
ఆదిదేవుడు మంచులింగ రూపంలో భక్తులను పులకింపచేసే అపురూప ఘట్టం అమర్‌నాథ్ యాత్ర. జమ్ముకశ్మీర్ మంచుకొండల్లో ఏర్పడే శివయ్య దర్శనం ఓ వర్ణనాతీత అనుభూతి.

ఏడాదిలో స్వల్పకాలమే సాగే అమర్‌నాథ్ యాత్ర కోసం ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూస్తుంటారు. ఆ సమయం రానే వచ్చింది.

జులై 3 నుంచి ఆగస్టు 9వరకు మంచుకొండల్లో శివయ్య దర్శనం ఇవ్వనున్నాడు.

పహల్గాం ఘటన తర్వాత జరుగుతున్న యాత్ర కావడంతో ప్రభుత్వం భక్తుల కోసం, యాత్ర సజావుగా సాగడం కోసం భారీ భద్రత ఏర్పాటు చేసింది. కొండలు కోనలు దాటుకుంటూ ముందు సాగుతుంటే.. శివ నామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగుతోంది.





























