ఐకానిక్‌ ఆటో: ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ లగ్జరీ హ్యాండ్‌ బ్యాగ్‌, ధర తెలిస్తే.! | Iconic auto rickshaw Into Louis Vuitton turnsluxury handbag internet reacts | Sakshi
Sakshi News home page

ఐకానిక్‌ ఆటో: ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌ లగ్జరీ హ్యాండ్‌ బ్యాగ్‌, ధర తెలిస్తే.!

Jul 2 2025 1:00 PM | Updated on Jul 2 2025 3:49 PM

Iconic auto rickshaw Into Louis Vuitton turnsluxury handbag internet reacts

మొన్న  కొల్హాపురి  చెప్పుల్ని  పోలిన ప్రాడా చెప్పులు సంచలనం రేపాయి.   ఇపుడు లూయిస్ విట్టన్ రిక్షా ఆకారంలో లాంచ్‌ చేసిన లగ్జరీ బ్యాగ్‌ నెట్టింట సందడిగా మారింది.  ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచిన ఈ హ్యాండ్‌బ్యాగ్  ఫోటోలను ప్రముఖ  ఫ్యాషన్  డిజైనర్‌ డైట్ పరాత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 

ప్రముఖ ఫ్యాషన్‌  బ్రాండ్‌ లూయిస్ విట్టన్ 2026 కలెక్షన్ ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. ఇండియన్‌ ఆటోరిక్షా ఆకారంలో వచ్చిన హ్యాండ్‌బ్యాగ్‌ ఈ సీజన్‌లో భారతదేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆటో-రిక్షా ప్రేరణతో లూయిస్ విట్టన్ కొత్త హ్యాండ్‌బ్యాగ్
దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ మూల మూలలా సందడిగా తిరిగే ఐకానిక్ ఆటో ఆకారంలో లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌ను తీసుకొచ్చి లూయిస్‌ విట్టన్‌.  లూయిస్ విట్టన్ సిగ్నేచర్ మోనోగ్రామ్ కాన్వాస్‌తో బుల్లి చక్రాలు (ఇవి పనిచేస్తాయి కూడా)  హ్యాండిల్‌బార్‌..ఇలా అచ్చం ఆటోలాగానే దీన్ని రూపొందించారు.

 ఇలాంటి కళా ఖండాలను  మార్కెట్లోకి తీసుకురావడం   LVకి కొత్త కాదు, ఇది గతంలో విమానాలు, డాల్ఫిన్లు, పీత ఆకారంలో ఉన్న బ్యాగులను ఆవిష్కరించింది. అయితే, ఆటోరిక్షా బ్యాగ్  మాత్రం స్ట్రీట్‌కల్చర్‌కి ప్రతిబింబంగా నిలుస్తోందంటున్నారు ఫ్యాషన్‌ ప్రియులు.  దీనిక ఖరీదుఎంతో  తెలిస్తే   పెద్దగా ఆశ్చర్యపోవాల్సిపనేలేదే. లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఎల్‌వీ  తీసుకొచ్చిన ఈ బ్యాగ్‌ ధర . 35 లక్షలట.

 

నెటిజన్ల స్పందన
వేలాది లైక్‌లు, కమెంట్స్,  జోక్స్‌తో ఈ హ్యాండ్‌బ్యాగ్ ఫోటోలు నెట్టింట్‌ వైరల్ అయ్యాయి. లగ్జరీ బ్యాగ్‌ ధర కూడా లగ్జరీగానే ఉంటుందా? " బావుంది! కానీ చాందినీ చౌక్‌లో విడుదలయ్యే వరకు నేను వెయిట్‌ చేస్తా" అని ఒకర చమత్కరించగా, మరొకరు, "నా అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ బ్యాగ్  ఖరీదైందా? లేక ఆటో ఖరీదైనదా?" అని  ఒకరు, "సరే, మీటర్ ప్రకారం దాని ధర నిర్ణయిస్తారా?" అని  మరొకరు  చమత్కరించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement