అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత.. కారణమిదే.. | Amarnath Yatra Temporarily Suspended On Both Routes Due To Heavy Rains, More Details Inside | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత.. కారణమిదే..

Jul 17 2025 11:54 AM | Updated on Jul 17 2025 12:28 PM

Amarnath Yatra Temporarily Suspended on Both Routes

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న  అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రా మార్గంలో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో పహల్గామ్, బాల్టాల్ మార్గాలలో కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్రను గురువారం(జూలై 17)న ఒకరోజు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. శుక్రవారం (జూలై 18)న యాత్ర తిరిగి ప్రారంభమయ్యే ముందు భద్రతా తనిఖీలు నిర్వహించనున్నారని తెలిపారు.
 

కశ్మీర్‌ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా, ట్రాక్‌లపై మరమ్మతు, నిర్వహణ పనులు చేపట్టాల్సిన అవసరం ఏర్పండిందన్నారు. అందుకే గురువారం నాడు ఈ రెండు బేస్ క్యాంపుల  మీదుగా పవిత్ర గుహ వైపు వెళ్లేదారిలో ఎటువంటి  రాకపోకలను అనుమతించకూడదని నిర్ణయించామన్నారు. పగటిపూట వాతావరణ పరిస్థితులను అనుసరించి శుక్రవారం యాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.

 

గందర్‌బాల్ జిల్లాలోని యాత్ర బాల్తాల్ మార్గంలో  కొండచరియలు విరిగిపడి ఒక మహిళ మృతిచెందిన నేపధ్యంలో అప్రమత్తమైన అధికారులు యాత్రను ఒకరోజు నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అమర్‌నాథ్ యాత్రా మార్గంలోని బాల్తాల్ ప్రాంతంలో  అధిక వర్షపాతం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాకాలంలో పర్వత ప్రాంతాలలో  ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని అధికారులు తెలిపారు. జూలై 3న యాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 2.47 లక్షలకు పైగా యాత్రికులు  అమర్‌నాథ్‌ పవిత్ర గుహను సందర్శించుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement