సినిమా రేంజ్‌లో 50 పోలీసు వాహనాలతో ఛేజ్‌.. అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్ట్‌

Khalistan Leader Amritpal Singh Arrest In Punjab - Sakshi

ఛండీఘర్‌: పంజాబ్‌లో హైటెన్షన్‌ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా పంజాబ్‌ పోలీసులు ఖలిస్తాన్‌ వేర్పాటువాద నేత అమృత్‌పాల్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో పంజాబ్‌లోని పలు జిల్లాల్లో పోలీసులు ఇంటర్నెట్‌ సేవలను బంద్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. ఖలిస్తాన్‌ సానుభూతిపరుడు అమృత్‌ పాల్‌ సింగ్‌ను పోలీసులు జలంధర్‌లో శనివారం అరెస్ట్‌ చేశాడు. దాదాపు 50 పోలీసులు వాహనాలు అతడిని వెంబడించి అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో అమృత్‌ పాల్‌ సింగ్‌ అనుచరులు దాడులకు, సోషల్‌ మీడియాలో ఫేక్‌ వార్తలు ప్రచారం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు జిల్లాల్లో పోలీసులు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. అలాగే, భద్రతను పటిష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్‌ సింగ్‌ ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ద్వారా పంజాబ్‌లో ఖలిస్తాన్‌ అనుకూల భావజాలాన్ని పోత్సహిస్తున్నాడు. దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో పోలీసులు అతడిపై నిఘా వేశారు. ఈ క్రమంలో అరెస్ట్‌ చేశారు. 

మరోవైపు.. ఇటీవలే అమృత్‌పాల్‌ సింగ్‌ దమ్ముంటే తనను అరెస్ట్‌ చేయాలని పోలీసులకే సవాల్‌ విసిరాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. వారిస్‌ పంజాబ్‌ దే సంస్థ చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌తో సహా అతడి అనచరులు ఆరుగురిని జలంధర్‌లో అరెస్ట్‌ చేశారు. అమృత్‌ పాల్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో అలర్ట్ అయిన పంజాబ్ పోలీసులు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను, ఎస్‌ఎంఎస్ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

ఇది కూడా చదవండి: అస్సాంలోని మదర్సాలన్నిటినీ మూసేస్తాం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top