భార్యపై కానిస్టేబుల్‌ అత్యాచారం సహకరించిన భర్త..! | Husband Threaten His Wife With Her Intimate Videos In Karnataka, More Details Inside | Sakshi
Sakshi News home page

భార్యపై కానిస్టేబుల్‌ అత్యాచారం సహకరించిన భర్త..!

Jul 17 2025 11:48 AM | Updated on Jul 17 2025 12:13 PM

Husband Threaten His Wife With Her Intimate Videos

కర్ణాటక: మహిళపై అత్యాచారం కేసులో పోలీసు కానిస్టేబుల్‌ను దక్షిణకన్నడ జిల్లా మంగళూరు కంకనాడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. కావూరు పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న చంద్రనాయక్‌ నిందితుడు. మంగళూరు నగర పోలీసు కమిషనర్‌ సుదీర్‌ కుమార్‌ రెడ్డి వివరాలను వెల్లడించారు.  బాధిత మహిళను ఆమె భర్త నగ్న వీడియోలను తీసి తాను చెప్పినట్లు చేయాలని బెదిరించసాగాడు. భర్త వేధింపులను తట్టుకోలేక   పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఆ సమయంలో చంద్రనాయక్‌ను ఆమెతో మాట్లాడాడు. భర్త ఫోన్‌లోని వీడియోలను అతడు తొలగించడంతో సమస్య సద్దుమణిగింది. అప్పటినుంచి బాధితురాలికి మాయమాటలు చెప్పిన చంద్రనాయక్‌  లైంగికంగా వాడుకున్నాడు. ఇందుకు భర్త కూడా సహకరించాడు. ఇద్దరి వేధింపులు మితిమీరడంతో తట్టుకోలేక బాధితురాలు పోలీసు కమిషనర్‌ సుధీర్‌కుమార్‌ రెడ్డిని కలిసి తన గోడును వెల్లబోసుకుంది. ఆయన ఆదేశాలతో చంద్రనాయక్‌ను, ఘరానా భర్తని అరెస్టు చేశారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement