khalistan
-
జైశంకర్ పర్యటనలో ఖలిస్థానీల అత్యుత్సాహం.. ఖండించిన యూకే
లండన్ : యూకే పర్యటలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ వాహనంపై ఖలిస్థానీ మద్దతుదారులు జరిపిన దాడి యత్నాన్ని యూకే ఖండించింది. ఈ సందర్భంగా బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ (FCDO) అధికారికంగా స్పందించింది."యూకే చాఠమ్ హౌస్ బయట భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ కారుపై దాడి యత్నాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. యూకే శాంతియుత నిరసన హక్కును గౌరవిస్తుంది. కానీ ఇలా దాడులకు యత్నించడం, బెదిరించడం, ప్రజా కార్యక్రమాల్ని అడ్డుకోవడం సరైందని కాదని’ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.మరోవైపు లండన్ మెట్రోపాలిటన్ పోలీసు వర్గాలు సైతం జైశంకర్‌పై జరిగిన దాడి యత్నాన్ని ఖండించాయి. నిందితులపై చర్యలు తీసుకున్నామని పేర్కొంది. మా అతిథుల భద్రతను పర్యవేక్షించడం, వారి సంరక్షణ బాధ్యతలకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నామని మరో ప్రకటనలో స్పష్టం చేసింది. -
కెనడాలో బిగ్ ట్విస్ట్.. ప్రధాని ట్రూడోకు షాకిచ్చిన ఎన్డీపీ
అట్టావా: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ తగిలింది. ట్రూడోకు ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) షాక్ ఇచ్చింది. ట్రూడో లిబరల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఎన్డీపీ నేత జగ్మీత్సింగ్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.తాజాగా ఎన్డీపీ నేత జగ్మీత్సింగ్ ట్విట్టర్ వేదికగా ఒక లేఖను పోస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన..‘జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలో విఫలమయ్యారు. ప్రజల కోసం కాకుండా, శక్తిమంతుల కోసం ట్రూడో పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్డీపీ సిద్ధంగా ఉంది. కెనడియన్లకు తమ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అవకాశం కల్పిస్తాం. హౌస్ ఆఫ్ కామన్స్ తదుపరి సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాం అని చెప్పుకొచ్చారు. దీంతో, కెనడా రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.మరోవైపు.. కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రిలాండ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేబినెట్లో అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపు పొందిన ఆమె, ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపించారు. అయితే, ఆమె నిర్వహిస్తున్న ఆర్థికశాఖను మారుస్తున్నట్లు ట్రూడో చెప్పిన నేపథ్యంలో క్రిస్టియా తన పదవికి రాజీనామా చేయడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా..కెనడాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాని ట్రూడోకు ఖలిస్థానీల మద్దతుపై ఉత్కంఠ నెలకొంది. ఇక, ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు లభిస్తే కెనాడలో తొమ్మిదేళ్ల ట్రూడో పాలన ముగిసిపోతుంది. Justin Trudeau failed in the biggest job a Prime Minister has: to work for people, not the powerful.The NDP will vote to bring this government down, and give Canadians a chance to vote for a government who will work for them. pic.twitter.com/uqklF6RrUX— Jagmeet Singh (@theJagmeetSingh) December 20, 2024 -
ఆలయంపై దాడి ఘటన.. కెనడాలో అమల్లోకి కొత్త చట్టాలు
ఒట్టావా: హిందూ భక్తులపై సిక్కు వేర్పాటు వాదుల దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాడులు పునరావృతం కాకుండా కొత్త చట్టాల్ని అమల్లోకి తెచ్చింది. బ్రాంప్టన్‌లో ప్రార్థనా స్థలాల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలపై నిషేదం విధిస్తూ స్థానిక (బైలా) చట్టాన్ని అమలు చేసినట్లు బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ప్రకటించారు. ఈ చట్టంపై సిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని చెప్పారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఈ నెల ప్రారంభంలో బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో సిక్కు వేర్పాటువాదులు ఖలిస్థానీ జెండాలతో రెచ్చిపోయారు. దేవాలయానికి వస్తున్న హిందూ భక్తులపై కర్రలతో దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియోలో వైరల్‌గా మారాయి.ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులపై దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎక్స్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఈ దాడిని ఖండించారు. ప్రతి ఒక్క కెనడియన్ తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా, సురక్షితంగా అనుసరించే హక్కు ఉందని అన్నారు. -
కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదార్లున్నారు
ఒట్టావా: కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నారని ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అంగీకరించారు. అయితే, వారు మొత్తంగా సిక్కు సమాజానికి ప్రాతినిధ్యం వహించడం లేదని చెప్పారు. కెనడాలో ఓట్టావాలోని పార్లమెంట్ హాల్లో తాజాగా దీపావళి వేడుకల్లో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ దేశంలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఉన్నమాట వాస్తవమేనని చెప్పారు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుదారులు, అభిమానులు సైతం ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారని, అయితే వారంతా హిందూ కెనడా పౌరులకు ప్రాతినిధ్యం వహించడం లేదని తెలిపారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు బలహీనపడిన సంగతి తెలిసిందే. ఖలిస్తాన్ ఉగ్రవాదులకు కెనడా అడ్డాగా మారిందని, అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత్ పలుమార్లు ఆరోపించింది. అయినా కెనడా ప్రభుత్వం పెద్దగా స్పందించని సంగతి తెలిసిందే. -
ఆగని ఆగడాలు
ఎంత గట్టిగా చెప్పినా, ఎన్నిసార్లు నిరసన తెలిపినా భారత్‌కూ, భారతీయులకూ వ్యతిరేకంగా కెనడాలో ఆగడాలు ఆగడం లేదు. ఈ ఉత్తర అమెరికా దేశంలో ఆదివారం జరిగిన సంఘటనలు అందుకు తాజా నిదర్శనం. టొరంటోకి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని బ్రాంప్టన్‌లో హిందూ సభ ఆలయం వద్ద పసుపుపచ్చ ఖలిస్తానీ జెండాలు ధరించిన మూకలు హిందూ భక్తులతో, భారతదేశ జెండాలు ధరించినవారితో ఘర్షణకు దిగి, దాడి చేసిన ఘటన ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయం. భారత దౌత్యాధికారులు ప్రార్థనా మందిరాన్ని సందర్శిస్తున్నప్పుడు జరిగిన ఈ వ్యవహారాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. మన ప్రధాని, విదేశాంగ మంత్రి తమ నిరసనను కటువుగానే తెలిపారు. ఖలిస్తానీ మద్దతుదారులైన 25 మంది ఎంపీల అండతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఘటన ఖండించాల్సి వచ్చింది. అయితే, సాక్షాత్తూ ట్రూడో ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు చంద్ర ఆర్య ఇదంతా ఖలిస్తానీ తీవ్రవాదుల పని అనీ, వారు లక్ష్మణ రేఖ దాటారనీ పేర్కొనడంతో సమస్యకు మూలకారణం సర్కారు వారి సొంత వైఖరిలోనే ఉందని కుండబద్దలు కొట్టినట్టయింది. సీనియర్ సిటిజన్లయిన భారతీయ, కెనడియన్లకు లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి స్థానిక హిందూ సభ మందిరంతో కలసి భారత అధికారులు దౌత్య శిబిరం నిర్వహించిన సందర్భంలో తాజా ఘటనలు జరిగాయి. ఇది మరీ దుస్సహం. అటు బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిరం, ఇటు సర్రీ లోని లక్ష్మీనారాయణ ఆలయం వద్ద జరిగిన ఘర్షణల్ని చెదురుమదురు ఘటనలు అనుకోలేం. భారత, హిందూ ధర్మ వ్యతిరేక ధోరణితో హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని అల్లరి మూకలు కొన్నేళ్ళుగా దౌర్జన్యాలకు దిగుతున్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. భారత్‌కు వ్యతి రేకంగా, ఖలిస్తాన్‌కు అనుకూలంగా మందిరాల వద్ద గోడలపై రాతలు రాస్తున్న వైనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. కెనడాతో భారత్ తన నిరసన తెలిపి, అక్కడి భారతీయులు, ఖలిస్తానీ అనుకూలే తరుల భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసినా ఫలితం కనిపించట్లేదు. ట్రూడో సర్కార్ చిత్తశుద్ధి లేమికి ఇది అద్దం పడుతోంది. కెనడాలో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతధర్మాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా పాటించే హక్కుందని ఆ దేశ ప్రధాని పైకి అంటున్నారు. కానీ లోలోపల సర్కారీఅండ చూసుకొనే ఆ దేశంలో మందిరాలపై ఖలిస్తానీ దాడులు పెరుగుతున్నాయనేది చేదు నిజం. కెనడాలోని పరిణామాలు ఇతరులకేమో కానీ, భారత్‌కు మాత్రం ఆశ్చర్యకరమేమీ కాదు. నిజం చెప్పాలంటే కొంతకాలంగా, మరీ ముఖ్యంగా గడచిన నాలుగేళ్ళుగా వేర్పాటువాద ఖలిస్తానీ మద్దతుదారులకు కెనడా ఒక కేంద్రంగా తయారైంది. భారత వ్యతిరేకులైన ఈ తీవ్రవాదులకు కెనడా ఆశ్రయం ఇవ్వడమే కాక, వారికి రక్షణగా నిలుస్తోంది. భారత్‌లో హింస, భయాందోళనల్ని వ్యాపింపజేస్తూ, ఆయుధాలు అందిస్తున్నట్టుగా వీరిలో చాలామందిపై భారత అధికారులు ఇప్పటికే క్రిమినల్ కేసులు పెట్టారు. అయినా సరే, డిజిటల్ మీడియా సహా వివిధ వేదికలపై ఖలిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తూ, భారత వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నవారిని కెనడా ప్రభుత్వం ఇంటి అల్లుళ్ళ కన్నా ఎక్కువగా చూసుకుంటోంది. నిజానికి, భారత ప్రభుత్వం కరడుగట్టిన గ్యాంగ్స్టర్లు ఏడుగురి పేర్లను గత ఏడాదే కెనడాకు అందజేసింది. జస్టిన్ ట్రూడో సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. వీటన్నిటి పర్యవసానమే... ఇప్పుడు కెనడాలో హిందువులపై జరుగుతున్న దాడులు. అల్లరి మూకలకు ఆశ్రయం ఇవ్వడం వల్లనే ఇలాంటి హింసాత్మక ఘటనలకు కెనడా నెలవుగా మారిందని ఇప్పుడు ప్రపంచానికి తేటతెల్లమైంది. హిందువులందరూ భారత్‌కు తిరిగి వెళ్ళిపోవాలని ఖలిస్తానీ గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ గత ఏడాది బాహాటంగానే హెచ్చరించారు. మొన్నటికి మొన్న దీపావళి జరుపుకోరాదనీ బెదిరించారు. బ్రాంప్టన్, వాంకూవర్లలో ఖలిస్తానీ మద్దతుదారులు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యో దంతాన్ని ఉత్సవంలా చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా ట్రూడో సర్కార్ మాటలకే తప్ప చేతలకు దిగలేదు. ఆగడాలను ఆపే ప్రయత్నం చేయనే లేదు. తాజా ఘటనల్లో ఖలిస్తానీ అల్లరి మూకలను ఆపే బదులు కెనడా స్థానిక పోలీసులు మౌనంగా చూస్తూ నిల్చొని, బాధిత హిందూ భక్తులపైనే విరుచుకుపడడం విడ్డూరం. కొందరు పోలీసు ఉద్యోగులు సాధారణ దుస్తుల్లో ఖలిస్తానీ జెండాలతో తిరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రక్షకభటులు ఓ వర్గానికి కొమ్ముకాయడం ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు లేకుండా జరిగే పని కాదు. ఇది భారతీయ కెనడియన్ల భద్రతపై ఆందోళన రేపే అంశం. ట్రూడో అధికారంలోకి వచ్చాక భారత, కెనడా సంబంధాలు అంతకంతకూ క్షీణిస్తూ వస్తున్నా యనేది బహిరంగ రహస్యం. గత ఏడాది కాలంగా సాక్ష్యాధారాలు చూపకుండా భారత్‌పై కెనడా ఆరోపణలు, మన దేశ ప్రతి విమర్శలు, మొన్న అక్టోబర్‌లో దౌత్యాధికారుల పరస్పర బహిష్కరణ దాకా అనేక పరిణామాలు సంభవించాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడానికే మొగ్గు చూపడం చివరకు ద్వైపాక్షిక సంబంధాలు ఇంతగా దెబ్బతినడానికి కారణమవుతోంది. ప్రజాస్వామ్యంలో స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛ ఉండాల్సిందే కానీ, దాని మాటున తీవ్రవాదుల ఇష్టారాజ్యం సాగనిద్దామనే ధోరణి సరైనది కాదు. ఈ వైఖరి పోనుపోనూ భారత, కెనడా ద్వైపాక్షిక సంబంధాలకే కాదు... చివరకు భవిష్యత్తులో కెనడా సొంత మనుగడకే ముప్పు తేవచ్చు. పాలు పోసి పెంచిన పాము మన ప్రత్యర్థిని మాత్రమే కాటు వేస్తుందనుకోవడం పిచ్చి భ్రమ. ట్రూడో సర్కార్ ఆ సంగతి ఇప్పటికైనా తెలుసుకొంటే మంచిది. -
కెనడా: హిందూ దేవాలయాలపై దాడి ఘటనలో కీలక పరిణామం
ఒట్టావా: కెనడాలో ఖలిస్థానీ వేర్పాటు వాదులు హిందూ దేవాలయాలపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటు వాదులకు మద్దతు పలుకుతూ హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడ్డ వారిపై కెనడా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనను కెనడా ప్రధాని జెస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఖలిస్థానీలకు మద్దతు పలుకుతున్న ప్రభుత్వ అధికారులపై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఖలిస్థాని జెండాతో కెనడా పీల్ ప్రాంత రీజనల్ పోలీసు అధికారి హరీందర్ సోహీపై ఆందోళన చేపట్టారు. ఖలిస్థానికి మద్దతుగా, భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీందర్ సోహీ నినాదాలు చేస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో కెనడా పోలీస్ శాఖ సోహీపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. కెనడా కమ్యూనిటీ సేఫ్టీ, పోలీసింగ్ యాక్ట్ నిబంధనల్ని ఉల్లంఘించినందనే హరీందర్ సోహీపై చర్యలు తీసుకున్నట్లు రిచర్డ్ చిన్ తెలిపారు. మరోవైపు హిందూ దేవాలయాలపై ఖలిస్థానీ వేర్పాటు వాదుల దాడిని సీరియస్‌గా తీసుకున్న కెనడా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఖండించిన మోదీకెనడాలోని హిందూ ఆలయం లక్ష్యంగా జరిగిన దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ విధ్వంసక ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద ప్రయత్నాలు కూడా అంతే దారుణమైనవి పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్ స్థైర్యాన్ని ఏమాత్రం బలహీనపరచలేవన్నారు. ఈ ఘటనపై కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. -
అమిత్ షాపై కెనడా సంచలన ఆరోపణ
అట్టావా: భారత హోంమంత్రి అమిత్ షాపై కెనడా సంచలన ఆరోపణలు చేసింది. కెనడాలోని ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్ షా అనుమతి ఇచ్చారని కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చారు. దీంతో, రెండు దేశాల మధ్య మరోసారి రాజకీయం వేడెక్కింది.తాజాగా ఓ కార్యక్రమంలో కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి నటాలియా డ్రౌయిన్ మాట్లాడుతూ..‘కెనడాలో ఖలిస్తానీ ఏర్పాటువాది నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ అధికారుల హస్తం ఉంది. ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలకు అమిత్ షా అనుమతి ఇచ్చారు. ఈ విషయాలను మేము వెల్లడిస్తున్నాం. ఇదే సమయంలో ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు విషయాలను తాము కావాలనే అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టుకు లీక్ చేసినట్లు అంగీకరించారు.ఈ విషయాలు చెప్పేందుకు, తాను ఆ సమాచారం లీక్ చేయడానికి ట్రూడో అనుమతి అవసరం లేదన్నారు. ఈ దౌత్య వివాదంలో ఒక అమెరికన్ మీడియా కెనడా వాదనను వినిపించేలా చేస్తానన్నారని డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మోరిసన్ తెలిపారు. తమ కమ్యూనికేషన్ వ్యూహం మొత్తాన్ని ట్రూడో ఆఫీస్ పర్యవేక్షిస్తోందని చెప్పారు.🚨 HUGE. Canada ACCUSES 🇮🇳 Home Minister Amit Shah.Canadian Deputy foreign Minister says "Amit Shah AUTHORISED violent operations targeting Khalistanis in Canada."– This statement will BACKFIRE Canada only & will boost Modi govt's image in India 🎯pic.twitter.com/28y5t1VK13— Megh Updates 🚨™ (@MeghUpdates) October 30, 2024 ఇక, అక్టోబర్ 14వ తేదీకి ముందు తాను వాషింగ్టన్ పోస్టు పత్రికకు వెల్లడించిన సమాచారం సీక్రెట్ ఏమీ కాదని నటాలియా సదరు ప్యానల్‌కు వెల్లడించారు. భారత్‌తో సహకారానికి తాము తీసుకొన్న చర్యలు కూడా అందులో ఉన్నాయన్నారు. కెనడా వాసులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఆధారాలను న్యూఢిల్లీకి వెల్లడించినట్టు చెప్పుకొచ్చారు. -
ఢిల్లీ పేలుడు: ఖలిస్తానీ హస్తంపై టెలిగ్రామ్‌కు లేఖ
ఢిల్లీ ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ వద్ద ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. అయితే.. ఈ ఘటనకు నాటు బాంబే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ), సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ల బృందాలు విచారణ చేపట్టాయి.ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ.. ప్రతీకారంగా ఈ పేలుడు జరిగిందని టెలిగ్రామ్‌లో ఓ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఓ టెలిగ్రామ్ ఛానెల్ ఈ పోస్ట్‌ను పెట్టినట్లు పోలీసులు గురించారు. దీంతో ఈ దాడికి ఖలిస్థాన్ వేర్పాటువాదులు పాల్పడి ఉంటారని దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఘటనకు ఖలిస్తాన్ వేర్పాటవాదులకు ఉన్న లింక్‌ను పరిశీలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. తాజాగా ‘జస్టిస్ లీగ్ ఇండియా’ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానెల్‌కు సంబంధించిన వివరాలను ఇవ్వాలని దర్యాప్తు బృందం లేఖలో కోరింది. అయితే.. టెలిగ్రామ్ నుంచి దర్యాప్తు సంస్థలకు ఇంకా ఎంటువంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు.ఇక.. ఈ పేలుడు తీవ్రతకు స్కూలు ప్రహరీ, ఆ సమీపంలోని దుకాణాల అద్దాలు, ఒక కారు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు.. పండగ సీజన్లో ఇప్పటికే రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్నాయి. ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తత ప్రకటించారు. -
కెనడాలో ఖలిస్తానీల ‘సిటిజన్స్ కోర్ట్’
న్యూఢిల్లీ: కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. వాంకోవర్‌లో ఉన్న భారత కాన్సులేట్ ఎదురుగా రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ దిష్టి»ొమ్మను దహనం చేయడంతోపాటు ‘సిటిజన్స్ కోర్ట్’ను నిర్వహించారు. ఈ వ్యవహారంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌లోని కెనడా హై కమిషన్‌కు డిప్లొమాటిక్ నోట్ ద్వారా అభ్యంతరం తెలిపింది. ఖలిస్తానీ శక్తుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రూడో ప్రభుత్వం వేర్పాటువాదులకు దన్నుగా నిలుస్తోందని ఆరోపించింది. గతేడాది జరిగిన నిజ్జర్ హత్యకు భారత్ ఏజెంట్లే కారణమన్న కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. -
పన్నూ హత్య కేసు: న్యూయార్క్ కోర్టులో నిఖిల్ గుప్తా వాదన ఇదే..
వాషింగ్టన్: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కేసులో నిందితుడిగా అభియోగం ఎదుర్కొంటున్న భారత సంతతి నిఖిల్ గుప్తాను పోలీసులు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్బంగా వాదనల అనంతరం కేసు విచారణను కోర్టు జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది.అయితే, ఖలిస్థానీ తీవ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూను చంపేందుకు ఒక కిరాయి హంతకుడిని వియోగించాడనే ఆరోపణను ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా (52)ను చెక్ రిపబ్లిక్ గత వారంలో అమెరికాకు అప్పగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రూక్లిన్ లోని ఫెడరల్ మెట్రోపాలిటన్ నిర్బంధ కేంద్రంలో ఉన్న గుప్తాను సోమవారం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు.ఈ క్రమంలో వాదనల సందర్భంగా గుప్తా ముందస్తుగా 15,000 డాలర్లు ఇచ్చి ఒక కిరాయి హంతకుడిని వియోగించాడని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. తనపై అన్యాయంగా అభియోగాన్ని మోపారని గుప్తా చెప్పుకొచ్చారు. మరోవైపు.. భారత ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారి ఆదేశం మేరకు పన్నూ హత్యకు గుప్తా కుట్రపన్నాడని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తోంది. ఇరు వాదనలు విన్న అనంతరం, ఈ కేసు విచారణను జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది. 28వ తేదీ వరకు గుప్తా పోలీసుల కస్టడీలోనే ఉండాలని ఆదేశించింది. గుప్తాకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.ఇదిలా ఉండగా.. చెక్ రిపబ్లిక్ పోలీసులు నిఖిల్ గుప్తాను యునైటెడ్ స్టేట్స్కు అప్పగించిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Czech police has released visuals of Nikhil Gupta being extradited to the US. The visuals from 14th June shows NYPD-New York City Police Department official also present. pic.twitter.com/1ll4SePJIQ— Sidhant Sibal (@sidhant) June 17, 2024 -
‘ఖలిస్థానీ‘ వివాదాస్పద పోస్టర్లు: ఘాటుగా స్పందించిన కెనడా మంత్రి
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లు అతికించడం కలకలకలం రేపింది. ఈ చర్యలను కెనడా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దీనిపై ఎక్స్ వేదికగా కెనడా మంత్రి డామినిక్ ఏ లెబ్లాంక్ స్పందించారు. ‘వాంకూవర్‌లో కొందరు ఇందిరా గాంధీ హత్య పోస్టర్లు వేశారు. కెనడాలో ఈ విధంగా హింసను ప్రోత్సహించడం ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు. దీనికి ముందు కెనడాలోని వాంకోవర్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు ఇందిరా గాంధీ హత్యపై వివాదాస్పద పోస్టర్లు అతికించడాన్ని హిందూ-కెనడియన్ ఎంపీ, మంత్రి చంద్ర ఆర్య తీవ్రంగా తప్పుపట్టారు. కెనడాలో హింసను ప్రోత్సహించడాన్ని ఎన్నటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్రూడో ప్రభుత్వాన్ని ఆయన కోరారు.ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్టీకి చెందిన ఎంపీ ఆర్య ట్విట్టర్ వేదికగా.. ‘భారత ప్రధాని ఇందిరా గాంధీ శరీరంపై బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయని, ఆమె అంగరక్షకులే తుపాకులు పట్టుకుని హంతకులుగా మారారని పేర్కొంటూ ఖలిస్థానీ మద్దతుదారులు పోస్టర్లు వేసి, మరోమారు హిందూ-కెనడియన్లలో భయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.ఇది కొన్ని సంవత్సరాల క్రితం బ్రాంప్టన్‌లో జరిగిన బెదిరింపుల కొనసాగింపని, కెనడాలోని హిందువులను భారతదేశానికి తిరిగి వెళ్లాలని కోరుతున్న ఖలిస్థానీ ఉద్యమ నేత పన్నూన్ చర్య అని పేర్కొన్నారు. ఆయన ప్రత్యేక సిక్కు రాష్ట్ర ఉద్యమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ విధమైన చర్యలకు పాల్పడతున్నారన్నారు. పన్నూన్‌పై కెనడాలోని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్య డిమాండ్ చేశారు. ఇటీవల వాంకోవర్‌లో భారత ప్రధాని ఇందిరా గాంధీ హత్యను చిత్రీకరించే పోస్టర్లు వెలిశాయని పబ్లిక్ సేఫ్టీ, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్ గవర్నమెంటల్ అఫైర్స్ మంత్రి డొమినిక్ ఎ లెబ్లాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. హింసను ప్రోత్సహించడం ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కాగా హౌస్ ఆఫ్ కామన్స్ ఆఫ్ కెనడాలో నేపియన్ ఎన్నికల జిల్లాకు చంద్ర ఆర్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Khalistan supporters in Vancouver with posters, of Hindu Indian prime minister Indira Gandhi body with bullet holes with her bodyguards turned assassins holding their guns, are again attempting to instil fear of violence in Hindu-Canadians. This is continuation of threats with a… pic.twitter.com/ia8WQL4VtH— Chandra Arya (@AryaCanada) June 8, 2024 -
Lok Sabha Election 2024: లోక్‌సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాదుల మద్దతుదారులు లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగారు. పార్లమెంట్లో అడుగుపెట్టడంతో పాటు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు తెలిపే వారందరినీ ఏకం చేసేందుకు ఎన్నికలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అకాలీదళ్‌కు చెందిన సిమ్రన్‌జీత్ సింగ్ మాన్, జైలులో ఉన్న ’వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌తో సహా ఎనిమిది మంది వేర్పాటువాదులు పంజాబ్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ రాజీనామాతో 2022లో జరిగిన సంగ్రూర్ ఉప ఎన్నికలో సిమ్రన్‌జీత్ సింగ్ మాన్ విజయం సాధించారు. ఇది ఖలిస్తానీ మద్దతుదారులకు ప్రేరణగా మారింది. సిమ్రన్‌జీత్ ఈసారి కూడా సంగ్రూర్ నుంచే పోటీ చేస్తున్నారు. ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి కుశాల్‌పాల్ సింగ్ మాన్, ఫరీద్కోట్ నుంచి బల్దేవ్ సింగ్ గాగ్రా, లుధియానా నుంచి అమృత్‌పాల్ సింగ్ చంద్ర, పటియాలా నుంచి మోనీందర్పాల్ సింగ్ పోటీ చేస్తున్నారు. కర్నాల్ నుంచి హర్జీత్ సింగ్ విర్క్, కురుక్షేత్ర స్థానం నుంచి ఖాజన్ సింగ్ బరిలోకి దిగారు. దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. -
పోలీస్ అధికారిపై ‘ఖలిస్తానీ’ వ్యాఖ్యలు...చిక్కుల్లో బీజేపీ నేత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ‘సందేశ్‌ఖాలీ’ వివాదం సద్దుమణగడం లేదు. నార్త్ 24 పరిగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ నేతలు భూఆక్రమణలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గత వారం రోజులుగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ వ్యవహారంలో తాజాగా సిక్కు పోలీస్ అధికారిని ఖలిస్తానీ అంటూ దూషించడంతో రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి చిక్కుల్లో పడ్డారు. ఈ వీడియోను పశ్చిమ బెంగాల్ పోలీసులు మంగళవారం షేర్ చేయడంతో తాజా వివాదం రాజుకుంది. ‘మా అధికారులలో ఒకరిని రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి 'ఖలిస్తానీ' అని పిలిచారు. అది తప్పు. అతను గర్వించదగిన సిక్కు, అలాగే చట్టాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమర్థుడైన పోలీసు అధికారి. ఈ వ్యాఖ్యలు మతపరంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇది నేరపూరిత చర్య. ఒక వ్యక్తి మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా చేసిన ఈ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం’ అని రాష్ట్ర పోలీసు అధికారిక హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశారు. చదవండి: సీనియర్ లాయర్ ఫాలీ నారీమన్ కన్నుమూత We, the West Bengal Police fraternity, are outraged to share this video, where one of our own officers was called ‘Khalistani’ by the state's Leader of the Opposition. His ‘fault’: he is both a proud Sikh, and a capable police officer who was trying to enforce the law…(1/3) — West Bengal Police (@WBPolice) February 20, 2024 సువేందు అధికారి వ్యాఖ్యలను సీఎం మమతా బెనర్జీ ఖండించారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. పోలీసులు అధికార టీఎంసీకి లోబడి పనిచేస్తున్నారని మండిపడింది. Stern legal action is being initiated. (3/3)#Honourandduty #WBP pic.twitter.com/ucHCZTLFvk — West Bengal Police (@WBPolice) February 20, 2024 అయితే సువేందు అధికారి నేతృత్వంలో నిరసనకారులు సందేశ్‌ఖాలీని సందర్శించేందుకు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణలో, నిరసనకారులలో ఒకరు సంఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ పోలీసు అధికారిని ‘ఖలిస్తానీ’ అని పిలిచినట్లు తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన అధికారి ‘నేను తలపాగా వేసుకున్నాను, అందుకే నన్ను ఖలిస్తానీ అంటారా? దీనిపై నేను చర్య తీసుకుంటాను. మీరు నా మతంపై దాడి చేయలేరు. మీ మతం గురించి నేను ఏమీ చెప్పలేదు" అని అధికారి చెబుతున్నట్లు వీడియోలో వినిపిస్తోంది. -
పోలీసు అధికారిపై అనుచిత వ్యాఖ్యలు.. సీఎం మమతా ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఓ పోలీసు ఉన్నతాధికారిపై బీజేపీ నిరసనకారుడు కార్యకర్త చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేత సువేందు అధికారి సందేశ్‌ఖాలీలో పర్యటించటం కోసం బీజేపీ కార్యకర్తలతో బయలుదేరారు. దీంతో అక్కడ నిషేదాజ్ఞలు ఉన్నాయని పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసుల్లో.. ఉన్నతాధికారిగా ఒక సిక్కు అధికారి ఉన్నాడు. దీంతో బీజేపీ కార్యకర్తల్లో ఒకరు ఆయన్ను ‘ఖలిస్థానీ’ అంటూ అరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Today, the BJP's divisive politics has shamelessly overstepped constitutional boundaries. As per @BJP4India every person wearing a TURBAN is a KHALISTANI. I VEHEMENTLY CONDEMN this audacious attempt to undermine the reputation of our SIKH BROTHERS & SISTERS, revered for their… pic.twitter.com/toYs8LhiuU — Mamata Banerjee (@MamataOfficial) February 20, 2024 ఈ వీడియోపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ (ట్విటర్) వేదికగా మండిపడ్డారు. ‘ఈ రోజు బీజేపీ పార్టీ వేర్పాటువాద రాజకీయాలకు తెరలేపటం సిగ్గుచేటు. ఈ ఘటనతో బీజేపీ రాజ్యాంగంలోని అన్ని పరిధిలు దాటింది. బీజేపీ వాళ్ల దృష్టితో టర్బన్ ధరించిన ప్రతి సిక్కు వ్యక్తి.. ‘ఖలిస్థానీ’. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. బీజేపీ వాళ్లు సిక్కు సోదరసోదరీమనులను అవమానపరిచారు. వారి త్యాగాలను కించపరిచారు. తాము బెంగాల్ సామాజిక శ్రేయస్సుకు కట్టుబడి ఉంటాం. బెంగాల్ సామాజిక సామరస్యాన్ని భంగం కలిగించేవారిపై చట్టబద్దమైన కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ ఘటనపై సదరు పోలీసు ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడారు. ‘నేను టర్బన్ ధరించింనందుకు నన్ను ‘ఖలిస్థానీ’ అని బీజేపీ కార్యకర్తలు అన్నారు. నేను వారిపై చర్యలు తీసుకుంటా. తన మతంపై ఎవరూ దాడి చేయడానికి వీలు లేదు. నేను ఇతరుల వారి మతంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు’ అని పేర్కొన్నారు. చదవండి: Sandeshkhali: బెంగాల్ సర్కార్‌పై హైకోర్టు సీరియస్ -
ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం వేళ దేశ రాజధానిలో ఖలిస్థానీల రాతలు కలకలం రేపుతున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడిన వేళ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు వెలువడ్డాయి. ఔటర్ ఢిల్లీ చందర్ విహార్ ప్రాంతంలోని గోడలపై ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు రాయడం కనిపించింది. రిపబ్లిక్ డేగా రోజు జనవరి 26న ఢిల్లీలో ఖలిస్తానీ జెండాను ఎగురవేయాలని పన్నూన్ హెచ్చరించారు. ఆయన హెచ్చరిక వీడియో విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో చంద్ర విహార్ ప్రాంతంలోని గోడలపై ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు రాశారని వర్గాలు తెలిపాయి. ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నినాదాలు చేశారు. రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఢిల్లీలోని తన స్లీపర్ సెల్స్ ద్వారా పన్నూ ఇటువంటి కార్యకలాపాలను ప్రేరేపిస్తున్నాడని వర్గాలు తెలిపాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు కూడా పన్నన్ బెదిరింపులు జారీ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున మాన్‌పై దాడి చేయాలని గ్యాంగ్స్టర్లకు పిలుపునిచ్చాడని వర్గాలు తెలిపాయి. అయితే.. ఢిల్లీలో గోడలపై రాసిన నినాదాలను పోలీసులు తుడిచేసి కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ మరోసారి బెదిరింపులు -
నిజ్జర్ హత్య కేసులో ఇద్దరి అరెస్టుకు రంగం సిద్ధం?!
ఒట్టావా: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో పురోగతి చోటు చేసుకుందా?. ఈ కేసుకు సంబంధించి.. ఇద్దరు వ్యక్తులను కెనడా పోలీసులు అరెస్టు చేయనున్నారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల నిఘాలో ఉన్నారని సమాచారం. నిజ్జర్ హత్య తర్వాత హంతకులు కెనడాను విడిచిపెట్టలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెలల తరబడి పోలీసుల నిఘాలో ఉన్నారని తెలుస్తోంది. కెనడా సర్రేలోని గురుద్వారాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌ను ఈ ఏడాది జులై 18న గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. ఇది కాస్త భారత్-కెనడా వివాదంగా మారిపోయింది. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరైన విషయం కాదని తెలిపింది. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తుకు భారత్ బాధ్యత వహించాలని కెనడా డిమాండ్ చేసింది. ప్రపంచ దేశాల నుంచి భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం కూడా చేసింది. ఇరుదేశాలు వీసాలపై నిబంధనలు విధించుకునే స్థాయికి వెళ్లాయి. ఇటీవలే కెనడా వీసాల రద్దును భారత్ సడలించింది. ఇదీ చదవండి: హైదరాబాద్ నుంచే అయోధ్య రామ మందిర తలుపులు -
అదే రోజున పార్లమెంట్‌పై దాడి..! భారత్‌కు పన్నూ బెదిరింపులు
ఢిల్లీ: సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్‌కు మరోసారి హెచ్చరికలు చేశాడు. డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగి 22 ఏళ్లు నిండడం గమనార్హం. అమెరికాలో భారత్ చేపట్టిన తన హత్య కుట్ర విఫలమైందని పేర్కొంటూ పన్నూ ఓ వీడియోను విడుదల చేశాడు. 'ఢిల్లీ బనేగా ఖలిస్తాన్' (ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుంది) అనే శీర్షికతో 2001 పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు పోస్టర్‌ను వీడియోలో పన్నూ ప్రదర్శించాడు. తనను చంపడానికి భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని పన్నూన్ పేర్కొన్నాడు. డిసెంబరు 13 లేదా అంతకంటే ముందు పార్లమెంటుపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తూ వీడియోను విడుదల చేశాడు. ఈనెల 2 నుంచి డిసెంబర్ 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పన్నూ బెదిరింపులకు పాల్పడటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భారత వ్యతిరేక విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన కే-2 (కశ్మీర్-ఖలిస్థాన్) విభాగం పన్నూకి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ ఇటీవల పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నికిల్ గుప్తాతో భారతీయ ఏజెన్సీకి చెందిన ఉద్యోగితో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. పన్నూను హత్య చేయడానికి గుప్తాను కిరాయికి మాట్లాడుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు ఆరోపించాయి. ఇదీ చదవండి: పార్ట్ టైమ్ జాబ్ మోసాలు.. 100 వెబ్సైట్లపై కేంద్రం నిషేధం -
ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే మృతి
పాకిస్తాన్లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే(72) మృతి చెందాడు. ఆయన నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్(కేఎల్ఎఫ్)తో పాటు ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్‌కు చీఫ్. లఖ్బీర్ గుండెపోటుతో మృతి చెందాడు. లఖ్బీర్ సింగ్ రోడే.. ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు. భారత్ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు, అకల్ తఖ్త్ మాజీ నేత జస్బీర్ సింగ్ రోడే.. లఖ్బీర్ మరణాన్ని ధృవీకరించారు. లఖ్బీర్ సింగ్ రోడేకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వారు కెనడాలో నివసిస్తున్నారు. లఖ్బీర్ సింగ్ రోడే భారతదేశంలోని పంజాబ్‌లోని మోగా జిల్లాలోని రోడే గ్రామంలో ఉండేవాడు. భారతదేశం నుండి దుబాయ్‌కి పారిపోయాడు. తరువాత దుబాయ్ నుండి పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. తన కుటుంబాన్ని కెనడాలో ఉంచాడు. 2002లో 20 మంది టెర్రరిస్టులను భారత్‌కు అప్పగించేందుకు పాక్‌కు భారత్ ఒక జాబితాను అందజేసింది. అందులో లఖ్బీర్ సింగ్ రోడే పేరు కూడా ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం లఖ్బీర్ సింగ్ రోడే తన అంతర్జాతీయ సిక్కు యూత్ ఫెడరేషన్ శాఖలను బ్రిటన్, జర్మనీ, కెనడా,అమెరికాతో సహా అనేక ప్రాంతాలలో ప్రారంభించాడు. భారత్‌కు అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పంపినట్లు రోడేపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత? -
పన్నూ హత్య కుట్ర కేసుపై అమెరికా సీరియస్
న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమార్చాలనే కుట్రలో భారతీయ పౌరుడి ప్రమేయం ఉందనే ఆరోపణలపై వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ తాజాగా స్పందించారు. ఈ అంశాన్ని అమెరికా చాలా తీవ్రంగా తీసుకుందని చెప్పారు. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొంటూనే తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. “అమెరికాకు భారతదేశం వ్యూహాత్మక భాగస్వామి. ఆ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసును మాత్రం మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ ఆరోపణలపై సీరియస్‌గా దర్యాప్తు చేపడతాం” అని వైట్ హౌస్ ఉన్నత అధికారి జాన్ కిర్బీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నికిల్ గుప్తాకు భారతీయ ఏజెన్సీకి చెందిన ఉద్యోగితో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. పన్నూను హత్య చేయడానికి గుప్తాను కిరాయికి మాట్లాడుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయి. పన్నూ హత్య కుట్ర కేసులో భారత్ కూడా దర్యాప్తుకు ఓ కమిటీని ఏర్పాటు చేయడంపై జాన్ కిర్బీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని భారత్ కూడా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేయించడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ కేసులో దోషులను నిష్పక్షపాతంగా గుర్తించి శిక్షించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: సీరియస్‌గా తీస్కోండి.. మళ్లీ భారత్‌పై కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు -
‘న్యూయార్క్‌లో హత్యకు కుట్ర పన్నింది ఆ భారతీయుడే’!
అమెరికాలో నివసిస్తున్న ఒక సిక్కు వేర్పాటువాది హత్యకు భారత్ నుంచే కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ ఒక ప్రకటనలో ఆరోపించింది. అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నిఖిల్ గుప్తాపై నేరం రుజువైతే, అతనికి గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాగా ఈ ఆరోపణలపై అమెరికా నుంచి అందిన ఇన్‌పుట్‌పై విచారణ జరుపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడానికి నవంబర్ 18న భారత ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అందించే వివరాల ఆధారంగా భారత ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టనుంది. ఇదిలాఉండగా నవంబర్ 20న గురుపత్వంత్ సింగ్ పన్నుపై జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. ఎయిరిండియాలో ప్రయాణించే వ్యక్తులను భయాందోళనకు గురిచేసేలా పన్నూ సోషల్ మీడియా సందేశాలను జారీ చేశారని ఎన్ఐఏ ఆరోపించింది. ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్ ఇండియాలో ప్రయాణించేవారు ప్రమాదంలో ఉన్నారని పన్నూ సందేశం పంపాడు. నవంబర్ 19న ఎయిరిండియాకు అనుమతి ఇవ్వబోమని కూడా ఆయన పేర్కొన్నాడు. కాగా దీనికిముందు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే కెనడా ఆరోపణలన్నింటినీ భారత ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. కెనడాతో భారత ప్రభుత్వ దౌత్యపరమైన వివాదం ముగిసిన రెండు నెలల తర్వాత ఇప్పుడు అమెరికా న్యాయ శాఖ ఈ ప్రకటన వెలువరించడం విశేషం. నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్‌కు హర్దీప్ సింగ్ నిజ్జర్ చీఫ్. భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్న ఇతను ఈ ఏడాది జూన్‌లో హత్యకు గురయ్యాడు. ఇతని హత్యపై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని భారత్ అభివర్ణించింది. దీనికి సంబంధించిన ఆధారాలను అందించాలని భారత ప్రభుత్వం కెనడాను కోరింది. అయితే కెనడా ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు అందించలేదు. ఇది కూడా చదవండి: కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం -
భారత్ కీలక నిర్ణయం.. కెనడియన్లకు వీసా పునరుద్ధరణ
ఢిల్లీ: జీ20 వర్చువల్ సమావేశం నిర్వహించడానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు ఎలక్ట్రానిక్ వీసా సేవలను పునరుద్ధరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు రెండు నెలల తర్వాత వీసా సేవలను ప్రారంభించడం గమనార్హం. ఈ చర్యతో పర్యటక వీసాతో పాటు కెనడాకు అన్ని రకాల వీసాలను పునరుద్దరించినట్లయింది. కెనడాకు వ్యాపర, మెడికల్ వీసా సేవలను భారత్ గత నెలలోనే ప్రారంభించింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు వివాదంలో సెప్టెంబర్ 21న కెనడాకు భారత్ వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించాడు. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ట్రూడో ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ అంశంపై ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. ఇరుదేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఇరుదేశాలు దౌత్య వేత్తలను సమాన సంఖ్యలో ఉంచాలని భారత్ డిమాండ్ చేసింది. ఎక్కువ సంఖ్యలో ఉన్న కెనడా దౌత్య వేత్తలను ఉపసంహరించుకోవాలని గడువు కూడా విధించింది. ఈ వివాదంలో భాగంగానే భారత్ నుంచి కెనడా 41 మంది దౌత్య వేత్తలను కూడా ఉపసంహరించుకుంది. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తుకు సహకరించేలా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చెసింది కెనడా. పశ్చిమాసియా దేశాల పర్యటనల్లోనూ ట్రూడో ఈ అంశాన్ని లేవనెత్తారు. ట్రూడో వ్యాఖ్యలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఇటీవల యూకే వేదికగా జరిగిన ప్రపంచ స్థాయి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ అంశంపై స్పందించారు. నిజ్జర్ కేసులో దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదు.. కానీ ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. నిరాధారమైన ఆరోపణలతో దర్యాప్తు కోరకూడదని చెప్పారు. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
భారత్ నుంచి కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం నేపథ్యంలో భారత్ నుంచి 41 మంది దౌత్య వేత్తలను కెనడా ఉపసంహరించుకుందని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. కెనడా ప్రతీకార చర్యలకు పాల్పడబోదని ఆమె వెల్లడించారు. కెనడా దౌత్యవేత్తలు భారత్‌ను వీడకపోతే శుక్రవారం ఏకపక్షంగా వారి అధికారిక హోదాను రద్దు చేస్తామని భారత్ బెదిరించిందని జోలీ చెప్పారు. ఈ చర్యతో భారత్ దౌత్య సంబంధాలపై కుదుర్చుకున్న వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. భద్రతపై ఆందోళనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో భారత్ నుంచి దౌత్యవేత్తలను తరలించామని జోలి చెప్పారు. దౌత్యపరమైన విధానాలను నాశనం చేయాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడా దౌత్యవ్యవస్థ ఉండబోదని తెలిపారు. అందుకే తాము ప్రతిచర్యకు పాల్పడటం లేదని తెలిపారు. 41 మంది దౌత్యవేత్తలు వారిపై ఆధారపడిన 42 మంది సభ్యులను భారత్ నుంచి తరలించామని తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో భారత్-కెనడా మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదంలో ఇరుదేశాలు దౌత్యపరమైన ఆంక్షలు కూడా విధించుకున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ మండిపడింది. ఈ పరిణామాల అనంతరం భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కేంద్రం కోరింది. అక్టోబర్ 10 నాటికి ఉపసంహరించుకోవాలని గడువును కూడా విధించింది. ఇదీ చదవండి: రష్యా, హమాస్ ఒకటే: బైడెన్ -
నిజ్జర్ హత్య కేసు: 'కెనడా ఆరోపణల్లో ఎలాంటి వివాదం లేదు'
న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కెనడా ఆరోపణల్లో ఎలాంటి వివాదం కనిపించట్లేదని ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (ASIO) డైరెక్టర్ మైక్ బర్గెస్ అన్నారు. కాలిఫోర్నియాలోని ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ భాగస్వాముల చారిత్రాత్మక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక దేశ పౌరుని హత్య విషయంలో మరో దేశం జోక్యం చేసుకోవడం తీవ్రమైన అంశమని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలకు ఏ దేశం పాల్పడకూడదని చెప్పారు. భారత ఏజెంట్ల తర్వాతి లక్ష్యం ఆస్ట్రేలియానేనా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. అలా అని తాను ఊహించలేనని చెప్పారు. కెనడాలో జరిగిన విషయం ఆస్ట్రేలియా వరకు వస్తుందని చెప్పలేమని అన్నారు. ఇతర దేశ ప్రభుత్వం తమ దేశంలో జోక్యం చేసుకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులకు పాల్పడుతున్న అతివాదులకు భారత్ నుంచి ముప్పు ఉంటుందని భావిస్తున్నారా..? అని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. అది వారినే అడగాలని దాటవేశారు. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపించారు. తమ దేశ పౌరుని హత్యలో ఇతర దేశ ప్రమేయం తగదని హెచ్చరికలు చేసింది. ఇది ఇరుదేశాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలతోపాటు వీసా రద్దు వంటి కఠిన చర్యలు తీసుకున్నాయి. ఈ కేసు విచారణలో భారత్ సహకరించేలా ఒప్పించేట్లు ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా కెనడా చేసింది. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని భారత్ వాదించింది. ఇదీ చదవండి: పాలస్తీనాకు మద్దతుగా అమెరికాలో ఆందోళనలు -
హర్దీప్ నిజ్జర్ హత్య వెనుక చైనా హస్తం? భారత్‌పై నిందకు కుట్ర?
