హెచ్‌1–బీ వీసాదారులకు తీపికబురు | Sakshi
Sakshi News home page

USCIS: హెచ్‌1–బీ వీసాదారులకు తీపికబురు

Published Thu, May 16 2024 5:30 AM

USCIS: Extend your H-1B visa amid layoffs

ఉద్యోగం పోతే 60 రోజులకుపైగా అమెరికాలో ఉండొచ్చు 

వీసా స్టేటస్‌ను మార్చుకొనే అవకాశం  

వాషింగ్టన్‌: అమెరికాలోని ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. గూగుల్, మెటా, ఆపిల్, డెల్, ట్విటర్, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. నాన్‌–ఇమ్మిగ్రెంట్లను తొలగిస్తున్నాయి. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా అమెరికాలో 237 ఐటీ కంపెనీలు 58,499 మందిని తొలగించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 

లే–ఆఫ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రధానంగా హెచ్‌–1బీ వీసాలతో అమెరికా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న భారతీయుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కంపెనీ యాజమాన్యం జాబ్‌ నుంచి తొలగిస్తే 60 రోజుల్లోగా మరో ఉద్యోగం వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాల్సిందే. ఇలాంటి వారికి యూఎస్‌ సిటిజెన్‌íÙప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సరీ్వసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) తీపి కబురు అందించింది. 

హెచ్‌–1బీ వీసాదారులు ఉద్యోగం పోతే 60 రోజులు దాటినా కూడా అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండొచ్చని వెల్లడించింది. అయితే, నాన్‌–ఇమిగ్రెంట్‌ వీసా స్టేటస్‌ మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికాలోనే ఉన్న జీవిత భాగస్వామిపై డిపెండెంట్‌గా మారొచ్చు. అంటే హెచ్‌–4, ఎల్‌–2 వీసా పొందొచ్చు. ఈ వీసాలు ఉన్నవారికి పని చేసుకొనేందుకు(వర్క్‌ ఆథరైజేషన్‌) అనుమతి లభిస్తుంది. స్టూడెంట్‌(ఎఫ్‌–1), విటిటర్‌ (బి–1/బి–2) స్టేటస్‌ కూడా పొందొచ్చు. కానీ, బి–1/బి–2 వీసా ఉన్నవారికి పని చేసుకొనేందుకు అనుమతి లేదు. 60 రోజుల గ్రేస్‌ పిరియడ్‌లోనే వీసా స్టేటస్‌ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్‌సీఐఎస్‌ సూచించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement