
న్యూఢిల్లీ: సైకాలజీ, న్యూట్రిషన్ తదితర హెల్త్‌కేర్ సంబంధిత రంగాల కోర్సులను ఇకపై ఆన్‌లైన్, దూరవిద్యా విధానంలో అందించరాదని ఉన్నత విద్యా సంస్థలను యూజీసీ కోరింది. దీనిపై నిషేధం 2025 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
నిషేధిత కోర్సుల్లో సైకాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, బయోటెక్నాలజీ, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయటెటిక్స్ ఉన్నాయని వెల్లడించింది. వచ్చే విద్యా సెషన్ నుంచి ఆయా కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవద్దని యూజీసీ కార్యదర్శి జోషి కోరారు. ప్రాక్టికల్స్ కీలకమైన హెల్త్‌కేర్ కోర్సులను ఆన్‌లైన్/దూరవిద్య ద్వారా అందించడం వల్ల నాణ్యత దెబ్బతింటున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.