
హెచ్-1బీ(H1-B) వీసా వార్షిక రుసుమును పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో బహుళజాతి కంపెనీల్లోని ఉద్యోగుల వేతనాలపై చర్చ సాగుతోంది. యూఎస్ కార్పొరేట్ కంపెనీలు విదేశాల్లోని తమ ఉద్యోగులకు దేశీయంగా ఎంత వేతనాలు ఆఫర్ చేస్తున్నాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ సర్వీసులు అందిస్తున్న మైక్రోసాఫ్ట్(Microsoft) కంపెనీ హెచ్1-బీ వీసాపై ఉన్న తమ నిపుణులకు యూఎస్‌లో ఎంత పే చేస్తుందో వివరాలు వెల్లడయ్యాయి. అయితే వీటిని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదని గమనించాలి.
జాబ్ రోల్ | ప్రదేశం | వేతనం(యూఎస్ డాలర్లలో) |
---|---|---|
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ | రెడ్మండ్ | 2,84,000 వరకు |
ప్రొడక్ట్ మేనేజర్ | రెడ్మండ్ | 2,50,000 వరకు |
డేటా సైంటిస్ట్ | రెడ్మండ్ | 1,21,200 - 1,60,000 |
డేటా సైంటిస్ట్ | మౌంటైన్ వ్యూ | 2,74,500 వరకు |
- ఈ వేతనాలు బేస్ శాలరీలు మాత్రమే. కంపెనీ అందించే అలవెన్స్‌లు వీటికి అదనం.
ఉద్యోగి స్థాయిని అనుసరించి వేతన వివరాలు ఇలా..
వేతన స్థాయి | సగటు వేతనం (USD) | గరిష్ట వేతనం (USD) |
---|---|---|
స్థాయి I | 1,28,844 | 1,77,200 |
స్థాయి II | 1,53,010 | 2,77,980 |
స్థాయి III | 1,82,575 | 3,13,500 |
స్థాయి IV | 2,17,619 | 3,14,000 |
నాన్-ఓఈఎస్ | 1,71,081 | 2,25,294 |
ఇదీ చదవండి: ట్రయినీల నియామకానికి వ్యతిరేకంగా సమ్మె