అమెరికాలో నివసిస్తున్న చైనీస్ బ్లాగర్, జర్నలిస్ట్ జెన్నిఫర్ జెంగ్ తన సంచలన వాదన వినిపించారు. కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీసీ) హస్తం ఉందని ఆరోపించారు. ఈ విధంగా చేయడం వెనుక చైనా లక్ష్యం.. భారతదేశం- పశ్చిమ దేశాల మధ్య వైషమ్యాలను సృష్టించడమేనని ఆ బ్లాగర్ పేర్కొన్నాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియోలో హర్దీప్ నిజ్జర్‌ను సీసీసీ ఏజెంట్లు హత్య చేశారని జెంగ్ ఆరోపించారు. 2023, జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా పార్కింగ్ స్థలంలో ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్‌ను తపాకీతో కాల్చిచంపారు. కాగా జీ-20 సమ్మిట్ నుండి కెనడాకు తిరిగి వచ్చిన తరువాత, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. నిజ్జర్ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. పలు దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. ఈ బ్లాగర్ తన వీడియోలో నిజ్జర్ హత్యకు ముందు సీసీసీ తన ఉన్నత అధికారులలో ఒకరిని అమెరికాలోని సీటెల్‌కు పంపిందని పేర్కొన్నారు. అక్కడ రహస్య సమావేశం జరిగిందన్నారు. భారతదేశం- పశ్చిమ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే ఈ సమావేశం లక్ష్యమని పేర్కొన్నారు. కెనడాలో సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సీసీసీ ఏజెంట్లదే బాధ్యత అని బ్లాగర్ జెంగ్ పేర్కొన్నారు. జూన్ 18న సీసీసీ ఏజెంట్లు తుపాకీలతో నిజ్జర్‌ను వెంబడించారని బ్లాగర్ పేర్కొన్నారు. వారు అతనిని కాల్చి చంపిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి నిజ్జర్ కారు డాష్‌బోర్డ్‌లో అమర్చిన కెమెరాను పగలగొట్టారని అన్నారు. హంతకులు ఉద్దేశపూర్వకంగానే భారతీయ యాసతో ఇంగ్లీషులో మాట్లాడారని కూడా జెంగ్ ఆరోపించారు. సీసీసీ రహస్య ఏజెంట్లు భారతదేశాన్ని చిక్కుల్లో పడేసే ప్రణాళికలో భాగంగానే ఈ పని చేశారని బ్లాగర్ ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) ఈ వీడియోలో పోస్ట్ చేయగా, జెన్నిఫర్ జెంగ్ ఆరోపణలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి! Exclusive: #CCP Kills #Sikh Leader #Nijjar in #Canada To Frame #India, as Part of “#IgnitionPlan" to Disrupt Worldhttps://t.co/cZOalFxZfE#HardeepSinghNijjar, #assassination, #IndiaCanadaRelations, #ChinaIndiaRelations #IsraelPalestineWar pic.twitter.com/RD240btPbU — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) October 8, 2023 -
భారత్‌ను వీడిన కెనడా దౌత్యవేత్తలు
ఢిల్లీ: భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కేంద్రం కోరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కెనడా స్పందించింది. తమ దౌత్య వేత్తలను భారత్ నుంచి ఖాలీ చేయించింది. సింగపూర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు పరిణామాల అనంతరం దౌత్యవేత్తల సంఖ్యను సమానంగా ఉంచాలని భారత్ కోరిన నేపథ్యంలో కెనడా ఈ మేరకు చర్యలు తీసుకుంది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య వేత్తలను దాదాపు 40 మంది వరకు బయటకు పంపించాలని భారత్ కెనడాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇరుదేశాల్లో దౌత్య వేత్తలు సమాన సంఖ్యలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్టోబర్ 10 నాటికి చివరి గడువును విధించింది. అప్పటికీ ఖాలీ చేయకపోతే.. రక్షణను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్ ఘాటుగా స్పందించింది. అయితే.. కెనడా దౌత్య వేత్తలు ఎంత మంది భారత్‌ను వీడారనేది మాత్రం స్పష్టంగా తెలియదు. కానీ వారిని మాత్రం సింగపూర్‌కు తరలించినట్లు కెనడాకు చెందిన ఓ మీడియా కథనం వెల్లడించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ట్రూడో వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడింది. అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. భారత్ కెనడా వీసాలను రద్దు చేసింది. అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: ఎన్నికల ముందు ఉచితాలు.. ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు -
వరల్డ్ కప్ ముందు ఖలిస్థాన్ నినాదాలు.. పోలీసులు అలర్ట్
ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై దుండగులు ఖలిస్థాన్ నినాదాలు రాశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వచ్చే నెలలో క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఐదు మ్యాచ్‌లు ధర్మశాలలో జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023కి భారత్ ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెలలో ధర్మశాలలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రికెట్ టీమ్‌లు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' అంటూ అల్లరిమూకలు నినాదాలు రాశారు. ఈ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జల్ శక్తి డిపార్ట్మెంట్ గోడలపై స్పే పేయింటింగ్ ద్వారా దుండగులు నినాదాలు రాశారని కాంగ్రా ఎస్పీ షాలినీ అగ్నిహోత్రి తెలిపారు. పోలీసు బృందాలు అక్కడి వెళ్లి గోడలకు మళ్లీ పేయింటింగ్ వేసినట్లు కూడా వెల్లడించారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కెనడా-భారత్ మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు కెనడాలో పెరిగిపోతున్నాయి. ఇటు ఇండియాలోనూ అల్లరిమూకలు ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ ఎక్కడపడితే అక్కడ గోడలపై నినాదాలు రాస్తున్నారు. అదీగాక వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో తాజా అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇదీ చదవండి: భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అందుకు తగ్గట్టుగానే అప్పు కూడా.. -
భారత్ తప్పించుకోగలదా?
ఖలిస్థానీ సానుభూతిపరుడు, నిషేధిత ‘ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్’ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణ అత్యంత వివాదాస్పదం అయింది. ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలోని ఓ గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు నిజ్జర్ని కాల్చి చంపిన నేపథ్యంలో... భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చనేందుకు ‘విశ్వసనీయమైన ఆరోపణలు’ ఉన్నాయని ట్రూడో గత నెలలో తమ పార్లమెంటులో ప్రకటించారు. దరిమిలా ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు క్రమంగా దెబ్బతింటూ వచ్చాయి. ఈ పరిణామాలను అమెరికాపై దృష్టిని కేంద్రీకరించి చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ దేశ స్పందన మనకు అత్యంత కీలకం కాబట్టి! జస్టిన్ ట్రూడో (కెనడా ప్రధానమంత్రి) ఆరోపణలపై మన ప్రభుత్వ ప్రతిస్పందనను నేను విశ్వసిస్తున్నప్పటికీ, ఒక జర్నలిస్టుగా కొన్ని ప్రత్యేకమైన వాస్తవాలను కూడా మన మది పరిగణనలోకి తీసుకోవాలేమోనని నా ఆలోచన. అయితే ఆ వాస్తవాలు అవసరమైనంత మేర కైనా నివేదనకు వచ్చాయని నేను అనుకోవడం లేదు. కొన్నిసార్లు అవి ఉద్దేశపూర్వకమైన విస్మ రణకు కూడా గురయ్యాయి. అందువల్ల వాటిని మీ దృష్టికి తీసుకురావడం నా కర్తవ్యంగా భావిస్తూ, ముగింపును మాత్రం మీకే వదిలేస్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయంతో మిమ్మల్ని ప్రభావితం చేయడం నాకు ఇష్టం లేదు. మొదటిది– ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఈ ఆరోపణలను లేవనెత్తి ‘‘ఆందోళన వ్యక్తం చేసినట్లు’’ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ రాసింది. యూఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ ‘‘అత్యున్నత స్థాయుల్లో ఈ అంశంపై చర్చ జరిగింది,’’ అని చెప్పినప్పుడే ఆయన ఈ ‘‘అందోళన వ్యక్తం అవడాన్ని’’ ధ్రువీకరించి ఉండొచ్చు. భారత్‌పై కెనడా చేసిన ఈ ఆరోపణలను బైడెన్ ఎలా చూస్తున్నారన్న విషయమై ఇది మనకు ఏం చెబుతోంది? గట్టి సాక్ష్యాలు ఉన్నాయా? రెండవది– కెనడాలోని అమెరికన్ రాయబారి ఒకటీ లేదా అంతకన్నా ఎక్కువ ‘పంచనేత్ర నిఘా కూటమి దేశాలు’ (ఫైవ్–ఐస్ కంట్రీస్: యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా) రహస్య సమాచారాన్ని అట్టావా (కెనడా రాజ ధాని)తో పంచుకున్నట్లు రూఢి పరిచారు. వాటిలో ఒక దేశం యూఎస్ఏ అని ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ఆ పత్రిక ఇంకా ఇలా రాసింది: ‘‘చూస్తుంటే కెనడా దగ్గర ‘పొగలు గక్కే తుపాకీ’ (వివాదానికి తావులేని సాక్ష్యం) ఉన్నట్టు కన బడుతోంది. ఆ దేశంలోని భారతీయ దౌత్యవేత్తల సమాచార వ్యవస్థలోకి చొరబడటం అన్నది పన్నాగంలో (వారికి) ప్రమేయం ఉందన్న సంకే తాలను ఇస్తోంది.’’ ఈ చొరబాట్లు ఏం చెబు తున్నాయి? అవి నిజంగానే పొగలు గక్కుతున్న తుపాకీతో సమానమైనవా? మూడవది – ఆరంభంలో జేక్ సల్లివాన్, ఆ మర్నాడు యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్: ‘‘మేమే మా కెనడియన్ సహోద్యోగులతో చాలా దగ్గరగా సంప్రదింపులు జరుపుతున్నాం. కేవలం సంప్రదింపులు మాత్రమే కాదు, ఈ అంశంపై వారితో సమన్వయం చేసుకుంటున్నాం’’ అని ప్రకటించారు. అంటే ఏమిటి? కెనడా దగ్గర ఉన్న సమాచారం ఎలాంటిదో మాత్రమే కాదు,అందులోని నాణ్యత ఎంతటిదో కూడా వాషింగ్టన్కు అవగాహన ఉందని ఇది సూచిస్తోందా? నాల్గవది – ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బ్లింకెన్, ‘‘ఈ పరిశోధనలో కెనడాతో కలిసి ఇండియా పని చేయడం చాలా ముఖ్యం. దీనికి బాధ్యులెవరో చూడాలనుకుంటున్నాం. దర్యాప్తు దానికై అదే జరిగి, ఫలితం వైపునకు దారి తీయాలి’’ అన్నారు. ఆయన అలా అన్నది ఒక పత్రికా సమావేశంలో అయినప్పటికీ అది న్యూఢిల్లీకి ఒక సందేశం అనుకోవాలా? ఐదవది – ‘‘ఇలాంటి చర్యలకు మీకు కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులేమీ ఉండవు. దేశంతో నిమిత్తం లేకుండా మేము గట్టిగా నిలబడి, మా ప్రాథమిక సూత్రాలను కాపాడుకుంటాం’’ అని సల్లివాన్ అనడం చూస్తుంటే, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరిది అబద్ధం? ఆరవది–కెనడా జాతీయ భద్రతా సలహాదారు జోడీ థామస్... కెనడా ఇంటెలిజెన్స్ సర్వీసెస్ హెడ్‌తో కలిసి ఆగస్టులో నాలుగు రోజులు, సెప్టెంబరులో ఐదు లేదా ఆరు రోజులు ఢిల్లీలో ఉండి, భారత నిఘా సంస్థలకు సమాచారం అందించినట్లు కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్ల డించింది. అయితే భారత ప్రతినిధి మాత్రం... ‘‘కెనడా అప్పుడు గానీ, ఇప్పుడుగానీ, ఎప్పుడూ గానీ తమతో ఎటువంటి నిర్దిష్ట సమాచారాన్ని పంచుకోలేదు’’ అని పేర్కొన్నారు. మరి అలాంటి సమాచారం ఏదీ లేకుంటే జోడీ థామస్ భారత దేశంలో పది రోజుల పాటు ఎందుకు గడిపినట్లు? ఏడవది– మన భారత ప్రతినిధి అరిందమ్ బాగ్చి కెనడాను... ‘‘ఉగ్రవాదులకు, తీవ్రవాదు లకు, వ్యవస్థీకృత నేరాలకు సురక్షితమైన స్వర్గ ధామం’’ అని పేర్కొన్నారు. ఆ మాటలు సాధార ణంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి వాడుతుంటారు. అలాంటిది తమ నాటో మిత్రపక్షం, జీ–7 సభ్య దేశం, మరీ ముఖ్యంగా సన్నిహిత, సాంస్కృతిక పరిచయాలు కలిగిన తమ పొరుగు దేశం అయిన కెనడా గురించి ఇండియా అలా అనడాన్ని అమెరికా ఎలా చూస్తుంది? అమెరికా వైఖరి కీలకం ఎనిమిదవది– అట్లాంటిక్‌కు ఇరు వైపులా ఉన్న అనేక ఆంగ్ల భాషా వార్తాపత్రికలు భారతదేశం ఇలా ఎలా మారిందీ అని ప్రశ్నల్ని లేవదీశాయి. ఉదాహరణకు, ‘ది అబ్జర్వర్’ పత్రిక ‘‘స్వదేశంలో, విదేశాలలో మోదీ ప్రభుత్వ విధానం ప్రజా స్వామ్యం పట్ల ఆ దేశ నిబద్ధత, భాగస్వామ్య దేశంగా తన విశ్వసనీయతల పైన సందేహాలను లేవనెత్తుతోంది’’ అని రాసింది. ‘న్యూయార్క్ టైమ్స్’ కాలమిస్ట్ నికోలస్ క్రిస్టోఫ్ పాకిస్తాన్ పాలకుడు జనరల్ జియాతో మోదీని పోల్చారు. ‘ది ఎకనామిస్ట్’ నిర్మొహమాటంగా ‘‘ఇది కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం’’ అని పేర్కొంది. మన దేశం గురించి ఇలాంటి వ్యాఖ్య లన్నిటికీ మనం ఎలా స్పందించాలి? చివరిగా– ఒక అధికారిక ప్రకటనలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రూడో ఆరోపణలను ‘‘పూర్తిగా తిరస్కరించింది’’. వాటిని ‘‘అసంబద్ధము, ప్రేరణపూరితమూ అయినవి’’గా పేర్కొంది. బైడెన్ గురించి మనకు తెలిసిన దానిని బట్టి... అలాగే సల్లివాన్, బ్లింకెన్‌ల ప్రకటనలను బట్టి చూస్తే అమెరికా ఈ ప్రతిస్పందనను అంగీ కరిస్తుందని అనుకోవచ్చా? ఇప్పుడు నేను అమెరికా పైననే నా దృష్టిని కేంద్రీకరించాను. ఎందుకంటే ఆ దేశ ప్రతిస్పందన చాలా ముఖ్యమైనది. భారత్ కేవలం ఆరోపణలను మాత్రమే ఎదుర్కొంటుండగా, బ్లింకెన్ అంటున్న ‘అంతర్జాతీయ అణచివేత’లో దోషి కచ్చితంగా అమెరికానే అని నాకు తెలుసు. అయినప్పటికీ అమెరికా దీని నుంచి పదే పదే తప్పించుకుంటూ వచ్చింది. భారత్ కూడా అలా తనపై వచ్చిన ఆరో పణల నుంచి తప్పించుకోగల స్థితిలో ఉందా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సన్నిహిత సంబంధాలకే మొగ్గు: ట్రూడో
టొరంటో: ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారి, ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌తో సన్నిహిత సంబంధాలను మెరు గుపర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. అదేసమయంలో, ఖలిస్తాన్ వేర్పాటువాది నిజ్జర్ హత్య ఘటనకు సంబంధించిన వాస్తవాల వెల్లడిలో సహకారానికి భారత్ ముందుకురావాలని కోరారు. భారత్‌పై బలమైన ఆరోపణలున్నప్పటికీ సన్నిహితంగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. మాంట్రియల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచ వేదికపై కీలకంగా మారిన భారత్‌తో కెనడా, మిత్ర దేశాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందని భావిస్తున్నా. ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ అంతర్జాతీయ రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషిస్తోంది. అందుకే భారత్‌తో సన్నిహిత సంబంధాల కొనసాగింపునకు కట్టుబడి ఉన్నాం’అని చెప్పారు. అదే సమయంలో చట్టపాలన కలిగిన దేశంగా, నిజ్జర్ హత్యకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు భారత్ తమతో కలిసి పని చేయాలని భావిస్తున్నామన్నారు. భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో వాషింగ్టన్లో జరిగే సమావేశంలో ఇదే విషయాన్ని బ్లింకెన్ ప్రస్తావిస్తారని కూడా బైడెన్ ప్రభుత్వం చెప్పిందన్నారు. -
భారత్-కెనడా వివాదం: జైశంకర్, బ్లింకెన్ కీలక సమావేశం
న్యూయార్క్: భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో గురువారం భేటీ కానున్నారు. భారత్-కెనడా మధ్య వివాదం కొనసాగుతున్న వేళ వీరి సమావేశం ప్రధాన్యత సంతరించుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో ఇరుదేశాల మధ్య చెలరేగిన వివాదం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీ వెనక ఉన్న ఉద్దేశాన్ని మాత్రం వెల్లడించలేదు అధికార వర్గాలు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందా..? ప్రశ్నించినప్పుడు.. ఈ వ్యవహారంలో కెనడాకు సహకరించాలని భారత్‌ను ఇప్పటికే కోరినట్లు యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. కెనడా, భారత్ రెండు దేశాలు సహకరించుకోవాలని విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. భారత్‌తో సంబంధాలు పెంచుకోనున్న నేపథ్యంలో నిజ్జర్ హత్య కేసులో కెనడాకు అమెరికా మద్దతుగా నిలవడంలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. నిరాధారమైన ఆరోపణలను భారత్ ఖండించింది. అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా అడుగులు వేశాయి. ఈ కేసులో భారత్‌పై ఒత్తిడి పెంచడంలో అమెరికా విఫలమైందనే ఆరోపణలు కూడా వచ్చాయి. భారత్‌తో సంబంధాలు పెంచుకునే నేపథ్యంలోనే కెనడాను పక్కకు పెడుతోందని వాదనలు వెలువడ్డాయి. ఈ క్రమంలో భారత్ దర్యాప్తుకు సహకరించాలని అమెరికా కోరింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు హాజరైన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్.. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి బ్లింకెన్‌తో అనధికారికంగా ఇప్పటికే ఒకసారి కలిశారు.కానీ కెనడా-భారత్ వివాదం చర్చకు రాలేదని తెలుస్తోంది. న్యూయార్క్‌లో జరిగిన క్వాడ్ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు రాలేదని మిల్లర్ తెలిపారు. ఇదీ చదవండి: చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్ దిష్టిబొమ్మ దహనం -
నిజ్జర్ హత్య వెనక ఐఎస్ఐ హస్తం..!
ఒట్టావా:కెనడా-భారత్ మధ్య వివాదానికి కారణమైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో పాకిస్థాన్ ఉగ్రసంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజ్జర్ హత్యతో భారత్-కెనడా మధ్య చెలరేగిన వివాదం పథకంలో భాగమనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. అయితే.. ఇటీవల కెనడాలో పాగా వేయాలనే ఐఎస్ఐ సంకల్పించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆ దేశంలో కొంత మంది ఉగ్రవాదులను కూడా దింపింది. వారికి సహకరించాలని ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్‌పై ఒత్తిడి చేసిందట. ఆయన ఐఎస్ఐ ఉగ్రవాదులకు సహకరించకుండా ఖలిస్థానీ మద్దతుదారుల వైపే మొగ్గు చూపారట. అందుకే నిజ్జర్‌ను హత్య చేశారనే అనుమానాలు వెల్లడవుతున్నాయి. తమకు సహకరించడానికి ఐఎస్ఐ మరో వ్యక్తిని వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖలిస్థానీ మద్దతుదారులకే మద్దతునిస్తున్నారని సమాచారం. ఇండియా-కెనడా వివాదం.. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు ఇండియా-కెనడా మధ్య వివాదానికి దారితీసింది. నిజ్జర్ హత్యలో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ ఖండించింది. ఈ పరిణామాల తర్వాత ఇరు దేశాలు ఆంక్షలను విధించుకున్నాయి. భారత్ వీసాలను కూడా రద్దు చేసింది. అటు.. దేశంలో ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి 78వ సర్వ సభ్య సమావేశంలోనూ ఈ అంశాన్ని భారత్ లేవనెత్తింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయరాదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? -
భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా
న్యూయార్క్: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై అమెరికా నెమ్మదిగా ఒత్తిడి పెంచుతోంది. ఈ కేసులో కెనడాకు సహకరించాలని ప్రైవేట్‌గా, బహిరంగంగా అభ్యర్థించామని స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయబద్ధంగా నిందితులను కోర్టులో హాజరుపరచాలని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కోరారు. కెనడా ఆరోపణలపై కలత చెందామని పేర్కొన్న ఆయన.. ఆ దేశంతో టచ్‌లో ఉన్నట్లు చెప్పారు. కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న US హౌస్ సభ్యుడు జిమ్ కోస్టా కూడా నిజ్జర్ హత్య కేసుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని కోరారు. బాధ్యులైనవారికి కఠిన శిక్షలు పడాలని అన్నారు. ఇందుకు భారత్ సహకరించాలని కోరారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ హెచ్చరికలతో పాటు కెనడాలో వీసాలను కూడా రద్దు చేసింది. కెనడా కూడా ఇప్పటికే తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇదీ చదవండి: ఇండియా-కెనడా వివాదం: అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రూడో -
ఇండియా-కెనడా వివాదం: అగ్గికి ఆజ్యం పోస్తున్న ట్రూడో
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ఇండియా-కెనడా మధ్య ఆంక్షల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కెనడా మరోసారి అగ్గికి ఆజ్యం పోస్తున్నట్లు తెలుస్తోంది. కెనడా పౌరులకు ప్రయాణ హెచ్చరికలను పునరుద్ధరించింది. ఇండియాలో ఉన్న కెనడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. కెనడా పట్ల భారత సోషల్ మీడియా వెబ్సైట్లలో నిరసన వైఖరికి సంబంధించిన పోస్టులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై భారత్ మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదని హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణ హెచ్చరికలతో పాటు కెనడాలో వీసాలను కూడా రద్దు చేసింది. కెనడా కూడా ఇప్పటికే తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ.. కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ హిందువులకు హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తిరిగి వెళ్లాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. భారత ఎంబసీ ముందు సిక్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్థానీ మద్దతుదారు సంస్థ నిరసనలు కూడా చేపట్టింది. ఈ పరిణామాలు వియన్నా కన్వెన్షన్ అంతర్జాతీయ ఒప్పందానికి విరుద్ధంగా ఉండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కెనడా, యూకే, అమెరికా సహా తదితర దేశాల్లో నివాసం ఉంటున్న దాదాపు 19 మంది ఖలిస్థానీ మద్దతుదారులను ఉగ్రవాదులుగా పేర్కొంటూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఖలిస్థానీ మద్దతుదారులకు సంబంధించిన భారత్‌లో ఉన్న ఆస్తులను స్వాధీనం కూడా చేసుకుంది. ఇదీ చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు? -
ఉర్దూస్తాన్, ఖలిస్తాన్..
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రత్యేక ఖలిస్తాన్ కోసం వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ పెద్ద ప్రణాళికలే రచించాడు. సంబంధిత వివరాలు ఉన్న భారత నిఘా వర్గాల నివేదిక ఈ విషయాలను వెల్లడిస్తోంది. ఆ నివేదికలోని వివరాలను ఓసారి గమనిస్తే ► మతాల ప్రాతిపదికన భారత్‌ను విడగొట్టాలి అనేది పన్నూ ప్రధాన ఎజెండా. ► ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్‌సహా పలు రాష్ట్రాల్లో పన్నూపై పలు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్న పన్నూపై భారత్‌లో చాలా రాష్ట్రాల్లో పదహారుకు పైగా కేసులు నమోదవడాన్ని బట్టి ఎస్ఎఫ్జే కార్యకలాపాలు ఇండియాలో ఎంతగా విస్తరించాయో అర్ధమవుతుంది. ► భారత భూభాగంలో ముస్లింల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటుచేయాలనేది పన్నూ ఆలోచన. దీనికి ‘ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దూస్తాన్’ అని పేరు కూడా ఖాయం చేసుకున్నాడు. ► దేశం నుంచి కశీ్మర్‌ను వేరుచేసేందుకు కశ్మీర్‌లోని ప్రజలను విప్లవకారులుగా తయారుచేయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకోసం భారత్ పట్ల వ్యతిరేకభావన ఉన్న ప్రాంతాల్లో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. కశీ్మర్లో అసంతృప్తితో రగిలిపోతున్న వారికి మరింత ఉద్రేకపరిచేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖలిస్తాన్ జెండా ఎగరేస్తానని పన్నూ గతంలో ప్రకటించాడు కూడా. అసలు ఎవరీ పన్నూ ? దేశ విభజన కాలంలో 1947లో పన్నూ కుటుంబం పాకిస్తాన్ నుంచి అమృత్సర్ దగ్గర్లోని ఖాన్కోట్ గ్రామానికి వలసవచి్చంది. అమృత్‌సర్‌లో పుట్టిన పన్నూ.. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పుచ్చుకున్నాడు. అమెరికాలో ఉంటున్న పన్నూ అక్కడే అటారీ్నగా పనిచేస్తున్నాడు. భారత్‌లో ఖలిస్తాన్‌ను ఏర్పాటుకు కృషిచేస్తున్న ఎస్ఎఫ్జే సంస్థకు న్యాయ సలహాదారుగా ఉంటున్నట్లు పన్నూ చెప్పుకుంటున్నాడు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సాక్ష్యాధారాలతో గుర్తించిన కేంద్ర హోం శాఖ పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. పన్నూ ప్రేలాపణలు.. భారత్‌లో ఖలిస్తాన్ వేర్పాటువాదంలో నిమగ్నమైన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తుంటాడని పన్నూపై ఆరోపణలు ఉన్నాయి. తాను చెప్పిన పనులు చేసినా భారీ బహుమతులు ఇస్తానని గతంలో బహిరంగ ప్రకటనలుచేశాడు. ఢిల్లీలోని ప్రఖ్యా త ఇండియాగేట్ వద్ద ఖలిస్తాన్ జెండా ఎగరేస్తే 25 లక్షల డాలర్లు ఇస్తానని పిలుపునిచ్చాడు. 2021లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ మువ్వన్నెల జెండా ఎగరేయకుండా ఎవరైనా పోలీసు అడ్డుకుంటే అతనికి 10 లక్షల డాలర్లు ఇస్తానని ప్రకటించాడు. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిన పన్నూపై ఎన్ఐఏ కోర్టు 2021 ఫిబ్రవరిలో నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. -
ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు?
