ఎర్రకోటకు ఖలిస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు | Capital On High Alert After Bomb Threat Emails Target Red Fort, Delhi Assembly And Schools, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఎర్రకోటకు ఖలిస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు

Feb 23 2026 1:38 PM | Updated on Feb 23 2026 1:52 PM

Delhi receive bomb threat from Khalistani groups

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం హఠాత్తుగా హై అలర్ట్ ప్రకటించారు. చారిత్రక కట్టడం ఎర్రకోటతో పాటు ఢిల్లీ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయానికి (అసెంబ్లీ) బాంబు బెదిరింపులు రావడంతో కలకలం చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా పంపిన హెచ్చరికలతో భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఈ బెదిరింపు ఈమెయిల్ ఒక ఖలిస్థానీ ఉగ్రవాద గ్రూపు పేరుతో వచ్చినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

రాజధానిలోని అత్యంత కీలకమైన ఎర్రకోట, సచివాలయం ప్రాంతాలను బాంబులతో పేల్చివేస్తామన్న సందేశం అందగానే ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ సచివాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను గమనిస్తున్నారు.

ఒకవైపు గాలింపు చర్యలు కొనసాగుతుండగానే, మరోవైపు ఈ-మెయిల్ మూలాలను కనిపెట్టేందుకు దర్యాప్తు సంస్థలు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నాయి. ఖలిస్థానీ సానుభూతిపరుల పేరిట వచ్చిన ఈ బెదిరింపుల వెనుక అసలు కుట్రదారులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీవ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement