బంగ్లాదేశ్ నేతల విద్వేశపూరిత ప్రసంగాల నేపథ్యంలో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢాకాలోని ఇండియా వీసా కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసేస్తున్నట్లు ప్రకటించింది. తీవ్రవాదుల నుంచి ముంపు పొంచిఉన్న నేపథ్యంలో దేశ భద్రతకై ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇండియన్ వీసా సెంటర్ తన కార్యకలాపాలను తాత్కాలికంగా మూసివేసింది. ఇటీవల బంగ్లాదేశ్కి చెందిన నేత భారత్ను విచ్ఛిన్నం చేసే వారికి తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని తద్వారా సెవెన్ సిస్టర్స్ ప్రాంతం చీలిపోయే అవకాశం ఉందని విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఆదేశ రాయభారి రియాజ్ హమీదుల్లాకి సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి శాంతి భద్రతల సమస్య పొంచిఉన్న నేపథ్యంలో ఆ బంగ్లాదేశీయులకు భారత వీసా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగింది.
బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో ఆదేశ మాజీ ప్రధాని షేక్ హాసీనా ప్రస్తుతం భారత్‌లో తలదాచుకుంటున్నారు. అయితే ఆమెకు వివిధ కేసుల్లో మరణశిక్షతో పాటు 21 సంవత్సరాల జైలుశిక్ష పడింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ షేక్ హసీనాను ఆదేశానికి అప్పగించాలని భారత్‌ను కోరింది. ఈవిషయంపై ఇండియా ఇంకా స్పందించలేదు.
ఇంతలోనే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్ హసంత్ అబ్దుల్లా భారత్‌పై విద్వేశపూరిత వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులకు, ఉగ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్‌లో ఆశ్రయం కల్పిస్తామని దాని వల్ల భారత్‌నుంచి ఈశాన్య ప్రాంతం సెవెన్‌సిస్టర్స్ వేరయ్యే అవకాశం ఉందన హెచ్చరించారు. దీనిపై సీరియస్ అయిన భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హైకమిషనర్‌ని వివరణ కోరింది. తాజాగా బంగ్లాదేశీయులకు భారత వీసాను నిలిపివేసింది.


