రిటైల్‌ రుణాలు రూ.162 లక్షల కోట్లు | retail debt Rs 162 crores refers outstanding borrowings retail cos | Sakshi
Sakshi News home page

రిటైల్‌ రుణాలు రూ.162 లక్షల కోట్లు

Feb 25 2026 8:50 AM | Updated on Feb 25 2026 9:56 AM

retail debt Rs 162 crores refers outstanding borrowings retail cos

అత్యధికం గృహ రుణాలే

ఆటో రుణాల్లో ఎక్కువ వృద్ధి

క్రిఫ్‌ హై మార్క్‌ నివేదిక 

రిటైల్‌ రుణాలు గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయి. 2025 డిసెంబర్‌ త్రైమాసికంలో 18 శాతం పెరిగి రూ.162 లక్షల కోట్లకు చేరాయి. ముఖ్యంగా బంగారం ధరలు పెరగడంతో, వాటిపై రుణాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండడం.. అలాగే, పండగల సీజన్, జీఎస్‌టీ రేట్ల తగ్గింపు రుణ వితరణ పెరిగేందుకు దారితీసింది. ఈ వివరాలను క్రెడిట్‌ సమాచార సంస్థ క్రిఫ్‌ హై మార్క్‌ విడుదల చేసింది.  

  • రిటైల్‌ రుణాల్లో అతిపెద్ద విభాగమైన గృహ రుణాలు 10.5 శాతం పెరిగి రూ.43 లక్షల కోట్లకు చేరాయి. ఈ విభాగంలో యాక్టివ్‌ రుణాలు నికరంగా 3.3 లక్షలు పెరిగాయి.  

  • వ్యక్తిగత రుణాలు సైతం 11.6 శాతం వృద్ధితో రూ.15.9 లక్షల కోట్లుగా ఉన్నాయి.

  • ఆటో రుణాలు 14.6 శాతం, ద్విచక్ర వాహన రుణాలు 12.3 శాతం, కన్జ్యూమర్‌ డ్యురబుల్‌ రుణాలు 14.3 శాతం చొప్పున పెరిగాయి.  

  • సోల్‌ పొప్రైటర్‌ సంస్థలు (ఒక్కరే యజమానిగా ఉన్న) తీసుకున్న రుణాలు 26.2 శాతం పెరిగాయి.  

  • రిటైల్‌ రుణాల వసూలు కూడా మెరుగుపడింది. 30 నుంచి 180 రోజుల వరకు చెల్లింపుల్లేనివి (మొండి బకాయిలు) డిసెంబర్‌ చివరికి 2.8 శాతానికి తగ్గాయి. సరిగ్గా అంతక్రితం ఏడాది డిసెంబర్‌ చివరికి ఇవి 3.2 శాతంగా ఉన్నాయి.  

  • తెలంగాణ, కర్ణాటక, యూపీ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో గృహ రుణాలు ఎక్కువ వృద్ధిని చూడగా, ఢిల్లీ మార్కెట్లో వృద్ధి తగ్గుమఖం పట్టింది.  

  • డిసెంబర్‌ త్రైమాసికంలో నికరంగా జారీ అయిన మొత్తం రుణాల్లో సగం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉన్నాయి.

ఇదీ చదవండి: మార్కెట్‌ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement