రాష్ట్రానికి ‘మళ్లీ’ వర్షసూచన! | Rain forecast again for the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి ‘మళ్లీ’ వర్షసూచన!

Jul 17 2025 5:28 AM | Updated on Jul 17 2025 5:28 AM

Rain forecast again for the state

వాతావరణ శాఖ నిపుణుల అంచనాలు

సాక్షి, విశాఖపట్నం: రుతుపవనాలు ప్రవేశించి.. దాదాపు నెలన్నర అవుతున్నా.. లోటు వర్షపాతమే కొనసాగుతోంది. మండు వేసవిని తలపించేలా భానుడు భగభగలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో.. బ్రేక్‌మాన్‌సూన్‌ పరిస్థితులు కనిపిస్తున్నా­యని ఎండలు.. లోటు వర్షపాతం నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశాలున్నాయని వాతావ­రణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వారి అంచనాల ప్రకారం గురువారం నుంచి రాష్ట్రంలో వర్షా­లు క్రమక్రమంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ వర్షాలు జోరందుకోను­న్నా­యి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయల­సీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచన­లున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, పిడు­గులు పడే ప్రమాదం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదు­రుగా­లులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధి­కారులు హెచ్చరిస్తున్నారు. వేటకు వెళ్లే మత్స్య­కారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement