హెచ్‌1-బీ వీసా రిజిస్ట్రేషన్‌, హెచ్‌-1బీ పిటిషిన్‌ ప్రాసెస్‌ చేయొచ్చు. 

కొత్త పద్దతి హెచ్‌-1బీ వీసా పిటిషనర్లకు వరం
జోబైడెన్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మైయూఎస్‌సీఐఎస్‌ ఈ కొత్త వీసా పద్దతి హెచ్‌-1బీ వీసా పిటిషనర్లకు వరంగా మారుతుందని వీసా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వీసా ప్రాసెస్‌లో సంస్థలే హెచ్‌-1బీ ప్రాసెస్‌ చేసుకోవచ్చు.హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌, పిటిషన్స్‌తో పాటు ఫారమ్‌ ఐ-907కి సంబంధించిన కార్యకలాపాల్ని చక్కబెట్టుకోవచ్చు. 

ఇమ్మిగ్రేషన్‌ ప్రయోజనాలు 
అంతేకాదు మైయూఎస్‌సీఐఎస్‌ ఉన్న డేటా ఆధారంగా  అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) అధికారులు వలసదారుల (noncitizens) అర్హతని బట్టి ఇచ్చే ఇమ్మిగ్రేషన్‌ ప్రయోజనాలు కల్పించాలా? వద్దా? అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని యూఎస్‌సీఐఎస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.  

ఈ దశ చాలా అవసరం
మార్చి 2024 నుండి  సంస్థలు హెచ్‌-1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో పాల్గొనడానికి కొత్త ఆర్గనైజేషనల్‌ అకౌంట్‌ను క్రియేట్‌ చేయాలి. 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1బీ పిటిషన్‌లను ఫైల్ చేయాలనుకుంటున్న వారికి ఈ దశ చాలా అవసరం.

ఫారమ్‌ ఐ-907 అంటే? 
ఇందులో కొత్త మొత్తాన్ని చెల్లించి వీసా ప్రీమియం ప్రాసెసింగ్‌ సర్వీసులు పొందవచ్చు. ఉదాహరణకు పిటిషన్స్‌, అప్లికేషన్‌లు.   

హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌, హెచ్‌-1బీ పిటిషన్స్‌ అంటే?
ఉదాహరణకు భారతీయులు అమెరికాలో ఏదైనా సంస్థలో పనిచేయాలనే వారికి హెచ్‌-1బీ వర్క్‌ పర్మిట్‌ తప్పని సరి. ఈ హెచ్‌-1బీ వీసా అప‍్లయ్‌ చేయడాన్ని హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ అంటారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత ఎంపికైనా అ‍భ్యర్ధులకు తర్వాత  జరిగే ప్రాసెస్‌ను హెచ్‌-1బీ పిటిషన్‌ అని అంటారు. 

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top