కెనడాలో ఉంటున్న ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో విదేశాలలో ఇదేరీతిలో తలదాచుకున్న ఇతర ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను కోరింది. యుఎస్, యుకె, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులను గుర్తించాలని, వారు భారతదేశానికి తిరిగి రాకుండా వారి విదేశీ పౌరసత్వాన్ని (ఓసిఐ) రద్దు చేయాలని ప్రభుత్వం ఆ ఏజెన్సీలను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చండీగఢ్, అమృత్‌సర్‌లోని పన్నూన్ ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వాధీనం చేసుకున్న దరిమిలా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఫలితంగా భారతదేశానికి చెందిన ఈ ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందదని, అప్పుడు వారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా, బ్రిటన్, కెనడా, యూఏఈ, పాకిస్తాన్ తదితర దేశాల్లో పరారీలో ఉన్న 19 మంది ఖలిస్తానీ ఉగ్రవాదులను ప్రభుత్వం గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో కెనడా, యునైటెడ్ స్టేట్స్, పాకిస్తాన్లో నివసిస్తున్న 11 మందిని గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదులుగా భద్రతా సంస్థలు గుర్తించాయి. వీరిలో ఎనిమిది మంది అనుమానితులు కెనడాలోనే ఉన్నట్లు అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ జాబితాలో గ్యాంగ్స్టర్లు, ఉగ్రవాదుల పేర్లు ఉన్నాయి. పాకిస్తాన్లో హర్విందర్ సంధు అలియాస్ రిండా ఉన్నాడని భావిస్తున్నారు. లఖ్బీర్ సింగ్ అలియాస్ లాండా, సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖ దునాకే (మూడు రోజుల క్రితం హతమయ్యాడు), అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా, రమణదీప్ సింగ్ అలియాస్ రామన్ జడ్జి, చరణ్‌జిత్ సింగ్ అలియాస్ రింకూ బిహాలా, సనావర్ ధిల్లాన్, గుర్పిందర్ సింగ్ అలియాస్ బాబా డల్లా కెనడాలో ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ఇక అమెరికాలో గౌరవ్ పత్యాల్ లక్కీ, అన్మోల్ బిష్ణోయ్‌లు ఉన్నారనే అనుమానాలున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న తాజా చర్యలు ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డులతో విదేశాల్లో నివసిస్తున్న ఉగ్రవాదుల కార్యకలాపాలను అరికట్టడానికి సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వారు భారతదేశంలో ఉద్యమాలు చేపట్టి, యువతను తప్పుదారి పట్టించేందుకు అవకాశం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: భారత్- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? -
భారత్-కెనడా వివాదం:'అమెరికా దూరం'
న్యూయార్క్: భారత్-కెనడా వివాదంలో అమెరికా తలదూర్చకపోవచ్చని రాజకీయ వ్యూహ సంస్థ సిగ్నమ్ గ్లోబల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు చైర్మన్ చార్లెస్ మైయర్స్ చెప్పారు. కెనడా వివాదం కారణంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో ఏర్పరుచుకున్న సంబంధాలకు అమెరికా ఇబ్బంది కలిగించబోదని ఆయన అన్నారు. ఈ వ్వవహారంలో అంటీ అంటనట్లు ఉండవచ్చని అంచనా వేశారు. భారత్- కెనడా వివాదంలో ఇరుదేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా చెప్పింది. సమస్యను పరిష్కరించడానికి ఇరుదేశాలు సహకరించుకోవాలని కోరింది. ఈ అంశంలో భారత్ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. కానీ అమెరికా దాని మిత్రపక్షాలు ఈ అంశంలో భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించడం వంటి చర్యలు తీసుకోకుండా ఆగిపోయాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన -
ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో భారత దౌత్య అధికారుల హస్తం ఉందన్న విశ్వసనీయ సమాచారాన్ని ఇండియాకు తాము కొన్ని వారాల క్రితమే తెలియజేశామని అన్నారు. గత సోమవారం పార్లమెంట్లో మాట్లాడటం కంటే ముందే భారత్‌కు చెప్పామని స్పష్టం చేశారు. ఇండియాతో నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కోరుకున్నామని చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య అధికారుల ప్రమోయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. కెనడా పౌరుని హత్యలో భారత్ జోక్యం అంటూ మండిపడ్డారు. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టింది. ఇది రాజకీయ లాభం కోసం చేస్తున్న చర్యగా అభిప్రాయపడింది. ఆ తర్వాత ఇరుదేశాలు ఆంక్షలు విధించుకున్నాయి. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా నిఘా విభాగాలు ఎలాంటి ఆధారాలు సేకరించాయో బయటపెట్టాలని భారత్ కోరింది. కానీ కెనడా ఇప్పటివరకు ఆధారాలను వెల్లడించలేదు. ఇండియా జవాబుదారీగా ఉండాలి: అమెరికా ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ఆరోపణలపై భారత్ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. దర్యాప్తులో కెనడాకు సహకరించాలని ఇండియాకు పిలుపునిచ్చారు. ఈ అంశంలో భారత్, కెనడాతో సంప్రదింపులు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కెనడాలో సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యత..? -
Canada–India relations: అక్కడి నుంచే సమాచారం
టొరంటో: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా చేసిన ఆరోపణలకు ఫైవ్ ఐస్ నెట్వర్క్ అందించిన సమాచారమే ఆధారమని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి కెనడా ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని ఒక గురుద్వారాలో నిజ్జర్‌ను దుండగులు కాల్చి చంపిన తర్వాత కెనడా ప్రభుత్వం సాగించిన విచారణలో అయిదు కళ్ల కూటమిలో ఒక భాగస్వామ్య దేశం అందించిన సమాచారం ఆధారంగానే భారత్ ప్రమేయం ఉందన్న అనుమానాలు వచ్చాయని సీబీసీ న్యూస్ ఒక కథనంలో వెల్లడించింది. కెనడాలో భారత్ దౌత్యవేత్తల కమ్యూనికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆ దేశం కెనడాకు పంపినట్టుగా తెలిపింది. మానవ మేధస్సు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ దేశం పంపిన సమాచారంలో భారత్ ప్రమేయంపై అనుమానాలున్నట్టు తెలుస్తోంది. కెనడాతో పాటు అమెరికా, యూకే, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాలు సభ్యత్వం ఉన్న ఆ కూటమిలో ఏ దేశం భారత్ ప్రమేయం ఉందని చెబుతున్న సమాచారం అందించిందో సీబీసీ న్యూస్ వెల్లడించలేదు. కెనడాలో విద్వేషానికి చోటు లేదు భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ హిందువుల్ని బెదిరిస్తున్న వీడియో మరింతగా ఆందోళనల్ని పెంచుతోంది. కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం వీడి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన కెనడా ప్రభుత్వం ఇలాంటి విద్వేషపూరితమైన చర్యలకి తమ దేశంలో చోటు లేదని పే ర్కొంది. కెనడాలో నివసిస్తున్న వారెవరూ భయాందోళనలకు లోనుకావల్సిన పని లేదని హామీ ఇచి్చంది. భారత్‌కు ప్రత్యేక మినహాయింపులుండవ్: అమెరికా ఖలిస్తాన్ అంశంలో కెనడా, భారత్ మధ్య రగిలిన చిచ్చుపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలీవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలకు సంబంధించి తాము భారత్ దౌత్యవేత్తలతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ఈ అంశంలో భారత్‌కు ప్రత్యేకంగా ఎలాంటి మినహాయింపులు ఉండవన్నారు. భారత్‌తో బంధాల బలోపేతం కోసమే కెనడా వైపు అమెరికా మాట్లాడడం లేదన్న ఆరోపణలు వచి్చన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడాతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. -
ఖలిస్తాన్ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు విడదీయాలంటున్నారు?
గత కొద్ది రోజులుగా ఖలిస్తాన్ పేరు చర్చలలోకి వస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెన్సీల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ నేపధ్యంలో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో ఖలిస్తాన్ ఉదంతం ఏమిటో తెలుసుకోవాలనే అసక్తి అందరిలో పెరిగింది. ఈ ఉద్యమం ఏమిటో? అది ఎలా మొదలైందో తెలియని వారు గూగుల్ సాయంతో సమాచారాన్ని సేకరిస్తున్నారు. అందుకే ఖలిస్తాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఖలిస్తాన్ అంటే ఏమిటి? భారతదేశంలో ఖలిస్తాన్ ఉద్యమ మూలాలు ఎప్పుడో అంతరించిపోయాయి. అయితే ఆ తర్వాత కొందరు విదేశాల్లో ఉంటూ ఖలిస్తాన్ పేరిట అనేక ఉద్యమాలు సృష్టిస్తున్నారు. భారత్‌పై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు వారు నిరంతరం కృషిచేస్తున్నారు. వారు భారతదేశం నుండి పంజాబ్‌ను వేరు చేయాలనే ఉద్యమానికి ఖలిస్తాన్ ఉద్యమం అని పేరు పెట్టారు. ఖలిస్తాన్ అనే పేరు ఎలా వచ్చింది? ఖలిస్తాన్ అనేది ఖలీస్ అనే అరబిక్ పదం నుండి ఉద్భవించింది. ఖలిస్తాన్ అంటే ఖల్సాకు చెందిన భూమి. అంటే సిక్కులు మాత్రమే నివసించే ప్రదేశం. 1940లో లాహోర్ డిక్లరేషన్‌కు ప్రతిస్పందనగా డాక్టర్ వీర్ సింగ్ భట్టి ఒక కరపత్రాన్ని ప్రచురించినప్పుడు ఈ పదాన్ని తొలిసారి ఉపయోగించారు. సిక్కుల కోసం ప్రత్యేక దేశం అనే డిమాండ్ 1929 నుండి మొదలయ్యింది. కాంగ్రెస్ సమావేశంలో మాస్టర్ తారా సింగ్ ఈ డిమాండ్‌ను తొలిసారి లేవనెత్తారు. ఖలిస్తానీ ఉద్యమ నాంది.. 70వ దశకంలో చరణ్ సింగ్ పంక్షి, డాక్టర్ జగదీత్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో ఖలిస్తాన్ కోసం డిమాండ్ మరింత తీవ్రమైంది. దీని తరువాత 1980లో ఖలిస్తాన్ నేషనల్ కౌన్సిల్ కూడా ఏర్పాటయ్యింది. అనంతరకాలంలో పంజాబ్‌లోని కొంతమంది యువకులు దాల్ ఖల్సా అనే సంస్థను స్థాపించారు. ఇదిలావుండగా ఉగ్రవాదులను అంతం చేసేందుకు 1984లో అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్‌ను నిర్వహించారు. దీని తరువాత ఖలిస్తానీ ఉద్యమ మూలాలు భారతదేశం నుండి దూరమయ్యాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, బ్రిటన్‌తో సహా అనేక దేశాలలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా తరచూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలో ఉంటూ, భారత గడ్డపై అశాంతిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? ఎన్వలప్లో ఓటు ఎందుకు ప్యాక్ చేస్తారు? -
భారత్- కెనడా వివాదం: అమెరికా ఎవరి వైపు..?
న్యూయార్క్: కెనడా-భారత్ మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయాన్ని అంటగడుతూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభణకు కారణమైంది. అయితే.. ఈ వ్వవహారంలో అమెరికా ఎవరి పక్షాన ఉంది.? భారత్‌కూ మినహాయింపు లేదు..? భారత-కెనడా ప్రతిష్టంభణపై స్పందించిన అమెరికా.. ఇలాంటి వ్యవహారంలో ఏ దేశానికైనా ప్రత్యేక మినహాయింపులు ఉండవని తెల్చి చెప్పింది. ఈ అంశంలో భారత్‌కైనా మినహాయింపు ఉండదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ స్పష్టం చేశారు. కెనడా ఆరోపణలపై భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. కెనడాతో విబేధాలు లేవు.. భారత్‌తో బంధాలను బలోపేతం చేసుకునే దిశలో అమెరికా ఉన్నందున కెనడా వైపు బలంగా మాట్లాడటంలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన జేక్ సుల్లివన్.. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అమెరికా దాని నియమ నిబంధనలకు ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది. కెనడా ఆరోపణలపై అత్యున్నత స్థాయిలో ఇరుదేశాలతో చర్చిస్తున్నాము. ఈ అంశంపై అమెరికా నిష్పక్షపాతంగా ఉందని అన్నారు. ఇలాంటి అంశాల్లో భారత్‌కైనా మినహాయింపు ఉండదని చెప్పారు. ఇండియా కెనడా మధ్య చెలరేగిన ఖిలిస్థానీ ఉగ్రవాది హత్యకేసు వివాదంలో.. అమెరికా-కెనడా మధ్య దూరం పెరిగిందనే ఆరోపణలు అవాస్తవని సుల్లివాన్ తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఆందోళనలు కలిగిస్తున్నాయని అన్నారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు. నేరస్థులు ఎవరైనా శిక్ష పాడాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రెసిడెన్షియల్ సూట్ వద్దన్నాడు.. విమానాన్ని కాదన్నాడు! -
ఉగ్రవాదులకు స్వర్గధామంగా కెనడా: భారత్
ఢిల్లీ: కెనడా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి అన్నారు. ఖలిస్థానీ ఉగ్రవాదంపై కెనడా ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఓ వైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే.. ప్రతిష్ట పొందుతోందని దుయ్యబట్టారు. ఇరు దేశాల మధ్య వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ.. ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఉగ్రవాదుల కార్యకలాపాలను యధేచ్చగా జరగనిచ్చేలా అవకాశాన్ని కల్పించడం, ఉగ్రవాదులకు ఫండింగ్ సమకూర్చడం వంటి చర్యలకు కెనడా స్వర్గధామంగా మారింది. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను పంచుకోవాలని కోరితే స్పందన లేదు. కేవలం రాజకీయ మనుగడ కోసమే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఉగ్రవాదులకు మద్దతునివ్వడం మానుకోవాలని కెనడాను కోరుత్నునాం.' అని అరింధమ్ బాగ్చి తెలిపారు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారులను కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కేనడా ప్రయాణాలపై పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశ వీసాలను కూడా రద్దు చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
ఐరాస వేదికగా ఖలిస్థానీ ప్రశ్నలకు ట్రూడో ఎడముఖం
న్యూయార్క్: ఐరాస వేదికగా ఇండియా-కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించడానికి జస్టిన్ ట్రూడో నిరాకరించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్రపై ట్రూడో చేసిన ఆరోపణలపై పీటీఐ అడిగిన ప్రశ్నలను దాటవేశారు. జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 78వ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొన్నారు. వాతావరణ లక్ష్యాలు, ఉక్రెయిన్ అంశాలపై భద్రతా మండలిలో మాట్లాడారు. ఈ క్రమంలో రెండు సందర్భాల్లో ట్రూడోని పీటీఐ ప్రశ్నించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ట్రూడో చేసిన ఆరోపణలను ఇండియా ఖండించిన అంశంపై ప్రశ్నించారు. కానీ ఏ మాత్రం స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. Visuals of Canadian PM Justin Trudeau at United Nations (UN) headquarters in New York, US. pic.twitter.com/itdbUnI2tm — Press Trust of India (@PTI_News) September 21, 2023 ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం పాత్ర ఉందని జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారిని ఆ దేశం నుంచి బహిష్కరించారు. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన ఆరోపణలుగా పేర్కొంటూనే కెనడా దౌత్య అధికారిని ఇండియా కూడా బహిష్కరించింది. కెనడా, భారత్ మధ్య దౌత్య పరమైన సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. కెనడా ప్రయాణికులకు ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశానికి వెళ్లదలచినవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. ఇదీ చదవండి: ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై అనుమానాలు.. -
భారత్-కెనడా మధ్య దౌత్య ఉద్రిక్తతలు
-
40 ఏళ్లుగా కెనాడాలోచాప కింద నీరులా ఉగ్రవాదం
కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాదానికి 40 ఏళ్ల చరిత్ర ఉంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు, వ్యవస్థీకృత నేరాలు వంటివి ఖలిస్తాన్ వేర్పాటు వాదులకు గత నాలుగు దశాబ్దాలుగా నిత్యకృత్యంగా మారాయి. అయినా అక్కడ ప్రభుత్వాలు ఖలిస్తాన్ వేర్పాటు వాదుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి దీనికి ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన కారణం. భారత్ తర్వాత ప్రపంచంలో కెనడాలో సిక్కు జనాభా అధికంగా ఉంది. కెనడా జనాభా లెక్కల ప్రకారం దాదాపుగా 8 లక్షల మంది సిక్కులు (మొత్తం జనాభాలో 2%పైగా) ఉన్నారు. వీరి జనాభా శరవేగంతో పెరుగుతూ వస్తోంది. కెనడాలో న్యూ డెమోక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) పగ్గాలను సిక్కు నాయకుడైన జగ్మిత్ సింగ్ ధాలివాల్ 2017 సంవత్సరంలో చేపట్టిన తర్వాత ఖలిస్తాన్ వేర్పాటు వాదుల ఎజెండాకు మద్దతు పలికారు. 2021లో ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలవలేకపోవడంతో ఎన్డీసీ మద్దతు తీసుకోవాల్సి వచ్చింది.దీంతో ఖలిస్తాన్ వేర్పాటువాదులు మరింత చెలరేగిపోతున్నా ప్రధాని ట్రూడో ఏమీ చేయలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం కెనడా పార్లమెంటులో 18 మంది సిక్కు ఎంపీలు ఉన్నారు. సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అనే సంస్థ ప్రత్యేక ఖలీస్తాన్పై రెఫరెండం చేపట్టి తమకు లక్ష మందికిపైగా మద్దతు పలుకుతున్నట్టుగా ప్రకటించింది. 2019 నుంచి పెరిగిన దాడులు ♦ జగ్మిత్ సింగ్ బృందం ఖలిస్తాన్ విషయంలో మరింత చురుగ్గా ఉంటూ దాడులకుప్రోత్సహిస్తోంది. కెనడాతో పాటు అమెరికా, యూకే, ఆ్రస్తేలియాలో ఇటీవల కాలంలోవీరి దాడులు పెరిగిపోతున్నాయి. ♦ భారత కార్యాలయాలు, హిందూఆలయాలపై విచ్చలవిడిగా దాడులుజరుగుతున్నాయి. మార్చిలో లండన్‌లో భారత హైకమిషనర్ కార్యాలయంపై దాడి జరిగింది. ♦2022 మేలో మొహాలిలో పంజాబ్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై గ్రెనేడ్ దాడి వెనుక(ఎస్ఎఫ్జే) హస్తం ఉంది. ♦ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యను కీర్తిస్తూ జూన్ 4న ఖలీస్తాన్ ఉద్యమకారులువివిధ కార్యక్రమాలు చేపట్టారు.రక్తపు మడుగులో పడి ఉన్న ఇందిర, ఒక సిక్కు చేతిలో తుపాకీ ఉన్న చిత్రాలకి సంబంధించిన కటౌట్లు టొరాంటో వీధుల్లో వెలిశాయి. దర్బార్ సాహిబ్‌పై దాడులకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగిందంటూ దానిపై రాశారు. ఒంటారియాలో భారీ ర్యాలీతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంబరాల్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా ఖండించారు.కెనడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వేర్పాటువాదుల ఆగడాలను చూసీచూడనట్టువదిలేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ♦ జులైలో ఆ్రస్టేలియాలోని సిడ్నీలో భారతీ విద్యార్థులపైఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. అప్పట్లో ట్రూడో తండ్రి ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రి పియరే ట్రూడో 1980లో కెనడా ప్రధానిగా ఉన్నారు. అప్పట్లోనే ఖలిస్తాన్ కార్యకలాపాలపై భారత ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఆయనకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆ నాటి ప్రభుత్వం కూడా ఉదాసీనంగానే వ్యవహరించిందని బ్లడ్ ఫర్ బ్లడ్ అనే పుస్తకంలో రచయిత టెర్రీ మిల్వెస్కీ పేర్కొన్నారు. అప్పట్లో ఖలిస్తాన్ ఉద్యమం కెనడాలో కూడా ఉవ్వెత్తున లేచింది. ఇందిరాగాంధీ హత్య తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో మళ్లీ వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. వాస్తవానికి ఖలిస్తాన్ ఉద్యమం ప్రజా మద్దతు ఉన్నది కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ‘‘‘ఖలిస్తాన్ ఉద్యమం భౌగోళిక రాజకీయాలకు సంబంధించినది. చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు తమ శత్రుదేశమైన భారత్‌కు ఇబ్బంది కలుగుతుందని ఖలిస్తాన్ వేర్పాటు వాదులకి సాయపడుతున్నాయి’’అని రచయిత టెర్రీ పేర్కొన్నారు. ఇందిర హత్యని ఒక సంబరంగా పేర్కొంటూ 2002లో టొరాంటో ప్రధాన కేంద్రంగా ప్రచురితమయ్యే సంజా సవేరా మ్యాగజైన్ కథనాలు వండి వార్చింది. ఆలాంటి పత్రికకు ప్రభుత్వం అత్యధికంగా వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ద్వారా తన వైఖరి ఏంటో చెప్పకనే చెప్పింది. నిజ్జర్ హత్యతో రాజుకున్న చిచ్చు గత ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను సర్రేలోని గురుద్వారాలో కాల్చి చంపడంతో భారత, కెనడాల మధ్య చిచ్చు రేగింది. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలతో ఇరు దేశాలు తమ రాయబారుల్ని వెనక్కి పిలిపించేదాకా వెళ్లాయి. పంజాబ్‌లో జలంధర్‌కు చెందిన నిజ్జర్ 1997లో కెనడాకు వలస వెళ్లాడు. ప్లంబర్‌గా పని చేస్తూనే ఖలిస్తాన్ వేర్పాటు వాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. సిక్స్ ఫర్ జస్టిస్‌లో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 2020లో భారత్ నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. 2007లో పంజాబ్‌లోని లూథియానాలో పేలుళ్లు, 2009లో పటియాలాలో రాస్ట్రీయ సిక్ సంగత్ అధ్యక్షుడు రూల్డా సింగ్ హత్యలో నిజ్జర్ ప్రమేయమున్నట్టు అనుమానాలున్నాయి. కెనడా, యూకే, అమెరికాలో భారత రాయబార కార్యాలయాల దాడుల వెనుక నిజ్జర్ హస్తం ఉన్నట్టుగా భారత్ విచారణలో తేలింది. -
భారత్‌ను రెచ్చగొట్టే ఉద్దేశం లేదు: ట్రూడో
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు, భారత ప్రభుత్వ ఏజెంట్లకు మధ్య సంబంధం ఉందని ఆరోపించిన వ్యవహారంలో భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు. ’’భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఈ అంశాన్ని తీసుకుంది.. కానీ ఇండియాను రెచ్చగొట్టడం మా ఉద్దేశం కాదు. కానీ కొన్ని ప్రశ్నలకు మాకు సమాధానాలు కావాలి" ఖలిస్థానీ అంశంలో కెనడా ప్రధాని ట్రూడో వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం భారత ప్రభుత్వం చాలా సీరియస్ కామెంట్లు చేసింది. అందుకే కెనడా ప్రధాని మళ్లీ స్పందించినట్లు స్పష్టం అవుతోంది. కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇంతేకాకుండా కెనడాలో ఉన్న ఇండియన్ దౌత్య అధికారిని బహిష్కరించారు. ఈ పరిణామాలను భారత్ సీరియస్‌గా తీసుకుంది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారిని కూడా బహిష్కరించింది. దేశం విడిచి వెళ్లాలని గడువు విధించింది. ఇదీ చదవండి: భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
దేవాలయంపై దాడి.. గోడలపై ఖలిస్థానీల నినాదాలు..
కెనడాలో ఖలిస్థానీలు మరోసారి రెచ్చిపోయారు. బ్రిటీష్ కొలంబియాలో అతి పురాతనమైన లక్ష్మీ నారాయణ ఆలయాన్ని ధ్వంసం చేశారు. అనంతరం ఆలయ గోడలు, గేట్లపైన ఖలిస్థానీ పోస్టర్లు అంటించారు. ఇటీవల మరణించిన ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ చిత్రాలు ఆ పోస్టర్లపై అంటించి ఉన్నాయి. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇద్దరు వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి పోస్టర్లు అంటిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ముసుగులు ధరించి ఉన్న నిందితులు.. వరసగా హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది కెనడాలో ధ్వంసం అయిన నాలుగో దేవాలయం ఇది కావడం గమనార్హం. భారతీయులకు వ్యతిరేకంగా విధ్వేషాలను రెచ్చగొట్టడంపై మేయర్ కిర్క్ ప్యాట్రిక్ ఆందోళన వ్యక్తం చేశారు. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు దేవాలయంలో అంటించిన పోస్టర్లపై 'జూన్ 18న జరిగిన ఘటనలో భారత పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తుంది' అని రాసి ఉంది. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ చీఫ్‌గా నిజ్జర్ పనిచేశాడు. ఇతన్ని కెనడాలోని సుర్రేలో ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. ఇదీ చదవండి: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ కాకర్.. మరింత ఆలస్యంగా ఎన్నికలు! -
ఖలిస్థానీల ముసుగులో అక్రమ వలసలు..
లండన్: భారత అక్రమ వలసదారులకు ఇంగ్లాండ్‌లో ఎలాగోలా ఆశ్రయం కల్పించేందుకు బ్రిటీష్ లాయర్లలో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. వీరంతా మాఫియాలా ఏర్పడి బాధితుల నుండి నగదు వసూలు చేసి బదులుగా ఖలిస్తానీలుగానూ, స్వలింగ సంపర్కులగానూ చెప్పి భారత్‌లో తమ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు కోర్టుకు చెప్పమని చెబుతున్నట్టు ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఓ స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటన్ ప్రధాని తీవ్రస్థాయిలో స్పందించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత్ నుంచి ఇంగ్లాండ్ వలసవచ్చే వారిలో ఎవరైనా సరైన డాక్యుమెంట్లు లేకుండా అక్కడ అడుగుపెట్టారా.. వారు అక్కడి లాయర్ల చేతికి చిక్కినట్లే. పడవల్లో వలస వచ్చే భారతీయులే ఈ లాయర్ల ప్రధాన లక్ష్యం. వీరికి ఇంగ్లాండ్‌లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మతాంతర వివాహం చేసుకున్నామని, స్వలింగ సంపర్కులమని, ఖలిస్తానీ మద్దతుదారులమని చెప్పమంటున్నారు. మీరు కోర్టుకి ఈ మాట చెబితే చాలు మీ ప్రాణానికి భారత్‌లో ప్రాణహాని ఉందని కోర్టుని నమ్మిస్తానని దీనికోసం 5500 యూరో పౌండ్లను సిద్ధం చేసుకోవాలని ఒక రిపోర్టర్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో లాయర్ చెబుతుండగా వీడియో తీశారు. ఈ వీడియో ప్రధాని రిషి సునాక్ కు చేరడంతో ఆయన ఈ వ్యవహారంపై చాలా సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యకలాపాలకు మేమెప్పుడూ వ్యతిరేకమే. ప్రతిపక్ష లేబర్ పార్టీవారు, కొంతమంది లాయర్లు, క్రిమినల్ గ్యాంగులు వారి జేబులు నింపుకోవడం కోసం అక్రమ వలసదారులకు చట్టవ్యతిరేక మార్గంలో సహాయపడుతున్నారు. దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసనీ అన్నారు. This is what we’re up against. The Labour Party, a subset of lawyers, criminal gangs - they're all on the same side, propping up a system of exploitation that profits from getting people to the UK illegally. I have a plan to stop it. Here’s how 🧵https://t.co/ez3rYIU0uQ — Rishi Sunak (@RishiSunak) July 25, 2023 ఇది కూడా చదవండి: ఏకాంతంగా బ్రతకాలనుకున్నారు.. చివరికి... -
భావప్రకటన అంటే.. హింసకు పాల్పడటం కాదు..
వాషింగ్టన్: శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ పై ఖలిస్థాన్ వేర్పాటువాదుల దాడిని అక్కడి ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. గత నెల ఖలిస్థాన్ వేర్పాటువాది భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారంగా అతని అనుచరులు ఈ హింసాకాండకు తెరతీశారు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ పేరిట వేర్పాటువాద సంస్థకు నాయకుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ పై 10 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది. కెనడాలో గురుద్వారా గుమ్మం వద్దే అతడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దీంతో అమెరికాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు అక్కడి భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడి నిప్పు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఖలిస్తానీలు హింసకు ప్రతిగా హింస అంటూ నినదించారు. గడిచిన ఐదు నెలల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని దౌత్య కార్యాలయంపై దాడులు జరగడం ఇది రెండో సారి. దీంతో అమెరికా ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భారత దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న దౌత్యాధికారుల భద్రత మాకు చాలా ముఖ్యమని, శాంతికి భంగం కలిగిస్తే ఎవ్వరినీ సహించేది లేదని వైట్ హౌస్ జాతీయ భద్రతా విభాగానికి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి RO ఖన్నా మాట్లాడుతూ.. నాకు భారత దౌత్యాధికారి సంధు వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఎప్పుడన్నా మానవ హక్కుల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆలోచనతోనూ, పరిపక్వతతోనూ నిజాయతీగా స్పందిస్తూ ఉంటారు. అలాంటి వారికి హాని కలిగించే విధంగా ప్రవర్తించడం దారుణం, అప్రజాస్వామికం. అమెరికాలో ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేఛ్చ ఉంటుంది. అలాగని దాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టి, హింసను ప్రేరేపించమని కాదు దానర్ధం. ప్రభుత్వం ఈ హింసాకాండపై విచారణ జరిపించి దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: భారత్ ఆరోపణల్ని తప్పుబట్టిన కెనడా ప్రధాని.. ‘అది వాస్తవం కాదు’ Khalistan supporters’ try to set on fire Indian consulate in San Francisco; US 'strongly condemns’@siddhantvm and @live_pathikrit share their views@Sriya_Kundu | #Khalistan #SanFrancisco pic.twitter.com/wEtGKyfn35 — News18 (@CNNnews18) July 4, 2023 -
భారత్ ఆరోపణల్ని తప్పుబట్టిన కెనడా ప్రధాని.. ‘అది వాస్తవం కాదు’
కెనడా: ఒకపక్క ఖలిస్థాన్ మద్దతుదారుల ఆకృత్యాలు పెరిగిపోతుంటే కెనడా ప్రభుత్వం చూసి చూసినట్టు వ్యవహరిస్తోందని భారత విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తప్పుబట్టారు. వారు చెప్పేదాంట్లో వాస్తవం లేదని తాము ఉగ్రవాద చర్యలపై ఎప్పుడూ కఠినంగానే వ్యవహరించామని అన్నారు. కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఆపరేషన్ బ్లూ 39వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ర్యాలీలో ప్రదర్శించిన ఖలిస్తానీలు ఇటీవల భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. జులై 8న ఖలిస్తానీల స్వేఛ్చ ర్యాలీ నిర్వహించనున్నట్లు దౌత్య కార్యాలయం ఎదుట పోస్టర్లను ప్రదర్శించారు. ఖలిస్తానీల చర్యలపై పలు అగ్రదేశాలు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కెనడా ప్రధాని వైఖరిని తప్పుబట్టింది. ఖలిస్తానీలపై మెతక వైఖరి మన రెండు దేశాల సంబంధాలకే ప్రమాదమని చెబుతూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా వారు ఖలిస్థాన్ మద్దతుదారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించింది. కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వారు చెప్పేది వాస్తవం కాదు. కెనడా ఎప్పుడూ హింసను ప్రేరేపించే తీవ్రవాదం పైన కఠినంగానే వ్యవహరించింది. వ్యవహరిస్తుంది కూడా. దేశంలో అందరికీ భావ ప్రకటన స్వేఛ్చ ఉంటుందని అలాగే హింసను తీవ్రవాదంపై ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతోనే ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల ఖలిస్తానీలు భారత దౌత్య కార్యాలయంపై దాడికి కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి ప్రతి కదలికనూ గమనిస్తోందని మా పెరట్లో పాములు పడగ విప్పి బుసలు కొడుతున్నాయని ఎప్పుడు కాటేసి చంపుతాయన్నదే మమ్మల్ని వేధిస్తున్న ప్రశ్న.. అని అన్నారు. ఇది కూడా చదవండి: నోరుజారిన నేపాల్ ప్రధాని.. ఏకి పారేస్తున్న ప్రతిపక్షాలు -
35 రోజులుగా వేట.. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు!
చండీగడ్: 35 రోజులుగా పోలీసులను ముప్పు తిప్పులు పెడుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం మోగా జిల్లాలోని ఓ గురుద్వార్ అతడు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. చాకచక్యంగా చుట్టుముట్టి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు అతడు చిక్కడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే అమృత్‌పాల్ సింగ్ తనంతట తానే పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులపైకి ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయేలదని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అతని లొంగిపోడవం తప్ప మరో ఆప్షన్ లేదని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అతనిపై ఎన్ఎస్ఏ వారెంట్ జారీ అయినట్లు పేర్కొన్నారు. పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ సింగ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అరెస్టైన అతని అనుచరులను కూడా పంజాబ్ నుంచి వేరే రాష్ట్రానికి తరలించినట్లు సమాచారం. అమృత్‌పాల్ అత్యంత సన్నిహితుడు పాపల్ ప్రీత్ సింగ్‌ను కూడా అసోం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులోనే ఉంచారు. అమృత్‌పాల్ సింగ్‌ను అత్వి త్వరలోనే అరెస్టు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారమే వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో అతను స్వేచ్ఛగా తిరిగేవాడని, కానీ ఇప్పుడు అది సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆ మరునాడే పోలీసులు అమృత్‌పాల్‌ను అరెస్టు చేశారు. విద్వేష ప్రసంగాలతో యువతను రెచ్చగొడుతున్న అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అతడి కోసం వేల మంది పోలీసులు నెలరోజులుగా వేట కొనసాగిస్తున్నారు. అయినా వేషాలు, వాహనాలు మార్చుతూ అతడు ఎవరికంటాపడకుండా తిరిగుతున్నాడు. అమృత్ పాల్ పరారీలో ఉన్నప్పటి నుంచి అతడి అనుచరులను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు పోలీసులు. మఖ్య సన్నిహితుడు పాపల్ ప్రీత్ సింగ్‌ను ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. ఏప్రిల్ 15న జోగా సింగ్‌ను, ఏప్రిల్ 18న మరో ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో అమృత్‌పాల్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తన మద్దతుదారులు పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగెలా చేశాడు అమృత్‌పాల్ . వీరంతా ఫిబ్రవరి 23న పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. లవ్‌ప్రీత్ సింగ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే విద్వేష ప్రసంగాలు చేసినందుకు అమృత్‌పాల్ సింగ్‌పై కేసు నమోదైంది. అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. అతనికి చెందిన ఆయుధాలు, వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. #WATCH | Outside visuals from Rodewal Gurudwara in Moga, Punjab from where Waris Punjab De's #AmritpalSingh was arrested by Punjab Police today. pic.twitter.com/gHtlARqarn — ANI (@ANI) April 23, 2023 #WATCH | Earlier visuals of Waris Punjab De's #AmritpalSingh at Gurudwara in Moga, Punjab. He was arrested by Punjab Police from Moga this morning and is likely to be shifted to Dibrugarh, Assam. pic.twitter.com/2HMxTr50s7 — ANI (@ANI) April 23, 2023 చదవండి: మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం -
అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్‌కు భారీ షాక్..
అమృత్సర్: ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ గత కొద్దిరోజులుగా పోలీసులకు దొరక్కకుండా తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రతా బలగాలు, పంజాబ్ పోలీసులు.. అమృత్‌పాల్ కోసం గాలిస్తున్నారు. ఇదే సమయంలో అమృత్‌పాల్ సింగ్ కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే, తాజాగా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ (28)ను పోలీసులు అమృత్సర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. కిరణ్‌దీప్ కౌర్ గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్లే క్రమంలో అమృత్సర్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ పోలీసులు ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విమానం షెడ్యూల్ ప్రకారం లండన్‌కు 1.30 గంటలకు వెళ్లాల్సి ఉండగా.. కిరణ్‌దీప్‌ను పోలీసులు అడ్డుకుని విచారిస్తున్నారు. తమకు చెప్పకుండా ఆమెకు విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఇంత అర్జెంట్‌గా లండన్ ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కాగా, కిరణ్‌దీప్ కౌర్ బ్రిటిష్ పౌరురాలు. ఆమెపై పంజాబ్‌లో కానీ, దేశంలో కానీ ఎలాంటి కేసులు లేవు. అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్ యూకేలో ఉంటూ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌లో క్రియాశీలక సభ్యురాలిగా ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్‌దీప్ కౌర్‌ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. మార్చిలో అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా గ్రామంలో ప్రశ్నించారు. మరోవైపు.. కిరణ్‌దీప్ లండన్ వెళ్తున్న నేపథ్యంలో అమృత్‌పాల్ కూడా లండన్‌కు వెళ్తున్నారా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఖలీస్థాన్ వేర్పాటువాద ఉద్యమంలో అతడి భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అనేది ఆమెను ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అమృత్‌పాల్ అనుచరులను పంజాబ్ పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. VIDEO | Visuals from Amritsar Airport where fugitive pro-Khalistani leader Amritpal Singh's wife Kirandeep Kaur has been stopped by immigration officials. pic.twitter.com/KaCSfb6Fcr — Press Trust of India (@PTI_News) April 20, 2023 -
భారత్‌కు రాకముందు సర్జరీ చేయించుకున్న అమృత్‌పాల్ సింగ్
ఖలిస్తాన్ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా అమృత్‌పాల్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో భారత్‌కు తిరిగివచ్చే ముందు అమృత్‌పాల్ సింగ్ కాస్మొటిక్ సర్జరీ చేసుకునేందుకు జార్జియా వెళ్లిన్నట్లు విచారణలో వెల్లడైంది. ఒకప్పుడు ఖలిస్తాన్ ఉద్యమాన్ని నడిపిన వేర్పాటువాది జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలా పోలికలతో కనిపించేందుకు కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రతా చట్టంకింద అరెస్టయి ప్రస్తుతం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న సింగ్ సన్నిహితులు విచారణలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నాయి. సింగ్ జార్జియాలో దాదాపు రెండు నెలలు (20/6/22 నుంచి 19/8/22 వరకు) ఉన్నట్లు సమాచారం. కాగా జర్నైల్ సింగ్ బింద్రన్ వాలా 1984 జూన్ 6న భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్‌లో హతమయ్యాడు. ప్రస్తుతం 'వారిస్ పంజాబ్ దే' సంస్థ చీఫ్‌గా ఉన్న అమృత్‌పాల్ కూడా అతడి విధానాన్ని అనుసరిస్తూ.. సిక్కులను తన బోధనలతో రెచ్చగొడుతున్నారు. బింద్రన్‌వాలే తరహాలోనే తన టర్బన్, సిక్కు దుస్తులు, సిక్కు గుర్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో బింద్రన్ వాలే 2.0గా ఫేమస్ అయ్యాడు. ప్రభుత్వం కీలక నిర్ణయం మరోవైపు వారీస్ పంజాబ్ దే అధినేతను పట్టుకునేందుకు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 తేదీ వరకూ పోలీసులకు సెలవులు రద్దు చేసింది. ఇదివరకే మంజూరైన సెలవులను రద్దు చేయటంతోపాటు కొత్తగా ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని పంజాబ్ డీజీపీ.. పోలీసు అధికారులకు సూచించారు. మూడు వారాలుగా గాలింపు మార్చి 18న అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించగా.. చిక్కినట్టే చిక్కి తన మద్దతుదారుల సాయంతో తప్పించుకున్నాడు.. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. రకరకాల ప్రదేశాలు మారుస్తూ, మారువేషాల్లో తప్పించుకుంటున్నాడు. అయితే అతని సహాయకులు, మద్దతుదారులను పెద్దఎత్తున పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్‌పాల్ కేసులో అతని మామ హర్జిత్ సింగ్, దల్జిత్ సింగ్‌తో సహా ఎనిమిది మందిని ఎన్ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేసి అస్సాంలోని డిబ్రూఘర్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. -
తీవ్ర హెచ్చరిక.. జాగ్రత్తగా వినండి సీఎం.. మధ్యలో వచ్చి బలికావొద్దు!
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ సంఘం నేత గురుపత్వాన్ సింగ్ పన్నూ సీఎంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అస్సాం జర్నలిస్టులకు కాల్ చేసి ముఖ్యమంత్రిని బెదిరించాడు. పంజాబ్‌లో ఖలిస్తాన్ వేర్పాటు వాది, అమృత్‌పాల్ సింగ్ కోసం గాలింపు కొనసాగుతున్న వేళ అస్సాం సీఎంకు బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. ‘ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులను అస్సాంలో నిర్భంధించి హింసిస్తున్నారు. జాగ్రత్తగా వినండి సీఎం శర్మ.. ఇక్కడ పోరాటం ఖలిస్తాన్ అనుకూల సిక్కులకు.. భారత ప్రభుత్వానికి మధ్య జరుగుతోంది. అనవసరంగా ఈ హింసలో మీరు బలికావద్దు’ అని హెచ్చరించాడు. అలాగే ‘మేము ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణ మేరకు శాంతియుత ప్రజాస్వామ్య పద్దతిలో భారత ఆక్రమణ నుంచి పంజాబ్‌ను విముక్తి చేయాలని కోరుతున్నాం. మీ ప్రభుత్వం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉన్న అమృతపాల్ మద్దతురాలైన ఆరుగురుని ఖైదీలుగా మార్చి వేధింపులకు గురిచేస్తోంది. మీరు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పన్నూ ఫోన్లో బెదిరించాడు. కాగా వారిస్ పంజాద్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులకు చిక్కిన్నట్లే చిక్కి వేషాలు, వాహనాలు మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు వందలాది ఖలిస్తాన్ మద్దతుదారులు, అమృత్‌పాల్ సహాయకులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే భద్రతా కారణాల రీత్యా అతడి ఆరుగురు సహాకులను అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. చదవండి: అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు..! -
పోలీసులకు లొంగిపోయే యోచనలో అమృత్‌పాల్ సింగ్?.. వీడియో విడుదల
పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్తాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తిరిగి పంజాబ్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. గోల్డెన్ టెంపుల్ వద్ద పోలీసుల ముందు లొంగిపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో భయంతో అమృత్‌పాల్.. చివరకు తన మనసు మార్చుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులకు లోంగిపోతాడనే ఊహాగానాల మధ్య పరారీలో ఉన్న ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ బుధవారం వీడియో విడుదల చేశాడు. ఇందులో పంజాబ్ పోలీసులపై విమర్శలు గుప్పించాడు. ఒకవేళ పోలీసులకు తనను అరెస్టు చేయాలనే ఉద్దేశ్యం ఉంటే.. ఇంటికి వచ్చి అరెస్టు చేసేవారని అన్నాడు. తను అరెస్ట్‌కు భయపడే వ్యక్తి కాదని చెప్పాడు. పంజాబ్ ప్రభుత్వం నా అరెస్ట్ కోసం కాదు.. మొత్తం సిక్కు సమాజంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అతని సన్నిహతులను అరెస్టు చేయడం, అస్సాం జైలులో వారిని నిర్బంధించడం గురించి కూడా వీడియోలో మాట్లాడాడు. ప్రజల మనస్సులలో ప్రభుత్వం సృష్టించిన భయాన్ని తొలగించడానికి బైస్కాహి సందర్భంగా తల్వాండి సబోలో సమావేశం నిర్వహించాలని అకల్ తఖ్త్ జాతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్‌ను అభ్యర్థించినట్లు తెలిపాడు. పోలీసుల నుంచి పారిపోయిన తర్వాత వారిస్ పంజాబ్ దే చీఫ్ విడుదల చేసిన మొట్టమొదటి వీడియో ఇదే కావడం గమనార్హం. అయితే అమృత్‌పాల్ ఈ వీడియోలో ప్రత్యేక రాష్ట్రం లేదా ఖలిస్తాన్ గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. #BREAKING: Khalistani Radical Amritpal Singh releases a new video from hiding in Punjab. Requests Jathedar of Akal Takht to call Sarbad Khalsa (congregation of Sikhs) to discuss issues to save Punjab. Dares Punjab CM Bhagwant Mann and Punjab Police. pic.twitter.com/vhcDN1lBaE — Aditya Raj Kaul (@AdityaRajKaul) March 29, 2023 కాగా ఖలిస్తాన్ సానూభూతి పరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు 10 రోజులుగా విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. ఈ నెల 18వ తేదీన పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు వేషాలు మార్చకుంటూ పారిపోతున్నాడు. ఈ క్రమంలోనే రాష్ట్రం విడిచి వెళ్లిన్నట్లు గుర్తించారు. అయితే తాజాగా వారిస్ పంజాబ్ దే చీఫ్ మంగళవారం హోషియార్పూర్ మీదుగా అమృత్‌సర్‌కు వచ్చిన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. అమృతపాల్ సింగ్, అతని సహాయకులు మంగళవారం అర్థరాత్రి తర్వాత హోషియపూర్లోని ఓ గ్రామంలో దాక్కున్నారనే సమాచారంతో పంజాబ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మార్నియన్ గ్రామంలోని గురుద్వారా వద్ద అమృతపాల్ సింగ్ ఇన్నోవా కారును వదిలిపెట్టి అక్కడి పొలాల్లోకి పారిపోయాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఖలిస్తాన్ నేత కోసం విస్తృతంగా గాలింపు చేపడుతున్నారు. అనుమానితుల్ని పట్టుకునేందుకు రోడ్లపై చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. గోల్డెన్ టెంపుల్ చుట్టూ, అకల్ తఖ్త్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. త్వరలోనే అతను లొంగిపోయే అవకాశం ఉన్నందున అమృత్సర్ అంతటా హై అలర్ట్ కొనసాగుతోంది. చదవండి: 2025 కాదు 2050లో కూడా బీజేపీ గెలవదు.. కేజ్రీవాల్ జోస్యం.. -
ఇది భారత్ భరించలేని బెడద
పాకిస్తాన్‌తో కలిసి వేర్పాటువాద శక్తులు పంజాబ్‌లో సమస్యను పెంచి పోషించడానికి ప్రయత్నిస్తున్నారనేది స్పష్టం. పోలీసులు ఇప్పటికైనా మేలు కున్నారు. కానీ రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాడేందుకు ప్రభుత్వం, పోలీసు బలగాలకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. అలాగే ఖలి స్తాన్ నిరసనకారులు లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల త్రివర్ణ పతాకాన్ని దించేయడం వంటి చర్యలకు దిగారు. వీరి కార్యకలా పాలను నిరోధించేందుకు సమర్థ చర్యలు చేపట్టాలని కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాల మీద భారత్ ఒత్తిడి తేవాలి. యుద్ధప్రాతిపదికన ఖలిస్తాన్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేదంటే 1980లలో పంజాబ్‌ను వెంటాడిన ఉగ్రవాద పీడ కలలు పునరావృతమైతే దేశం వాటిని భరించలేదు. ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్, అతడి అనుచరులపై మోపిన ఉక్కు పాదం నాటకీయంగా ఉంది. అది రహస్యంగా జరిగింది. వేర్పాటువాద బోధకుడు గత కొంతకాలంగా పెంచుకుంటూ వచ్చిన ప్రమాద తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా మేలుకుంది. ఫిబ్రవరి 23న జరిగిన అజ్నాలా ఘటన పోలీసులకు పెద్ద ఉపద్రవంలా మిగిలింది. ఈ ఘటనలో ఖలిస్తానీలు తుపా కులు పేల్చి పోలీసులపై దాడికి దిగారు. అమృత్‌పాల్ సింగ్ అనుయాయి లవ్‌ప్రీత్ సింగ్ ఓ తూఫాన్‌లా పోలీసులపై విరుచుకుపడ్డాడు. ఈ వేర్పాటువాదికి పోలీసులు దాదాపుగా లొంగిపోవడం కలవరపెట్టింది. తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న తర్వాత, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఎట్టకేలకు మార్చి 18నఅమృత్పాల్ సింగ్, అతడి మద్దతుదారులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇలాంటి సమయంలో ఏ రాష్ట్ర పోలీసుకు అయినా మంచి నిఘా వ్యవస్థ, సమగ్ర ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. పైగా ఈ పథకాన్ని అమలుపర్చే బృందాన్ని జాగ్రత్తగా ఎంచుకోవలసి ఉంది. అయితే పంజాబ్ పోలీసులు ఎక్కడో దారి తప్పినట్లు కనిపిస్తోంది. అసలు అందరికంటే ముందు అమృత్‌పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేయవలసింది. అతడిని బహిరంగంగా కస్టడీలోకి తీసుకుని వుంటే అతడి అనుచరులు చెదిరిపోయేవారు. అమృత్‌పాల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. దీన్ని జీర్ణించుకోవడం కష్టం. పంజాబ్ పోలీసులు ఎల్లప్పుడూ శాంతిభద్రతల దృక్కోణంలో పనిచేస్తుంటారని పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ సుఖ్‌చైన్ సింగ్ గిల్ వ్యాఖ్యానించారు. ఈ వాదన సమంజసంగా లేదనిపించేలా క్షేత్ర స్థాయి ఘటనలు జరిగాయి. మారుమూల దాగి వున్న వ్యక్తిని పట్టుకోవడానికి పంజాబ్ అటు నాగాలాండ్ కాదు, ఇటు చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కాదు. చూస్తుంటే పంజాబ్ పోలీసులు గందరగోళానికి గురైనారనిపించింది. లేదా అమృత్‌పాల్‌ను ఇప్పటికే నిర్బంధించి ఉండాలి. కానీ బహిరంగంగా కోర్టుకు హాజరు పర్చకపోయి ఉండాలి. ఏ రకంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వానికీ, పోలీసులకూ ఇది అంత మంచిపేరేమీ తీసుకురాలేదు. వారిస్ పంజాబ్ దే అనుయాయులకు వ్యతిరేకంగా నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సమాజంలో సామరస్యతను పాడు చేయడం, పోలీసులపై దాడి చేయడం, హత్యాయత్నానికి దిగడం, ప్రజాసేవకులు తమ విధులు చేపట్టకుండా అడ్డుకోవడం వాటికి కారణాలు. ఇవి సరే. కానీ భింద్రన్‌వాలే 2.0 అని తనను తాను చెప్పుకొంటున్న వ్యక్తిని బహిరంగంగా పట్టుకోకపోతే, ఈ దాడులతో ఉపయోగం ఉండదు. రాష్ట్ర పోలీసులు కొన్ని మాత్రమే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. భటిండాలో 16 మంది ఖలిస్తానీ మద్దతుదారులను అరెస్టు చేశారు. లూథియానాలో 21 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. అజ్నాలాలో ఏడుగురిని చుట్టుముట్టారు. మొత్తంగా 112 మందిని అరెస్టు చేశారు. ఫిరోజ్‌పూర్, భటిండా, రూప్ నగర్, ఫరీద్ కోట్, బటాలా, హోషియార్పూర్, గుర్దాస్పూర్, మోగా, జలంధర్ వంటి నగరాల్లో భద్రతా దళాలు తమ బలం తెలిపేలా జాతీయ పతాకం చేబూని మార్చ్ కూడా నిర్వహించాయి. రాజకీయాలకో నమస్కారం! ఈ చర్యలన్నీ స్వాగతించాల్సినవే. కానీ గత కొద్ది నెలలుగా, పంజాబ్ పోలీసులు వారి ఘనతకు తగినట్లుగా వ్యవహరించలేక పోయారు. అత్యంత శక్తిమంతులైన శత్రువులకు కూడా నరకం చూపించే తమ సమర్థతను వారు ప్రదర్శించలేకపోయారు. ఒకే ఒక వివరణ ఏమిటంటే, ఈ వ్యవహారంలో పోలీసులు కాస్త నెమ్మదిగా వ్యవహరించాలని సూచనలు అందివుండాలి. వారిస్ పంజాబ్ దే ప్రతీఘాతుక కార్యకలాపాల గురించి మాట్లాడుతూనే, పంజాబ్ రాజ కీయ నాయకత్వం అమృత్‌పాల్ సింగ్ పేరును ప్రత్యేకించి పేర్కొనక పోవడంపై చాలామంది ఎత్తిచూపారు. నేటి రాజకీయాలకో నమ స్కారం. వాటి వల్ల పోలీసులు ఏ చర్యా చేపట్టకపోవడమే సురక్షిత మైన చర్య అనుకున్నట్టున్నారు. ఎందుకంటే ఇది వివాదానికి దారి తీయవచ్చు, పైగా అధికారంలో ఉన్నవారు తమకు మద్దతుగా నిల బడకపోవచ్చు అని వారు భావించి వుండాలి. ఇలాంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వ విశ్వస నీయతను, చిత్తశుద్ధిని దెబ్బతీస్తాయి. నిస్సందేహంగా, అమృత్‌పాల్ సింగ్ ప్రతిష్ఠకు పెద్ద దెబ్బ తగిలింది. అజ్నాలా పోలీస్ స్టేషన్‌కు గురు గ్రంథ్ సాహిబ్‌ని తీసు కెళ్లాలనీ, దాన్ని ఒక కవచంగా ఉపయోగించాలనీ అతడు తీసుకున్న నిర్ణయాన్ని సిక్కు మతాధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు, అతడు అదృశ్యమైపోవడం పట్ల కూడా తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి ప్రమాదాన్నయినా నిర్భయంగా ఎదుర్కొ వాలనీ, దాన్ని సవాలుగా తీసుకోవాలనీ బోధించే సిక్కు సంప్రదాయానికి ఇది భిన్నం. ఇక్కడ రెండు అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఒకటి పాకిస్తాన్ తో, ఆ దేశ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో సింగ్‌కు గల లంకె. ఒక సీనియర్ పంజాబ్ పోలీస్ అధికారి దీన్ని స్పష్టంగా పేర్కొన్నారు కూడా. అలాగే, తన మచ్చలను చిరుతపులి ఎన్నటికీ మార్చుకోలేనట్టుగా– తమ ప్రజలు ఆకలితో అలమటిస్తూ, దేశ ఖజానా దివాళా తీస్తున్న సమయంలో కూడా భారత్‌కు వ్యతిరేకంగా సమస్యలు సృష్టించడానికి పాకిస్తాన్ తన ఎత్తులను ఎన్నటికీ వదులుకోదనే విషయం స్పష్టమైంది. రెండోది ఏమిటంటే– పోలీసు, శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలో ఉంటున్నప్పటికీ వేర్పాటువాదం ఈ స్థాయిలో చెలరేగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఉగ్రవాదులకు స్తూపాలా? గత 10 సంవత్సరాలుగా పంజాబ్ పరిస్థితులు దిగజారుతున్నాయి. 2014లో దమ్దమీ టక్సాల్ సంస్థ ‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో చనిపోయిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే, ఇంకా ఇతర తీవ్రవాదులకు స్వర్ణ దేవాలయం ఆవరణలో స్మారక స్థూపం నిర్మించింది. పంజాబ్ వ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఖలిస్తాన్, భింద్రన్‌వాలే పోస్టర్లను బహిరంగంగా ప్రదర్శించారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ వాటిని నిర్లక్ష్యం చేశాయి. పంజాబ్ ఈరోజు అనేక రకాల సమస్యలతో పోరాడుతోంది. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించాలని పాకిస్తాన్ ప్రభుత్వం పకడ్బందీగా పథకం వేస్తోంది. దీనికి తోడుగా సరిహద్దుల అవతలి నుంచి సీమాంతర మాదక ద్రవ్యాల సమస్య కూడా తీవ్రంగానే ఉంది. పాకిస్తాన్ నుంచి డ్రోన్లతో ఆయుధాలు జారవిడవడం, రాష్ట్రం లోపల సాయుధ ముఠాలు పెరగడం, ఖలిస్తాన్ రూపకల్పనకు మద్దతిచ్చే శక్తులు పెరగడం– వీటన్నింటినీ దీర్ఖకాలిక పథకంతో పరిష్కరించాల్సి ఉంది. అరకొర స్పందనలు, తలొగ్గిపోయే చర్యలు వంటివి సరిపోవు. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో ఖలిస్తాన్ మద్దతుదారుల కార్యకలాపాలను నిరోధించేందుకు సమర్థ చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఖలిస్తాన్ అనుకూలవాద నినాదాలు చేస్తున్న నిరసనకారులు లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల త్రివర్ణ పతాకాన్ని కిందికి దించేయడంతో ఇలాంటి చర్య చేపట్టడం తప్పనిసరిగా మారింది. భారత ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన దీన్ని పరిష్కరించాల్సి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే, 1980లలో పంజాబ్‌ను వెంటాడిన ఉగ్రవాద సమస్యలు తిరిగి సంభవిస్తే భారతదేశం వాటిని భరించలేదు. ప్రకాశ్ సింగ్ వ్యాసకర్త మాజీ పోలీస్ అధికారి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మళ్లీ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత
లండన్: ఖలిస్తానీ మద్దతుదారుల దాడితో ఘటనకు కేంద్ర బిందువుగా మారిన లండన్‌లోని భారతీయ హైకమిషన్ వద్ద మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం భారతీయ హైకమిషన్‌పై దాడికి తెగబడిన ఘటన మరువకముందే మళ్లీ దాదాపు 2,000 మందితో కూడిన ఆ వేర్పాటువాద మూక అదే భవంతి సమీపానికి చేరుకుంది. ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేసిన వేర్పాటువాదులు వెంట తెచ్చుకున్న రంగులు వెదజల్లే చిన్న బాణసంచా, నీళ్ల సీసాలు, కొన్ని వస్తువులను హైకమిషన్ భవంతిపైకి విసిరారు. ఆదివారం నాటి దుశ్చర్యతో అప్రమత్తమైన లండన్ పాలనా యంత్రాంగం భారీ సంఖ్యలో పోలీసులను అంతకుముందే అక్కడ మొహరించడంతో వేర్పాటువాదుల భారీ దాడి యత్నాలు ఆచరణలో విఫలమయ్యాయి. అమృత్‌పాల్ అరెస్ట్‌కు కంకణం కట్టుకున్న పంజాబ్ పోలీసుల చర్యను నిరసిస్తూ ఫెడరేషన్ ఆఫ్ సిఖ్ ఆర్గనైజేషన్స్, సిఖ్ యూత్ జతేబందియా వంటి సంస్థలు ఉమ్మడిగా ‘నేషనల్ ప్రొటెస్ట్’ పేరిట బ్యానర్లు సిద్ధంచేసి భారతీయ హైకమిషన్ వద్ద దాడికి కుట్ర పన్నినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. నిరసనకారులను అదుపులోకి తీసుకుని తరలించేందుకు దాదాపు 20 బస్సులను పోలీసులు తెప్పించారు. అప్రమత్తతలో భాగంగా కొందరు పోలీసులను అక్కడి వీధుల్లో కవాతుచేశారు. ఖలిస్తానీవాదులు అక్కడికి రాగానే పంజాబ్‌లో మానవహక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఇంగ్లిష్, పంజాబీ భాషల్లో మైకుల్లో భారత వ్యతిరేక ప్రసంగాలు ఇచ్చారు. నిరసనకారుల్లో చిన్నారులు, మహిళలూ ఉండటం గమనార్హం. భారత్ తమను వేర్పాటువాదులని, పాక్ ఐఎస్ఐతో కుమ్మక్కయ్యారని ప్రకటించడాన్ని తప్పుబడుతున్నారు. భారత్ హైకమిషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఖలిస్తానీ మద్దతుదారులు -
జాడలేని అమృత్‌పాల్ సింగ్.. ఎన్నారై భార్యతో అక్కడికి ప్లాన్?
దేశంలో ఎక్కడ విన్నా ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ పేరే వినిపిస్తోంది. సినిమా రేంజ్లో ట్విస్ట్ ఇస్తూ వేషాలు మారుస్తూ ఐదు రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కార్లు, బైకులు మారుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఇక, అమృత్‌పాల్ దేశం విడిచి పాకిస్తాన్, నేపాల్‌లోకి వెళ్లినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్ పరారీ నేపథ్యంలో ఆయన భార్య కిరణ్‌దీప్ కౌర్‌పై పోలీసులు నిఘా పెంచారు. కిరణ్‌దీప్ సహా ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు బుధవారం విచారించారు. మహిళా పోలీసు అధికారితో సహా పోలీసు బృందం దాదాపు గంటపాటు కిరణ్‌దీప్ కౌర్ ఆమె తండ్రి తార్సేమ్ సింగ్, తల్లిని విచారించింది. అమృత్‌పాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై కిరణ్‌దీప్ కౌర్‌ను పోలీసులు ప్రశ్నించారు. ఫండింగ్ గురించి పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఇక, కిరణ్‌దీప్ యూకేకు చెందిన ఎన్నారై. ఆమె స్వస్థలం పంజాబ్‌లోని జలంధర్. కిరణ్‌దీప్‌ను అమృత్‌పాల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిచేసుకున్నాడు. వీరి పెళ్లి జల్లూపూర్ ఖేడాలో జరిగింది. కాగా, పెళ్లి తర్వాత తన భార్యను అమృత్‌పాల్ తనతోనే ఇండియాలోనే ఉండాలని కోరాడు. ఇది విదేశాల నుంచి పంజాబీల రివర్స్ మైగ్రేషన్‌ను పోత్సహించేందుకు ఉపయోగపడుతుందని ఆమెకు చెప్పినట్టు సమాచారం. మరోవైపు.. కిరణ్‌దీప్ కౌర్ కెనడా వెళ్లేందుకు ఇప్పటికే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, అమృత్‌పాల్ భారత్ విడిచి కెనడా పారిపోయే అవకాశం ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అమృత్‌పాల్ ఎక్కడున్నాడో తెలియకపోవడంతో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్(బీఎస్ఎఫ్)ను కేంద్రం అప్రమత్తం చేసింది. మరోవైపు, అంతకు ముందు.. విదేశీ ఖలిస్థానీ సానుభూతిపరుల ద్వారా వచ్చిన డబ్బుతో అమృతపాల్ అక్రమ ఆయుధాలతో పాటు 35 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కూడా కొనుగోలు చేశాడు. అతడికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నాయంటూ భద్రతా సంస్థలు గుర్తించాయి. పంజాబ్‌లో శాంతిభద్రతలను అస్థిరపరిచేందుకు యువ సిక్కులను తన గ్రూపు కిందకు తీసుకురావాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
అమృత్‌పాల్ సింగ్: సినిమాను మించిన ట్విస్ట్.. వేషం మార్చుకుంటూ..
అమృత్‌పాల్ సింగ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. ఖలిస్తాన్ వేర్పాటువాది అయిన అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు మామూలుగా ప్రయత్నించడం లేదు. సినిమా రేంజ్లో నిందితుడు.. పోలీసులు కళ్లుగప్పి వేషాలు మారుస్తూ తప్పించుకుంటున్నాడు. హాలీవుడ్ సినిమాలో ఛేజింగ్ సీన్స్‌ను తలపిస్తూ అమృత్‌పాల్ పంజాబ్ నుంచి బయటపడినట్టు సమాచారం. ఇక, దశావతారం సినిమాలో గేటప్స్ మార్చినట్టు అమృత్‌పాల్ వేషధారణ మార్చుకుంటూ కార్లు నుంచి బైక్.. బైక్ నుంచి వివిధ వాహనాలు మార్చుకుంటూ పోలీసుల వ్యూహాలకే చెక్ పెడుతున్నాడు. అమృత్‌పాల్ సింగ్ ఇప్పటి వరకు దాదాపు ఐదుకు పైగా వేషాలు మారుస్తూ బయట తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడి ఫొటోలు కూడా బయటకు రిలీజ్ చేశారు. ఈ ఫొటోలు చూసి పోలీసులు కూడా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అదేవిధంగా ఇతరులు గుర్తుపట్టకుండా అతను తన మత దుస్తులకు బదులు చొక్కా, ప్యాంటు ధరించినట్లు పోలీసు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. 🇮🇳 #Watch | 'Waris Punjab De' chief #AmritpalSingh was seen escaping in an SUV in Jalandhar on March 18. He is still on the run. (CCTV visuals) #india #mostliked pic.twitter.com/9LPIeuFdZ6 — Imminent Global News (@imminent_news) March 21, 2023 ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్ కోసం పోలీసులు గత నాలుగు రోజులుగా విస్తృతంగా గాలింపు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌ను దాటి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ కారులో టోల్గేట్ దాటిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అమృత్‌పాల్ చివరిసారిగా మెర్సిడెస్ ఎస్యూవీ వాహనంలో తప్పించుకున్నాడు. అయితే, ప్రస్తుతం అతను మారుతీ సుజికీ బ్రిజా కారులో జలంధర్‌లోని టోల్‌గేట్‌ను దాటుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఇక, చివరగా బైక్‌పై తన మద్దతుదారులతో వెళ్తున్న పుటేజీ కూడా బయటకు వచ్చింది. #BREAKING #Trending #Viral #CCTVFootage of #fugitive #AmritpalSingh fleeing on a bike after changing clothes from a Gurudwara in nangal Ambian village . @PunjabPoliceInd #PunjabPolice #Khalistan #Khalistanis #AmritpalMisleadingPunjab #Amritpal_Singh #PunjabNews #Sikhs pic.twitter.com/BmCGEscP2s — Sumedha Sharma (@sumedhasharma86) March 21, 2023 ఇది కూడా చదవండి: 80వేల మంది పోలీసులు చోద్యం చూస్తున్నారా?.. పాక్ ఏజెంట్‌గానే సూసైడ్ ఎటాక్స్‌కు ప్లాన్ -
పంజాబ్ వదిలి పారిపోయిన అమృత్‌పాల్ సింగ్?
ఖలిస్థాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు గత నాలుగు రోజులుగా భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నా. నేటీకి అతని ఆచూకీ లభించడం లేదు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో పంజాబ్ వ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. తాజాగా అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ సరిహద్దులు దాటి పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం ఓ పాడుబడ్డ కారులో అతని దుస్తులు లభించడంతో పోలీసులు ఈ విధంగా భావిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్ మెర్సిడెస్ నుంచి దిగి బ్రెజా కారులో షాకోట్‌కు పారిపోయాడని పోలీసులు తెలిపారు. అనతరం ఖలీస్తానీ వేర్పాటువాదీ తన బట్టలు మార్చుకొని తన మద్దతుదారులకు చెందిన బైక్‌పై పంజాబ్ వదిలి వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు అమృతపాల్ సింగ్ దుస్తులు, బ్రెజ్జా కారు, మరికొన్ని కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఖలిస్తానీ వేర్పాటువాదులు పారిపోవడానికి సహకరించిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు వందమందికి పైగా అతని సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ‘ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్’ (ఏకెఎఫ్) కోసం ఉపయోగిస్తున్న అక్రమ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: కోర్టులో పారదర్శకత ముఖ్యం.. ఏమిటీ సీల్డ్ కవర్ సంస్కృతి?: సుప్రీం కోర్టు అలాగే అమృత్‌పాల్ మామ హర్జీత్ సింగ్, డ్రైవర్ హర్‌ప్రీత్ సింగ్ జలంధర్‌లో పోలీసులకు లొంగిపోయారు. వీరి కారును పోలీసులు సీజ్ చేశారు. ఈ ఖలిస్తాన్ అనుకూల ఉద్యమం వెనుక పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు పంజాబ్‌లో శనివారం నుంచి మూతపడిన ఇంటర్నెట్ సేవలు నేడు(మంగళవారం)పాక్షింగా పునరుద్ధరించనున్నారు. కాగా సిక్కులకు ప్రత్యేక దేశం కావాలన్న ఖలిస్తానీ జెండాను భుజానికెత్తుకున్న యువనేత అమృత్‌పాల్, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అత్యంత సన్నిహతుడిని విడిపించుకునేందుకు తన మద్దతుతారులతో కలిసి అమృత్‌సర్‌లో పోలీస్‌స్టేషన్‌పై ఫిబ్రవరి 23న దాడి చేసినప్పటి నుంచి ఈ పరిణామం తీవ్రరూపం దాల్చింది. డీ–ఎడిక్షన్ కేంద్రాలనూ, అలాగే ఓ గురుద్వారానూ అమృత్‌పాల్ తన అడ్డాగా చేసుకొని కత్తులు, తుపాకీలు, తూటాలు... పోగేసి, ఆత్మాహుతి దాడులకు యువతరాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఖలిస్తాన్ 2.0 -
ఖలిస్తాన్ 2.0
శనివారం నుంచి మూడు రోజులుగా నిరంతర గాలింపు. అయినా దొరకలేదు. ఇప్పటికి వందమందికిపైగా అతని సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పొద్దుగూకాక కూడా నిందితుడు పోలీసుల గస్తీ కళ్ళ నుంచి తప్పించుకొని, తిరుగుతూనే ఉన్నాడు. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ అధినేత అమృత్‌పాల్ సింగ్ పరారీ, అందుకు దారి తీసిన పరిస్థితులు చూస్తే, నలభై ఏళ్ళ నాటి తీవ్రవాద సంక్షుభిత పంజాబ్ పరిస్థితులు పునరావృతమవుతున్నాయన్న ఆందో ళన కలుగుతోంది. సిక్కులకు సార్వభౌమాధికార దేశం కావాలన్న ఖలిస్తానీ జెండాను భుజానికెత్తుకున్న యువనేత అమృత్‌పాల్ ముఠా బలప్రదర్శన చేసి,అమృత్‌సర్‌లో పోలీస్‌స్టేషన్‌పై ఫిబ్రవరి 23న దాడి చేసి నెలవుతున్నా, నిన్నటి దాకా కళ్ళు తెరవని ‘ఆప్’ సర్కార్ వైఫల్యం వెక్కిరిస్తోంది. గాలివార్తలు సుడిగాలిలా వైరల్ అవుతున్న వేళ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇంటర్నెట్ సేవల్ని మంగళవారం మధ్యాహ్నం దాకా పాలకులు నిలిపివేయాల్సి వచ్చిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రూపం మార్చుకున్న సరికొత్త ఖలిస్తాన్ 2.0 విజృంభిస్తోందా? 1980–90ల్లోలా పంజాబ్ మళ్ళీ అగ్నిగుండం కానుందా? హత్యానేరం, పోలీసులపై దాడి సహా కనీసం 7 క్రిమినల్ నేరారోపణలున్న అమృత్‌పాల్ ఇప్పుడు పంజాబ్‌లో మళ్ళీ పుంజుకుంటున్న వేర్పాటువాదానికి కేంద్రబిందువయ్యాడు. మాదక ద్రవ్యాల అలవాటును మాన్పించడానికి పనిచేసే డీ–ఎడిక్షన్ కేంద్రాలనూ, అలాగే ఓ గురుద్వారానూ అమృత్‌పాల్ తన అడ్డాగా చేసుకున్నాడట. ఆ స్థావరాల్లో కత్తులు, తుపాకీలు, తూటాలు... పోగేసి, ఆత్మాహుతి దాడులకు యువతరాన్ని సిద్ధం చేస్తున్నాడని గూఢచారి వర్గాల సమాచారం. ఆయుధాలు – బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు దొరకడం, సాయుధ పోరాటం ఇష్టం లేదంటూనే ‘ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్’ (ఏకెఎఫ్) పేరును ప్రాచుర్యంలో పెట్టడం లాంటి అమృత్‌పాల్ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బంధువుల సాయంతో 20 ఏళ్ళ వయసులో దుబాయ్ వెళ్ళి, భారీ వాహనాల డ్రైవర్‌గా పని చేసి, నిరుడు భారత్‌కు తిరిగొచ్చిన ఓ యువకుడు అనూహ్యంగా ఈ స్థాయికి చేరడం చిత్రమే. నిన్నటి దాకా ఆధునిక వేషభాషల్లో ఉన్న 30 ఏళ్ళ అమృత్‌పాల్ ఇవాళ సాంప్రదాయిక సిక్కు వస్త్రధారణలో, చేతిలో కృపాణంతో, ఖలిస్తానీ ఉద్యమానికి వేగుచుక్క కావడం సహజ పరిణామం అనుకోలేం. ఈ ఖలిస్తాన్ అనుకూల ఉద్యమం వెనుక పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందన్న అనుమానం బలపడుతున్నది అందుకే. అతనికి నిధులెక్కడివన్నదీ ఆరా తీయాల్సిందే! ఇక, పలాయితుడిపై జాతీయ భద్రతా చట్టం విధిస్తారన్న వార్త పరిస్థితి తీవ్రతకు ఉదాహరణ. 1980లు, 90లలో అకాలీలు తీవ్రవాద ఆరోపణలతో అరెస్టయిన తమ అనుయాయుల విడుదల కోసం వీధికెక్కినట్టే, ఈ 2023లో అమృత్‌పాల్, ఆయన తోటి ఖలిస్తానీ మద్దతుదారులు తమ సహచరుడి విడుదల కోసం గత నెలలో వీధికెక్కారు. ఏడేళ్ళ వయసు నుంచే సాంప్రదాయిక సిక్కు ధార్మిక శిక్షణ పొందిన ఒకప్పటి ఖలిస్తానీ నేత జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేకు భిన్నంగా,అలాంటి శిక్షణేమీ లేకుండా ఉన్నట్టుండి అలాగే వేషం కట్టి, మాట్లాడుతున్నాడు అమృత్‌పాల్. స్వీయ ప్రచారం మాటెలా ఉన్నా అతనిని ‘భింద్రన్‌వాలే 2.0’ అనలేం. సాయుధ అంగరక్షకుల నడుమ ఊరూరా తిరుగుతూ, రెచ్చగొడుతున్నాడు. 1984లో అమృత్సర్ స్వర్ణాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్‌లో భింద్రన్‌వాలేను హతమార్చిన తర్వాత నాటి ప్రధాని ఇందిర, పంజాబ్ సీఎం బియాంత్ సింగ్‌లకు పట్టిన గతి నేటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పంజాబ్ సీఎం మాన్లకు పడుతుందని తొడకొడుతున్నాడు. మానిన పాత గాయాల్ని మళ్ళీ కెలుకుతున్నాడు. భారత్ పట్ల ఖలిస్తానీల విద్వేషం బ్రిటన్, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల్లో ఉన్నట్టుండి వెల్లువె త్తడం మరింత ఆందోళనకరం. బరి తెగించిన ఖలిస్తానీ దుండగులు లండన్ తదితర ప్రాంతాల్లో భారత రాయబార కార్యాలయాలపై దాడి చేయడం, జాతీయ జెండాను తొలగించడం దుస్సహం. రాయబార కార్యాలయానికి కాపుండాల్సిన ఆయా దేశాల ఉదాసీన వైఖరీ ముమ్మాటికీ తప్పే. అసలు మన బంగారం మంచిదైతేగా! పంజాబ్ సంపన్న రాష్ట్రమే కానీ, గత పదిహేనేళ్ళలో తీవ్రనిరుద్యోగంతో యువత తప్పుదోవ పడుతోంది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా 2020 – 21లో పంజాబీ సోదరులు పోరాటం సాగిస్తున్నప్పుడు దాన్ని సుదీర్ఘంగా సాగదీసిన కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత సైతం అసంతృప్తి ప్రబలడానికి ఓ కారణం. హిందూ రాష్ట్రమనే భావనను పైకి తెస్తున్న పిడి వాదులూ, పరోక్షంగా ఖలిస్తానీల సిక్కురాజ్య వాదనకు ప్రేరేపకులే! నిరుద్యోగ యువత అసంతృప్తి, రైతుల ఆగ్రహం, ‘ఉఢ్తా పంజాబ్’గా మారిన రాష్ట్రంలో ఇట్టే దొరుకుతున్న మాదక ద్రవ్యాలు, పాక్ సరిహద్దుల నుంచి ఆయుధ ప్రవాహం, పాలకుల నిస్తేజం... అన్నీ కలసిన పంచకూట కషాయమే – పంజాబ్‌లో ప్రబలుతున్న దేశవ్యతిరేక కార్యకలాపాలు. జనబాహుళ్య అసంతృప్తిని తెలివిగా వాడుకుంటూ తన పునాదిని విస్తరించుకుంటున్న అమృత్ పాల్‌కు పాక్ అండతో సాగుతున్న విదేశీ ఖలిస్తానీ మద్దతుదారులు తోడవడం అగ్నికి ఆజ్యమే. తనను తాను అతిగా ఊహించుకుంటున్న ఈ వేర్పాటువాదిని ఆదిలోనే అడ్డుకోవాలి. మొగ్గలోనే తుంచకపోతే విభజనవాదం బ్రహ్మరాక్షసిగా మారి మింగేస్తుంది. కదం తొక్కాల్సిన పాలకులు కాలహరణం చేస్తే పంజాబ్‌లో మళ్ళీ పాత చీకటి రోజులు ముందుకొస్తాయి. పారా హుషార్! -
ఇండియన్ కాన్సులేట్‌పై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి
న్యూఢిల్లీ: ఖలీస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమృత్‌పాల్ సింగ్ అరెస్టును వ్యతిరేకిస్తూ.. విదేశాల్లో భారత సంబంధిత దౌత్యపరమైన కార్యాలయాలపై వరుస దాడులకు తెగబడుతున్నారు. లండన్‌లో భారత హైకమిషన్ భవనం వద్ద భారతీయ జెండాను కిందకు లాగి అవమానపరిచే యత్నం మరిచిపోకముందే.. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై దాడికి పాల్పడ్డారు. పంజాబ్‌లో ఖలీస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ను.. సినీ ఫక్కీ ఛేజ్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా ప్రభావం చూపెడుతోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు భారత దౌతకార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆదివారం లండన్‌లోని భారతీయ హైకమిషన్ భవనం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారతీయ జెండాను కిందకు దించి.. ఖలీస్తానీ జెండాను ఎగరేసే యత్నం చేశారు. అయితే.. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ.. ఆ దేశపు దౌత్యవేత్తలకు వివరణ కోరుతూ సమన్లు సైతం జారీ చేసింది. అయితే.. తాజాగా శాన్ ఫ్రొన్సిస్కో(యూఎస్ స్టేట్ కాలిఫోర్నియా)లోని ఇండియన్ కాన్సులేట్ భవనంపై దాడి జరిగింది. గుంపుగా వచ్చిన కొందరు దాడికి పాల్పడడంతో పాటు అక్కడి గోడలపై ఫ్రీ అమృత్‌పాల్(అమృత్‌పాల్‌ను విడుదల చేయాలి) అంటూ రాతలు రాశారు. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో పంజాబీ సంగీతం భారీ శబ్ధంతో వినిపిస్తోంది. దాడికి పాల్పడిన దుండగుల్లోనే కొందరు వీడియోలు తీయడం విశేషం ఇక్కడ. ఈ పరిణామంపై అదనపు సమాచారం అందాల్సి ఉంది. After London, now San Francisco - Indian consulate in San Francisco is attacked by Khalistan supporters. For Modi’s security, Rs 584 crores spent every year, but India’s diplomatic missions are left unsecured. pic.twitter.com/scJ9rKcazW — Ashok Swain (@ashoswai) March 20, 2023 ఇదీ చదవండి: త్రివర్ణ పతాకాన్ని అవమానం నుంచి కాపాడారు! -
పంజాబ్‌లో హైటెన్షన్.. అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్
ఛండీఘర్: పంజాబ్‌లో హైటెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా పంజాబ్ పోలీసులు ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని పలు జిల్లాల్లో పోలీసులు ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. వివరాల ప్రకారం.. ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్‌ను పోలీసులు జలంధర్‌లో శనివారం అరెస్ట్ చేశాడు. దాదాపు 50 పోలీసులు వాహనాలు అతడిని వెంబడించి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అమృత్ పాల్ సింగ్ అనుచరులు దాడులకు, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాల్లో పోలీసులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అలాగే, భద్రతను పటిష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్ సింగ్ ‘వారిస్ పంజాబ్ దే’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ద్వారా పంజాబ్‌లో ఖలిస్తాన్ అనుకూల భావజాలాన్ని పోత్సహిస్తున్నాడు. దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో పోలీసులు అతడిపై నిఘా వేశారు. ఈ క్రమంలో అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఇటీవలే అమృత్‌పాల్ సింగ్ దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని పోలీసులకే సవాల్ విసిరాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారిస్ పంజాబ్ దే సంస్థ చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌తో సహా అతడి అనచరులు ఆరుగురిని జలంధర్‌లో అరెస్ట్ చేశారు. అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో అలర్ట్ అయిన పంజాబ్ పోలీసులు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా చదవండి: అస్సాంలోని మదర్సాలన్నిటినీ మూసేస్తాం -
భింద్రన్‌వాలే 2.0: అమృత్‌పాల్ సింగ్
‘సిద్ధాంతానికి చావుండదు. మా సిద్ధాంతమూ అంతే’ ‘మా లక్ష్యాన్ని మేధోపరంగా, భౌగోళిక రాజకీయపరంగా చూడాలి’ ‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని అడ్డుకుంటే ఇందిరకు పట్టిన గతే అమిత్ షాకూ పడుతుంది’ – ఇవీ... తనను తాను ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడిగా ప్రకటించుకున్న అమృత్ పాల్ సింగ్ వ్యాఖ్యలు! ఏదైనా ‘చేస్తా’నని బహిరంగంగా చెప్పి మరీ చేస్తున్నాడు. ఎవరితను? అతని సారథ్యంలో ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోందా...? అమృత్‌పాల్ సింగ్ రాకతో ఏడాదిగా ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమ వాణి బలంగా మళ్లీ వినిపిస్తోంది. అచ్చం ఆపరేషన్ బ్లూ స్టార్‌లో మరణించిన కరడుగట్టిన ఖలిస్తానీ తీవ్రవాది భింద్రన్‌వాలే మాదిరిగా నీలం రంగు తలపాగా చుట్టుకొని, తెల్లటి వస్త్రధారణతో మాటల తూటాలు విసురుతూ యువతను ఉద్యమం వైపు ప్రేరేపిస్తున్నాడు. ఇటీవలి దాకా ఎవరికీ పెద్దగా తెలియని అమృత్‌పాల్ కేంద్రంపై తరచూ విమర్శలతో ఉన్నట్టుండి చర్చనీయాంశంగా మారిపోయాడు. ఎవరీ అమృత్‌పాల్ 29 ఏళ్ల అమృత్ పాల్ సింగ్ గతేడాది దాకా దుబాయ్‌లోనే రవాణా వ్యాపారంలో ఉన్నాడు. సంప్రదాయాలకు అంత విలువనిచ్చేవాడు కాదు. కానీ నటుడు దీప్ సిద్ధూ స్థాపించిన ‘వారిస్ పంజాబ్ దే’సంస్థ సభ్యుడు. 2022 ఫిబ్రవరిలో దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సంస్థను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. పంజాబ్‌కు తిరిగి వచ్చి, అణగారిన ఖలిస్తానీ ఉద్యమానికి తన మాటలు, చేతలతో మళ్లీ ఊపిరిలూదుతున్నాడు. హింసామార్గాన్నే ఎంచుకున్న అమృత్‌పాల్ అచ్చం పాకిస్తాన్ ఐఎస్ఐ తరహాలో ఉద్యమాన్ని నడిపిస్తున్నాడన్న ఆందోళనలున్నాయి. ఏమిటీ ఖలిస్తాన్ ఉద్యమం? ఖలిస్తాన్ అంటే పంజాబీలో పవిత్రమైన భూమి. సిక్కులకు ప్రత్యేక దేశమే కావాలంటూ 1940లో ఖలిస్తాన్ ఉద్యమం ప్రారంభమైంది. భారత్‌లో పంజాబ్‌ను తమ మాతృభూమిగా ప్రకటించాలంటూ సిక్కులు ఇప్పటిదాకా ఎన్నో ఉద్యమాలు నడిపారు. 1970–80ల్లో తార స్థాయికి వెళ్లిన ఈ ఉద్యమాన్ని ప్రధాని ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్‌తో అణచి వేశారు. ఏకంగా అమృత్సర్ స్వర్ణ దేవాలయా న్ని కేంద్రంగా చేసుకొని సమాంతర ప్రభుత్వా న్నే నడిపిన ఖలిస్తానీ నేత భింద్రన్‌వాలేను స్వర్ణ దేవాలయంలోకి చొచ్చు కెళ్లి మరీ సైన్యం హతమార్చింది. అలా చల్లబడ్డ ఉద్యమం ఇప్పుడు విస్తరిస్తున్నట్టు కనిపిస్తోంది. అమృత్ పాల్ కూడా స్వర్ణ దేవాలయం కేంద్రంగానే మరింత కాక రాజేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వర్ణ దేవాలయంపై దాడిని నిరసిస్తూ ఇందిరను ఆమె సిక్కు అంగరక్షకులే బలిగొన్న తరహాలో అమిత్ షా తమ టార్గెట్ అంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు! కెనడా కనెక్షన్ కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో సిక్కు జనాభా ఎక్కువ. దాంతో ఆయా దేశాల్లో ఖలిస్తానీ ఉద్యమ ప్రభావం బాగా కనిపిస్తుంటుంది. అక్కడి హిందూ ఆలయాలపై, గణతంత్ర వేడుకలు జరుపుకునే వారిపై దాడులు పరిపాటిగా మారాయి. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఖలీస్తాన్ ఉద్యమకారులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉంటారు. కెనడాలోనైతే సిక్కు జనాభా మరీ ఎక్కువ. ప్రభుత్వంలోనూ సిక్కుల ప్రాబల్యముది. ప్రత్యేక ఖలిస్తాన్ కోసం ఖలీస్తాన్ ఉద్యమ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (సీఎఫ్‌జే) కెనడాలో ఏకంగా రిఫరెండం నిర్వహించగా లక్షకు మందికిపైగా సిక్కులు ఓటింగ్‌లో పాల్గొన్నారు! దీన్ని ఆపాలని మోదీ ప్రభుత్వం కోరినా కెనడా ప్రభుత్వం ఒప్పుకోలేదు. అది తమ చట్టాల ప్రకారం ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతోందంటూ అనుమతి నిచ్చింది. భారత్ నుంచి పంజాబ్‌ను విడదీసి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఏకంగా ఐక్యరాజ్యసమితికే విజ్ఞప్తి చేయడానికి ఖలీస్తాన్ మద్దతు çసంఘాలు యూఎన్‌ను సంప్రదించనున్నాయి! ఖలిస్తానీ శక్తులు పుంజుకుంటున్నాయా ? తన అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను ఓ కిడ్నాపింగ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుంటే అమృత్‌సర్‌లో అమృత్ పాల్ సృష్టించిన భయోత్సాతాన్ని అంతా దిగ్భ్రమతో చూశారు. కత్తులు, కటార్లే గాక అధునాతన తుపాకులు కూడా చేతబట్టుకొని వేలాది మంది సిక్కులు పోలీసుస్టేషన్లోకి చొరబడటమే గాక ఏకంగా పోలీసులతో బాహాబాహీకి దిగారు. దాంతో పంజాబ్ ఆప్ ప్రభుత్వం అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవంటూ విడుదల చేసిన పరిస్థితి! ఈ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది. అంతకుముందు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేసినప్పుడు ఢిల్లీలో ధర్నా సందర్భంగా ఏకంగా చారిత్రక ఎర్రకోటపైనే ఖలిస్తాన్ జెండా ఎగురవేశారు! వీధుల్లో వీరంగం వేశారు. ఖలిస్తానీ శక్తులు బలం పుంజుకుంటున్నా యనడానికి ఇవన్నీ తార్కాణాలే. ఏడాది కాలం జరిగిన రైతు ఉద్యమం వెనకా ఖలిస్తానీ వేర్పాటు వాదుల హస్తమే ఉందంటారు. ఖలీస్తానీ ఉద్యమ పునాదులపై పుట్టిన అకాలీదళ్ పార్టీ బలహీనపడిపోతున్న తరుణంలో అమృత్‌పాల్ రూపంలో కొత్త గళం బలంగా వినిపించడం ప్రారంభమైంది. ఆప్ పాత్రపై అనుమానాలు పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తానీ వేర్పాటువాదులకు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. పెచ్చరిల్లిన హింసాకాండ, కాల్చి చంపడాల నేపథ్యంలో గన్ లైసెన్సులపై ఇటీవల సంపూర్ణ సమీక్ష నిర్వహిస్తున్న పంజాబ్ పోలీసులు ఎవరి దగ్గర ఆయుధాలు, తుపాకులున్నా వెంటనే కేసులు పెడుతున్నారు. కానీ బాహాటంగా ఆయుధాలు చేబూని తిరుగుతూ భయోత్పాతానికి దిగుతున్న అమృత్‌పాల్, అతని అనుచరులపై ఇప్పటిదాకా ఒక్క కేసూ నమోదవలేదు! ఏకంగా కేంద్ర హోం మంత్రికే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రభుత్వ పెద్దలను బాహాటంగా బెదిరిస్తున్నా చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. దీని వెనక రాజకీయ కారణాలున్నాయనే అభిప్రాయాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయానికి ఖలీస్తాన్ శక్తులే తోడ్పాటు అందించినట్టు విశ్లేషణలున్నాయి. అందుకే ఇప్పుడు వారి ఆగడాలపై ఆప్ నోరు మెదపడం లేదంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఇక పంజాబ్‌లో మిలిటెంట్ కార్యకలాపాల్లో దోషులుగా తేలి 30 ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న బందీ సింగ్ (సిక్కు ఖైదీ)ల విడుదల కోసం వారి మద్దతుదారులు వేలాదిగా రోడ్డెక్కి నిరసనలకు దిగుతున్నారు. ఇలా ఈ మధ్య ఖలీస్తాన్ వేర్పాటువాదులు ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. -
అర్షదీప్ వ్యవహారం.. కేంద్రం తీవ్రస్పందన
టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్‌పై కొందరు టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆదివారం పాక్‌తో మ్యాచ్ సందర్భంగా.. మ్యాచ్‌ను మలుపు తిప్పే కీలకమైన క్యాచ్‌ను వదిలేశాడంటూ అర్షదీప్‌ను తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో పాటు పలువురు ఆటగాళ్లు, మాజీల మద్దతు అతనికి లభిస్తోంది. అయితే.. అర్షదీప్ సింగ్ వ్యవహారంలో అనుచితమైన చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు. అతనిపై దాడి చేస్తామని, చంపేస్తామని కొందరు బైకులపై తిరుగుతూ గోల చేయడం తెలిసిందే. తాజాగా అతనికి నిషేధిత సంస్థ ఖలీస్తానీతో సంబంధం ఉందంటూ తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. అతని వికీపీడియా పేజీలో భారత్ స్థానంలో ఖలిస్తాన్ అంటూ ఎడిట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. అయితే.. ఈ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. వికీపీడియా పేజీలో చోటు చేసుకున్న తప్పుడు సమాచారం వల్ల మత సామరస్యం దెబ్బతింటుందని, పైగా అర్షదీప్ కుటుంబ సభ్యులకు ముప్పు ఏర్పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్‌లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది. తప్పుడు సమాచారం ఎలా ప్రచురితమైందో వివరణ ఇవ్వాలని అందులో కోరింది. ఇదిలా ఉంటే.. అర్షదీప్ వికీపీడియా పేజీలో భారత్ అని ఉన్న చోట.. ఖలిస్తాన్ అని జత చేశారు. అది అన్‌రిజిస్టర్డ్ అకౌంట్ నుంచి జత అయినట్లు తెలుస్తోంది. అయితే.. 15 నిమిషాలోపే వికీపీడియా ఎడిటర్స్ ప్రొఫైల్‌ను సవరించారు. ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి పాలైన తర్వాత అర్షదీప్ సింగ్‌పై కొందరు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మ్యాచ్‌లో భాగంగా 18వ ఓవర్లో మూడో బంతికి రవి బిష్ణోయ్ వేసిన బంతిని అసిఫ్ అలీ స్వీప్ షాట్ అడగా.. సలువైన క్యాచ్‌ను అర్షదీప్ జారవిడిచాడనే విమర్శ చెలరేగింది. అయితే.. ఉత్కంఠభరితమైన చివరి ఓవర్లో అర్షదీప్ సింగ్ పరుగుల కట్టడికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్షదీప్‌కు విపరీతమైన మద్దతు లభిస్తోంది. Catch drop by arshdeep singh 😭#arshdeepsingh #INDvPAK #INDvsPAK2022 pic.twitter.com/ttxabkCArI — Girish Singh rajput (@GirishSinghraj3) September 4, 2022 Senior pro Virat Kohli backs youngster Arshdeep Singh, who had a volatile day at the field today#AsiaCup2022 #INDvsPAK #ViratKohli #ArshdeepSingh pic.twitter.com/FYPl5N4PMx — OneCricket (@OneCricketApp) September 4, 2022 He is best in death overs , we can’t blame for his one match.. I stand with #arshdeepsingh #INDvsPAK2022 pic.twitter.com/pDkbYTrBWY — Karan Sandhu (@Karanbi03633746) September 5, 2022 #NewProfilePic pic.twitter.com/ksSXCNMOgC — Aakash Chopra (@cricketaakash) September 5, 2022 ఇదీ చదవండి: చిన్న పొరపాట్లే మిస్త్రీ ప్రాణాలు తీశాయా? -
‘దీక్షా’దక్షతకు సలాం
