breaking news
luxury handbag
-
ఐకానిక్ ఆటో: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్, ధర తెలిస్తే.!
మొన్న కొల్హాపురి చెప్పుల్ని పోలిన ప్రాడా చెప్పులు సంచలనం రేపాయి. ఇపుడు లూయిస్ విట్టన్ రిక్షా ఆకారంలో లాంచ్ చేసిన లగ్జరీ బ్యాగ్ నెట్టింట సందడిగా మారింది. ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచిన ఈ హ్యాండ్‌బ్యాగ్ ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డైట్ పరాత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్ 2026 కలెక్షన్ ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తోంది. ఇండియన్ ఆటోరిక్షా ఆకారంలో వచ్చిన హ్యాండ్‌బ్యాగ్ ఈ సీజన్లో భారతదేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఆటో-రిక్షా ప్రేరణతో లూయిస్ విట్టన్ కొత్త హ్యాండ్బ్యాగ్దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ మూల మూలలా సందడిగా తిరిగే ఐకానిక్ ఆటో ఆకారంలో లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌ను తీసుకొచ్చి లూయిస్ విట్టన్. లూయిస్ విట్టన్ సిగ్నేచర్ మోనోగ్రామ్ కాన్వాస్‌తో బుల్లి చక్రాలు (ఇవి పనిచేస్తాయి కూడా) హ్యాండిల్‌బార్..ఇలా అచ్చం ఆటోలాగానే దీన్ని రూపొందించారు. View this post on Instagram A post shared by Urban NXT | Luxury Platform (@urban.nxt) ఇలాంటి కళా ఖండాలను మార్కెట్లోకి తీసుకురావడం LVకి కొత్త కాదు, ఇది గతంలో విమానాలు, డాల్ఫిన్లు, పీత ఆకారంలో ఉన్న బ్యాగులను ఆవిష్కరించింది. అయితే, ఆటోరిక్షా బ్యాగ్ మాత్రం స్ట్రీట్కల్చర్కి ప్రతిబింబంగా నిలుస్తోందంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. దీనిక ఖరీదుఎంతో తెలిస్తే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిపనేలేదే. లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఎల్వీ తీసుకొచ్చిన ఈ బ్యాగ్ ధర . 35 లక్షలట. View this post on Instagram A post shared by Diet Paratha (@diet_paratha)నెటిజన్ల స్పందనవేలాది లైక్‌లు, కమెంట్స్, జోక్స్‌తో ఈ హ్యాండ్‌బ్యాగ్ ఫోటోలు నెట్టింట్ వైరల్ అయ్యాయి. లగ్జరీ బ్యాగ్ ధర కూడా లగ్జరీగానే ఉంటుందా? " బావుంది! కానీ చాందినీ చౌక్‌లో విడుదలయ్యే వరకు నేను వెయిట్ చేస్తా" అని ఒకర చమత్కరించగా, మరొకరు, "నా అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ బ్యాగ్ ఖరీదైందా? లేక ఆటో ఖరీదైనదా?" అని ఒకరు, "సరే, మీటర్ ప్రకారం దాని ధర నిర్ణయిస్తారా?" అని మరొకరు చమత్కరించారు. -
బనారసీ చీరలో నీతా అంబానీ లుక్ : లగ్జరీ బ్యాగ్ స్పెషల్ ఎట్రాక్షన్
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. దేశంలో ముంబైలో నెలకొల్పిన 'నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీతా న్యూయార్క్‌లోని ఐకానిక్ లింకన్ సెంటర్లో 'ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్' పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అంతేకాదు స్వయంగా భరతనాట్యం నృత్యకారిణి నీతా అంబానీ ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు.బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ భారతీయత, ష్యాషన్ పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు.వ్యాపారం , ఫ్యాషన్ రంగంలో ఎప్పుడూ ప్రత్యేకమైన శైలే. ప్రపంచ స్థాయిలో భారతీయ సంస్కృతిని అందరినీ ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ప్రీ-ఈవెంట్ లుక్‌లో అచ్చమైన బంగారం, వెండి జరీతో గండభేరుండ మోటిఫ్‌లతో చేతితో నేసిన ఎరుపు రంగు బనారసి చీరను ధరించారు. దీనికి సింపుల్ జ్యుయల్లరీ ఎంచుకున్నారు. దీనికి జతగా ధరించిన కస్టమ్ హెర్మ్స్ బ్యాగ్ షో మరింత హైలైట్‌గా నిలిచింది. రాబోయే ఈవెంట్‌పై పనిచేస్తున్న ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా దీనికి సంబంధించిన ఫోటో, వివరాలను పంచుకున్నారు. ఈ లగ్జరీ బ్యాగ్‌ను పదేళ్ల క్రితం ఆమె కోసం ప్రత్యేకంగా రూపొందించారట. నీతా అంబానీ ఇప్పటికే తన లుక్‌తో భారతీయ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) సెప్టెంబర్ 12 నుండి 14 వరకు న్యూయార్క్‌లో ఇండియా వీకెండ్NMACC సెప్టెంబర్ 12 నుండి 14, 2025 వరకు న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్లో ఇండియా వీకెండ్‌ను నిర్వహించనుంది. 2023లో భారతదేశ సంస్కృతి, వారసత్వం, నాటకం, నృత్యం, జానపదాలు, కళలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటైన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ మరో అడుగు ముందుకేసిందని నీతా అంబానీ ప్రకటించారు. ప్రపంచ వేడుకగా తొలిసారి న్యూయార్క్‌లోని ప్రఖ్యాత లింకాన్ సెంటర్లో ఎన్ఎంఏసీసీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు డ్యాన్స్, సంగీతం, ఫ్యాషన్, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నామని ఆమె తెలిపారు. ఈ వేడుకలో భారతదేశం, దేశానికి చెందిన 5 వేల ఏళ్లనాటి వైభవాన్ని చాటి చెప్పేందుకు ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు నీతా అంబానీ.చదవండి: తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదాగ్రాండ్ స్వాగత్ ఉత్సవంతో ఈవేడుకలు ప్రారంభమవుతాయి. ఇందులో అంబానీ చేనేత ఎంపోరియం, స్వదేశ్ కోసం ఫ్యాషన్ షో కూడా ఉంటుంది. ప్రతి డిజైన్‌ను మనీష్ మల్హోత్రా క్యూరేట్ చేస్తారు. మరోవైపు, నగరంలో తన రెస్టారెంట్ బంగ్లాను నడుపుతున్న మిచెలిన్ స్టార్ చెఫ్ వికాస్ ఖన్నా, దేశంలోని విభిన్న రుచులతో ప్రత్యేకంగా రూపొందించిన మెనూను అందిస్తారు. ఇంకా శంకర్ మహదేవన్, శ్రేయ ఘోషల్ ,రిషబ్ శర్మ వంటి సంగీతకారులు , గాయకులు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్నారు.ఇదీ చదవండి: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ చర్య, భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి? -
నీతా అంబానీయా మజాకా : ఆమె బ్యాగు ధరతో కారు కొనేయొచ్చట!
మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం నిర్వహించిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నారు. సందర్భానికి తగ్గట్టు తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అదరగొట్టడం మాత్రమే కాదు, హై-ఎండ్ యాక్సెసరీలతో స్పెషల్ లుక్‌లో అందరి కళ్లను తనవైపు తిప్పుకోవడంలో నీతా అంబానీ ముందుంటారు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన WPL 2025 మినీ వేలం ఈవెంట్లో మరోసారి ఈ విషయాన్నే రుజువుచేశారు. ముఖ్యంగా ఆమె చేతిలోని పింక్ బ్యాగ్ హాట్ టాపిక్‌గా నిలిచింది.నీతా అంబానీ పవర్ లుక్!ఈ వేలం కార్యక్రమం కోసం నీతా అంబానీ నీతా అంబానీ పవర్లుక్లో అదర గొట్టారు. ఈ బిజినెస్ ఐకాన్ పవర్ షోల్డర్లు, డబుల్ కాలర్స్‌తో కూడిన చిక్ పాస్టెల్ పింక్ బ్లేజర్‌ను ధరించారు. స్టైలిష్ డెనిమ్ బ్లేజర్‌కు జతగా విలాసవంతమైన హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించారు. అంతేనా డైమండ్ స్టడ్స్, హార్ట్ షేప్డ్ లాకెట్టు నెక్లెస్, తెల్లటి చేతి గడియారం , హై హీల్స్‌తో తన స్టయిల్‌కి లగ్జరీ టచ్ ఇచ్చారు.ఇదీ చదవండి: ముంబై ఇండియన్స్ మహిళా టీం, యువ ప్రతిభకు ప్రాధాన్యం : నీతా పింక్ హ్యాండ్బ్యాగ్ఈ ఔట్‌ఫిట్‌కు తగ్గట్టుగా పర్ఫెక్ట్ మ్యాచింగ్‌తో ధరించిన పింక్ హ్యాండ్‌బ్యాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పింక్ అండ్ వైట్ గోయార్డిన్ కాన్వాస్, చెవ్రోచెస్ కాల్ఫ్స్కిన్ సైగాన్ స్ట్రక్చర్ ఉన్న ఈ వాచ్ ధరతో ఒక కారు కొనేయొచ్చంటే నమ్ముతారా? ప్రఖ్యాత బ్రాండ్ గోయార్డ్ బ్రాండ్‌కు చెందిన బ్యాగ్ ధర సుమారు 10 లక్షల(12వేల అమెరికా డాలర్లు) రూపాయలట.కాగా మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ 3 కోసం రిలయన్స్ఫౌండేన్ చైర్పర్సన్ నీతా అంబానీ యాజమాన్యలోని ముంబై ఇండియన్స్ పటిష్టమైన టీంను సిద్ధం చేసింది. WPL 2025 ఆదివారం బెంగుళూరులో జరిగిన వేలంలో కొత్తగా నలుగురు మహిళా క్రికెటర్లను జట్టులో చేర్చుకుంది. దీనిపై నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. -
హ్యాండ్ బ్యాగు ధర వింటే షాక్!
హాంగ్‌కాంగ్: సాధారణంగా మహిళలు షాపింగ్‌కు వెళితే కొన్ని వందలో, లేక వేలో ఖర్చుపెట్టి హ్యాండ్ బ్యాగును కొంటారు. కానీ ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాగు ధర ఎంత ఉంటుందనుకుంటున్నారు. కాస్త ఖరీదైన బ్యాగ్ అయితే రూ.5 వేలు, లేక రూ.10 వేలు అని భావిస్తున్నారు కదూ.. అయితే ఈ మహిళ చేతిలో కనిపిస్తున్న ఈ బ్యాగు ధర వింటే ఎవరిరైనా దిమ్మతిరిగి పోతుంది. హ్యాండ్ బ్యాగు ధర 3,80,000 డాలర్లు (భారత కరెన్సీలో 2.448 కోట్ల రూపాయలు). ఈ బ్యాగు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగుగా రికార్డు నెలకొల్పింది. చూడటానికి మామూలుగా కనిపిస్తున్న ఈ బ్యాగును అరుదుగా కనిపించే తెల్లని మొసలి చర్మంతో రూపొందించారు. 18 క్యారట్ల బంగారంతో పాటు వందకు పైగా వజ్రాలు పొదిగిన ఈ బ్యాగును క్రిస్టీ అనే సంస్థ హాంగ్‌కాంగ్‌లో బుధవారం వేలం వేసింది. ఓ వ్యక్తి 2.448 కోట్ల రూపాయలకు బ్యాగును సొంతం చేసుకున్నాడు. ఆ సంస్థ అతడి వివరాలు మాత్రం వెల్లడించలేదు. గతేడాది క్రిస్టీ సంస్థ నిర్వహించిన వేలంలోనే 3 లక్షల డాలర్లకు అమ్ముడుపోయిన బ్యాగు రికార్డును తాజా వేలంలో తెల్లటి మొసలి చర్మంతో, వజ్రాలు పొదిగిన బ్యాగు చెరిపివేసింది.