breaking news
Amarnath Yatra 2025
-
అమర్నాథ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత
శ్రీనగర్: పహల్గాం, బాల్తాల్ మార్గాల్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బుధవారం తెల్లవారుజామునుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు జమ్మూ కశశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధూరి తెలిపారు. రెండు మార్గాల్లోనూ కురుస్తున్న భారీ వర్షాలు బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల రాకపోకలను ప్రభావితం చేశాయన్నారు.పరిస్థితి మెరుగుపడేవరకు బాల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపుల వైపు ఎలాంటి రాకపోకలను అనుమతించబోని తెలిపారు. ఈ విషయంలో యాత్రికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తామని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు మెరుగుపడితే యాత్రను తిరిగి ప్రారంభించే విషయాలను కూడా యాత్రికులకు తెలియజేస్తామన్నారు. జూలై మూడో తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీతో ముగియనుంది.ఈ పవిత్ర వార్షిక యాత్ర కోసం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు. యాత్రికులు రెండు మార్గాల్లో పుణ్య క్షేత్రానికి చేరుకుంటారు. ఒకటి 48 కిలోమీటర్ల పొడవైన పహల్గాం మార్గం కాగా, మరోటి నిటారుగా ఉన్న తక్కువ దూరమైన బాల్తాల్ మార్గం. ఈ ఏడాది ఇప్పటివరకు 3.93 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. -
అమర్నాథ్ యాత్ర నిలిపివేత.. కారణమిదే..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రా మార్గంలో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో పహల్గామ్, బాల్టాల్ మార్గాలలో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను గురువారం(జూలై 17)న ఒకరోజు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. శుక్రవారం (జూలై 18)న యాత్ర తిరిగి ప్రారంభమయ్యే ముందు భద్రతా తనిఖీలు నిర్వహించనున్నారని తెలిపారు. Tragedy Strikes Amarnath Yatra: Pilgrim Killed, Route Halted!A devastating landslide on the Baltal route in Ganderbal claimed the life of a woman pilgrim and injured three others, prompting the suspension of the Amarnath Yatra on July 17, 2025. Heavy rainfall triggered a… pic.twitter.com/uERtEB9cbm— UnreadWhy (@TheUnreadWhy) July 17, 2025కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా, ట్రాక్‌లపై మరమ్మతు, నిర్వహణ పనులు చేపట్టాల్సిన అవసరం ఏర్పండిందన్నారు. అందుకే గురువారం నాడు ఈ రెండు బేస్ క్యాంపుల మీదుగా పవిత్ర గుహ వైపు వెళ్లేదారిలో ఎటువంటి రాకపోకలను అనుమతించకూడదని నిర్ణయించామన్నారు. పగటిపూట వాతావరణ పరిస్థితులను అనుసరించి శుక్రవారం యాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. Indian Army Rescues Pilgrims Amid Heavy Rain on Amarnath Yatra Route #AmarnathYatra #IndianArmy #ArmyRescue #Kashmir #YatraSafety #BreakingNews #Amarnath2025 #PilgrimSupport #DisasterResponse #JaiHind pic.twitter.com/oQyqxeMCHz— Geopolitics | News | Trends (@rareinfinitive) July 17, 2025గందర్బాల్ జిల్లాలోని యాత్ర బాల్తాల్ మార్గంలో కొండచరియలు విరిగిపడి ఒక మహిళ మృతిచెందిన నేపధ్యంలో అప్రమత్తమైన అధికారులు యాత్రను ఒకరోజు నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అమర్నాథ్ యాత్రా మార్గంలోని బాల్తాల్ ప్రాంతంలో అధిక వర్షపాతం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాకాలంలో పర్వత ప్రాంతాలలో ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని అధికారులు తెలిపారు. జూలై 3న యాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 2.47 లక్షలకు పైగా యాత్రికులు అమర్నాథ్ పవిత్ర గుహను సందర్శించుకున్నారు. -
Amarnath yatra:‘ఆపరేషన్ శివ’లో అద్భుత సాంకేతిక భద్రత ఇదే..
శ్రీనగర్: జూలై 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర.. భక్తుల ‘హర్‌హర్ మహాదేవ్’ నినాదాల మధ్య అంత్యంత వైభవంగా కొనసాగుతోంది. అమర్నాథ్ యాత్ర- 2025 కోసం ప్రభుత్వం 8,500 మంది సైనికులను, హైటెక్ భద్రతను ఏర్పాటు చేసింది. యాత్రలో అత్యవసర పరిస్థితులకు తక్షణం స్పందించేందుకు భారత ఆర్మీ హెలికాప్టర్లు నిరంతరం సిద్ధంగా ఉన్నాయి. యాత్రికుల ప్రయాణం సజావుగా సాగేందుకు క్విక్ రియాక్షన్ టీమ్స్ (క్యూఆర్టీ), టెంట్ వసతి, వాటర్ స్టేషన్లు, కమ్యూనికేషన్ యూనిట్లను అందుబాటులో ఉంచారు.‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం..అమర్నాథ్యాత్రకు ‘ఆపరేషన్ శివ’పేరుతో భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగా అనంత్‌నాగ్‌లోని 48 కిలోమీటర్ల నున్వాన్-పహల్గామ్ మార్గం, గండర్‌బాల్‌లోని 14 కిలోమీటర్ల బాల్టాల్ మార్గాలు సైన్యం నిశిత నిఘాలో ఉన్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదుల నుంచి పెరిగిన బెదిరింపులకు ప్రతిస్పందనగా, సైన్యం బహుళ-స్థాయి ఉగ్రవాద నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేసింది.ఆధునిక కెమెరాలతో..డ్రోన్ హెచ్చరికలను తటస్థీకరించడానికి 50 కంటే ఎక్కువ సీ-యూఏఎస్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలతో కూడిన కౌంటర్-మానవరహిత వైమానిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. డ్రోన్లు, అధిక రిజల్యూషన్ పీటీజెడ్ కెమెరాలను ఉపయోగించి యాత్రా మార్గాలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా ముప్పు ఏర్పడినప్పుడు వేగవంతమైన ప్రతిస్పందనకు యాత్రా కాన్వాయ్‌ల నిజ-సమయ ట్రాకింగ్‌ను అందుబాటులో ఉంచారు.100 పడకల ఆస్పత్రియాత్రికుల వైద్య మౌలిక సదుపాయాల కోసం 150 మందికి పైగా వైద్యులు, పారామెడిక్స్, రెండు అధునాతన డ్రెస్సింగ్ స్టేషన్లు, తొమ్మిది సహాయ పోస్టులు, 100 పడకల ఆస్పత్రి, రెండు లక్షల లీటర్ల ఆక్సిజన్‌తో కూడిన 26 ఆక్సిజన్ బూత్‌లను ఏర్పాటు చేశారు. అత్యవసర లాజిస్టిక్స్‌లో బాంబు నిర్వీర్య బృందాలు, అవాంతరాలు లేని కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సాంకేతిక సహాయ యూనిట్లు, 25,000 మందికి అత్యవసర రేషన్లు, బుల్డోజర్లు, ఎక్స్కవేటర్లు వంటి భారీ యంత్రాలను ఉంచారు.గత రికార్డు అధిగమించేలా..ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆర్మీ హెలికాప్టర్లు స్టాండ్బైలో ఉంటాయి. ఇప్పటికే 1.4 లక్షలకు పైగా భక్తులు శివుని మంచు లింగాన్ని దర్శించుకున్నారు. ఈ ఏడాది యాత్ర కోసం నాలుగు లక్షలకు పైగా యాత్రికులు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. 2024లో ఈ యాత్రలో 5.1 లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఈ సంఖ్యను అధిగమించనుంది. జూలై 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 9తో ముగియనున్నది. -
అమర్నాథ్ యాత్రలో అపశృతి.. సహాయక చర్యలు ముమ్మరం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో జూలై మూడు నుంచి ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో తాజాగా స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. రాంబన్‌లోని చందర్‌కోట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పలువులు యాత్రికులు గాయపడ్డారు. ఇక్కడి నుంచి పహల్గామ్‌నకు వెళ్లే రహదారిలో ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 36 మంది భక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.యాత్రా కాన్వాయ్‌లో ఈ బస్సులు బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు వివరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆరోగ్య శాఖ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన యాత్రికులను రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాది జూలై 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 9 వరకు అంటే రక్షా బంధన్ వరకూ కొనసాగనుంది. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహకు యాత్రికులు రెండు మార్గాల ద్వారా చేరుకుంటారు. వాటిలో ఒకటి పహల్గామ్ మార్గం. రెండవది బాల్తాల్ మార్గం. Shri Amarnath Yatra Bus Collision in Ramban, J&KOver 30 pilgrims sustained minor injuries when five buses in a Pahalgam-bound convoy for the Shri #AmarnathYatra collided near the Chanderkote langar site in Ramban district, #JammuAndKashmir The Deputy Commissioner of Ramban… pic.twitter.com/VFA33YyE0p— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) July 5, 20256,979 మంది యాత్రికుల బృందం శనివారం జమ్ము నుండి కాశ్మీర్‌కు గట్టి భద్రత మధ్య అమర్నాథ్ యాత్రకు బయలుదేరింది. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజులపాటు జరగనుంది. గడచిన రెండు రోజుల్లో 26,800 మందికి పైగా భక్తులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త బ్యాచ్ భగవతి నగర్ యాత్ర నివాస్ నుండి 312 వాహనాలతో కూడిన రెండు ఎస్కార్ట్ కాన్వాయ్‌లలో బయలుదేరింది. ఈ యాత్రికులలో 2,753 మంది బాల్టాల్ బేస్ క్యాంప్‌కు వెళుతుండగా, 4,226 మంది నున్వాన్ (పహల్గామ్) బేస్ క్యాంప్‌కు బయలుదేరారు. ఇది కూడా చదవండి: ‘బెట్టింగ్ యాప్’ వరుడు పరార్.. ఈడీ అదుపులో అతిథులు -
మంచు కొండల్లో ‘శివయ్యా..’ అమర్నాథ్ యాత్ర షురూ (చిత్రాలు)
-
అమర్నాథ్ యాత్ర షురూ
సాక్షి, న్యూఢిల్లీ: హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహలోని మంచు స్ఫటిక శివలింగ దర్శనానికి వేళయ్యింది. అత్యంత కఠినమైన, అననుకూల వాతావరణం మధ్య మొత్తం 38 రోజులపాటు సాగే అమర్నాథ్ యాత్ర గురువారం ప్రారంభమైంది. ఉదయం 3,880 మీటర్ల ఎత్తులోని అమర్నాథ్ గుహలో బాబా బర్ఫానీకి తొలి హారతి కార్యక్రమం నిర్వహించారు. వందలు, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భక్తుల్లో మొదటి యాత్రికుల బృందం పహల్గాం, బాల్టాల్ బేస్ క్యాంప్‌ల నుంచి ‘హర్ హర్ మహాదేవ్’, ‘బమ్ బమ్ భోలే’ నినాదాలతో గుహ దిశగా ప్రయాణం ప్రారంభించారు. బుధవారం జమ్మూలోని భగవతీ నగర్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపడంతో 168 వాహనాల్లో 5,892 మందితో కూడిన యాత్రికుల తొలి బృందం పయనమైంది. ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీన రక్షాబంధన్ రోజున ముగుస్తుంది. ఇప్పటికే 3.5 లక్షలకుపైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జమ్మూలోని సరస్వతీ ధామ్, వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ సభ వంటి కేంద్రాల్లో రోజూ సుమారు 2,000 మంది రిజిస్ట్రేషన్లను చేసుకుంటున్నారు. 2011లో అత్యధికంగా 6.34 లక్షల మంది భక్తులు అమర్‌నాథుని దర్శించుకున్నారు. ఈసారి ఇప్పటి వరకు యాత్రకు 3.5 లక్షల మంది ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకున్నారు.The first batch of Shri #AmarnathYatra2025 pilgrims was flagged off by Srinagar Police and the CRPF from the Pantha chowk base camp and directed to the Baltal base camp.#spiritualjourney #amarnathcave #yatra2023 #jammukashmir #DivineJourney #religioustourism #mountainpilgrimage pic.twitter.com/KHI1zN9Z4t— crpf_fan (@CrprepostFan) July 2, 2025ఘనమైన భద్రతా ఏర్పాట్లు1990 నుంచి 2017 వరకు అమర్నాథ్ యాత్ర మార్గంలో 36 వరకు ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 53 మంది యాత్రికులు మరణించగా, మరో 167 మంది గాయపడ్డారు. 2000లో అమర్నాథ్ యాత్రపై మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఏడాది యాత్రను ప్రశాంతంగా పూర్తి చేయడానికి జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశాయి. ప్రధానమైన పహల్గాం, బాల్టాల్ మార్గాల్లో కాంక్రీటు బంకర్లు, చెక్‌పోస్టులు, డ్రోన్ల ద్వారా నిత్యం నిఘా కొనసాగిస్తున్నారు. యాత్రికుల వాహనాలు పాస్‌ల ద్వారా మాత్రమే అనుమతులు పొందుతున్నాయి. పలు అంశల భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రతి దశలో మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్లతో అణువణువూ తనిఖీలు చేస్తున్నారు.రెండు రూట్ల ద్వారా యాత్రపహల్గాం రూట్: 48 కిలోమీటర్ల దూరం, సుమారు 5 రోజులు పడుతుంది. పహల్గాం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్వాడి వరకు యాత్ర తేలిక. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న పిస్సూ టాప్, ఆపై మరో 9 కిలోమీటర్లు నడవాలి. సాయంత్రానికి శేషనాగ చేరుకుంటారు. రెండో రోజు అక్కడ్నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచతరణి చేరుకుంటారు. ఆపైన చివరిగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ గుహకు పయనమవుతారు. బాల్టాల్ మార్గం: యాత్ర సమయం తక్కువగా ఉన్న వారు ఈ మార్గంలో వెళ్లవచ్చు. సుమారు 16 కిలోమీటర్ల దూరముండే ఈ మార్గంలో సుమారు 2 రోజుల్లో పవిత్ర గుహకు చేరుకునే వీలుంది. అయితే ఇది కాస్త కఠినమైన పర్వతమయం, మలుపులతో కూడిన మార్గం. వృద్ధులకు అనువైంది కాదు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం