ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తున్నారా? | Bengaluru Man develope AI Helmet Reports Traffic violations | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తున్నారా?

Jan 8 2026 8:03 PM | Updated on Jan 8 2026 10:46 PM

Bengaluru Man develope AI Helmet Reports Traffic violations

తెల్లవారు జామున లేవగానే.. రోడ్డుపై అడుగుపెట్టే వాహనదారులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడెక్కడ ఉన్నారా? ఫోటోలు తీస్తున్నారా? చలానాలు వస్తాయెమోనన్న భయంతో బిక్కు బిక్కు మంటూ వెళ్లడం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఇక ముందు ట్రాఫిక్‌ పోలీసులున్నా.. లేకపోయినా... మనం మాత్రం ట్రాఫిక్ పోలీసుల కనుసైగల్లోనే ఉంటాం. నిబంధనలు ఉల్లంఘించగానే ఆ సమాచారం నేరుగా ట్రాఫిక్‌ కంట్రల్‌ రూం చేరి.. తద్వారా వాహనదారులకు జరిమానా చేరుతుంది. ఇదేం కొత్త టెక్నాలజీ అని ఆశ్చర్యపోతున్నారా.... అయితే  జాగ్రత్తగా ఈ వీడియోను చూడండి..

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. నగరంలోని ట్రాఫిక్‌ సమస్యలను గమనించాడు. నిబంధనలు పాటించని వాహనదారుల కారణంగానే సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించాడు. ట్రాఫిక్‌ పోలీసులున్నా.. వారిని గుర్తించి పట్టుకోలేరనే ధీమాతో వాహనదారులు ఇష్టానుసారంగా డ్రైవింగ్‌ చేస్తున్నారని గుర్తించి అలాంటి వాహనదారులను చెక్‌ పెడితే.. ట్రాఫిక్‌ సమస్యలను కొంత వరకు నివారించవచ్చని ఊహించాడు. సాధారణంగా వాహనదారులు తమకు కేటాయించిన దార్లలో కాకుండా.. రాంగ్‌సైడ్‌ వెళ్లడం.. అతివేగంగా వెళ్లడంతోనే ప్రమాదాలు జరగడం.. ఫలితంగా ట్రాఫిక్‌ అంతరాయాలు ఉంటాయని.. ఆ సమస్య నివారణ కోసం ఫోకస్‌ చేశాడు.

రోడ్డుపై పోలీసులు ఉన్నా లేకున్నా.. వాహనదారుడు మాత్రం క్రమశిక్షణ పాటించాల్సిందేనని.. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని వారిని గుర్తించడానికి ఓ హెల్మెట్‌ను సృష్టించాడు. ఏఐ టెక్నాలజీతో కెమెరాతో అనుసంధానించిన ఆ హెల్మెట్‌ పెట్టుకుని వాహనదారుడు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలపై ఆ హెల్మెట్‌ దృష్టి సారిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాన్ని గుర్తించి వాటి ఫోటోలు తీసి ఏకంగా ట్రాఫిక్‌  అధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేశాడు. ఆధారాలతో పోలీసులు తదుపరి చర్యలు చేపడతారు. కొత్త సాంకేతికతో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టేలా కృషి చేసిన బెంగళూరు నగర యువకుడు పంకజ్‌ తన్వర్‌ను బెంగళూరు పోలీసు కమిషనర్ అభినందించారు.

ఈ హెల్మెట్ ఎలా పనిచేస్తుందంటే.. హెల్మెట్‌లో ఉన్న కెమెరాలో చిప్‌తో పాటు సిమ్‌ అమర్చి ఉంటుంది. తీసిన ఫోటోలు ఆటోమెటిక్‌గా పోలీసులకు అందుతాయి. అందులోని సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా  పోలీస్‌ కంట్రోల్‌ రూంకు మెయిల్‌ ద్వారా పంపించే ఏర్పాట్లు ఉన్నాయి. లభించిన ఆధారాలతో పోలీసులు వాహనదారుల్ని గుర్తించి చలానాలు విధించడం లేదా కోర్టులో హాజరు పరుస్తారు. ఇలాంటి కఠినచర్యలు తీసుకోవడంతో పాటు కనిపించని కెమెరాతో ఫోటోలు వస్తాయని వాహనదారులకు తెలిస్తే రోడ్డు నిబంధనలు పాటించే అవకాశముంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement