వీడు మామూలోడు కాదు.. సినిమా రేంజ్‌లో ట్విస్ట్‌ ఇస్తూ కారు నుంచి బైక్‌.. 

Khalistani Leader Amritpal Singh Escaped On Bike With Aides - Sakshi

అమృత్‌పాల్‌ సింగ్‌.. ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఇది. ఖలిస్తాన్‌ వేర్పాటువాది అయిన అమృత్‌పాల్‌ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్‌ పోలీసులు మామూలుగా ప్రయత్నించడం లేదు. సినిమా రేంజ్‌లో నిందితుడు.. పోలీసులు కళ్లుగప్పి వేషాలు మారుస్తూ తప్పించుకుంటున్నాడు. హాలీవుడ్‌ సినిమాలో ఛేజింగ్‌ సీన్స్‌ను తలపిస్తూ అమృత్‌పాల్‌ పంజాబ్‌ నుంచి బయటపడినట్టు సమాచారం. 

ఇక, దశావతారం సినిమాలో గేటప్స్‌ మార్చినట్టు అమృత్‌పాల్‌ వేషధారణ మార్చుకుంటూ కార్లు నుంచి బైక్‌.. బైక్‌ నుంచి వివిధ వాహనాలు మార్చుకుంటూ పోలీసుల వ్యూహాలకే చెక్‌ పెడుతున్నాడు. అమృత్‌పాల్‌ సింగ్‌ ఇప్పటి వరకు దాదాపు ఐదుకు పైగా వేషాలు మారుస్తూ బయట తిరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతడి ఫొటోలు కూడా బయటకు రిలీజ్‌ చేశారు. ఈ ఫొటోలు చూసి పోలీసులు కూడా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అదేవిధంగా ఇతరులు గుర్తుపట్టకుండా అతను తన మత దుస్తులకు బదులు చొక్కా, ప్యాంటు ధరించినట్లు పోలీసు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్‌ కోసం పోలీసులు గత నాలుగు రోజులుగా విస్తృతంగా గాలింపు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, అమృత్‌పాల్‌ సింగ్‌ పంజాబ్‌ను దాటి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ కారులో టోల్‌గేట్‌ దాటిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అమృత్‌పాల్‌ చివరిసారిగా మెర్సిడెస్‌ ఎస్‌యూవీ వాహనంలో తప్పించుకున్నాడు. అయితే, ప్రస్తుతం అతను మారుతీ సుజికీ బ్రిజా కారులో జలంధర్‌లోని టోల్‌గేట్‌ను దాటుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఇక, చివరగా బైక్‌పై తన మద్దతుదారులతో వెళ్తున్న పుటేజీ కూడా బయటకు వచ్చింది. 

ఇది కూడా చదవండి: 80వేల మంది పోలీసులు చోద్యం చూస్తున్నారా?.. పాక్‌ ఏజెంట్‌గానే సూసైడ్‌ ఎటాక్స్‌కు ప్లాన్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top