ఒకే డిమాండ్, ఒకే ఒక్క డిమాండ్ మూడు ‘నల్ల’ సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలనే ఆ ఒక్క డిమాండ్ సాధన కోసం రైతన్నలు ఏడాది పాటు సుదీర్ఘ పోరాటం చేశారు లాఠీలు విరిగినా, కేసులు పెట్టినా, హింస చెలరేగినా వాహనాలే యమపాశాలై ప్రాణాలు తీసినా అదరలేదు, బెదరలేదు, వెనకడుగు వెయ్యలేదు ఎండనక వాననక, గడ్డకట్టించే చలిని లెక్కచేయక కరోనా మహమ్మారికి బెదిరిపోక ఢిల్లీ, హరియాణా సరిహద్దుల్లోనే ఏడాదిగా మకాం వేసి చివరికి ఎలాగైతేనేం కేంద్రం మెడలు వంచారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన పోరాటం పంజాబ్‌లో మొదలై హరియాణాకి వ్యాపించి, ఉత్తరప్రదేశ్‌లో హింసకు దారి తీసి దేశవ్యాప్తంగా అన్నదాతల్ని ఏకం చెయ్యడంతో కేంద్రం దిగొచ్చింది. కరోనాని లెక్కచేయకుండా, చలి ఎండ వాన వంటి వాతావరణ పరస్థితుల్ని తట్టుకొని, భార్యాపిల్లల్ని విడిచిపెట్టి, రోడ్లపైనే నిద్రించి మొక్కవోని దీక్షతో ఏడాది పాటు సుదీర్ఘంగా సాగిన ఉద్యమంలో రైతన్నలు చివరికి విజయం సాధించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2020 జూన్‌లో వ్యవసాయ చట్టాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడంతో ఈ చట్టాలను దొడ్డదారిలో తెచ్చింది తమ పుట్టి ముంచడానికేనని రైతన్నలు బలంగా నమ్మారు. కిసాన్ సంఘర్‡్ష సమన్వయ కమిటీ సెప్టెంబర్ 25న దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది. సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను ఆమోదించడంతో రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్3 న వివిధ రైతు సంఘాలు చేసిన రైతు నిరసనలు మొదట్లో పంజాబ్ చుట్టుపక్కల ప్రాంతానికే పరిమితమయ్యాయి. నవంబర్ 25న రైతు సంఘాలు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి దానిపై పడింది. కేంద్ర ప్రభుత్వం పదకొండు రౌండ్లు రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఏడాదిన్నర పాటు చట్టాలను వెనక్కి తీసుకుంటామన్న కేంద్రం ప్రతిపాదనలకు కూడా రైతులు అంగీకరించలేదు. చట్టాల రద్దు తప్ప మరి దేనికీ తలవంచమంటూ పోరుబాట పట్టారు. ప్రతీ దశలోనూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతలా అణిచివేయాలని చూస్తే అంతలా పైపైకి లేచింది. ఒక్కో ఎదురుదెబ్బ తగిలినప్పుడలా మరింత బలం పుంజుకుంటూ వచ్చింది. దేశవ్యాప్తంగా 40 సంఘాలకు చెందిన రైతులు ‘సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)’ పేరిట ఒకే గొడుకు కిందకు వచ్చి ఢిల్లీ, హరియాణా, యూపీ సరిహద్దుల్లోని సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ వద్ద శిబిరాలు వేసుకొని అక్కడే మకాం వేశారు. కుటుంబాలను విడిచిపెట్టి వచ్చిన రైతులు సామూహిక వంటశాలలు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేసుకొని ఏడాదిగా అక్కడే ఉంటున్నారు. ‘కిసాన్ ఏక్తా జిందాబాద్’ అన్న నినాదం ఢిల్లీలో మారుమోగడమే కాదు, అదే ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎర్రకోట సాక్షిగా మలుపు తిరిగిన ఉద్యమం ఒకానొక దశలో సాగు చట్టాలపై రైతుల ఉద్యమం నీరుగారిపోతుందని అందరూ భావించారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్రదినోత్సవం నాడు రైతు సంఘాల నాయకులు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింస, ఘర్షణలు ఉద్యమాన్ని మరో మలుపు తిప్పాయి. కొంతమంది నిరసనకారులు ఎర్రకోట గోడలు మీదుగా ఎక్కి సిక్కు మతం చిహ్నమైన నిషాన్ సాహిబ్ జెండాని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలతో రాజధాని రణరంగంగా మారింది. రైతు ఉద్యమం ఖలిస్తాన్ వేర్పాటువాద చేతుల్లోకి వెళ్లిపోయిందన్న ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో రైతులు సరిహద్దులు ఖాళీ చేసి వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించారు. ఆ సమయంలో భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ పెట్టుకున్న కన్నీళ్లు మళ్లీ ఉద్యమ నిప్పుకణికని రాజేసాయి. ఇంటి బాట పట్టిన నిరసనకారులందరూ తిరిగి ఢిల్లీ సరిహద్దుల్లో మకాం వేశారు. ఏడాదిగా జరుగుతున్న ఈ పోరాటంలో ఘర్షణలు, హింసాత్మక ఘటనలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంతో 700 మందికి పైగా రైతులు మరణించారు. మరెందరో రైతులపై కఠినమైన చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. యూపీకి వ్యాపించి, రణరంగంగా మారి: ఆ తర్వాత నుంచి రైతు సంఘం నాయకులు పక్కా ప్రణాళికతో రహదారులు దిగ్బంధించడం, రైలు రోకోలు, నిరసన ర్యాలీలు, బ్లాక్ డే వంటివి చేస్తూ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాకేశ్ తికాయత్ ర్యాలీలు చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రైతు ఉద్యమం ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ పాప్ స్టార్ రిహన్నా దీనిపై మనం ఎందుకు మాట్లాడడం లేదు అంటూ లేవనెత్తిన ప్రశ్నతో అంతర్జాతీయంగా అన్నదాతలకు మద్దతు లభించింది. టీనేజీ పర్యావరణవేత్త గ్రేటా థెన్‌బర్గ్ , అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేనకోడలు లాయర్ అయిన మీనా హ్యారిస్ వంటివారు రైతుల గళానికి బలంగా నిలిచారు.మే 27న రైతు ఉద్యమానికి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా బ్లాక్ డే పాటించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. జులైలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఢిల్లీలో 200 మందికిపైగా రైతులు జంతర్మందర్ దగ్గర కిసాన్ సంసాద్ నిర్వహించారు. సెప్టెంబర్5న యూపీలోని ముజఫర్‌నగర్‌లో రైతు సంఘం నాయకులు బలప్రదర్శన చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదీ తమ బలం అంటూ చూపించారు. ఇక యూపీలోని లఖీమ్‌పూర్‌ఖేరిలో అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనలతో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకి వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతన్నలపై ఎస్యూవీ దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు బలి కావడం , ఆ వాహనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నారన్న ఆరోపణలు మోదీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో రైతులపై ప్రజల్లో సానుభూతి పెల్లుబుకింది. వచ్చే ఏడాది అత్యంత కీలకమైన యూపీ, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రైతు ఉద్యమం అంతకంతకూ బలం పుంజుకుంటూ ఉండడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ఏడాది పాటు జరిగిన జరిగిన ఉద్యమం విజయతీరాలకు చేరుకుంది. సుప్రీం నిలిపివేసినా... ఉద్యమం ఆగలేదు! వ్యవసాయ చట్టాలపై ఒకవైపు రైతులు వివిధ రకాలుగా తమ నిరసన వ్యక్తం చేస్తూనే మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాల నాయకులు డిసెంబర్ 11న వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టాల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టులో దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి విచారించడానికి ఈ ఏడాది జనవరి 7న సుప్రీం కోర్టు అంగీకరించింది. వ్యవసాయ చట్టాలపై నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక కమిటీ వేయడానికి జనవరి 11న అంగీకరించింది. ఆ మర్నాడు జనవరి 12న వ్యవసాయ చట్టాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ నిపుణులు అనిల్ ఘన్వత్, అశోక్ గులాటీ, ప్రమోద్ జోషిలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదికని మార్చి 19న సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో సమర్పించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దాని ప్రక్రియను పూర్తి చేస్తే ఇక న్యాయస్థానంలో కేసే ఉండదు. ఆ పిటిషన్లన్నీ ప్రయోజనం లేకుండా మిగిలిపోతాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
స్వర్ణ దేవాలయంలో ఖలిస్తానీ నినాదాలు
అమృత్సర్: పంజాబ్‌లో సిక్కుల ప్రధాన దేవాలయమైన గోల్డెన్ టెంపుల్లో ఆదివారం ఖలిస్తాన్ నినాదాలు వినిపించాయి. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్‌లో భాగంగా గోల్డెన్‌టెంపుల్‌లో నక్కిన ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు 37 ఏళ్లు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఖలిస్తాన్ మద్దతు నినాదాలు వినిపించాయి. ఇందులో నినాదాలు చేసిన వారు శిరోమణి అకాలీదళ్ (మన్)కు చెందిన వారు కావడం గమనార్హం. జనవరి 26న రైతుల ట్రాక్టర్ మార్చ్‌లో జరిగిన హింసకు బాధ్యుడని భావిస్తున్న దీప్ సిద్దూ.. మాజీ ఎంపీ సిమ్రాన్‌జిత్ సింగ్ మన్తో కలసి ఈ సమావేశంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ సందర్భంగా జతేదార్ హర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ బ్లూ స్టార్ గాయాలను సిక్కు వర్గం ఇంకా మర్చిపోలేదన్నారు. -
రైతు ఉద్యమం : ఆ ఖాతాలకు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు ఆందోళన నేపథ్యంలో సోషల్ మీడియాపై గుర్రుగా ఉన్న కేంద్రం ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీలో హింస తరువాత ట్విటర్ ఖాతాలపై మరింత కన్నేసిన సర్కార్ ఖలీస్తాన్ సానుభూతి పరులతో లేదా పాకిస్తాన్ లింకులున్న ఖాతాలను బ్లాక్ చేయాలంటూ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌కు తాజాగా నోటీసు ఇచ్చింది. తప్పుడు సమాచారంతో, "రైతుల మారణహోమం" లాంటి ప్రమాదకర హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్న 250 ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం ఇటీవల కోరిన కొన్ని రోజుల తరువాత తాజా ఆదేశాలివ్వడం గమనార్హం. హోం మంత్రిత్వ శాఖ నివేదిక మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ ఈనోటీసు లిచ్చింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ వేదికగా రైతుల ఆందోళనలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ, రైతులను రెచ్చగొడుతున్న పాకిస్తాన్ , ఖలీస్తాన్‌తో సంబంధాలున్న 1,178 ఖాతాలను తొలగించాలని కేంద్రం కోరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నాయని కేంద్రం ఆరోపించింది. అయితే దీనిపై ట్విటర్ ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టిన సమాచారం లేదు. ఇదిలా ఉంటే ట్విటర్ ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ మహిమా కౌల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలరీత్యా పదవినుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. కౌల్ ఈ జనవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ, బాధ్యతల మార్పిడి సౌలభ్యం కోసం మార్చి వరకు పదవిలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. కానీ అనూహ్య రాజీనామా చర్చకు దారి తీసింది. అయితే ఈ వివాదానికి ఆమె రాజీనామాకు సంబంధం లేదని భావిస్తున్నప్పటికీ, కొందరు పెద్దల ఒత్తిడితోనే కౌల్ ముందస్తు రాజీనామా చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. కాగా సుమారు మూడు నెలలకాలంగా కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం కొనసాగుతోంది. చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఆ 40 వెబ్సైట్లపై వేటు!
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాద కార్యకలాపాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)కు చెందిన 40 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్టు హోంమంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. అమెరికాకు చెందిన ఎస్ఎఫ్జే ఖలిస్తాన్ అనుకూల ఉగ్ర సంస్థ. ప్రత్యేక ఖలిస్తాన్ ఉద్యమం కోసం పనిచేసే వారిని నిషేధిత ఎస్ఎఫ్జే ప్రోత్సహిస్తోంది. హోంమంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా ఎలక్ర్టానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎస్ఎఫ్జేకు చెందిన 40 వెబ్సైట్లను బ్లాక్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ గత ఏడాది ఎస్ఎఫ్జేను హోంమంత్రిత్వ శాఖ నిషేధించింది. ఎస్ఎఫ్జే బాహాటంగా ఖలిస్తాన్‌కు మద్దతు ఇస్తోందని, ఫలితంగా దేశ సమగ్రత, సార్వభౌమత్వం, భౌగోళిక స్వరూపాలకు సవాళ్లు ఎదురవుతాయని హోం మంత్రిత్వ శాఖ అధికారి వ్యాఖ్యానించారు. వేర్పాటువాద అజెండాతో ముందుకొచ్చిన ఎస్ఎఫ్జే ఖలిస్తాన్‌పై సిక్కుల రిఫరెండంకు పిలుపుఇచ్చింది. చదవండి : పంజాబ్‌లో ఉగ్ర దాడికి భారీ స్కెచ్.. -
కర్తార్‌పూర్ వీడియోలో ఖలిస్తాన్ నేతలు?
లాహోర్: సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి వేడుకల సందర్భంగా పాకిస్థాన్ విడుదల చేసిన ఒక వీడియోలో ఖలిస్తాన్ నేతలు ఉండటం వివాదమైంది. ఆపరేషన్ బ్లూస్టార్ (1984)లో మరణించిన భింద్రన్‌వాలే, అతడి మిలటరీ సలహాదారు షాబేగ్ సింగ్‌లు ఉన్న వీడియోను పాకిస్థాన్ సోమవారం విడుదల చేసింది. ఖలిస్తాన్ ఉద్యమానికి అనుకూలంగా ఉన్న సిఖ్స్ ఫర్ జస్టిస్ బ్యానర్ ఈ వీడియోలో ఉండటం గమనార్హం. సరిహద్దు వెంట పంజాబ్‌లోని బాబా నానక్ గుడిని.. పాకిస్థాన్‌వైపు ఉన్న కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను కలుపుతూ నిర్మించిన కర్తార్‌పూర్ కారిడార్ త్వరలో మొదలుకానున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదల వివాదమైంది. -
సెమీఫైనల్లో కలకలం
మాంచెస్టర్: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో మంగళవారం కలకలం రేగింది. ఓల్డ్ టఫోర్డ్ స్టేడియంలో ఖలిస్తాన్ మద్దతుదారులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సివచ్చింది. నలుగురు ఖలిస్తాన్ వేర్పాటువాదులకు బేడిలు వేసి స్టేడియం నుంచి బయటకు తీసుకెళ్లారు. అరెస్ట్ సందర్భంగా ఆందోళనకారుల నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రాజకీయ సందేశాలు రాసివున్న టీషర్ట్స్ ధరించి నలుగురు సిక్కులు స్టేడియంలోకి వచ్చారని, ఇలాంటి వాటికి అనుమతి లేదన్నారు. తమకు ప్రత్యేకంగా ఖలిస్తాన్ దేశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నలుగురు స్టేడియంలో బ్యానర్లు ప్రదర్శించారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది. ఉత్తర పంజాబ్ నుంచి తమను వేరు చేసి ప్రత్యేక దేశం ఇవ్వాలని ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచకప్ వన్డే మ్యాచ్‌ల్లో ఇంతకుముందు కూడా రాజకీయ సందేశాలున్న బ్యానర్లు ప్రదర్శించారు. ‘కశ్మీర్‌కు న్యాయం చేయాలి’ అంటూ భారత్-శ్రీలంక మ్యాచ్ సందర్భంగా కొంతమంది బ్యానర్ ప్రదర్శించారు. కాగా, వర్షం కారణంగా మంగళవారం ఆట నిలిచిపోవడంతో భారత్-కివీస్ సెమీఫైనల్ మ్యాచ్‌ను నేడు కొనసాగించనున్నారు. (చదవండి: భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ నేడు కొనసాగింపు) -
మా సమగ్రతను ప్రశ్నిస్తే సహించం
న్యూఢిల్లీ: భారత్ ఐక్యతను, సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను సవాలుచేస్తే సహించబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రాజకీయ లక్ష్యాలు, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి మతాన్ని దుర్వినియోగం చేసేవారికి ప్రపంచంలో ఎక్కడా చోటు ఉండకూడదన్నారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులపై కెనడా ప్రభుత్వ ఉదాసీన వైఖరిని పరోక్షంగా ప్రస్తావిస్తూ మోదీ మాట్లాడారు. శుక్రవారం నాడిక్కడ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో భేటీ అయిన మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. తర్వాత సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడారు.‘ ఇరుదేశాల మధ్య రక్షణ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. భిన్న సంస్కృతులున్న భారత్, కెనడా వంటి ప్రజాస్వామ్య దేశాలకు ఉగ్రవాదం, తీవ్రవాదాలే ప్రధాన ముప్పు. వీటిని తుదముట్టించడానికి కలసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నాం’ అని మోదీ అన్నారు. ట్రూడో పర్యటన సందర్భంగా ఇరుదేశాలు వాణిజ్యం, ఇంధన భద్రత, ఉన్నత విద్య, సైన్స్ అండ్ ఐటీ, మేధో సంపత్తి హక్కులు, అణు రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ట్రూడో దేశమంతా పర్యటించడాన్ని ఉటంకిస్తూ.. భారత్‌లోని భిన్నత్వం ఈ పర్యటనలో ఆయనకు అర్థమై ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు. ట్రూడోకు ఘన స్వాగతం: అంతకుముందు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ట్రూడో కుటుంబానికి మోదీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ట్రూడోను మోదీ ఆలింగనం చేసుకున్నారు. పర్యటనలో భాగంగా ట్రూడో కుటుంబం రాజ్‌ఘాట్‌ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించింది. మోదీ–ట్రూడోల సమావేశం అనంతరం ‘విభిన్న సంస్కృతులు, జాతుల సమాజాలున్న భారత్, కెనడాలు ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కులు, సమన్యాయ పాలనకు కట్టుబడి ఉన్నాయి. అల్‌కాయిదా, ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి అంగీకరించాం’ అని భారత్–కెనడాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ పర్యటనలో భాగంగా ట్రూడో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీలను కలుసుకున్నారు. ట్రూడో భార్య, పిల్లలతో సరదాగా ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ -
'పంజాబ్‌కు ఏం కాదు.. కలిసే ఉంటుంది'
సాక్షి, అమృత్సర్ : ఐక్య భారత్‌కే తమ దేశం కట్టుబడి ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. భారత్‌లోగాని, మరెక్కడైనాగానీ విభజన ఉద్యమాలకు తమ దేశం మద్దతివ్వబోదని చెప్పారు. ఖలిస్థాన్ డిమాండ్ తగ్గుముఖం పట్టేందుకు కూడా తన వంతు కృష్టి చేస్తానంటూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌కు ట్రూడో హామీ ఇచ్చారు. పంజాబ్ ఎప్పటికీ కలిసే ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో విడిపోదని ఆయన హామీ ఇచ్చారు. కెనడాలో కొంతమంది సిక్కులు ఖలిస్తాన్ డిమాండ్ చేస్తుండటంతో ట్రూడో పంజాబ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ డిమాండ్ సరైనది కాదని, ఐక్య పంజాబ్ తమకు కావాలని, ఈ డిమాండ్ తగ్గుముఖం పట్టేందుకు తమకు సహకరించాలని ట్రూడోను సీఎం అమరిందర్ సింగ్ కోరారు. 'నేను ట్రూడోకు చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ ఖలిస్తాన్ అనేది ప్రధాన సమస్య. దీనికోసం వివిధ దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా కెనడా నుంచి ఎక్కువగా వస్తున్నాయి. పంజాబ్‌ను అల్లకల్లోలం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాటికి మీరు సహకరించొద్దు. ఐక్యభారత్కు సహకరించాలి' అని తాను ట్రూడోను కోరినట్లు చెప్పారు. అందుకు ట్రూడో నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. -
‘ఖలిస్తాన్’ నేత హర్మిందర్ అరెస్టు
నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లో అదుపులోకి.. న్యూఢిల్లీ: పంజాబ్‌లోని నభా జైలు నుంచి తప్పించుకున్న తీవ్రవాది, ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూను పోలీసులు కొన్ని గంటల్లోనే చాకచక్యంగా నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లో అరెస్టు చేశారు. మలేసియా, లేదా జర్మనీకి పారిపోయేందుకు యత్నిస్తుండగా ఢిల్లీ, పంజాబ్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. జైలునుంచి తప్పించుకున్న మిగిలిన ఐదుగురు ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జైలు నుంచి తప్పించుకున్నాక హర్మిందర్ కదలికలపై నిఘా పెట్టిన పంజాబ్ పోలీసులు.. ఢిల్లీ వైపుగా వెళ్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ పోలీసుల సహకారంతో జారుుంట్ ఆపరేషన్ చేపట్టి నిజాముద్దీన్ రైల్వేస్టేషన్ పార్కింగ్ వద్ద అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పిస్టల్, ఆరు కాట్రిడ్జిలు స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ కమిషనర్ అర్వింద్ దీప్ చెప్పారు. పన్వల్ వరకూ హర్మిందర్ టికెట్ కొన్నాడని, అక్కడి నుంచి ముంబై లేదా గోవాకు వెళ్లి అనంతరం విదేశాలకు పారిపోవాలని నిర్ణరుుంచుకున్నట్లు తేలిందన్నారు.హర్మిందర్‌ను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 7 రోజుల కస్టడీకి అప్పగించింది. 6 నెలలుగా జైలు నుంచి తప్పించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నామని, గురుప్రీత్ సింగ్, హర్జిందర్ సింగ్‌లు సూత్రధారులని హర్మిందర్ విచారణలో చెప్పాడు. మరో సూత్రధారి పర్మిందర్‌ను ఆదివారం యూపీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. పరారీలో ఉన్న ఉగ్రవాది కశ్మీరాసింగ్, మిగతా నలుగురు గ్యాంగ్స్టర్లు కర్నాల్, పానిపట్ పరిసర ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు పర్మిందర్ విచారణలో చెప్పాడు. -
ఖలిస్తాన్ నినాదాలతో మార్మోగిన ఆలయం
ఆపరేషన్ బ్లూస్టార్ 31వ వార్షికోత్సవం సందర్భంగా అమృత్‌సర్‌లో జరిగిన నివాళి కార్యక్రమంలో రెండు సిక్కు గ్రూపుల మధ్య జరిగిన దాడులు శనివారం ఉద్రిక్త వాతావరణానికి దారి తీశాయి. ఈ ఘర్షణలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. నివాళి అర్పిస్తున్న సమయంలోనే స్వర్ణదేవాలయంలో ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు మార్మోగాయి. దీంతో ప్రత్యేక ఖలిస్తాన్ని సమర్థించే, వ్యతిరేకించే రెండు సిక్కు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్వర్ణ దేవాలయం శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ)కి చెందిన సిబ్బంది , రాడికల్ గ్రూపులకు మధ్య ఘర్షణ జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. 1984 జూన్ నెలలోజరిగిన ఆపరేషన్ బ్లూస్టార్పై ఐక్యరాజ్యసమితితో విచారణ జరిపించాలని ఎన్నో ఏళ్లుగా రాడికల్ గ్రూపు డిమాండ్ చేస్తోంది. అకాలీదళ్ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గత ఏడాది కూడా ఘర్షణ జరిగింది. నాటి ఘర్షణల్లో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. -
భుల్లర్‌కు శిక్ష తగ్గింపు
మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన సుప్రీంకోర్టు క్షమాభిక్ష నిర్ణయంలో జాప్యం,అనారోగ్యం నేపథ్యంలో నిర్ణయం తీర్పుపై బిట్టా అసంతృప్తి.. ఆత్మాహుతి చేసుకుంటానని వ్యాఖ్య న్యూఢిల్లీ: ఖలిస్తాన్ ఉగ్రవాది దేవేందర్‌సింగ్ భుల్లర్‌కు సుప్రీం కోర్టు జీవితాన్ని ప్రసాదించింది. ఆయన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చుతూ సోమవారం తీర్పు వెలువరించింది. భుల్లర్ క్షమాభిక్షపై నిర్ణయం తీసుకొనేందుకు విపరీతమైన జాప్యం జరగడంతోపాటు ఆయన అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనితో భుల్లర్ కుటుంబం పోరాటానికి ఫలితం లభించినట్లయింది. భుల్లర్ వయస్సు ప్రస్తుతం 48 ఏళ్లు.. ఆయన దాదాపు 19 ఏళ్లుగా జైలులోనే ఉన్నారు. 1993లో అప్పటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎస్ బిట్టాను హత్యచేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని యూత్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట భుల్లర్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఆ దాడిలో తొమ్మిది మంది చనిపోగా.. బిట్టా తీవ్రగాయాలతో బయటపడ్డారు.ఈ కేసులో భుల్లర్‌ను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష విధించింది. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మరణశిక్ష తీర్పును సమర్థించాయి. దీంతో ఆయన 2003 జనవరిలో క్షమాభిక్ష కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. కానీ దాదాపు ఎనిమిదేళ్ల తీవ్ర జాప్యం అనంతరం క్షమాభిక్షను తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకున్నారు.క్షమాభిక్ష నిర్ణయంలో సుదీర్ఘ జాప్యంతో పాటు భుల్లర్ మానసిక స్థితి సరిగా లేదని, మరణశిక్షను తగ్గించాలని కోరుతూ భుల్లర్ భార్య నవనీత్ కౌర్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘‘క్షమాభిక్ష నిర్ణయంపై ఎలాంటి కారణాలు లేకుండా.. అసాధారణంగా, సుదీర్ఘ జాప్యం జరిగినట్లుగా న్యాయస్థానాలు భావిస్తే, మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చవచ్చు. దీనికితోడు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో భుల్లర్ శిక్షను మార్పు చేస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. ఆత్మాహుతికి అనుమతివ్వండి..: బిట్టా భుల్లర్‌కు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్పుచేయడం ఉగ్రవాదంపై పోరాడుతున్నవారికి పెద్ద అపజయమని.. కాంగ్రెస్ నేత, భుల్లర్ బాంబుదాడిలో ప్రాణాలతో బయటపడిన ఎం.ఎస్. బిట్టా వ్యాఖ్యానించారు. దీనితో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని.. కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ ఉగ్రవాదం చేతిలో ఓడిపోయిన తనకు బతకాలని లేదని చెప్పారు. తాను ఆత్మాహుతి చేసుకొనేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాను, కోర్టును అనుమతి కోరుతానని పేర్కొన్నారు. -
సోనియాజీ.. కాల్చుకు చచ్చేందుకు అనుమతించండి!
ఖాలిస్తానీ ఉగ్రవాది దేవీందర్ పాల్ సింగ్ భుల్లర్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఆలిండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ నేత మనీందర్ జీత్ సింగ్ బిట్టా తనను తాను కాల్చుకుని చనిపోయేందుకు అనుమతినివ్వమని ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీని కోరారు. 'నన్ను చంపేందుకు కుట్రపన్ని కాల్పులు జరిపిన భుల్లర్ కి శిక్షను తగ్గించడం రాజకీయ టెర్రరిజం తప్ప మరేమీ కాదు. ఇక నేను బతికి ఉండి లాభం ఏమిటి? ఉగ్రవాదంపై పోరాటం చేసిన వారందరూ ఈ తీర్పులతో ఓడిపోయినట్టే. కాబట్టి కాల్చుకు చనిపోవడానికి నాకు అనుమతి ఇవ్వండి' అని ఆయన సోనియా గాంధీని కోరారు. 1993 సెప్టెంబర్ లో భుల్లర్ ఢిల్లీలో బాంబులు పేల్చాడు. ఈ ఉగ్రవాద ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు. బిట్టా సహా 25 మంది గాయపడ్డారు. ఈ సంఘటనలో భుల్లర్ ఒక కాలును కోల్పోయారు. తనను చంపేందుకు యత్నించిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడాన్ని బిట్టా తీవ్రంగా నిరసిస్తున్నారు.