
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి సతీమణి పంకజశ్రీతో కలిసి వెళ్లిన వంశీ.. కష్టకాలంలో అండగా నిలిచినందుకు పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ కుట్రలతో 11 కేసుల్లో 140 రోజులపాటు విజయవాడ జైల్లో గడిపిన వంశీ.. న్యాయస్థానాలు ఊరట ఇవ్వడంతో బుధవారం విడుదలయ్యారు.










