‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్‌ రావాలి’ | US H-1B Visa Fee Hike: Microsoft, Meta, Amazon Advise Employees to Return by Sept 21 | Sakshi
Sakshi News home page

‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్‌ రావాలి’

Sep 20 2025 1:13 PM | Updated on Sep 20 2025 1:20 PM

tech cos directed H 1B and H 4 visa holders return to US by September 21

ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సర్వీసులు అందిస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందిన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్‌.. వంటి కంపెనీలు యూఎస్‌ నుంచి వెళ్లి విదేశాల్లో సర్వీసులు అందిస్తున్న తమ ఉద్యోగులకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. యూఎస్‌ వెలుపల ఉ‍న్న హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాలు కలిగిన తమ ఉద్యోగులను సెప్టెంబర్ 21, 2025లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాలపై 1,00,000 అమెరికా డాలర్ల రుసుము విధిస్తూ ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అమెరికాలోనే ఉద్యోగులు తమ పనిని కొనసాగించాలని కోరుతూ, వెంటనే యూఎస్‌కు రావాలని మైక్రోసాఫ్ట్‌తోపాటు ఇతర టెక్‌ కంపెనీలు తమ సూచిస్తున్నాయి. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపిస్తున్నాయి.

ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొందరు చెబుతున్నారు. సాధారణంగా హెచ్‌1-బీ వీసాలు లాటరీపై ఆధారపడతుంది. అందుకు నామినల్‌ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా జారీ అయితే మాత్రం వార్షిక రుసుము పే చేయాలి. ఈ ఫీజునే ట్రంప్‌ ప్రభుత్వం 1 లక్ష డాలర్లకు పెంచింది. ఇప్పటివరకు ఇది 4,000 డాలర్ల వరకు ఉండేది. ఈ రుసుమును సాధారణంగా కంపెనీలే భరిస్తాయి. దీని పెంపు కంపెనీలకు భారం కానుంది.

అమెరికా స్థానికులకు ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు ఈ చర్యలు తోడ్పడుతాయని వైట్ హౌస్ పేర్కొంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తోపాటు ఇతర టెక్ కంపెనీలు కూడా H-1B వీసా నిబంధనలలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఉద్యోగులకు ఈ సూచనలు జారీ చేస్తున్నాయి. హెచ్‌-1బీ వీసాపై ట్రంప్‌ ప్రకటన నేపథ్యంలో జుకర్‌బర్గ్‌ నేతృత్వంలోని టెక్‌ సంస్థ మెటా సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ వ్యవహారంపై మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ..‘అభివృద్ధి చెందుతున్న విధాన మార్పును అంచనా వేస్తున్నందున ఇది ముందు జాగ్రత్త చర్యగా భావించాలి. మా ఉద్యోగుల భద్రతను నిర్ధారించడం అత్యంత ప్రాధాన్యతగా ఉంది’ అన్నారు.

ట్రంప్‌ తీసుకొచ్చిన ఈ నిబంధన సెప్టెంబరు 21 నుంచి వర్తించనుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి హెచ్‌-1బీ వీసాదారులు ఎవరైనా అమెరికాలోకి ప్రవేశించాలన్నా.. లేదా ప్రవేశించే ప్రయత్నాల్లో భాగంగా ఈ వీసాకు దరఖాస్తు చేసుకున్నా లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టెక్‌ కంపెనీలు తమ ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement