భారీ తుపాను.. ఢిల్లీ అతలాకుతలం! | Massive Storm In Delhi May 21st 2025 Details Here | Sakshi
Sakshi News home page

#storminDelhi: ధూళి తుపానుతో ఢిల్లీ అతలాకుతలం.. అంధకారం!

May 21 2025 9:06 PM | Updated on May 21 2025 9:15 PM

Massive Storm In Delhi May 21st 2025 Details Here

న్యూఢిల్లీ: భారీ తుపాను(Delhi Massive Storm) ధాటికి దేశ రాజధాని అతలాకుతలం అయ్యింది. బుధవారం సాయంత్రం నుంచి ధూళి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. 

నిన్నమొన్నటి దాకా 40 డిగ్రీల ఉష్ణోగ్రలతో.. తీవ్ర ఉక్కపోతతో రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే బుధవారం సాయంత్రం వాతావరణం చల్లబడిందని అనుకునేలోపే.. ధూళి తుపానుతో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ ధాటికి ఢిల్లీ, నోయిడాల్లో చాలా చోట్ల చెట్లు, హోర్డింగులు, కరెంట్‌ పోల్స్‌ నేలకొరిగాయి. 

చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపైనే చెట్లు, హోర్డింగ్స్‌ పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు రేపటికి తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీతో పాటు హర్యానా, యూపీ రాష్ట్రాల్లోనూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఢిల్లీకి వర్షాలు ఉండడంతో.. వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. సోషల్‌ మీడియాలో తుపాను బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement