
సాక్షి, హైదరాబాద్: నగరానికి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం సాయంత్రం భారీ నుంచి అతిభారీ వర్షం కురవొచ్చని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆఫీసులు, పనులు ముగిసే వేళలో వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు..
తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది.